
కుంభమేళాతో మోనాలిసా (Monalisha Bhosle) దశ తిరిగిపోయింది. పూసలమ్ముకునేందుకు కుంభమేళాకు వచ్చిన ఆమె తన అందమైన తేనెకళ్ల కారణంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా ఆమెకు దాసోహమైపోయింది. ఇంత అందాలరాశి ఇన్నాళ్లూ ఏమైపోయిందన్నట్లుగా కుప్పలుతెప్పలుగా కామెంట్లు.. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ కూడా!
విమానం ఎక్కిన మోనాలిసా
బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు 'ది డైరీ ఆఫ్ మణిపూర్' (The Diary of Manipur) సినిమాలో అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, నిరక్షరాస్యురాలైన ఆమెకు చదువు నేర్పించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఇప్పుడు ముఖానికి మేకప్ వేసి అందంగా ముస్తాబవడాన్ని కూడా నేర్పించాడు. కేరళలో ఓ షాప్ ఓపెనింగ్ కోసం ఆమెను దగ్గరుండి తీసుకెళ్లాడు. అది కూడా విమానంలో! విమానం ఎక్కడం మొదటిసారి కావడంతో మోనాలిసా కొంత భయం, మరికొంత సంతోషానికి లోనైంది.
లుక్ మార్చేసిన బ్యూటీ
ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక షాప్ ఓపెనింగ్‌లో మోనాలిసా తన గెటపే మార్చేసింది. తన జుట్టును చిన్నగా కత్తిరించుకుని దాన్ని స్టైల్ చేసింది. రెడ్ కలర్ గాగ్రా డ్రెస్‌లో మెరిసింది. తన లుక్‌ను చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు మరింత అందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఒక్క కుంభమేళా తన జీవితాన్నే మార్చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: నేను హీరో అనగానే చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు: లవ్‌టుడే హీరో