
సాక్షి, కర్నూలు: కర్నూలులోని గౌరిగోపాల్ హాస్పిటల్ వద్దనున్న మ్యారియట్ లాడ్జిలో ప్రేమికులు తలదాచుకున్న సంఘటన మంగళవారం సాయంత్రం కలకలం లేపింది. నందికొట్కూరుకు చెందిన కురువ యువకుడు, మరో సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. మంగళవారం సాయంత్రం యువతికి బుర్కా ధరించి మ్యారియట్ లాడ్జిలోని గదిలోకి తీసుకెళ్లడంతో అక్కడున్న ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు గుర్తించి గొడవకు దిగడంతో పెద్దెత్తున జనం గుమిగూడారు. ఈలోగా 3వ పట్టణ సీఐ తబ్రేజ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రేమికులతో పాటు గొడవ చేసిన యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
చదవండి: (Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి)
Comments
Please login to add a commentAdd a comment