
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో విషం తీసుకున్నారు. దీంతో ప్రియురాలు నేహా (17) మృతిచెందగా, ప్రియుడు కృష్ణ (19) పరిస్థితి విషమంగా ఉంది. యువకుడ్ని కేజీహెచ్‌కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురికీ తరలించారు.