Neha
-
సోషల్ మీడియాకు దూరం.. సివిల్స్‌కు దగ్గర.. ఐఏఎస్ అధికారి నేహా సక్సెస్ స్టొరీ
ఈ ఆధునికయుగంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా.. ఈ రెండూలేని మన రోజువారీ జీవితాన్ని ఊహించలేం. అయితే సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాలు మన దృష్టిని లక్ష్యాల నుంచి పక్కకు మళ్లీస్తున్నాయి. దీంతో చాలామంది తమ కెరియర్, జీవిత లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. దీనిని గుర్తించిన నేహా బయద్వాల్ తన కెరియర్ ఉన్నతి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో తన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు నేహా బయద్వాల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించేందుకు మూడేళ్ల పాటు మొబైల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ, ప్రిపరేషన్ కొనసాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన నేహా.. జైపూర్‌లో తన పాఠశాల విద్యను, భోపాల్‌లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా నేహా తరచుగా పాఠశాలలు మారవలసి వచ్చేది. నేహా తండ్రి, శ్రవణ్ కుమార్ సీనియర్ ఆదాయపు పన్నుశాఖ అధికారి. ఆయనే నేహా ఐఏఎస్ అధికారి కావడానికి ప్రేరణగా నిలిచారు. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. తన మొదటి మూడు ప్రయత్నాలలో నేహా పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారు.ఈ నేపధ్యంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగం తన దృష్టిని మరలుస్తున్నాయని గ్రహించిన ఆమె వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వాటికి దూరంగా ఉన్నానని నేహా మీడియాకు తెలిపారు. తన ప్రిపరేషన్ సమయంలో నేహా స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా అనేక ఒడిదుడుకులతో పోరాడి, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన నేహా.. 2021లో తన నాల్గవ ప్రయత్నంలో యూపీఎస్సీ సీఎస్ఈని ఛేదించి, 569 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. నేహా ఐఎస్ అధికారిగా ఎంపికైనప్పుడు ఆమె వయసు 24 మాత్రమే. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో నేహా ఇంటర్వ్యూలో 151 మార్కులతో కలిపి మొత్తం 960 మార్కులు సాధించారు. ఈ విజయం తరువాత నేహా బయద్వాల్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 28 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం -
విలేజ్‌లో మిస్టరీ
రవితేజ నున్నా, నేహ జురెల్ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజు దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కమర్షియల్ సబ్జెక్ట్ ఈ చిత్రం. ఎన్నో ఇబ్బందులు పడి ఈ సినిమా పూర్తి చేశాం’’ అన్నారు రవితేజ. ‘‘ఈ సినిమాలో హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు ముత్యాల రామదాసు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సత్యరాజ్. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి. ∙నేహ జురెల్, రవితేజ నున్నా -
దిల్ రాజు చేతికి ఆ యాక్షన్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
లక్ష్ చదలవాడ, నేహా పఠాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ధీర'. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ మూవీ హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతమందించారు. -
వైరల్: అవునండీ... ఇది బిర్యానీ టీ
వేడి వేడిగా బిర్యానీ తింటే ఎంత మజా? ఆ తరువాత వేడి వేడిగా టీ తాగుతుంటే ఎంత మజా! ఆ మజాను ఈ మజాను మిక్స్ చేసి ‘బిర్యానీ టీ’ తయారుచేసింది ‘మాస్టర్ చెఫ్ 4’ విజేత నేహాదీపక్షా. టీ ఆకులు, దాల్చిన చెక్క, సోంపు, నల్లమిరియాలు, యాల కులు... మొదలైన వాటితో నేహా తయారు చేసిన ఈ ‘బిర్యానీ టీ’ చవులూరిస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా నెటిజనులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఆహో ఓహో!’ అని పొగడ్తల దండకం అందుకుంటే, మరి కొందరు ‘బిర్యానీ టీ అంటే ఏమిటో కాదు వేడి వేడి బిర్యానీని వేడి వేడి టీలో కలపడం’ అని జోక్ చేస్తున్నారు. ఐస్‌క్రీమ్ రోల్ మేకర్ కూలింగ్ పాన్‌ను ఉపయోగించి ఒక చెఫ్ తయారుచేసిన ‘స్క్రీమ్టీ’కూడా ఈమధ్య నెట్‌లోకంలో హల్చల్ చేసింది. -
చలిపులికి సవాలు విసురుతూ....
మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో చలికి చేతులు కొంకర్లు పోతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. అలాంటి వాతావరణంలో పుషప్‌లు చేయడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ నేహా బంగియాకు అలాంటి వాతావరణం అవరోధం కాలేదు. కశ్మీర్‌కు వెళ్లిన నేహా అక్కడి ఆర్మీ సోల్జర్తో కలిసి స్పీడ్‌గా పుషప్‌లు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ‘ఇలాంటి అతిశీతల వాతావరణంలో కొన్నిరోజులు ఉండడానికే మాకు కష్టంగా అనిపించింది. మన సైనికులు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకొని దేశంకోసం పనిచేస్తున్నారు’ అని కాప్షన్లో రాసింది నేహా బంగియా. -
ఆ విభాగంలో భారత్‌కు తొలి పతకం.. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే!
Asian Games 2023- Neha Thakur Silver In Sailing: భారత్ ఖాతాలో మరో ఆసియా క్రీడల పతకం చేరింది. సెయిలింగ్(ఐఎల్సీఏ డింఘీ)లో నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్‌తో మెరిసింది. దీంతో ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. ఇక ఈ మెగా ఈవెంట్లో సెయిలింగ్‌లో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే? కాగా ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 2019లో సెయిలింగ్ విభాగంలో ఐఎల్సీఏ డింఘీ పేరిట రేసులకు అనమతినిచ్చింది. ఇక ఐఎల్సీఏ డింఘీ-4 కేటగిరీలో మొత్తం 11 రేసులు ఉంటాయి. ఇందులో సెయిలర్ వరస్ట్ స్కోరును.. మొత్తం రేసు పాయింట్ల నుంచి మైనస్ చేస్తారు. తద్వారా నెట్ స్కోరును నిర్ణయిస్తారు. నేహా 11 రేసులలో మొత్తంగా పోటీ ముగిసేలోపు ఎవరైతే తక్కువ నెట్ స్కోరు కలిగి ఉంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. కాగా 19వ ఆసియా క్రీడల్లో నేహా ఠాకూర్ ఐఎల్సీఏ డింఘీ-4 విభాగంలో 11 రేసులలో కలిపి 32 పాయింట్లు స్కోరు చేసింది. ఐదో ప్రయత్నంలో అత్యల్ప స్కోరు సాధించగా.. నెట్ స్కోరు 27గా నమోదైంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్‌కు చెందిన నొప్పాస్సాన్ ఖుబూంజాన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించి నేహా వెండి పతకం గెలుపొందింది. ఈ విభాగంలో థాయ్‌లాండ్‌కు స్వర్ణం, సింగపూర్‌కు కాంస్యం(కియారా మేరీ- నెట్ స్కోరు 28) దక్కాయి. ఇప్పటికి ఎన్ని పతకాలంటే? కాగా నేహా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల నేషనల్ సెయిలింగ్ స్కూల్లో సెయిలర్‌గా ఓనమాలు నేర్చుకుంది. ఇక చైనాలోని హోంగ్జూ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మంగళవారం(సెప్టెంబరు 26) మధ్యాహ్నం నాటికి భారత్ ఖాతాలో 2 పసిడి, నాలుగు రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ 🥈🌊 Sailing Success! Neha Thakur, representing India in the Girl's Dinghy - ILCA 4 category, secured the SILVER MEDAL at the #AsianGames2022 after 11 races⛵ This is India's 1️⃣st medal in Sailing🤩👍 Her consistent performance throughout the competition has earned her a… pic.twitter.com/0ybargTEXI — SAI Media (@Media_SAI) September 26, 2023 -
రాజుగారి అమ్మాయి ప్రేమకథ
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా సత్య రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి –నాయుడుగారి అబ్బాయి’. రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మించారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్ యు..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. రెహమాన్ సాహిత్యం అందించిన ఈ పాటని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ‘‘అందమైన ప్రేమకథతో రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
కొత్తవాళ్లు సక్సెస్ అవ్వాలి
విజయ్ రాజ్‌కుమార్, నేహా పఠాని జంటగా భరత్ మిత్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. నవీన్ కురవ, కిరణ్ కురవ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ విష్ణు మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో కొత్తవాళ్లు విజయం సాధిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. దర్శకుడు భరత్‌కు మంచి విజన్ ఉంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘18–30 వయసు మధ్య ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు భరత్ మిత్ర. ‘‘ఈ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా, సెకండాఫ్‌లో ఆడియన్స్ తల తిప్పుకోలేని సీన్స్ ఉంటాయి’’ అన్నారు విజయ్ రాజ్‌కుమార్. -
అమెరికాలో శ్రీమంతురాళ్లు.. వీళ్ల సంపద ఎంతో తెలుసా?!
న్యూయార్క్: Forbes Among America's 100 Richest Self Made Women : అమెరికాలోని టాప్ 100 సంపన్న మహిళల్లో (స్వయంగా ఆర్జించిన) నలుగురు భారత సంతతి వనితలకు చోటు లభించింది. పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రా నూయి(67), అరిస్టా నెట్వర్క్స్ (కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ) ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్(62), సింటే (ఐటీ కన్సల్టెంగ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేతి(68), కన్‌ఫ్లూయెంట్ (క్లౌడ్ కంపెనీ) సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కడే (38) ఫోర్బ్స్ ‘అమెరికా సంపన్న మహిళల’జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి ఉమ్మడి సంపద 4.06 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33292 కోట్లు)గా ఉంది. 100 మంది మహిళలు ఉమ్మడిగా 124 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారని, ఏడాది క్రితంతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఫోర్బ్స్ తెలిపింది. జాబితాలో జయశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్ల సంపదతో 15వ ర్యాంకులో ఉన్నారు. ఉన్నత విద్యను అమెరికాలో అభ్యసించారు. నీర్జా సేతి 990 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. తన భర్తతో కలసి స్థాపించిన సింటెల్‌ను ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈకి 3.4 బిలియన్ డాలర్లకు 2018లో విక్రయించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన తర్వాత ఆక్లాండ్ వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. నార్కడే 520 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 38వ స్థానంలో ఉన్నారు. కన్ఫ్లూయెంట్లో ఆమెకు 6 శాతం వాటాలున్నాయి. మరొకరితో కలసి ఆసిలర్ పేరుతో కొత్త కంపెనీని 2023 మార్చిలో స్థాపించారు. ఇంద్రా నూయి 2019లో పెప్సీకో సీఈవోగా రిటైర్ అయ్యారు. 350 మిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో 77వ స్థానంలో నిలిచారు. -
తొలి అడుగు
భద్ర, పద్మాకర్ రావ్ హీరోలుగా, నేహా, అంజలి హీరోయిన్లుగా ఉప్పలపాటి శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మిస్పా మూవీ మీడియాపై పద్మాకర్రావ్ చిన్నతోట, ఆర్.సువర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం కడపలో ప్రారంభమైంది. పద్మాకర్రావ్ చిన్నతోట మాట్లాడుతూ–‘‘పదహారేళ్లుగా మీడియా రంగంలో రాణిస్తున్న మా మిస్పా మూవీ మీడియా సంస్థ నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’గా గుర్తుండిపోతుంది'
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది. మా చిత్రాన్ని ఇండియాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూపించాలనేది మా లక్ష్యం' అని డైరెక్టర్ శివమ్ అన్నారు. బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నటించిన బాలల చిత్రం ‘లిల్లీ’. శివమ్ దర్శకత్వంలో కె. బాబురెడ్డి, సతీష్ కుమార్ .జి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా శివమ్ మాట్లాడుతూ– 'కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి నా స్వస్థలం. డైరెక్టర్ కావాలనుకుని 13ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా చేశాను. మణిరత్నంగారి ‘అంజలి’ స్ఫూర్తితో చిన్న పిల్లలతో ఓ సినిమా చేద్దామని ‘లిల్లీ’ కథ రాశాను. నేనే డైరెక్టర్‌గా, నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్, ఔట్పుట్ బాబురెడ్డిగారికి నచ్చడంతో ‘లిల్లీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేద్దామన్నారు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ కడపకు చెందిన కొత్తవారే. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. నేను డైరెక్టర్ అయ్యేందుకు ప్రోత్సహించిన మా నాన్న నాంచారయ్య, అమ్మ వెంకటలక్ష్మి, నా భార్య సుధా శక్తి, ఫ్రెండ్స్‌కి, చాన్స్ ఇచ్చిన బాబురెడ్డిగారికి కృతజ్ఞతలు. గోపురం బ్యానర్లోనే నాలుగు సినిమాలు సైన్ చేశాను' అన్నారు. -
లక్షితా... ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?
ప్రతి ఒక్కరికీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నంతగా ప్రైమరీస్కూల్ ఫ్రెండ్స్‌లో చాలా తక్కువమంది మాత్రమే టచ్‌లో ఉంటారు. అయితే వారి చిత్రాలు మన మదిలో ప్రింటై పోయి ఉంటాయి. ఏదో ఒక సమయంలో వారు గుర్తుకు వస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేహాకు తన ఎల్కేజీ ఫ్రెండ్ లక్షిత గుర్తుకు వచ్చింది. ‘ఎక్కడ ఉందో? ఎలా ఉందో’ అనే ఆసక్తి మొదలైంది. వెంటనే ‘ఫైండింగ్ లక్షిత’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేసింది. నేహా ఆన్లైన్ సెర్చ్ జర్నీకి లక్షలాది లైక్ వచ్చాయి అనేది ఒక విషయం అయితే, మరో విశేషం... నేహాను అనుసరిస్తూ ఎంతోమంది తమ ఎల్కేజీ ఫ్రెండ్స్‌ను వెదుక్కునే పనిలో పడ్డారు. ఇదొక ట్రెండ్‌గా మారింది. ‘నా ఎల్కేజీ ఫ్రెండ్ జాడ కోసం నేను కూడా నేహాలాగే చేశాను. ఇదొక మంచి ఐడియా. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటాను’ అని ఒక యూజర్ రాసింది. -
టాప్ సింగర్స్ జంట.. విడాకుల బాట పట్టనుందా?
బాలీవుడ్ టాప్ సింగర్ లిస్ట్‌లో నేహా కక్కడ్ కూడా ఉంటుంది. ఆమె పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే! తన గాత్రంతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుందీ సింగర్. అక్టోబర్ 24, 2020న బాలీవుడ్ సింగర్ రోహన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు జడ్జీలుగా ఉన్న సమయంలో వీరద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అప్పట్లోనే తెలిపారు. తాజాగా నేహా కక్కడ్ తన 35వ పుట్టినరోజు బాష్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. బర్త్‌డే పార్టీలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి) తన తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో కలిసి శాండ్విచ్లు తింటూ పోజులిచ్చిన ఫోటోలు మాత్రమే అక్కడ కనిపించాయి. కానీ ఏ ఫోటోలోనూ నేహా భర్త రోహన్ కనిపించలేదు. దీంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. రోహన్ క్షేమంగానే ఉన్నాడా? అని ఒకరు అడిగితే, మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని మరొకరు ప్రశ్నించారు. భర్త లేకుండా పార్టీలు చేసుకుందంటే గొడవలు ఉన్నట్లే కదా! అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. ఈ విషయంపై నేహ కక్కడ్‌తో పాటు రోహన్ కూడా నోరు మెదపక పోవడంతో బాలీవుడ్లో మరో జంట కూడా విడాకుల బాట పడుతుందేమో అనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. (ఇదీ చదవండి: తండ్రికి రెండో పెళ్లి చేస్తున్న బుల్లితెర నటి.. వధువుకు కూడా రెండోదే!) -
Neha Narkhede: టెక్నోస్టార్
పుణెలోని ఆ ఇంట్లో మరాఠీ, హిందీ పాటలతో పాటు పాఠాలు కూడా వినిపించేవి. అయితే అవి క్లాస్రూమ్ పాఠాలు కాదు. ఎన్నో రంగాలలో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన మహిళల గురించిన గెలుపు పాఠాలు. ఆ పాఠాలు వింటూ వింటూ ‘నేను కూడా సాధిస్తాను’ అన్నది చిన్నారి నేహ. అవును ఆమె సాధించింది! ఫోర్బ్స్ అమెరికా ‘రిచ్చెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్–2023’ జాబితాలో వివిధ రంగాలకు చెందిన వందమంది మహిళలకు చోటు దక్కింది. వీరిలో పదకొండు మంది నలభై ఏళ్ల వయసులోపు ఉన్నవారు. వారిలో ఒకరు 38 సంవత్సరాల టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ నేహ నర్ఖాడే.... మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నేహ. ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనకు కంప్యూటర్ కొనిచ్చారు. అప్పుడు టెక్నాలజీపై మొదలైన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త కొత్త విజయాలు సాధించేలా చేస్తూనే ఉంది. తన బలం ‘తల్లిదండ్రులు’ అని చెప్పుకుంటుంది నేహ. ‘మొదట చదువు విలువ గురించి చెప్పారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఎంతోమంది మహిళా రోల్‌మోడల్స్ గురించి చెప్పేవారు. నువ్వు కూడా ఏదైనా సాధించాలి అంటూనే... యస్. నువ్వు సాధించగలవు అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు’ అంటుంది నేహ. పుణె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీలో చదువుకున్న నేహ ... జార్జియా (యూఎస్)లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. జార్జియాలో చదువుకునే రోజుల్లో ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనే విషయంలో ఎంతోమంది స్నేహితులతో చర్చిస్తూ ఉండేది. ‘ఒరాకిల్’లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తొలి ఉద్యోగం చేసిన నేహ ఆ తరువాత ‘లింక్ట్ ఇన్’లో చేరింది. ఆ సమయంలో రకరకాల స్టార్టప్‌లు, వాటి విజయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘అపాచీ కాఫ్కా’ అనే ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. కంపెనీలు తమ డాటాతో వేగంగా యాక్సెస్ అయ్యే అవకాశాన్ని ఈ ప్లాట్‌ఫామ్ కల్పిస్తుంది. ‘ఎలాంటి జటిలమైన సమస్యను అయినా పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అనేది లక్ష్యంగా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల తరువాత ‘కన్‌ఫ్లూయెంట్’ అనే ఫుల్–స్కేల్ డాటా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది నేహ. ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ‘కన్‌ఫ్లూయెంట్’ నుంచి సేవలు పొందుతున్నాయి. కంపెనీకి సంబంధించి భాగస్వాములు, ఉద్యోగులను ఎంచుకోవడంలో నేహ అనుసరించే పద్ధతి ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘తెలివితేటలతో పాటు కష్టపడే స్వభావం ముఖ్యం. వీరితో ఐడియాలు షేర్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించాలి. సమస్య తలెత్తినప్పుడు మెరుపు వేగంతో పరిష్కరించే సామర్థ్యం ఉండాలి’ నేహ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు స్టార్టప్ కల్చర్‌పై ఇప్పుడు ఉన్నంత అవగాహన లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేసినా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుండేది. వెంటనే ఆ తప్పును దిద్దుకొని ముందుకు సాగేది. నేహా నర్ఖాడే విజయరహస్యం ఏమిటి? ‘వ్యూహాలు, ప్రతివ్యూహల సంగతి తరువాత. ఎంటర్ప్రెన్యూర్లకు తప్పనిసరిగా కావాల్సింది మానసిక బలం. ఆ బలం ఉంటే యుద్ధరంగంలో అడుగు ముందుకు వేయగలం. విజయాలు సాధించగలం. ఇది నా దారి... అంటూ పరుగెత్తడం కాదు. చుట్టూ ఏం జరుగుతుందో అనేదానిపై పరిశీలన దృష్టి ఉండాలి. మన తప్పుల నుంచీ కాదు ఇతరుల తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. టైమ్మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి’ అంటుంది నేహ. నేహ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు రోల్‌మోడల్, తన రోల్‌మోడల్ మాత్రం ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ‘నియో’ ఫౌండర్, సీయివో పద్మశ్రీ వారియర్. ‘రోల్‌మోడల్ స్థానంలో మనల్ని మనం చూసుకుంటే వారిలా విజయం సాధించడం కష్టం కాదు’ అంటుంది నేహ నర్ఖాడే. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా సరే... చేయాల్సిన పనిపై పక్కా ప్రణాళిక ఉండాలి. – నేహ -
టాయ్లెట్లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు..
టాయ్లెట్లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు తల్లులు తమ పిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడానికి పబ్లిక్ టాయిలెట్లకు ఎందుకు వెళ్లాలి? సిగరెట్ తాగడం కోసం స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేస్తారు. కానీ, ఆకలితో ఉన్న పిల్లలకు పాలివ్వడానికి ప్రతిచోటా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్‌లు ఎందుకు లేవు? అందరి ముందు తమ బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రజల చెడు దృష్టిని ఎందుకు ఎదుర్కోవాలి? ఢిల్లీవాసి, న్యాయవాది నేహా రస్తోగి ఈ సమస్యల నుండి తల్లులను రక్షించడానికి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పింక్ టాయిలెట్లు, పిల్లలకు తల్లిపాలు ఇచ్చే గదులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆమె ఈ దిశగా తన ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే ఉంది. ఇంతకీ నేహా రస్తోగి తల్లిపాల ఆలయాలు ఎందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. దీని ద్వారా ఆమె ఏం సాధిస్తోంది. లాయర్‌గా ఆమె పోరాటం దేనికి? ముందుగా తను ఎదుర్కొన్న సమస్యను వివరిస్తూ.. ‘‘నేను 2017, అక్టోబరులో మొదటిసారి తల్లిని అయ్యాను. నా బాబుకి మూడు నెలల వయసున్నప్పుడు బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి బయల్దేరాలి. గంటల గంటల ట్రాఫిక్ తాకిడిని తప్పించుకుంటూ విమానాశ్రయానికి చేరుకునేసరికి బాబు ఆకలితో ఏడుపు మొదలెట్టాడు. అక్కడ వాడికి పాలు ఎక్కడ ఇవ్వాలో తెలియలేదు. వాష్‌రూమ్‌లో తల్లి పాలు తల్లిపాలు పట్టేందుకు విమానాశ్రయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్లైట్‌లో వాడికి మరోసారి ఆకలి వేసింది. పక్కన కూర్చున్న వ్యక్తిని ‘బిడ్డకు పాలు పట్టాలి, కొద్దిగా స్థలం ఇవ్వమని అడిగాను. కానీ, అతను కాదన్నాడు. ఎయిర్‌హోస్టెస్‌ను అడిగితే ‘టాయ్‌లెట్‌కి వెళ్లు’ అని చెప్పింది. చాలాసేపు ప్రాధేయపడ్డాక ఎయిర్ హోస్టెస్ కూర్చున్న చోట కూర్చుని, పిల్లవాడికి పాలు పట్టాను. బెంగళూరు విమానాశ్రయంలోనూ బిడ్డకు తల్లి పాలు పట్టేందుకు చోటు లేదు. అలా బిడ్డతో నా మొదటి ప్రయాణం వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా చాలా బాధకారంగా అనిపించింది. గంటల తరబడి నా కొడుకు ఆకలితో ఏడుస్తూ ఉంటే, నేను నిస్సహాయంగా ఉండిపోయాను. విషయ సేకరణ ఈ సంఘటన తర్వాత నేను దేశవ్యాప్త సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాను. దేశంలో ఎక్కడా చంటి బిడ్డలకు తల్లిపాలు పట్టే గదులు లేవని తెలిసింది. ఈ విషయంపై చాలా మంది మహిళలతో మాట్లాడి, వారి బాధాకరమైన అనుభవాలను విన్నాను. నాలాంటి తల్లులకు బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చే హక్కును కల్పించాలని, అందుకు ఎంతకాలం యుద్ధం చేసినా పర్వాలేదని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఓ ఎంపీ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అప్పుడే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ ఈ కేసు విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో లక్షలాదిమంది చంటిబిడ్డలకు తల్లిపాలు ఇచ్చే ఏర్పాటు లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. రైల్వేస్టేషన్, బస్టాప్, ఎయిర్పోర్ట్, మాల్స్‌తో సహా ప్రతి బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాల బూత్‌లు ఏర్పాటు చేయాలని కోర్టును కోరాను. తల్లులు పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలన్నాను. లైంగిక వేధింపులు బిడ్డలకు చనుబాలివ్వడానికి గదులు అందుబాటులో లేకపోవడంతో తల్లులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే తమ పిల్లలకు పాలివ్వాల్సి వస్తోంది. ఈ సమయంలో వారు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లి గౌరవాన్ని దెబ్బతీసే వారు ఆమెను గౌరవంగా చూడరు. కంప్లైంట్ చేస్తే టాయ్లెట్లో కూర్చొని పాలు ఇవ్వమని సలహా ఇచ్చేవారున్నారు. కానీ, అటువంటి మురికి, దుర్వాసన ఉన్న ప్రదేశంలో కూర్చొని పాలు ఇవ్వడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికీ ప్రమాదకరం. ఈ సమస్యకు సంబంధించి అన్ని శాఖలు, ఏజెన్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2019లో నిర్ణయం తీసుకుని, ఫీడింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు పంపారు. హైకోర్టు తీర్పు తర్వాత చైనా, అమెరికా, లండన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా దానిని కవర్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో కనీస సౌకర్యాలు కూడా లేవని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైకోర్టు నిర్ణయం తర్వాత పింక్ టాయిలెట్, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ప్రారంభమైంది. ఇందులో తల్లులకు ప్రత్యేక భోజన గదులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తల్లి హాయిగా కూర్చొని బిడ్డకు పాలు పట్టచ్చు. స్నానం చేసి, బట్టలు కూడా మార్చుకోవచ్చు. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్‌లోని పార్లమెంట్ స్ట్రీట్‌లో మొదటి ఫీడింగ్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 700కు పైగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఆలయాల నుంచీ.. షిర్డీలో సాయిబాబా ఆలయం నుండి తాజ్‌మహల్ వరకు తల్లిపాలు ఇచ్చే గదులు నిర్మించారు. బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లలో తల్లిపాల క్యాబిన్లు ప్రారంభించారు. ఇప్పుడు రైల్వేస్టేషన్లలోనే కాదు రైళ్లలో కూడా ప్రత్యేక ఫీడింగ్ క్యాబిన్లను తయారుచేస్తున్నారు. ఈ విజయం ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించింది. తల్లి పాల బ్యాంక్ దేశంలో ఏ ఒక్క తల్లీ బిడ్డ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ సమస్యను ఎదుర్కోకూడదు. ఈ ఆలోచనతో ‘మాతృ స్పర్ష్ ఇనిషియేటివ్ బై అవ్యన్ ఫౌండేషన్’ పేరుతో ఒక ఎన్జీవోని ప్రారంభించాను. దీని ద్వారా ఫీడింగ్ రూమ్, తల్లి పాల బ్యాంకు సౌకర్యాన్ని కల్పించే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది తల్లి పాలు కావాలనే వాళ్లు కూడా సంప్రదిస్తున్నారు. దీంతో తల్లిపాలను దానం చేయాలనుకుంటున్న తల్లుల నుంచి పాలుతీసుకొని, అవసరమైన పిల్లలకు ఇస్తుంటాం. ఈ పనిలో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే, ప్రతి బిడ్డ తల్లి పాలు సులభంగా పొందుతుంది. ఆ దిశగానే ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. లండన్ యూనివర్శిటీలో జరుగుతున్న పరిశోధనలో నేను వాదించిన తల్లిపాల కేసు చేర్చారు. కేవలం తొమ్మిది నెలల వయసులో పిల్ దాఖలు చేసినందుకు నా కొడుకు అవ్యన్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. రొమ్ము లైంగిక అవయవం కాదు. ఇది తల్లి–బిడ్డల మధ్య పవిత్ర సంబంధాన్ని కలిగిస్తుంది. ఈ పోరాటం అంత సులువు కాలేదు. మాది చిన్న కుటుంబం. నా కొడుకు సిజేరియన్ ద్వారా పుట్టాడు. ఈ పోరాటంలో నేను ఆపరేషన్ నుంచి చాలా రోజుల వరకు కోలుకోలేకపోయాను. ఇంటి నుండి కోర్టు పనులు పూర్తయ్యేవరకు పిల్లాడిని పట్టుకొనేదాన్ని. సమాజంలో పాతకాలపు ఆలోచనలను మార్చడం పెద్ద సవాల్. ఎంతో మంది మహిళలు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా మాట్లాడలేకపోతున్నారు’’ అంటూ ఈ సమస్య గురించి సుధీర్గంగా తన గళం వినిపిస్తారు ఈ లాయర్. చదవండి: రూమ్, ఫుడ్ ఉచితం, మంచి జీతం.. జాబ్ ఏంటని తెలిస్తే షాక్ అవుతారు! -
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్‌ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్‌ఫామ్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్‌కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్‌ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
పెళ్లైన 10 ఏళ్లకు తల్లి కాబోతున్న బుల్లితెర నటి
బుల్లితెర నటి నేహా మాద్ర త్వరలో తల్లి కాబోతుంది. పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో ఆమె ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. తాజాగా నటి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నేహా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. 'నా కడుపులో ఉన్న బిడ్డపై ఎనలేని ప్రేమ కురిపించారు. ఈ సీమంతం అంతా ఒక కలలా అనిపిస్తోంది. నా అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను' అని రాసుకొచ్చింది. ఈ ఫోటోల్లో దంపతులిద్దరూ లావెండర్ కలర్ దుస్తుల్లో మెరిసిపోయారు. కాగా నేహా మాద్ర బిజినెస్మెన్ ఆయుష్మాన్‌ను 2012లో పెళ్లాడింది. గతేడాది నవంబర్ 24న తను గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా మెటర్నిటీ షూట్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది. ఇకపోతే నేహా బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు)లో గెహనాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. క్యో రిష్తా మే కత్తి బత్తి, డోలీ అర్మానోకీ వంటి సీరియల్స్‌లో నటించింది. అలాగే జలక్ దిక్లాజా డ్యాన్స్ షో 8వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) చదవండి: ఘనంగా హీరోయిన్ పూర్ణ సీమంతం -
అప్పట్లో స్టార్ హీరోయిన్.. కానీ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?
సినీ పరిశ్రమలో ఎందరో తారలు కనుమరుగై పోవడం మనం చూస్తుంటాం. అలాగే ప్రతి ఏటా కొత్తగా పదుల సంఖ్యలో ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ హీరోయిన్ కథేంటో చదివేద్దాం. నేహా పెండ్సే.. ఈ పేరు చాలామందికి తెలియదు. టాలీవుడ్లో సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముంబయి భామ. ఆమెకిదే తెలుగులో మొదటి సినిమా. ఆ తర్వాత 2003లో వచ్చిన గోల్మాల్, 2008లో వచ్చిన వీధిరౌడీ సినిమాలోనూ కనిపించింది. కానీ సినిమాలతో ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు హిందీ, మరాఠీ, తమిళ, మలయాళంలోనూ నటించింది. ఆమె 2018లో బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా కనిపించింది. కాగా.. మొదట 1995 నుంచి సీరియల్స్‌లో నటిస్తోంది. ప్రస్తుతం కూడా హిందీలో పలు సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘బాబీజీ ఘర్ పర్ హై’ అనే హిందీ సీరియల్ చేస్తోంది. అనితా విభూతి నారాయణ్ మిశ్రా పాత్ర పోషించినందుకు ఫేమ్ సాధించింది. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది భామ. ఇప్పుడున్న నేహాను చూస్తే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ ముంబై బ్యూటీ టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేసుంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. -
ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
భార్యాభర్తలు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో ముందడుగు వేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవనసహచరులు ఒకరికొకరు అండగా నిలిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. భారత రగ్బీ క్రీడాకారుల జంట నేహా పర్దేశీ- గౌతమ్ దాగర్ ఈ కోవకే చెందుతారు. భారత రగ్బీ జట్ల మాజీ కెప్టెన్లు అయిన వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకువచ్చి 2019, ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ప్రణయ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేహా- గౌతమ్ జీవితంలోని సంతోషాలను రెట్టింపు చేస్తూ గతేడాది నవంబరులో వీరికి కవలలు జన్మించారు. తమ కలల పంటకు దెమీరా దాగర్(కూతురు), కబీర్ దాగర్(కొడుకు)గా నామకరణం చేశారు ఈ క్రీడా దంపతులు. (Photo Credit: Gautam Dagar Facebook) ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన నేహా.. తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమయ్యారు. జాతీయ క్రీడల్లో భాగంగా ఈ ‘సూపర్ మామ్’ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గుజరాత్ వేదికగా 36వ జాతీయ క్రీడలు గురువారం అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు లక్షా 25 వేల మందితో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించిన ఆరంభ వేడుకల సంబరం అంబరాన్నంటింది. 36 క్రీడాంశాలు.. దాదాపుగా 600 మంది గుజరాతీ కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనతో కట్టిపడేశారు. ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య భారత ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ఈ ఆటల పండగను ప్రారంభించారు. జాతీయ క్రీడలు- 2022లో భాగంగా సుమారు 7000 మందికి పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పాల్గొననున్నారు. ఇందులో నేహా కూడా ఒకరు. మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తూ.. తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న ఆమె దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ రగ్బీ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా మాట్లాడుతూ.. సిజేరియన్ తర్వాత 20 రోజులకే ట్రెయినింగ్ ఆరంభించానంటూ ఆట పట్ల అంకిత భావాన్ని చాటుకున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోను ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉంటాను. ఇప్పుడు నా ఆటలో కాస్త వేగం తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ మానసికంగా నేనెంతో దృఢంగా ఉన్నాను. క్రీడాకారిణిగా నా బాధ్యతలను గతంలో కంటే మెరుగ్గా నెరవేర్చగలను. ఎందుకంటే.. నాకిపుడు మల్టీటాస్కింగ్ అలవాటైంది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా చూసుకుంటూనే తిరిగి రగ్బీ ఆడేందుకు సిద్ధమయ్యాను. సిజేరియన్ తర్వాత 20 రోజులకే ఫిజికల్ ట్రెయినింగ్ మొదలు పెట్టాను. ఫిట్నెస్ సాధించాను. తల్లిగా.. ప్లేయర్‌గా నా కర్తవ్యాన్ని నెరవేర్చడాన్ని నేను పూర్తి ఆస్వాదిస్తున్నా’’ అని ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న 29 ఏళ్ల నేహా చెప్పుకొచ్చారు. తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. కాగా 2019లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన నేహా.. శుక్రవారం నాటి మ్యాచ్‌తో రీఎంట్రీకి సన్నద్ధమయ్యారు. ఇక నేహా భర్త గౌతమ్ దాగర్ గతంలో భారత పురుషుల రగ్బీ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి' -
Bigg Boss- 6 : షాకింగ్ ఎలిమినేషన్: ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..
బిగ్‌బాస్ సీజన్-6 రసవత్తరంగా ముందుకు సాగుతుంది. తొలి రెండు వారాలు చప్పగా సాగిన ఈ షో.. మూడో వారంలో వచ్చేసరికి మాత్రం రసవత్తరంగా మారింది. నామినేషన్స్ మొదలు.. కెప్టెన్సీ టాస్క్ వరకు ఇంటి సభ్యులు గొడవపడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా గతవారం డబుల్ ఎలిమినేషన్‌తో షానీ, అభినయలు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంలో ఆసక్తి మొదలైంది. మూడోవారంలో వాసంతీ కృష్ణన్, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి, నేహా చౌదరి,ఇనయా సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో రేవంత్, గీతూ తమ ఆటతీరుతో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నారు. ఇక ఆరోహి, నేహా, ఇనయాలు డేంజర్ డోన్‌లో ఉండగా ఇనయా ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయిందని ఇప్పటికే లీకువీరులు లీక్ చేశారు. అర్థంపర్థం లేని రాద్దాంతం చేస్తూ చీటికిమాటికి గొడవపడుతూ ఇనయా బాగానే కంటెంట్ ఇచ్చింది. దీంతో చివరి నిమిషంలో ఆమె సేవ్ అయి నేహా చౌదరి ఎలిమినేట్ అయిందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు వేచిచూడాల్సిందే. -
మంచి మంచి పాటల్ని చెడగొడుతున్నారు కదయ్యా!
ముంబై: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్లో అయినా పాత హిట్ సాంగ్స్‌ను రీమిక్స్‌లు, రీ-రీమిక్స్‌లు, రీక్రియేషన్ల పేరుతో ఇప్పటి తరాలకు అందిస్తుండడం చూస్తున్నాం. అదే సమయంలో చాలావరకు కొత్తవాటిపై విమర్శలు వెల్లువెత్తుతుండం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా.. శ్రీలంక గాయని యోహానీతో ‘మనికే మేగే’ సాంగ్‌ను.. ‘థ్యాంక్ గాడ్’ సినిమా కోసం ఆమెతోనే పాడించి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ కంపోజిషన్‌పై మాములు తిట్లు పడడం లేదు. ఇక ఇప్పుడు మరో క్లాసిక్ పాటను చెడగొట్టే యత్నమూ జరుగుతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ‘మైనే పాయల్ హై ఛన్‌కాయి’ సాంగ్ గుర్తుందా? అప్పట్లో నార్త్-సౌత్ తేడా లేకుండా ఊపేసిన సాంగ్. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకున్న సాంగ్ అది. సింగర్ నేహా కక్కర్ ‘ఓ సజ్నా’ పేరిట రీమిక్స్ చేయించి వదిలింది టీ సిరీస్. దీంతో మంచి పాటను చెడగొట్టారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే నేహా కక్కర్ పాడిన పలు రీక్రియేషన్స్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి గతంలో. ఇక ఒరిజినల్ కంపోజర్ & సింగర్ ఫాల్గుని పాథక్ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఫ్యాన్స్ షేర్ చేసిన కొన్ని మీమ్స్‌ను, విమర్శలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రూపంలో షేర్ చేశారంటూ కథనాలు వెలువడుతున్నాయి. video credits: T-Series ఫాల్గుని పాడిన మైనే పాయల్ హై ఛన్‌కాయి ఒరిజినల్ సాంగ్ 1999లో రిలీజ్ అయ్యింది. వివన్ భాటేనా, నిఖిలా పలాట్లు ఇందులో నటించారు. కాలేజీ షోలో తొలుబొమ్మల ప్రదర్శన మీద ఈ సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది. ఇక కొత్త వెర్షన్ ఓ సజ్నాకు తన్షిక్ బాగ్చీ మ్యూజిక్ అందించగా.. ప్రియాంక శర్మ, ధనాశ్రీ వర్మ నటించారు. videoCredits: FalguniPathakVEVO -
ఏక్ నెంబర్ సీరియల్.. రెండేళ్లుగా నటికి డబ్బులెందుకివ్వట్లే?
తారక్ మెహతా కా ఉల్టా చష్మా.. ఈ పేరు తెలియని హిందీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఫేమస్ అయిందీ సీరియల్. ఇందులో నటించిన నటీనటులకు సైతం మంచి పేరుప్రఖ్యాతలు దక్కాయి. అయితే ఈ సీరియల్ నిర్మాతలు తనకు డబ్బులివ్వడం లేదంటూ నటి నేహా పలుమార్లు మీడియా ముందు వాపోయింది. ఈ ధారావాహికలో తారక్ మెహతా భార్య అంజలి మెహతా పాత్రలో నటించిన నేహ 2020లోనే సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఆరు నెలల నుంచి రెమ్యునరేషన్ అందలేదని, ఈ బకాయిలను ఇంకెప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్య కూడా ఓ ఇంటర్వ్యూలో తనకింతవరకు పూర్తిగా పారితోషికం అందనేలేదని అసహనానికి లోనైంది నేహ. తాజాగా ఆమె ఆరోపణలపై తారక్ మెహతా కా ఉల్టా చష్మా నిర్మాతలు స్పందించారు. 'ఆర్టిస్టులను మేము కుటుంబంగా పరిగణిస్తాం. నేహా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాక కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని చెప్పాం. ఈ ధారావాహిక నుంచి ఎగ్జిట్ అవుతున్నట్లుగా కొన్ని పత్రాలపై సంతకం చేయాలని సూచించాం. కంపెనీ పాలసీ ప్రకారం ఆ సంతకం చేసిన తర్వాతే ఆమెకు సెటిల్మెంట్ చేయగలం. ఆమెతో మాట్లాడేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఆమె ఖాతరు చేయడం లేదు. అంతేకాదు ఈ సీరియల్ నుంచి కూడా చెప్పాపెట్టకుండా తప్పుకుంది. 12 ఏళ్లపాటు ఫేమ్, మంచి కెరీర్‌ను ఇచ్చిన మేకర్స్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి బదులుగా మెయిల్స్‌కు స్పందిస్తే బాగుంటుంది' అంటూ నీలా ఫిలిం ప్రొడక్షన్స్ ఓ లేఖను విడుదల చేసింది. ఇకపోతే తారక్ మెహతా కా ఉల్టా చష్మా 2008లో ప్రారంభమైంది. 13 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ నిర్విరామంగా ముందుకు సాగుతోంది. చదవండి: హీరోయిన్ ఇంట్రస్టింగ్ పోస్ట్, ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్ ఘనంగా నాగశౌర్య సోదరుడి వివాహం, ఫొటోలు వైరల్ -
విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో విషం తీసుకున్నారు. దీంతో ప్రియురాలు నేహా (17) మృతిచెందగా, ప్రియుడు కృష్ణ (19) పరిస్థితి విషమంగా ఉంది. యువకుడ్ని కేజీహెచ్‌కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురికీ తరలించారు. చదవండి: (మహిళను లోబర్చుకుని.. రాత్రి తలుపులు పగులకొట్టి..) -
రోజంతా ఇవే మాట్లాడుకుంటున్నాం!
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఇదే గోలా? పొద్దున లేస్తూనే నేను వింటున్న వార్తలు (పెరుగు తున్న ద్రవ్యోల్బణం మినహా యించి) అన్నీ కూడా ఆలయాలు, మసీదుల గురించే. ఇది 2022. అయినా మనం ఇంకా రోజంతా– హిందువులు, ముస్లింలు; గుడులు, మసీదులు ఇవే మాట్లాడుకుంటున్నాం. ఇది ఆందోళనకరం, భయానకం. చెప్పాలంటే శక్తిని నిర్వీర్యం చేస్తోంది. – నేహా ఖన్నా, యాంకర్ నిషేధాల మీద నిషేధాలు తాలిబన్ కొత్త ఉత్తర్వు ప్రకారం– పురుషులు, మహిళలు కలిసి రెస్టారెంట్లో తినడం నిషిద్ధం. పార్కులకు కలిసి వెళ్లడానికి కూడా అనుమతి లేదు, వాళ్లు పెళ్లయిన దంపతులే అయినా సరే. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మహిళా హక్కుల సంక్షోభాన్ని అఫ్గానిస్తాన్ ఎదుర్కుంటోంది. – షబ్నమ్ నసీమీ, బ్రిటన్ ప్రభుత్వ సలహాదారు, ఒకప్పటి అఫ్గాన్ శరణార్థి ఆటవిక చర్య కశ్మీరీ పండిత్ అయినందుకు రాహుల్ భట్‌ను తీవ్రవాదులు చంపేశారు. కశ్మీరీ పోలీస్ అయినందుకు రియాజ్ ఠోకర్ను తీవ్ర వాదులు చంపేశారు. అసహనం, ఆటవికత, అగాథపు చీకట్లలాంటి దుష్టత్వమే జీవితంగా గడిపే తీవ్రవాదులు మరో రెండు కశ్మీరీ ప్రాణాలను అంతమొందించాయి. – జునైద్ అజీమ్ మట్టూ, శ్రీనగర్ మేయర్ పాత రోజులు కావు మా నాన్నతో మాట్లాడుతున్నాను. ఒక జ్ఞాపకం పంచుకున్నారు. 1960, 70ల ప్రాంతంలో ఆగ్రాలోని హిందూ బట్టల దుకాణదారులు రోడ్ల మీద తమ తాన్లను పరిచేవారట; ముఖ్యంగా జుమా అల్విదా, రంజాన్ రోజుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థన చేసేటప్పుడు. వాటి మీద నమాజ్ చేయడం వల్ల బట్టలకు ఆశీర్వాదం దొరికి అమ్మకాలు పెరుగుతాయనీ, ‘బర్కత్’ అవుతుందనీ నమ్మేవాళ్లట. ‘ఆలోచనే మారిపోయిందిప్పుడు,’ అన్నారు. – ఘజాలా వాహబ్, సంపాదకురాలు ట్రంపును తప్పించారంతే... జో బైడెన్ తప్పు ఏమిటంటే, దేశాన్ని మార్చడానికి ఆయనను ఎన్నికల్లో గెలిపించారని అనుకుంటున్నారు. కానీ నిజానికి అందరూ కోరుకున్నది కొద్దిగా నాటకీయత తగ్గాలని! – ఎలాన్ మస్క్, వ్యాపారవేత్త భరించలేని వైరస్ కోవిడ్–19 పాజిటివ్ అని తేలింది. తల నుంచి కాళ్ల వరకు విపరీతమైన నొప్పి. ఏదో ఒక పెద్ద లారీ ఢీకొట్టినట్టు అనిపిస్తోంది. నిజంగా నాకు బాలేదు. నాకోసం ప్రార్థించండి. – రెనీ లిన్, అమెరికా యాక్టివిస్ట్ నిరసనే లేదు వంట గ్యాసుకు నేను 1,048 రూపా యలు కడుతున్నాను. మీరెంత చెల్లిస్తు న్నారు? అది నాలుగు వందల రూపా యలు ఉన్న రోజులు నాకు తెలుసు– అప్పుడు దానిమీద చాలా నిరసన వ్యక్తమైంది. – బబీతా శర్మ, అస్సాం కాంగ్రెస్ ప్రతినిధి -
ఉక్రెయిన్: సారీ అమ్మా.. నేను భారత్‌కు రాలేను!
ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో అక్కడి పౌరులు సైతం ఆయుధాలు చేతబడ్డి కదనరంగంలోకి దూకారు. ఇక విదేశీ పౌరులేమో ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు భారత్‌కు క్షేమంగా చేరుకున్నారు. మరికొందరిని రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకొందరు బంకర్లలో(అండర్ గ్రౌండ్ల్లో) తలదాచుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఓ విద్యార్థిని చేసిన పని.. ఆమె కుటుంబంలో ఆందోళన కలిగిస్తుండగా.. మిగిలిన వాళ్లంతా శెభాష్ అని మెచ్చుకుంటున్నారు. Russia-Ukraine crisis: హర్యానాకు చెందిన నేహా .. మెడిసిన్ కోసం ఉక్రెయిన్ వెళ్లింది. కొన్నాళ్లు హాస్టల్లో ఉన్న ఆమె ఆ తర్వాత ఉక్రెయిన్‌కు చెందిన ఒక సివిల్ ఇంజనీర్ ఇంట్లో ఆశ్రయం పొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. కావాలంటే ఆమె భారత్‌కు తిరిగి వచ్చేది. కానీ, ఆమె ఉంటున్న ఇంటి యజమాని యుద్ధం కోసం సైన్యంలో చేరాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటిని వీడేందుకు నేహ నిరాకరించింది. తనకు అన్నం పెట్టిన కుటుంబం ఆపదలో ఉంటే ఎలా రావాలంటూ.. అక్కడే ఉండిపోయింది. అదే ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడంలో ఆయన భార్యకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. 17 ఏళ్ల నేహా ప్రస్తుతం సదరు ఇంజనీర్ భార్య, ఆయన ముగ్గురు పిల్లలతో కలిసి బంకర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. నేహా కుటుంబం మాతృభూమి కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమె తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాళ్లు. కొన్నేళ్ల కిందట యుద్ధంలో ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి తల్లి బాధ్యతగా ముందుకెళ్తోంది. ఆమె ప్రస్తుతం హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నారు. తన కూతురిని ఉక్రెయిన్ నుంచి రప్పించేందుకు నేహా తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, నేహ మాత్రం ససేమిరా అంది. ‘నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ.. ఈ పిల్లలను వదిలి రాలేను. నాకు జన్మనిచ్చిన తండ్రి దేశం కోసం అమరుడయ్యాడు. తండ్రి లాంటి వ్యక్తి దేశం కోసం పోరాటంలో ఉన్నారు. అన్నం పెట్టిన ఈ అమ్మను ఇలాంటి పరిస్థితిలో వదిలిపెట్టలేను’ అంటూ తన తల్లితో చెప్పేసింది. ఈ విషయాన్ని నేహ కుటుంబానికి దగ్గరైన సవితా జాఖర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.