
ముంబై : ప్రముఖ బాలీవుడ్ గాయని నేహా కక్కర్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె భర్త, పంజాబ్ సింగర్ రోహన్ ప్రీత్ సింగ్ సైతం నేహా ఫోటోను రీపోస్ట్ చేస్తూ.. ‘అవును.. ఇప్పడు మరింత కేర్ తీసుకోవాలి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నేహా తల్లి కాబోతోందని వారి అభిమానులు సంబరపడిపోయారు. ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షలు తెలిపారు. అయితే నేహా గర్భవతి అనే వార్త నిజం కాదని, ఓ సాంగ్ ప్రమోషనల్ టీజర్ అని తెలియడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. ‘ఖ్యాల్ రఖ్యా కర్’ అనే లేటెస్ట్ సాంగ్ కోసం నేహా గర్భవతిగా నటించింది. ఇందుకు సంబంధించి నేహా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేసింది. డిసెంబర్22న ఈ పాట విడుదల కానుంది. (తల్లి కాబోతున్న సింగర్ నేహా కక్కర్ )
ఈ కొత్తజంట చేసిన పబ్లిసిటీ స్టంట్‌తో అభిమానులు సహా కొందరు ప్రముఖులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. కపిల్‌శర్మ సహా మరికొందరు సెలబ్రిటీలు సైతం వీరికి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా కాగా నేహా, రోహాన్‌లు కొంతకాలంగా ప్రేమించుకుని గత అక్టోబర్ 24న ఢిల్లీలోని గురుద్వార్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలా చష్మా, దిల్‌బర్ రీమిక్స్ వంటి ఎన్నో పాటలు ఆలపించి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం నేహా ప్రముఖ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రోహన్‌ప్రీత్, ముజ్ సే షాదీ కరోగీ అనే వెడ్డింగ్ రియాలిటీ షోతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. (భారీగా బరువు తగ్గిన స్టార్ హీరో కూతురు )
Comments
Please login to add a commentAdd a comment