
పేరుకే హిందీ హీరోయిన్ గానీ దక్షిణాదిలోనూ ఈమె పర్వాలేదనిపించే ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ప్రభాస్ పక్కన సాహో మూవీలో హీరోయిన్ గానూ చేసింది. ప్రస్తుతానికైతే పూర్తి ఫోకస్ హిందీపైనే ఉంది. గతేడాది 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఇంతకీ దీని రేటు ఎంతంటే?
(ఇదీ చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్)
తండ్రి నటుడు కావడంతో సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రద్ధా కపూర్.. ఆచితూచి సినిమాలు చేస్తోంది. స్త్రీ 2 తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు లేదు. అలా అని ఖాళీగా లేదు. అపార్ట్ మెంట్స్ కొనడం, అమ్మడం లాంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. లగ్జరీ లైఫ్ మెంటైన్ చేస్తుందని చెప్పొచ్చు.
రెండేళ్ల క్రితం దాదాపు రూ.4 కోట్ల విలువైన లాంబోర్గిని కారుని కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.2.93 కోట్ల విలువ చేసే లెక్సెస్ ఎల్ఎమ్ 350హెచ్ అనే లగ్జరీ కారుని కొనేసింది. చాలామంది స్టార్స్ ప్రస్తుతం ఈ మోడల్ కారునే ఉపయోగిస్తుండటం విశేషం. ఇప్పుడు శ్రద్ధా కూడా ఆ లిస్టులోకి చేరిపోయిందని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే)