![Lovers Committed Suicide In Tenali - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/14/lovers-suicide.jpg.webp?itok=-8wQLnf-)
సాక్షి, గుంటూరు/ విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు రెండు చోట్ల ప్రేమికులు ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఓ జంట ప్రాణాలు కోల్పోగా..మరో జంట కొన ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. వివరాలు..గుంటూరు జిల్లా తెనాలి గాంధీచౌక్‌లోని ఓ లాడ్జిలో ఓ ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు విజయవాడ చిట్టినగర్‌కు చెందిన పృద్వీరాజ్(30), పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కొత్తలంక సాయిదివ్య(23)లుగా గుర్తించారు. లాడ్జి నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
మరో ఘటనలో..
విజయనగరం జిల్లా పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్ దగ్గర పురుగులు మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు జీఎం వలస మండలం నీచుకవలస గ్రామానికి చెందిన పేరూర సంతోష్(23), చింతాడ గౌతమి(22)గా గుర్తించారు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment