
యాదాద్రిలో ఎనిమిది జంటల అరెస్ట్
యాదాద్రి: ప్రపంచస్థాయి దేవాలయంగా నల్లగొండ జిల్లా యాదాద్రిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఇప్పటికే ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తుండగా.. ఆ మేరకు శాంతిభద్రతల నిర్వహణతోపాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా శుక్రవారం పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఎనిమిది జంటలు చిక్కాయి.
పవిత్ర పుణ్యక్షేత్రంలో (కొండ కింద) దాదాపు 21 ప్రైవేట్ లాడ్జిలు ఉన్నాయి. వీటిలో 20 లాడ్జిలపై శుక్రవారం మధ్యాహ్నం ఒకేసారి దాడులు నిర్వహించిన పోలీసు బృందాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది జంటలను అరెస్ట్ చేశాయి. నిందితులను ఆలేరు కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కు తరలించారు.