ఏం జరిగింది.. ఉద్యోగం కోసమని వచ్చి.. లాడ్జిలో ఆత్మహత్య | Unemployed Youth Suicide In Lodge Hyderabad | Sakshi
Sakshi News home page

ఏం జరిగింది.. ఉద్యోగం కోసమని వచ్చి.. లాడ్జిలో ఆత్మహత్య

Published Tue, Mar 29 2022 5:22 PM | Last Updated on Tue, Mar 29 2022 5:32 PM

Unemployed Youth Suicide In Lodge Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,రాంగోపాల్‌ పేట్‌(హైదరాబాద్‌): ఉద్యోగాన్వేషణలో ఉన్న ఓ యువకుడు లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు గోపాలపురం పోలీసుల కథనం ప్రకారం... సిద్దిపేట శ్రీనగర్‌ కాలనీ వాసి శ్రీనివాస్‌ రెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డి (26) బీటెక్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం చూసుకునేందుకు ఈ నెల 26న నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని గోకుల్‌ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు.

సోమవారం సాయంత్రం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా అతడు బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది వెళ్లి గది తలుపులు కొట్టినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాత్రి 9 గంటల సమయంలో తిరిగి వెళ్లి కిటికీలో నుంచి లోపల చూడగా టవల్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో తలుపు గడియను తొలిగించి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందినట్లుగా గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌ కార్డు ద్వారా అతన్ని సిద్దిపేట వాసిగా గుర్తించారు. అయితే అదే సమయంలో అతడి సెల్‌ఫోన్‌కు కుటుంబసభ్యుల నుంచి ఫోన్‌ రావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలియజేశారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

చదవండి: Extramarital affair: పెళ్లికాకుండానే తల్లయిన యువతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement