మహాకుంభ్ మేళా తేనే కళ్ల బ్యూటీ.. ఏకంగా సినిమాలో ఆఫర్! | Prayagraj Maha Kumbh Mela Viral Sensation Monalisa Gets Bollywood Movie Chance, Check Video Inside | Sakshi
Sakshi News home page

Kumbh Mela Monalisa: పూసలమ్మే తేనే కళ్ల సుందరి.. ఏకంగా సినిమా ఛాన్స్‌!

Published Wed, Jan 22 2025 4:53 PM | Last Updated on Wed, Jan 22 2025 5:28 PM

Mahakumbh Mela Monalisa gets Bollywood Movie Chance Goes Viral

సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు.. రాజకీయ నాయకురాలు అంత కన్నా కాదు. ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టికూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ తెచ్చుకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందేనే వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం.

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహకుంభ్ మేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. దానికి కారణం ఆమె కళ్లు. తేనేలాంటి కళ్లతో మహాకుంభ్‌ మేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ తర్వాత అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఏ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.

మహాకుంభ్‌ మేళాలో అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న తేనేకళ్ల సుందరి మోనాలిసా. ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్‌ ఇస్తానని ప్రకటించాడు. దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ ‍అట్రాక్షన్‌ కళ్లు. ఆ అందమైన కళ్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకున్న బాలీవుడ్ డైరెక్టర్‌కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశమివ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు.  ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
  

ఈ తేనె కళ్ల వెనుక ఇంత కథ ఉందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement