సాక్షి, హైదరాబాద్: రూబీ లాడ్జి విషాద ఘటనపై ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. లీథియం బ్యాటరీల పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. భవనానికి సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉంది. లిప్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది.
చదవండి: రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్‌లెన్నో?
అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయలేదు. భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్‌లో ఉండిపోయింది. భవనానికి కనీసం కారిడార్ కూడా లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదు. భవన, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో మొదటిగా అగ్ని ప్రమాదం మొదలైంది.తర్వాత మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయని నివేదికలో ఫైర్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment