new car
-
కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?
పేరుకే హిందీ హీరోయిన్ గానీ దక్షిణాదిలోనూ ఈమె పర్వాలేదనిపించే ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ప్రభాస్ పక్కన సాహో మూవీలో హీరోయిన్ గానూ చేసింది. ప్రస్తుతానికైతే పూర్తి ఫోకస్ హిందీపైనే ఉంది. గతేడాది 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఇంతకీ దీని రేటు ఎంతంటే?(ఇదీ చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్ రష్మీ గౌతమ్.. చివర్లో: నితిన్)తండ్రి నటుడు కావడంతో సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రద్ధా కపూర్.. ఆచితూచి సినిమాలు చేస్తోంది. స్త్రీ 2 తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు లేదు. అలా అని ఖాళీగా లేదు. అపార్ట్ మెంట్స్ కొనడం, అమ్మడం లాంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. లగ్జరీ లైఫ్ మెంటైన్ చేస్తుందని చెప్పొచ్చు.రెండేళ్ల క్రితం దాదాపు రూ.4 కోట్ల విలువైన లాంబోర్గిని కారుని కొనుగోలు చేయగా.. ఇప్పుడు రూ.2.93 కోట్ల విలువ చేసే లెక్సెస్ ఎల్ఎమ్ 350హెచ్ అనే లగ్జరీ కారుని కొనేసింది. చాలామంది స్టార్స్ ప్రస్తుతం ఈ మోడల్ కారునే ఉపయోగిస్తుండటం విశేషం. ఇప్పుడు శ్రద్ధా కూడా ఆ లిస్టులోకి చేరిపోయిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కార్ల బుకింగ్
హైదరాబాద్ నగరంలో పలు సాంస్కృతిక వేదికల్లో ఉగాది (Ugadi) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషా సాంస్కృతి శాఖ ఆధ్వరంలోనే కాకుండా పలు సాహిత్య, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో కళ, నృత్య ఉత్సవాలు, సాహిత్య వేడుకలు, ఉగాది పురస్కారాల సంబరాలను నిర్వహిస్తున్నారు. వారాంతాలతో పాటు సోమవారం రంజాన్ పండుగ కూడా కలిసి రావడంతో మూడు రోజుల సెలవులను ఆస్వాదించడానికి ఈ వేదికలను ఎంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి ((Shasta Graha Kutami) అనే అంశం వైరల్‌గా మారింది. అరుదుగా సంభవించే ఈ షష్ట గ్రహాల కూటమి వల్ల పలు మార్పులు సంభవిస్తాయని, ముఖ్యంగా రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు, పండితులు వెల్లడిస్తున్నారు. 2019లో సంభవించిన ఈ షష్ట గ్రహ కూటమి అనంతరం కరోనా (Corona) మహమ్మారి విజృంభించిందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కానీ, విశ్వంలో నిత్యం ఏర్పడే మార్పుల్లో భాగంగానే ఈ ఆరు గ్రహాల కూటమి, అంతకు మించి ఎలాంటి ప్రభావాలూ ఉండబోవని నగరానికి చెందిన పరిశోధకులు సోషల్‌మీడియా (Social Media) వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఉగాదికి కోరిక తీరింది.. వసంతానికి శుభారంబంగా అందరి జీవితాల్లోనూ వసంత శోభ వరించాలని ప్రకృతి దీవెనలతో నూతన సంవత్సరాది ప్రారంభమవుతోంది. అయితే ఈ ఏడాది అందరి చూపు నూతన వాహనాలపై పడింది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వాహనాలపై టాక్స్ పెరగనుందని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఉగాదికి నగరవాసులు భారీ సంఖ్యలో కొత్త వాహనాలను బుకింగ్ చేసుకున్నారని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనంతెలుగు సంవత్సరాది.. అందరికీ ఇష్టమైన ఉగాది..! జీవితంలో అన్ని అనుభవాలను, అనుభూతులను సముపాళ్లలో ఆస్వాదించాలనే మంచి సందేశాన్నందిస్తూ నూతన తెలుగు ఏడాదికి ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో నగరమంతా కొంగొత్త ఆశలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి ఆంధ్రా, దసరాకు తెలంగాణ (Telangana) ఊళ్లకు ప్రయాణమయ్యే నగరవాసులు.. ఉగాదికి మాత్రం నగరంలో ఉండటానికే ప్రధాన్యమిస్తున్నారు. ఈ సందర్భంగా నగరమంతా ఉగాది సంబరాల ఏర్పాట్లు, షాపింగ్ సందడితో కనిపిస్తోంది. మరోవైపు సాంస్కృతికప్రదర్శనలు, ఉగాది పురస్కారాలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ఉత్సవాలకు సిద్ధమైంది. – సాక్షి, సిటీబ్యూరో -
Soniya Singh: కొత్త కారు కొన్న విరూపాక్ష నటి (ఫోటోలు)
-
హీరోయిన్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువ. ఫ్లాట్స్, కార్లు అని ఏదో ఒకటి కొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలా ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) భర్త ఖరీదైన కారు కొని భార్యకి బహుమతిగా ఇచ్చాడు. ఇంతకీ దీని రేటు ఎంతో తెలుసా?(ఇదీ చదవండి: హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ)కేరళకు చెందిన అమలాపాల్ ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. కొన్నాళ్ల ముందు వరకు మాత్రం తెలుగు, తమిళ, మలయాల చిత్రాల్లో నటించింది. 2023లో జగత్ దేశాయ్ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత టైమ్ అంతా పూర్తిగా ఫ్యామిలీకే కేటాయిస్తోంది. గతేడాది కొడుకు కూడా పుట్టాడు.తాజాగా సందర్భం ఏంటో తెలియదు గానీ జగత్.. అమలాపాల్ కి ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW Car) కారుని బహుమతిగా ఇచ్చాడు. దీని ధర మార్కెట్ లో రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా వీళ్ల దగ్గర కాస్ట్ లీ పోర్స్ కారు కూడా ఒకటి ఉంది. బీఎండబ్ల్యూ కారు వీడియోని మాత్రం అమలాపాల్, ఆమె భర్త ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
దేశీయ విఫణిలో వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: పూర్తి వివరాలు
వోల్వో ఎక్స్‌సీ90 (Volvo XC90) ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో రూ. 1.02 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ అప్డేట్స్ పొందింది. అయితే ఇది కేవలం ఒక వేరియంట్లో.. పెట్రోల్ పవర్‌తో మాత్రమే లభిస్తుంది. డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి.కొత్త వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్.. ఆరు రంగులలో, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. 11.3 ఇంచెస్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్, పవర్డ్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 250 Bhp పవర్, 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 7.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ గ్రాండ్ చెరోకీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి -
బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
బీవైడీ కంపెనీ తన 'సీలియన్ 7' (Sealion 7) ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు రెండు వేరియంట్లలో.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సరికొత్త బీవైడీ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బీవైడీ సీలియన్ 7 కారు ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు వరుసగా.. రూ. 48.9 లక్షలు, రూ. 54.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). జనవరి ప్రారంభంలోనే కంపెనీ ఆ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మార్చి 7 నుంచి ప్రారంభమవుతాయి.కొత్త డిజైన్ కలిగిన బీవైడీ సీలియన్.. క్రాస్ఓవర్ మాదిరిగా ఉంటుంది. ఇది వాలుగా ఉండే రూఫ్‌లైన్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్ వంటివన్నీ 'బీవైడీ సీల్'ను పోలి ఉంటుంది. ప్రీమియం వేరియంట్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పెర్ఫార్మెన్స్ వేరియంట్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..ఫీచర్స్ విషయానికి వస్తే.. బీవైడీ సీలియన్ ఈవీ 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది కారు గురించి చాలా సమాచారం అందిస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్లోటింగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌షేడ్‌తో పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.బీవైడీ సీలియన్ 7 ఈవీ 82.56 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ప్రీమియం వేరియంట్ ఒక సింగిల్ ఛార్జితో 482 కిమీ రేంజ్ అందిస్తే.. పెర్ఫార్మెన్స్ వేరియంట్ 456 కిమీ రేంజ్ అందిస్తుంది. మొత్తం మీద ఈ రెండు కార్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. ఈ కారు 'వోల్వో సీ40 రీఛార్జ్'కు ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ.8.95 కోట్ల కొత్త రోల్స్ రాయిస్ కారు ఇదే.. చూశారా?
రోల్స్ రాయిస్ (Rolls Royce) కంపెనీ.. ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘోస్ట్ సిరీస్ II' (Ghost Series II)ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ దాని మునుపటి మోడల్లో అందుబాటులో లేని కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్‌లు, ఫీచర్లను పొందిందని సంస్థ వెల్లడించింది.రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్‌లో.. మూడు వెర్షన్స్ ఉన్నాయి. అవి ఘోస్ట్ సిరీస్ II, ఘోస్ట్ ఎక్స్టెండెడ్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II. వీటి ధరలు వరుసగా రూ. 8.95 కోట్లు, 10.19 కోట్లు,10.52 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు కోసం చెన్నై, న్యూఢిల్లీ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు.రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కారు 6.75 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజిన్‌ను పొందుతుంది, ఇది వరుసగా 600 హార్స్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఘోస్ట్ సిరీస్ II మెరుగైన రైడ్ స్టెబిలిటీ కోసం ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా సస్పెన్షన్లను అడ్జెస్ట్ చేయడానికి కెమెరాల సహాయంతో ఫ్లాగ్ బేరర్ సిస్టమ్ వంటి టెక్నాలజీ అప్గ్రేడ్లను పొందుతుంది. ఇది మెరుగైన ఆడియో సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఫంక్షన్లను కూడా పొందుతుంది. -
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: శీతల్ దేవికి గిఫ్ట్
పారిస్ పారాలింపిక్స్ 2024లో.. 'శీతల్ దేవి' (Sheetal Devi) మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. ఆ సమయంలో పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) శీతల్‌కు కారు బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశారు, అది ఇప్పుడు నిలబెట్టుకున్నారు.శీతల్ దేవిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె అద్భుతమైన సంకల్పం, దృఢత్వం, దృష్టిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఒక బాణాన్ని బహుమతిగా ఇచ్చింది. ఒక ఆర్చర్‌గా ఇది తన గుర్తింపు. శీతల్ మనందరికీ స్ఫూర్తిదాయకం.. ఆమె కొత్త ఎత్తులకు ఎదుగుతున్నప్పుడు.. స్కార్పియో ఎన్ (Scorpio N)తో చూడటం గర్వంగా ఉందని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.శీతల్ దేవి కేవలం 17 సంవత్సరాల వయస్సులో.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించింది. 2022 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం.. ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లలో ఒక స్వర్ణం, రజత పతకాలను సొంతం చేసుకుంది. క్రీడా రంగంలో ఆమె చేసిన సేవలకు గానూ.. భారత ప్రభుత్వం ఈమెను అర్జున అవార్డుతో సత్కరించింది.మహీంద్రా స్కార్పియో ఎన్భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలను పొందిన మహీంద్రా కార్లలో 'స్కార్పియో ఎన్' ఒకటి. దీని ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 24.54 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఐదు వేరియంట్లు.. మూడు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ఈ కారు, మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్.. డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా, ఆటో స్టార్ట్ / స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 12 స్పీకర్ 3డి సోనీ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటి ఎన్నో ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు 6, 7 సీటింగ్ ఆప్షన్లలో లభిస్తుంది.I have long admired @archersheetal ’s talent from afar. Meeting her in person, I was struck by her remarkable determination, tenacity and focus. Speaking to her mother and sister, it was clear that it runs in the family!She gifted me an arrow, a symbol of her identity as an… pic.twitter.com/SFY8RCf6iM— anand mahindra (@anandmahindra) January 28, 2025 -
జూబ్లీహిల్స్ : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ సోనియా ఆకుల (ఫొటోలు)
-
కొత్త కారును ఆవిష్కరించిన టెస్లా (ఫొటోలు)
-
కొత్త లుక్‌లో ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: రేటెంతో తెలుసా?
హోండా కంపెనీ.. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 15.51 లక్షలు. కాగా ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ధరలు రూ. 15.71 లక్షలు (ఎక్స్ షోరూమ్). బ్లాక్ ఎడిషన్ ఎలివేట్ టాప్-ఆఫ్-ది-లైన్ ZX గ్రేడ్ ఆధారంగా తయారైంది. ఇది మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.బ్లాక్ ఎడిషన్ కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్ పొందింది. ఇది బ్లాక్ అల్లాయ్ వీల్స్ & నట్లను పొందుతుంది. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఎగువ గ్రిల్, సిల్వర్ ఫినిషింగ్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్‌లు, లోయర్ డోర్ గార్నిష్.. రూఫ్ రైల్స్‌పై క్రోమ్ యాక్సెంట్లను కలిగి ఉంది. వెనుకవైపు ప్రత్యేక 'బ్లాక్ ఎడిషన్' చిహ్నం ఉండటం చూడవచ్చు.సిగ్నేచర్ ఎడిషన్‌లో ఫ్రంట్ అప్పర్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్‌లు, రూఫ్ రెయిల్‌లు, డోర్ లోయర్ గార్నిష్ నలుపు రంగులో పూర్తయ్యాయి. ఇది ఫ్రంట్ ఫెండర్‌పై 'సిగ్నేచర్ ఎడిషన్' చిహ్నం ఉంది.రెండు ఎడిషన్లు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను కలిగి ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్‌లో బ్లాక్ స్టిచింగ్‌తో బ్లాక్ లెథెరెట్ సీట్లు, బ్లాక్ డోర్ ప్యాడ్లు, ఆర్మ్‌రెస్ట్‌లు పీవీసీ, ఆల్ బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌తో చుట్టి ఉంటాయి. సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ అదనంగా రిథమిక్ 7 కలర్ యాంబియంట్ లైటింగ్‌ను పొందుతుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, లెథెరెట్ సీటింగ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కెమెరా బేస్డ్ ఏడీఏఎస్, ఆటో హెడ్లైట్లు, వైపర్లు, సెమీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,7.0 ఇంచెస్ TFT డిస్ప్లే మాత్రమే కాకుండా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కూడా అదే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 121 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. భారతదేశంలోని హోండా డీలర్‌షిప్‌లలో ఈ కారు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సీవీటీ వేరియంట్ డెలివరీలు జనవరి నుంచి ప్రారంభమవుతాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ డెలివరీలు ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్, ఎంజీ ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా బ్లాక్ ఎడిషన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది హోండా ఎలివేట్ క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, హైరిడర్, కుషాక్, టైగన్ వంటి వాటికి అమ్మకాల పరంగా పోటీ ఇస్తుంది.హోండా, నిస్సాన్ విలీనంజపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) మార్కెట్లో 'ఈక్యూఎస్ 450' (EQS 450) లాంచ్ చేసింది. దీని ధర ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈక్యూఎస్ కంటే తక్కువ. ఇది 5 సీటర్ మోడల్.. కేవలం సింగిల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.రూ. 1.28 కోట్ల ధర వద్ద లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ కారు రేంజ్ కూడా దాని 580 మోడల్ కంటే 11 కిమీ కంటే ఎక్కువ. రేంజ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు.. ముందు బంపర్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో కొన్ని చిన్న మార్పులు చూడవచ్చు. ఇంటీరియర్ కూడా కొంత అప్డేట్స్ పొందుతుంది. ఇందులో MBUX హైపర్‌స్క్రీన్ చూడవచ్చు. లోపల గమనించాల్సిన అతిపెద్ద మార్పు మూడో వరుస సీట్లు లేకపోవడం. అయితే రెండవ వరుస సీట్లు పవర్ అడ్జస్టబుల్గా కొనసాగుతాయి. ఎక్కువ సౌలభ్యం కోసం స్లైడ్ అండ్ రిక్లైన్ రెండూ చేయవచ్చు.ఈ కొత్త లగ్జరీ కారులో 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ వెంట్స్, 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, పుడ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్‌లతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైనవి ఉన్నాయి.బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు వెనుక యాక్సిల్‌పై సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 355 Bhp పవర్, 800 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేహవంతం అవుతుంది. ఇందులోని 122 కిలోవాట్ బ్యాటరీ.. సింగిల్ ఛార్జీతో 671 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు 200 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాల సమయం పడుతుంది. అయితే 22 కేడబ్ల్యు వాల్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6.25 గంటలు. ఈ కారు డెలివరీలు కూడా ఫిబ్రవరిలోనే జరుగుతాయి.ఇండియన్ మార్కెట్లో బెంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఇది ఒక సింగిల్ చార్జితో 473 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!
భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మరో విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును (Electric Car) కొనుగోలు చేశారు. ఇది అంబానీ బ్యారేజిలో చేరిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్. దీని ధర రూ. 7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు పేరు 'స్పెక్టర్' (Spectre). ఈ కారుకు MH 0001 అనే వీఐపీ నెంబర్ ప్లేట్ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ కోసం కూడా వారు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఎంత వెచ్చించారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు కస్టమైజ్డ్ అని తెలుస్తోంది. కాబట్టి దీని ధర ఎక్స్ షోరూమ్ ధర కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు 102 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఒక సింగిల్ ఛార్జితో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఇదీ చదవండి: ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!స్పెక్టర్ అనేది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇప్పటికే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', కేరళకు చెందిన ఒక బిల్డర్ కూడా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన స్పెక్టర్ కారు ధర రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. కాబట్టి దీనిని సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం కష్టం. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ కారును 10మంది కంటే తక్కువే.. దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారాం. అయితే ఈ కారు చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!అంబానీ గ్యారేజిలోని కార్లు (Mukesh Ambani Car Collection)భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గ్యారేజిలో.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్660 గార్డ్, మాట్ బ్లాక్ బీఎండబ్ల్యూ 760ఎల్ఐ, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, టెస్లా మోడల్ ఎస్ 100డీ, రోల్స్ రాయిస్ కల్లినన్, మెర్సిడెస్ మేబ్యాక్ 62, ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్, ఆస్టన్ మార్టిన్ రాపిడ్, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఆర్మర్డ్ బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ, బెంట్లీ బెంటయ్గా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. -
కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?
-
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
కాలం మారింది.. నేడు ఇంటికో వాహనం కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ కొందరు కేవలం టూ వీలర్స్ మాత్రమే వినియోగిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు కొత్త కారు కొనాలని యోచించవచ్చు. అయితే కొత్త కారు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ పాటించాలన్నది బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.ముందుగా సెర్చ్ చేయండిమార్కెట్లో లెక్కకు మించిన కార్లు నేడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏది మంచి కారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లను లేదా డీలర్‌షిప్‌లను సందర్శించండి. కస్టమర్ల రివ్యూలను బేరీజు వేసుకోవాలి. మీరు కొనాలనుకే కారు వాస్తవ ప్రపంచంలో ఎలాంటి పనితీరును అందిస్తుందనే విషయంపై కూడా అవగాహన పెంచుకోవాలి.బడ్జెట్ సెట్ చేసుకోవాలికారు కొనాలనుకోవడం సులభమే.. అయితే ఎంత బడ్జెట్లో కొనుగోలు చేయాలి? మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అనేదాన్ని కూడా ఆలోచించాలి. కేవలం కారు కొనాలంటే కేవలం ఎక్స్ షోరూమ్ ధరలను మాత్రమే కాకుండా.. లోన్ తీసుకుంటే కట్టాల్సిన వడ్డీ, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటివి చాలానే ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటికి బడ్జెట్ సెట్ చేసుకోవాలి.ఫైనాన్సింగ్ ఆప్షన్స్కారు కొనాలంటే.. అందరూ మొత్తం డబ్బు చెల్లించి కొనుక్కోలేరు. కాబట్టి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఇది మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా చేస్తుంది. బ్యాంకులు, క్రెడిట్ యూనియన్లు, కార్ ఫైనాన్స్ కంపెనీలు అందించే వడ్డీ రేట్లతో పాటు.. ఇతర నిబంధనలను కూడా సరిపోల్చుకోండి. ఏదైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ లేదా తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి.తెలివిగా చర్చించండికారు కొనడానికి డీలర్‌షిప్‌కు వెళ్తే.. అక్కడ తెలివిగా చర్చించాల్సి ఉంటుంది. మార్కెట్లో ఆ కారు ధర ఎంత, అప్పటికి ఏదైనా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలను కూడా ముందుగానే తెలుసుకుని ఉండాలి. మీ డీల్ అంచనాలకు దగ్గరగా లేకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఇయర్ ఎండ్, ఫెస్టివల్ డిస్కౌంట్స్, డీలర్షిప్ ప్రోత్సాహకాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి సమయంలో కారు కొనుగోలు సిద్దమవ్వండి.బీమా కవరేజ్బహుళ ప్రొవైడర్ల నుంచి బీమా ప్రీమియంలను సరిపోల్చండి. అందులో మీ వాహనానికి తగిన కవరేజీని అందిస్తూ చట్టపరమైన అవసరాలను తీర్చే ప్లాన్‌ను ఎంచుకోండి. యాడ్ ఆన్ కవర్లు, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తులు వంటి అంశాలను పరిగణించండి. అలారం, ఇమ్మొబిలైజర్లు, ట్రాకింగ్ పరికరాల వంటి భద్రతా ఫీచర్లను ఇన్స్టాల్ చేయడం వల్ల బీమా ప్రీమియంలు కూడా తగ్గుతాయి. వీటన్నింటిని గురించి తెలుసుకోండి.క్రెడిట్ స్కోర్కారు కొనుగోలు చేయాలంటే.. దాని కోసం లోన్ తీసుకోవాలంటే, మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. మీకున్న సిబిల్ స్కోరును బట్టి మీకు లోన్ లభిస్తుంది. వడ్డీ రేటు తగ్గాలంటే.. సిబిల్ స్కోర్ తప్పకుండా కొంత ఎక్కువగానే ఉంటుంది.ప్రభుత్వ ప్రోత్సాహకాలుఎలక్ట్రిక్ కారు, హైబ్రిడ్ కారు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను ప్రయోజనాలు వంటివి లభిస్తాయి. కాబట్టి దీని గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఇలాంటి ప్రోత్సాహకాలు గురించి తెలుసుకుంటే.. ఖర్చులు కొంత తగ్గుతాయి.ఇంధన సామర్థ్యంకారు ఎంచుకునే ముందే.. ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగిన కారును కొనుగోలు చేయాలి. పెట్రోల్ ఇంజిన్ కారును ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుంది? డీజిల్ ఇంజిన్ ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుందనేది తెలుసుకోవాలి. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేస్తే.. ఇంధన ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఇంధన సామర్థ్యాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. -
టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు
టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 9వ తరం 'క్యామ్రీ'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.సరికొత్త టయోటా క్యామ్రీ TNGA-K ప్లాట్‌ఫామ్‌పై ఆధారంగా నిర్మితమైంది. ఇది యూ షేప్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్, వెనుక వైపు కొత్త టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్టయోటా క్యామ్రీలోని 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 227 బీహెచ్పీ, 220 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈసీవీటీ (ఎలక్ట్రిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ సేడం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు: ధర రూ.250 కోట్ల కంటే ఎక్కువే! (ఫోటోలు)
-
హోండా అమేజ్ థర్డ్ జనరేషన్ వచ్చేసింది..
కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా మూడవ తరం అమేజ్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఎక్స్ షోరూమ్‌లో ధర రూ.7.99 లక్షల నుండి రూ.10.89 లక్షల వరకు ఉంది. ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో తయారైంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మారుతీ డిజైర్, హ్యుండై ఆరా వంటి మోడళ్లతో ఇది పోటీపడుతోంది.దేశంలో అడాస్ భద్రతా ఫీచర్లను కలిగిన అత్యంత సరసమైన కారు అమేజ్ అని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర చెప్పారు.హోండా దేశంలో ఇప్పటివరకు 5.8 లక్షల యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించింది. అమేజ్ మొదటి తరం 2013లో, రెండవ తరం 2018లో ప్రవేశించింది. అమేజ్ కస్టమర్లలో 50% మంది మొదటిసారి కారును సొంతం చేసుకున్నవారేనని సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ పేర్కొన్నారు. 2027 నాటికి మరో మూడు మోడళ్లు హోండా 2027 మార్చి నాటికి భారత్‌లో మూడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బలంగా అభివృద్ధి చెందుతున్న ఎస్యూవీ విభాగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర తెలిపారు. కంపెనీ ప్రస్తుతం భారత్‌లో ఎలివేట్ ఎస్‌యూవీతోపాటు సెడాన్స్ అయిన అమేజ్, సిటీ మోడళ్లను విక్రయిస్తోంది.2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్టు సుమూర తెలిపారు. తద్వారా ఎస్యూవీ విభాగంలో కంపెనీ ఉనికిని విస్తరిస్తుందని చెప్పా రు. భారతీయ మార్కెట్‌కు సరిపోయే హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వంటి మోడళ్లను హోండా అభివృద్ధి చేస్తూనే ఉందని వెల్లడించారు. -
రూ.1.03 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ ఎం2 కారు - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ ఎం2 కూపేను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర రూ. 1.03 కోట్లు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపించే బీఎండబ్ల్యూ ఎం2 కూపే.. ఇప్పుడు సావో పాలో ఎల్లో, ఫైర్ రెడ్, పోర్టిమావో బ్లూ, స్కైస్క్రాపర్ గ్రే అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ఎం వీల్స్ బ్లాక్ ఫినిషింగ్‌తో డబుల్ స్పోక్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఆప్షనల్ ఆల్కాంటారా ఫినిషింగ్ పొందుతుంది. ఇందులో ఐడ్రైవ్ సిస్టమ్‌తో కొత్త డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.అప్డేటెడ్ బీఎండబ్ల్యూ ఎం2 కారు 3.0 లీటర్ స్ట్రెయిట్ సిక్స్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ద్వారా 480 hp పవర్, 600 Nm టార్క్ అందిస్తుంది. 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన స్టాండర్డ్ M2 కూపే ఇప్పుడు 0-100kph వేగాన్ని 4 సెకన్లలో కవర్ చేస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 285 కిమీ/గం. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని స్పష్టమవుతోంది.Introducing the new avatar of unadulterated adrenaline. The new BMW M2 Coupé. #BMWIndia #BMWM #TheM2—————————————————The models, equipment, and possible vehicle configurations illustrated in the advertisement may differ from vehicles supplied in the Indian market. pic.twitter.com/dC701ZP66j— BMW India (@bmwindia) November 29, 2024 -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న కొత్త బీఎండబ్ల్యూ కారు: రేటెంతో తెలుసా?
ఈ ఏడాది జూన్‌లో 'ఎం5' (M5) కారును గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన తరువాత బీఎండబ్ల్యూ ఎట్టకేలకు భారతీయ విఫణిలో లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఎం5 ధర రూ.1.99 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్, వీ8 పవర్‌ట్రెయిన్ రెండూ ఉపయోగిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది.బీఎండబ్ల్యూ ఎం5 భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే దీని ధర కొంత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ కారులోని 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 577 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 194 Bhp, 280 Nm టార్క్ అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ (ఎం డ్రైవర్ ప్యాకేజీతో).బీఎండబ్ల్యూ ఎం5 కారులోని 22.1 కిలోవాట్ బ్యాటరీ 70 కిమీ రేంజ్ అందిస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 7.4 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ ఉపయోగించాలి. బ్యాటరీ 3:15 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి బ్యాటరీ కూడా మంచి రేంజ్ అందిస్తుందని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..2025 ఎం5 బోల్డ్ డిజైన్ కలిగి సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ ఎయిర్ వెంట్స్ కలిగి ఉండటం చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్‌తో రీస్టైల్ బంపర్, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారులో త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. కర్వ్డ్ ట్విన్ స్క్రీన్లు, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హీటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.బీఎండబ్ల్యూ ఎం5 నాన్ మెటాలిక్ ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, సోఫిస్టో గ్రే, బ్రూక్లిన్ గ్రే, ఫైర్ రెడ్, కార్బన్ బ్లాక్, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, స్టార్మ్ బే, మెరీనా బే బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్ రెడ్/బ్లాక్, కైలామి ఆరెంజ్, సిల్వర్‌స్టోన్/బ్లాక్ & ఆల్-బ్లాక్ వంటి కాంబినేషన్లను పొందుతుంది. -
నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులు ప్రారంభం
దక్షిణాఫ్రికాకు సరికొత్త ఎస్యూవీ న్యూ నిస్సాన్ మాగ్నైట్ ఎగుమతులను నిస్సాన్ మోటార్ ఇండియా ప్రారంభించింది. “ఒక కారు, ఒకే ప్రపంచం” విధానంతోపాటు భారత్‌ను గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఎగుమతులు చేపట్టింది.ఈ వాహనాలు చెన్నైలోని నిస్సాన్ అలయన్స్ ప్లాంట్ నుండి ఎగుమతి అవుతున్నాయి. సరికొత్త మాగ్నైట్ మోడల్‌ను దిగుమతి చేసుకున్న మొదటి అంతర్జాతీయ మార్కెట్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. భారత్‌లో లాంచ్ అయిన ఒక నెలలోనే, చెన్నై పోర్ట్ నుండి 2,700 యూనిట్లకు పైగా న్యూ మాగ్నైట్ వాహనాలు ఎగుమతయ్యాయి.కాగా 2020 డిసెంబర్లో మాగ్నైట్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 150,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇది నిస్సాన్క “మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” చొరవ విజయాన్ని చాటుతోంది. బోల్డ్ లుక్, మెరుగైన భద్రతా ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన న్యూ మాగ్నైట్ ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూ ఢిల్లీలో లాంచ్ అయింది. -
ఆడి కొత్త కారు.. బుకింగ్‌లు ప్రారంభం
ముంబై: లగ్జరీ కార్ల సంస్థ ఆడి.. నూతన ఆడి క్యూ7 మోడల్ కార్ల బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఆడి ఇండియా వెబ్సైట్ లేదా ‘మైఆడికనెక్ట్’ మొబైల్ యాప్ నుంచి రూ.2,00,000 చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.ఈ నెల 28న విడుదల చేసే న్యూ ఆడి క్యూ7 మోడల్ కార్లను ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. 3.0లీటర్ల వీ6 టీఎఫ్ఎస్ఐ ఇంజన్ కలిగిన ఆడి క్యూ7.. 340 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌తో ఉంటుంది. సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.6 సెకండ్లలో అందుకుంటుందని, 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది. -
రూ.74.9 లక్షల కొత్త జర్మన్ బ్రాండ్ కారు ఇదే..
బీఎండబ్ల్యూ ఇండియా '2024 ఎం340ఐ' పర్ఫామెన్స్ సెడాన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 74.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ సెడాన్ కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.2024 బీఎండబ్ల్యూ ఎం340ఐ 48వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్‌తో 374 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే.. 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది మెర్సిడీ బెంజ్ ఏఎంజీ సీ 43, ఆడి ఎస్5 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.కొత్త బీఎండబ్ల్యూ ఎం340ఐ సెడాన్ 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇది ఆర్కిటిక్ రేస్ బ్లూ, ఫైర్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. డిజైన్, సేఫ్టీ పరంగా ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అంటే ఇందులో ఎలాంటి అప్డేట్స్ లేదు. -
లాంచ్‌కు సిద్దమవుతున్న 'మిఫా 9' ఇదే..
భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో 'మిఫా 9' (Mifa 9) ఎంపీవీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ కారు విక్రయాలు 2025 మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్నట్లు సమాచారం.ఎంజీ మిఫా 9 కారు 2023లోనే మొదటిసారి ఆటో ఎక్స్పోలోలో కనిపించింది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కీయ కార్నివాల్‌కు ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కారు ఒట్టోమన్ సీట్లతో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫ్రంట్ ఫాసియా అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఉంటుంది. వెనుకవైపు ఎంపివి మధ్యలో లైట్ బార్‌తో వీ షేప్ ఎల్ఈడీ టైల్లైట్ సెటప్ ఉంటుంది. ఇది పవర్ స్లైడింగ్ రియర్ డోర్స్ పొందనున్నట్లు సమాచారం. ఈ కారు 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం. కాగా కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
రూ.10.23 లక్షలకే కొత్త ఫ్రెంచ్ బ్రాండ్ కారు
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ భారతదేశంలో 'ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్' కారును లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్లస్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.23 లక్షల నుంచి రూ. 14.79 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి.సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇది దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎయిర్‌క్రాస్ హుడ్ గార్నిష్, బాడీ డీకాల్స్ వంటివి ఉన్నాయి. లోపల వెనుక సీట్లు ఎంటర్టైన్మెంట్ కోసం డిస్ప్లే కూడా ఉంటుంది. డాష్ కెమెరా, ఫుట్‌వెల్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు కూడా ఇందులో గమనించవచ్చు.ఇదీ చదవండి: లక్షల ఖరీదైన బైకులు: మరింత కొత్తగా..డిజైన్, ఫీచర్స్ పరంగా అప్డేట్స్ పొందిన ఈ కారు 82 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, 110 హార్స్ పవర్ అందించే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్స్ వరుసగా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతాయి. -
రూ.24.99 లక్షల అమెరికన్ బ్రాండ్ కారు: భారత్‌లో లాంచ్
జీప్ కంపెనీ భారతదేశంలో తన మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్ కలిగి 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. కొత్త మెరిడియన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల చివరలో ప్రారంభమవుతాయి.అప్డేటెడ్ మెరిడియన్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్‌ల్యాండ్ అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ-లెవల్ లాంగిట్యూడ్ ట్రిమ్ 5-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన మూడు ట్రిమ్‌లు 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్‌తో హనీకూంబ్ మెష్ క్రోమ్ స్టడ్‌లను పొందుతుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. క్యాబిన్ లేఅవుట్ మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ.. డ్యాష్‌బోర్డ్ కాపర్ స్టిచింగ్‌తో కొత్త స్వెడ్ ఫినిషింగ్‌ని పొందింది. 9 స్పీకర్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వాటితో పాటు.. ఈ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్జీప్ మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 4x2, 4x4 వేరియంట్లతో పాటు 6 స్పీడ్ మాన్యువల్ & 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. -
టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ టైజర్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.20,160 విలువ చేసే టయోటా జెనివిన్ యాక్సెసరీస్ కిట్‌ను ఆఫర్ చేస్తోంది.అన్ని టర్బో వేరియంట్లలో అక్టోబర్ 31 వరకే ఇది లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.10.56 లక్షలు. ఇప్పటికే కంపెనీ పండుగ సీజన్ కోసం ఇతర మోడళ్లలోనూ లిమిటెడ్ ఎడిషన్లను అందుబాటులోకి తెచ్చింది. -
రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ భారతదేశంలో 'ఎం4 సీఎస్' పేరుతో ఓ కొత్త కారును లాంచ్ చేసింది. దీని ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మొట్ట మొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్. ఎం4 కాంపిటీషన్ మోడల్ కంటే కూడా దీని ధర రూ. 36 లక్షలు ఎక్కువ.కొత్త బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 3.0 లీటర్ ట్విన్ టర్బో స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్ పొందుతుంది. ఇది 550 హార్స్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బో బూస్ట్ ప్రెజర్ 1.7 బార్ నుంచి 2.1 బార్కి పెంచడం వల్ల పవర్ కొంత ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారు 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 302 కిమీ/గం.బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్.. టైటానియం ఎగ్జాస్ట్ సైలెన్సర్, సెంటర్ కన్సోల్, గేర్‌బాక్స్ ప్యాడిల్స్ వంటివి ఫైబర్ నిర్మితం. ఈ కారు ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్స్, వెనుక 20 ఇంచెస్ అల్లాయ్స్ పొందుతుంది. ఎం4 సీఎస్ కారులో ఎల్లో కలర్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. కిడ్నీ గ్రిల్ బార్డర్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసా?: తెలుసుకోకపోతే మోసపోతారు..ఫ్లాట్ బాటమ్ ఆల్కాంటారా ఎం స్టీరింగ్ వీల్ కలిగిన ఎం4 మోడల్ 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. సెంటర్ కన్సోల్‌లోని సీఎస్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆడి ఆర్ఎస్5కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ నిస్సాన్ తన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేయడానికి 100 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని పెట్టినట్లు శుక్రవారం తెలిపింది. కొత్త ఉత్పత్తి అభివృద్ధి, దేశంలో అదనపు అమ్మకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కంపెనీ ఇప్పటికే 600 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెట్టుబడి దీనికి అదనం.2026 నాటికి దేశీయంగా విక్రయాలను మూడింతలు చేయడం ద్వారా ఒక లక్ష యూనిట్లకు, అదే స్థాయిలో ఎగుమతులను చేయాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతకు అదనపు పెట్టుబడి నిదర్శనమని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. మాగ్నైట్ కొత్త వర్షన్‌ను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.మాగ్నైట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ సైతం తయారీ చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 20 మార్కెట్లకు మాగ్నైట్ ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వర్షన్ తయారీతో 65 మార్కెట్లకు ఎగుమతి చేయడానికి వీలు కలుగుతోందని వివరించారు. నిస్సాన్‌కు ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్‌గా ఉందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని టోరెస్ తెలిపారు.మూడు మోడళ్ల విడుదల..వచ్చే 30 నెలల్లో కంపెనీ మరో మూడు మోడళ్లను విడుదల చేయాలని భావిస్తోంది. మాస్ మార్కెట్ సెగ్మెంట్లో రెండు మిడ్–సైజ్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒకటి ఐదు సీట్లు, ఇంకొకటి ఏడు సీట్ల సామర్థ్యంతో రానుంది. అలాగే ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది.2026 చివరి నాటికి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావాలన్నది ప్రణాళిక అని టోరెస్ వెల్లడించారు. ఆ సమయానికి ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్ కోసం హైబ్రిడ్, సీఎన్జీతో సహా వివిధ పవర్‌ట్రెయిన్స్‌ను కంపెనీ అధ్యయనం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఏటా 32,000 యూనిట్లను విక్రయిస్తున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స తెలిపారు. 30 నెలల్లో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం ఉన్న ఒక శాతం నుంచి మూడు శాతానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
నిస్సాన్ మాగ్నైట్ మళ్లీ వచ్చేసింది.. సరికొత్తగా..
సరికొత్త రూపం సంతరించుకున్న నిస్సాన్ మాగ్నైట్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది విసియా, విసియా ప్లస్, ఏసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే ఆరు వేరియంట్లలో, రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్ తొలిసారిగా 2020లో పరిచయమైంది. అప్పటి నుంచి కంపెనీలో ప్రధాన మోడల్ కారుగా ఉంటూ వచ్చింది. 2023 ఏప్రిల్‌లో ఈ మోడల్‌ను కంపెనీ నిలిపేసింది. ఎగుమతులతో కలుపుకొని మొత్తం 1.5 లక్షల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు కంపెనీ చెబుతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో ఉండే ఈ కారును మరింత ఆకర్షణీయంగా ఫేస్‌లిఫ్ట్ చేసి 2024 మోడల్‌గా కంపెనీ విడుదల చేసింది.తాజా నిస్సాన్ మాగ్నైట్ పాత ఫీచర్లతోనే వచ్చినప్పటికీ డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ముందుభాగంలో సరికొత్త ఫ్రంట్ బంపర్తోపాటు ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అలాగే ఆటోమెటిక్ ఎల్ఈడీ హెడ్లైట్లు బై ఫంక్షనల్ ప్రొజెక్టర్‌తో ఇచ్చారు. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌లో ఉన్నాయి. వెనకవైపు టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేకమైన డీటైలింగ్, స్మోక్డ్ ఎఫెక్ట్‌తో ఇచ్చారు. రియర్ బంపర్ డిజైన్ కూడా మార్చారు.ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ మొత్తానికి మార్చకుండా చిన్నపాటి మార్పులు చేశారు. లోపలవైపు లెదర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్లెస్ చార్జర్ సరికొత్త ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరోవైపు సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన జీప్.. పూర్తి వివరాలు
భారతదేశంలో జీప్ కంపెనీ తన ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'కంపాస్ స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 25.26 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. కొత్త కాస్మొటిక్ డిజైన్స్ అన్నీ కూడా దీనిని స్పెషల్ ఎడిషన్ కారుగా గుర్తించడానికి సహకరిస్తాయి.కొత్త జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ బానెట్‌పై డ్యూయల్-టోన్ డికాల్తో పాటు ఆరవ గ్రిల్ స్లాట్‌పై వెల్వెట్ రెడ్ కలర్ ఉండటం చూడవచ్చు. లోపలి భాగంలో కూడా ఎక్కువ భాగం ఎరుపు రంగులోనే ఉండటం చూడవచ్చు. ఈ కొత్త ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 43000 ఎక్కువ ధర వద్ద లభిస్తోంది.ఇదీ చదవండి: టీవీఎస్ జుపీటర్ 125 Vs హోండా యాక్టివా 125: ఏది బెస్ట్?కొత్త జీప్ స్పెషల్ ఎడిషన్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ తప్పా.. ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి కంపాస్ యానివర్సరీ ఎడిషన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 350 న్యూటన్ మీటర్ టార్క్, 170 హార్స్ పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
ఖరీదైన ఇల్లు అమ్మేసి లగ్జరీ కారు కొన్న హీరోయిన్
మన దగ్గరేమో గానీ బాలీవుడ్లో సెలబ్రిటీలు చాలామంది ఎప్పటికప్పుడు కొత్త కార్లు కొంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కంగనా రనౌత్ చేరింది. మొన్నీ మధ్యే రూ.32 కోట్ల విలువ చేసే తన ఇంటిని అమ్మేసిన కంగన.. ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే కంగనా రనౌత్ గుర్తొస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. చాలామందిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగానూ గెలిచింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ఈ మధ్య కాలంలో 'ఎమర్జెన్సీ' సినిమాతో హాట్ టాపిక్ అయిపోయింది. ఇందిరా గాంధీగా కంగన కనిపించనుంది. లెక్క ప్రకారం సెప్టెంబరు 6న ఈ మూవీ రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ బోర్డ్.. కొన్ని సీన్లు కట్ చేయాలని చెప్పింది. అప్పటినుంచి దీని రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది.ఇవన్నీ పక్కనబెడితే మొన్నీమధ్యే పాలి హిల్స్‌లోని రూ.32 కోట్ల ఖరీదైన బంగ్లాని అమ్మేసిన కంగన.. ఇప్పుడు తన ఆఫీస్ అవసరాల కోసం రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ఎల్‌డబ్ల్యూబీ అనే లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మార్కెట్లో దీని ఖరీదు దాదాపు రూ.3.81 కోట్లుగా ఉంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) -
కేవలం 12 మందికే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
రేంజ్ రోవర్ తన మొట్టమొదటి ఇండియా ఎక్స్‌క్లూజివ్ మోడల్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.98 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం 12 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే 12మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు.రేంజ్ రోవర్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్ అనేది రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ నుంచి ప్రేరణ పొందింది. ఈ కారును విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు కంపెనీ విరాళంగా అందించనున్నట్లు సమాచారం.రణథంబోర్ ఎడిషన్ ఒక ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇది బ్లాక్ బాడీ కలర్లో రెడ్ షిమ్మర్‌తో నిండి ఉంది. డిజైన్ పులికి చిహ్నంగా రూపొందించారు. కాబట్టి పులి చారల వంటి డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఇది 23 ఇంచెస్ ఫోర్జ్డ్ డార్క్ గ్రే వీల్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలుఇంటీరియర్.. కారావే అండ్ లైట్ పెర్లినో సెమీ-అనిలిన్ లెదర్ కలయికను పొందింది. సీట్లపై ఎంబ్రాయిడరీ పులి వెన్నెముక వెంట ఉన్న చారల మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో రిక్లినబుల్ సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లోయబుల్ కప్‌హోల్డర్స్, రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్మెంట్ మొదలైనవి ఉన్నాయి.ఈ కారు ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 500 Nm టార్క్, 394 Bhp పవర్ అందిస్తుంది. కాబట్టి పనితీరు బాగుంటుందని భావిస్తున్నాము. -
భారత్‌లో రూ.10.50 కోట్ల రోల్స్ రాయిస్ కారు లాంచ్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) భారతీయ విఫణిలో 'కల్లినన్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 10.50 కోట్లు కాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎస్యూవీ డెలివరీలు 2024 డిసెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారును కల్లినన్ సిరీస్ 2 అని కూడా పిలువవచ్చు.2024 రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త స్టైలింగ్, రివైజ్డ్ ఇంటీరియర్ మరియు అప్డేటెడ్ టెక్నాలజీ పొందుతుంది. ఇది ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, వెనుక భాగంలో స్టెయిన్లెస్-స్టీల్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. రీడిజైన్ గ్రిల్ ఇక్కడ చూడవచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ కూడా కొంత అప్డేట్ పొందాయి.ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలురోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ స్టాండర్డ్ వేరియంట్ 571 హార్స్ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ 600 హార్స్ పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
1974 మందికి మాత్రమే ఈ కారు: దీని రేటెంతో తెలుసా?
పోర్స్చే 911 టర్బో 50 ఇయర్స్ ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి వచ్చేసింది. దీని ధర రూ. 4.05 కోట్లు (ఎక్స్ షోరూమ్). పేరుకు తగినట్లుగా ఈ కారు 50వ యానివెర్సరీ సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. దీనిని కేవలం 1974 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి, కంపెనీ దీనిని పరిమిత సంఖ్యలో విక్రయించడానికి సిద్ధమైంది.కొత్త పోర్స్చే టర్బో 50 ఇయర్స్ అనేది టర్బో ఎస్ కంటే రూ.7 లక్షలు ఎక్కువ. ఇది కేవలం టూ డోర్స్ మోడల్. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డయల్‌లు పొందుతుంది. బయట, లోపల భాగాలూ చాలా వరకు ఒకేరంగులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజంపోర్స్చే టర్బో 50 ఇయర్స్ 3.7 లీటర్ ట్విన్ టర్బో ప్లాట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 650 హార్స్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.7 సెకన్లలో ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిమీ వరకు ఉంది. ఈ కారు 1974లో ప్రారంభించిన ఒరిజినల్ 930 టర్బో కంటే రెండు రేట్లు ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'బీఎండబ్ల్యూ' ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ధర రూ. 1.33 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా లేటెస్ట్ అప్డేట్స్ పొందింది.ఎక్స్‌డ్రైవ్40ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తున్న ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. అయితే ఎన్ని యూనిట్లు విక్రయానికి ఉన్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కారు స్వరోవ్స్కీ గ్లాస్ కట్ క్రిస్టల్స్, అల్యూమినియం శాటినేటెడ్ రూఫ్ రెయిల్‌లతో కూడిన క్రిస్టల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటివి పొందుతుంది.టాంజానైట్ బ్లూ, డ్రవిట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఇండివిజువల్ లెదర్, యూనిక్ క్రిస్టల్ డోర్ పిన్స్,అల్కాంటారా కుషన్స్ వంటి వాటితో పాటు 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఇందులో లభిస్తుంది.ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?బీఎండబ్ల్యూ ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 48వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్ కూడా పొందుతుంది. ఈ ఇంజిన్ 381 హార్స్ పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో.. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. -
809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్యూవీ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 1.41 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 2 లక్షలు ఎక్కువ ఖరీదు.బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కాబట్టి.. ఇది ఒక బ్లాంక్డ్ ఆఫ్ బ్లాక్ ప్యానెల్ గ్రిల్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ముందు భాగంలో విస్తరించి ఉన్న లైట్బార్కు కనెక్ట్ అయి ఉంటుంది. వెనుక భాగంలో కూడా ఎల్ఈడీ టెయిల్ లాంప్ ఉంటుంది.విలాసవంతమైన క్యాబిన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17.7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్‌తో కూడిన హైపర్‌స్క్రీన్ సెటప్ పొందుతుంది. వీటితో పాటు ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డులు, 15 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్: 20 లక్షల ఉద్యోగాలు! కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ద్వారా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 809 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
ఏడాది తర్వాత మళ్ళీ వస్తున్న కారు.. రేపటి నుంచే బుకింగ్స్
కియా మోటార్స్ (Kia Motors) దేశంలో తన కార్నివాల్ ఎంపీవీని నిలిపివేసిన సుమారు సంవత్సరం తరువాత మళ్ళీ సరికొత్త కారుగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అంతకంటే ముందు సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.కియా కంపెనీ తన కొత్త తరం కార్నివాల్ కోసం బుకింగ్స్ సెప్టెంబర్ 16 నుంచి స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 2 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది అక్టోబర్ 3న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది.త్వరలో లాంచ్ కానున్న సరికొత్త కిస్ కార్నివాల్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ కొన్ని అప్డేట్స్ పొంది ఉండటం చూడవచ్చు. వర్టికల్ హెడ్‌లైట్స్, టైగర్ నోస్ గ్రిల్, వెనుక భాగంలో లైట్‌బార్ ద్వారా కనెక్ట్ అయిన స్లిమ్ వర్టికల్ టెయిల్ల్యాంప్ ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయంకొత్త కియా కార్నివాల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు టచ్‌స్క్రీన్, డ్యూయల్ సన్‌రూఫ్, 12 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ పొందుతుంది. వెనుక సీటు ప్రయాణికులు పవర్ ఆపరేటెడ్ స్లైడింగ్ డోర్లు, లెగ్ రెస్ట్లు, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన మధ్య వరుస సీట్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. -
నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో
ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో విపరీతమైన ఇష్టం ఉంటుంది. అలా తమిళ స్టార్ హీరో అజిత్‌కి కార్లు, బైక్స్ అంటే పిచ్చి. ఓవైపు సినిమాలు చేస్తుంటాడు. ఖాళీ దొరికితే చాలు బైక్ రైడింగ్, రేసింగ్ లాంటివి చేసేస్తుంటాడు. మొన్నీ మధ్య ఆగస్టులో రూ.9 కోట్ల విలువ చేసే ఫెర్రారీ కారు కొనుగోలు చేశాడు. ఇప్పుడు కూడా మరో కాస్ట్ లీ కారు సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అజిత్ భార్య, మాజీ నటి షాలినీ బయటపెట్టింది.అజిత్ లేటెస్ట్గా ఫోర్స్ కంపెనీకి చెందిన జీటీ3 ఆర్ఎస్ (GT3 RS) కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్లో దీని ధర మూడన్నర కోట్ల రూపాయలకు పైనే ఉంది. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దీని ధర రూ.4 కోట్లు దాటేస్తుంది. అయితే ఇలా నెలల వ్యవధిలో కోట్లు విలువ చేసే కార్లు సొంతం చేసుకున్న హీరో.. అవంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేశాడు.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!)ఈ కార్లు కాకుండా అజిత్ దగ్గర బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ కే 1300 ఎస్, ఏప్రిలా కాపోనార్డ్ 1200, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 145 లాంటి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. అలానే ఫెర్రారీ 458 ఇటాలియా, బీఎమ్ వన్ 740 లీ, హోండా ఎకార్డ్ వీ6 కార్లు కూడా ఉన్నాయి.ప్రస్తుతం 'విడా మయూర్చి' అనే సినిమా చేస్తున్న అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్) View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)Exclusive Pics of THALA AJITH With Porsche GT3RS 🏎️💨Man And the Machine.,🚨🚧 #VidaaMuyarchi | #Ajithkumar pic.twitter.com/sydMXebHaD— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) September 13, 2024 -
భారత్‌లో జపనీస్ బ్రాండ్ కారు లాంచ్: ధర రూ. 69.70 లక్షలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 69.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది.లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్ కొత్త సిల్వర్ గ్రిల్, రియర్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్, ఎల్ఈడీ లైట్ లెక్సస్ లోగోతో కూడిన ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ల్యాంప్, రియర్ సీట్ పిల్లో వంటి ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. కస్టమర్లు 5 సంవత్సరాల వరకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు.లెక్సస్ కొత్త కారు లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎడిషన్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని ఆయన అన్నారు.2024 ప్రథమార్థంలో, జపనీస్ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ భారతదేశంలో 55 శాతం ఈఎస్ కార్లను విక్రయించింది. ఇప్పుడు ఇందులో లగ్జరీ ప్లస్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కూడా మనషి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నారు. -
తళుక్కున మెరిసే హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్
హ్యుందాయ్ ఇండియా క్రెటా నైట్ (Creta Knight) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న కొన్ని క్రెటా వేరియంట్లకు ఇది కాస్మెటిక్ అప్‌గ్రేడ్. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ.14.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 ఎంపీఐ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో పలు వేరియంట్లు ఉన్నాయి.బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్, మ్యాటీ లోగో, బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లాక్ స్పాయిలర్ వంటివి క్రెటా నైట్ ఎడిషన్ అప్డేట్లలో ప్రధానంగా ఉన్నాయి. ఇంటీరియర్స్ పూర్తిగా బ్లాక్ అప్హోల్స్స్టరీ, స్టీరింగ్ వీల్‌పై లెదర్-ర్యాప్, గేర్ నాబ్‌తో అప్డేట్ చేశారు. మెటల్ పెడల్స్‌తో పాటు బ్రాస్ కలర్ ఇన్సర్ట్లు ఉన్నాయి.సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా, కొనుగోలుదారులు రూ.5,000 అదనంగా చెల్లించి టైటాన్ గ్రే మ్యాటీ కలర్ వాహనాన్ని, రూ. 15,000 చెల్లించి డ్యూయల్ టోన్ కలర్స్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.కొత్త ఎడిషన్ ధరలుహ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్CRETA Knight S(O) MT: రూ. 14.51 లక్షలుCRETA Knight S(O) CVT: రూ. 16.01 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 17.42 లక్షలుCRETA Knight SX (O) CVT: రూ. 18.88 లక్షలుహ్యుందాయ్ క్రెటా 1.5 డీజిల్CRETA Knight S(O) MT: రూ. 16.08 లక్షలుCRETA Knight S(O) AT: రూ. 17.58 లక్షలుCRETA Knight SX (O) MT: రూ. 19 లక్షలుCRETA Knight SX (O) AT: రూ. 20.15 లక్షలు -
స్కోడా కొత్త కారు.. వివరాలు
గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కోడా సూపర్బ్ కారును కంపెనీ సరికొత్త 'స్పోర్ట్‌లైన్' రూపంలో పరిచయం చేసింది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు కంటే కూడా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ కారు స్పోర్టియర్ డిజైన్ పొందుతుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మోడల్ రేడియేటర్ గ్రిల్ ఫ్రేమ్, విండో ఫ్రేమ్‌లు, వెనుకవైపు స్కోడా బ్యాడ్జింగ్‌తో సహా అన్ని క్రోమ్ ఎలిమెంట్లు బ్లాక్ కలర్ పొందుతుంటాయి. ఇందులో 18 ఇంచెస్ లేదా 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్లు, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్లపై స్పోర్ట్‌లైన్ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.స్కోడా సూపర్బ్ స్పోర్ట్‌లైన్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనేది లాంచ్ తరువాత తెలుస్తుంది. అయితే ఈ కారు దాని మునుపటి మోడల్ మాదిరిగా అదే పర్ఫామెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. -
భారత్‌లో సరికొత్త జర్మన్ బ్రాండ్ కారు లాంచ్: వివరాలు
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో 'జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్' లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లగ్జరీ కారు ధర రూ. 97.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు త్రీ-పాయింటెడ్ స్టార్ ప్యాటర్న్‌తో కూడిన డైమండ్ గ్రిల్, స్పోర్టియర్ ఎయిర్ ఇన్లెట్లు, క్రోమ్ ఇన్సర్ట్ & బ్లాక్ సరౌండ్‌తో మ్యాట్ డార్క్ గ్రేలో పెయింట్ చేసి ఉండటం చూడవచ్చు. ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 269 హార్స్ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 48వీ మైల్డ్-హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జెనరేటర్ కూడా పొందుతుంది. ఇది 20 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ. -
సరికొత్త లంబోర్ఘిని కారు: 312 కిమీ/గం స్పీడ్
ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతదేశంలో కొత్త 'ఉరుస్ ఎస్ఈ' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.4.57 కోట్లు (ఎక్స్ షోరూమ్). అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ కలిగిన కొత్త ఉరుస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది.లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ 4.0 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 620 hp, 800 Nm టార్క్ అందిస్తుంది. కంపెనీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయడానికి ఇంజిన్ పూర్తిగా రీ-ఇంజనీరింగ్ చేసింది. ఇది 25.9kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ (60 కిమీ రేంజ్) పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ 312 కిమీ/గం.కొత్త ఉరుస్ ఎస్ఈ కారు స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా మోడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆఫ్ రోడింగ్ కోసం మరో నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ కారు ఆన్ రోడ్, ఆఫ్ రోడింగ్‌కు అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.లంబోర్ఘిని ఉరస్ ఎస్ఈ మ్యాట్రిక్స్ టెక్నాలజీని కలిగిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. వెనుక వై-షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్ ఉంటుంది. లోపల 12.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, అప్డేటెడ్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ వీల్ వంటివి ఎన్నో ఉన్నాయి. -
భారత్‌లో రూ.1.11 కోట్ల జర్మన్ బ్రాండ్ కారు లాంచ్ - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో 'ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్' కూపే లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.1.11 కోట్లు (ఎక్స్ షోరూమ్).బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కొత్త ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 421 హార్స్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ స్లోపింగ్ రూఫ్‌లైన్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 11.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి వాటితో పాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
భారతీయ మార్కెట్లో జపాన్ బ్రాండ్ కారు లాంచ్ - పూర్తి వివరాలు
నిస్సాన్ కంపెనీ తన ఎక్స్-ట్రైల్ SUVని రూ. 49.92 లక్షల ప్రారంభ ధర వద్ద దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు 7 సీటర్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని సంస్థ సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది.కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 163hp పవర్, 300Nm టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.నిస్సాన్ ఎక్స్-ట్రైల్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, ఆటో-హోల్డ్ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ విఫణిలో ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
బర్త్ డే స్పెషల్.. ఖరీదైన కారుతో డబుల్ ఇస్మార్ట్ నటుడు!
కేజీఎఫ్ సినిమాతో దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు సంజయ్ దత్. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బిగ్ బుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే జూలై 29న సంజయ్ దత్ 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీతారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన బర్త్ డే రోజున అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్లో గుడ్ఛాడీ మూవీలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్‌తో జతకట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆగస్టు 9న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమాలో కనిపించనున్నారు. #WATCH | Sanjay Dutt Gifts Himself New Range Rover On His 65th Birthday#Bollywood #SanjayDutt @duttsanjay pic.twitter.com/vIhiFbkpV2— Free Press Journal (@fpjindia) July 29, 2024 -
నిస్సాన్ కొత్త కారు 'ఎక్స్-ట్రైల్' ఇదే.. విశేషాలేంటో తెలుసా?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రస్తుతం భారతదేశంలో మాగ్నైట్ SUVని మాత్రమే విక్రయిస్తోంది. అయితే దేశీయ విఫణిలో తన ఉనికిని చాటుకోవడానికి, వాహన ప్రియులకు చేరువ కావడానికి ఎక్స్-ట్రైల్ లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలను మాత్రమే వెల్లడికావాల్సి ఉంది.నాల్గవ తరం నిస్సాన్ ఎక్స్-ట్రైల్.. పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ అనే మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ కారు.. భారతదేశంలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని పొందుతుంది. ఇంజిన్ 163 పీఎస్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, ముందు అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారు ధర రూ. 40 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే ధరలు అధికారికంగా ఆగష్టు 1న వెల్లడవుతాయి. -
రెండేళ్ల తరువాత లాంచ్‌కు సిద్దమవుతున్న కారు ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సుమారు రెండేళ్ల తరువాత ఇండియన్ మార్కెట్లో టాటా కర్వ్ కారును ఆవిష్కరించింది. ఇది ఆగష్టు 7న భారతీయ విఫణిలో లాంచ్ అవుతుంది. ఏప్రిల్ 2022 లో కాన్సెఫ్ట్ మోడల్‌గా కనిపించిన ఈ కారు త్వరలోనే రోడ్డు మీదికి రానుంది.కంపెనీ లాంచ్ చేయనున్న ఈ మిడ్ సైజ్ SUV పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. ఈ కారు ఎల్ఈడీ హెడ్లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్ పొందుతుంది. ఫ్రంట్ ఫాసియా కొంతవరకు హారియర్, సఫారీకి మాదిరిగా ఉంటాయి. రియర్ ప్రొఫైల్ కూడా చూడచక్కగా ఉంటుంది.టాటా కర్వ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, టచ్ బేస్డ్ హెచ్‌విఎసి కంట్రోల్స్ వంటి ఫీచర్లను పొందవచ్చని సమాచారం. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.టాటా కర్వ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందుతుందని భావిస్తున్నాము. ఎలక్ట్రిక్ మోడల్ 450 కిమీ రేంజ్ అందించడానికి ఉపయోగపడే బ్యాటరీ ప్యాక్ అందిస్తుందని సమాచారం. -
Rithu Chowdary: జబర్దస్త్ బ్యూటీ కొత్త కారు.. అదిరిపోయిందంతే! (ఫోటోలు)
-
కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి
గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి శోభాశెట్టి. అంతకు ముందు 'కార్తీకదీపం'లో మోనిత అనే విలన్ పాత్రలో ఆకట్టుకున్న ఈమె.. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. కానీ గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఈమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ ఏర్పడింది. దానికి పెద్ద రీజన్ ఏం లేదు. అదంతా పక్కనబెడితే నెలన్నర క్రితం యశ్వంత్ అనే నటుడితో నిశ్చితార్థం చేసుకుంది.(ఇదీ చదవండి: పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయిన 'బిగ్ బాస్' జోడీ)'కార్తీకదీపం' సీరియల్లో యశ్వంత్, శోభా శెట్టి నటించారు. అలా షూటింగ్ జరుగుతున్న టైంలో తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ షోలోనే శోభాశెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. దీనితో పాటు కొత్త ఇంట్లో కూడా అడుగుపెట్టింది.ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారుని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభాశెట్టి కొనుగోలు చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంది. ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజు గిఫ్ట్ ఇచ్చింది అంటే పెళ్లికి శోభా ఇంకేం బహుమతిని ఇస్తుందో?(ఇదీ చదవండి: రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?) -
సరికొత్త ధోని ఎడిషన్.. కేవలం 100 మందికి మాత్రమే
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సిట్రోయెన్ కంపెనీ ఇటీవల 'సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. ఈ కారును కంపెనీ 100 మందికి మాత్రమే పరిమితం చేసింది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధోని పేరు, 7 నెంబర్ వంటివి ఉండటం చూడవచ్చు.సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్.. కుషన్ పిల్లో, సీట్ బెల్ట్ కుషన్లు, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్లు, ఫ్రంట్ డాష్ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారును కొనుగోలు చేసేవారు ధోని సంతకం చేసిన 'గ్లౌస్' పొందవచ్చు. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.The C3 Aircross 7 - Dhoni Edition comes with a surprise nobody saw coming. This is your cue to walk into the Citroen showroom to test drive the all new C3 Aircross 7 - Dhoni Edition today! What are you waiting for? #CitroenTeamDhoni #DoWhatMatters pic.twitter.com/ImLotpgvUb— Citroën India (@CitroenIndia) June 18, 2024 -
మహీంద్రా XUV 700 పై భారీ డిస్కౌంట్
-
కాస్ట్ లీ కారు కొన్న యువ హీరో.. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి పార్టీ?
రీసెంట్ టైంలో బాలీవుడ్‌లోకి వారసులు వరసగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. గతేడాది రిలీజైన ఓ మూవీతో ఖుషీ కపూర్, అగస్త్య నంద, సుహానా ఖాన్ తదితర నటులుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఇబ్రహీం అలీ ఖాన్ కూడా త్వరలో చేరబోతున్నాడు. ఇంకా హీరోగా తొలి మూవీ రిలీజ్ కాలేదు. కానీ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఆ కారు ఖరీదుతో పాటు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి)సైఫ్ అలీ ఖాన్ తొలి భార్యకు కలిగిన సంతానం సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. వీళ్లలో సారా ఇప్పటికే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు ఇబ్రహీం హీరోగా లాంచ్ కాబోతున్నాడు. 'సర్జమీన్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నటిస్తున్నందుకు గానూ మంచి రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులుతోనే బీఎండబ్ల్యూ ఎక్స్5 అనే లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లు టాక్. మార్కెట్లో దీని ధర రూ.1.13 కోట్లు అని సమాచారం.తాజాగా ఈ కారులో బయట కనిపించిన ఇబ్రహీం.. దీన్ని కొన్న సందర్భంగా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే ఇతడి రూమర్ గర్ల్‌ఫ్రెండ్, నటి పాలక్ తివారీ కూడా పాల్గొంది. ఇబ్రహీం ఇంటి నుంచి బయటకొస్తూ కనిపించడంతో ఇదే నిజమేనని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
భారత్‌లో కొత్త కారు లాంచ్ చేసిన దేశీయ కంపెనీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్‌బ్యాక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారు కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభించే టాటా ఆల్ట్రోజ్ రేసర్.. దాని బోనెట్, రూఫ్ వంటి వాటి మీద వైట్ రేసింగ్ స్ట్రిప్స్ పొందుతుంది. అక్కడక్కడా రేసింగ్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అలాగే ఉన్నాయి.డిజైన్ మాత్రమే కాకుండా టాటా ఆల్ట్రోజ్ రేసర్ వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెంటర్ కన్సోల్‌లోని గేర్ లివర్ మొదలైనవి కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
భారత్‌లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. ఎట్టకేలకు 'క్యూ7 బోల్డ్ ఎడిషన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.కొత్త ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే. అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వెర్షన్ లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి అదే ఇంజిన్ ఉంటుంది. పనితీరు పరంగా ఎటువంటి మార్పులు ఉండదు.ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. 335 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. క్యూ 7 మోడల్ ఆడి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్ రోడ్, ఇండివిజువల్ అనే 7 డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది.Make heads turn as you drive the new Audi Q7 Bold Edition.*Terms and conditions apply. European model shown. Accessories and equipment shown may not be currently offered in India. Bold Edition is available on select variants and select colours only.#AudiQ7 #BoldEdition pic.twitter.com/5hQZVQpQXL— Audi India (@AudiIN) May 21, 2024 -
బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం
గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024 -
సరికొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య (ఫొటోలు)
-
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపైన ఒక నెటిజన్ స్పందిస్తూ మహీంద్రా కార్లు అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడలేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనికి ఆనంద్ మహీంద్రా రిప్లై కూడా ఇచ్చారు.ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO కారును ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లకు షేర్ చేశారు. ఈ వీడియోపైన ఘాటుగా వ్యాఖ్యానించిన వ్యక్తికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ.. మీ సందేహానికి ధన్యవాదాలు, ఇలాంటివి మాలో ఇంకా కసిని పెంచుతాయని అన్నారు.1991లో నేను కంపెనీకి చేరినప్పుడు సరిగ్గా ఇలాగే అన్నారు. కార్ల తయారీ రంగంలో తప్పుకోవాలని అంతర్జాతీయ సంస్థలు సూచించాయి. కానీ అవన్నీ తట్టుకుని నిలబడగలిగాము. వచ్చే వందేళ్ల తరువాత కూడా మా బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నాము. దీనికోసం ప్రతిరోజు పోరాడుతూ ఉంటామని.. ఆనంద్ మహీంద్రా సున్నితంగా సమాధానం ఇచ్చారు.నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ పోస్టుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన యూజర్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడి నేతృత్వంలో మహీంద్రా బ్రాండ్ వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటుందని నమ్ముతున్నట్టు మరో నెటిజన్ ట్వీట్ చేశారు.Thank you for your skepticism. It only fuels the fire in our bellies. I was told exactly the same thing when I joined the company in 1991. Global consultants advised us to exit the industry. We were told the same thing when Toyota and other global giants in the UV space… https://t.co/oYMBO6HcWk— anand mahindra (@anandmahindra) April 29, 2024 -
కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ షోతో చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. వాళ్లలో ఒకరు దీప్తి సునయన. స్వతహాగా యూట్యూబర్ అయిన ఈమె.. షన్నుతో ప్రేమ వ్యవహారంతో మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న దీప్తి.. కొత్త కారు కొనేసింది. అందరిలా లగ్జరీ కార్లు కాకుండా కాస్త డిఫరెంట్ కారు తీసుకుంది. మరి ఈ కారు రేటు ఎంతో తెలుసా? (ఇదీ చదవండి: వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే?) డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే యూట్యూబ్‌లో వెబ్ సిరీసులు చేస్తోంది. అప్పట్లో బిగ్‌బాస్ రెండో షోలోనూ పాల్గొని మంచి ఫేమ్ సంపాదించింది. ఇక యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ఈమె ప్రేమ-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా దీప్తి సునయత తన తొలి కారుని కొనుగోలు చేసింది. టయోటా హై లక్స్ అనే కారుని కొనేసింది. ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చోవచ్చు. అలానే వెనక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. నార్మల్ కారు కాకుండా ఇలా డిఫరెంట్ కారు ఎందుకు తీసుకుందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మార్కెట్లో ఈ కారు ధర రూ.30-37 లక్షల వరకు ఉంది. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) -
మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూజర్ టైజర్’ను విడుదల చేసింది. దీని ధర రూ. 7.73 లక్షల నుంచి రూ. 13.03 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. ఇది మారుతీ సుజుకీకి చెందిన ఫ్రాంక్స్‌కి టీకేఎం వెర్షన్‌గా ఉంటుంది. టైజర్ పెట్రోల్, ఈ–సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రీమియం ఇంటీరియర్స్, కీ లెస్ ఎంట్రీ, 360 వ్యూ కెమెరా, 9 అంగుళాల హెచ్డీ స్మార్ట్‌ప్లే, యాంటీ–థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రూ. 11,000తో టైజర్‌ను బుక్ చేసుకోవచ్చు. మే నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ఈ మోడల్ తమకు ఉపయోగపడగలదని కంపెనీ డిçప్యూటీ ఎండీ తడాషి అసాజుమా తెలిపారు. కస్టమర్లు చిన్న కార్ల నుంచి క్రమంగా పెద్ద కార్ల వైపు మళ్లుతున్నారని, అందుకే మరిన్ని కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు తాము ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. -
ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు
ముంబై: చైనాకు చెందిన ఎస్ఏఐసీతో దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ’జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. సెపె్టంబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి 3–4 నెలలకు ఓ కొత్త కారును ఆవిష్కరించాలని భావిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఎస్ఏఐసీతో భాగస్వామ్యం ఖరారు చేసుకోవడాన్ని ప్రకటించిన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, హలోల్‌లో (గుజరాత్) ఇప్పుడు తమకున్న ప్లాంటుకు దగ్గర్లోనే మరో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా గౌరవ చైర్మన్ రాజీవ్ చాబా తెలిపారు. దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1 లక్ష యూనిట్ల నుంచి 3 లక్షలకు పెరుగుతుందన్నారు. సామర్థ్యాల పెంపు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై భాగస్వాములు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుతీ తరహా విప్లవం.. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల (ఎన్ఈవీ) విభాగంలో ఈ జేవీ ’మారుతీ తరహా విప్లవాన్ని’ తేగలదని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ‘నలబై ఏళ్ల క్రితం మారుతీ మార్కెట్లోకి వచి్చన తర్వాత ఆటో పరిశ్రమను మార్చేసింది. సమర్ధమంతమైన, తేలికైన, అధునాతనమైన కార్లను ప్రవేశపెట్టి ఇప్పుడు మార్కెట్ లీడరుగా ఎదిగింది. అంబాసిడర్లు, ఫియట్లు కనుమరుగయ్యాయి. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల విభాగంలో ఎంజీ కూడా ఆ ఫీట్‌ను పునరావృతం చేయగలదని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలతో ఎన్ఈవీ విభాగంలో తమ సంస్థ మార్కెట్ లీడరుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు జిందాల్ వివరించారు. ఎంజీ మోటర్ మాతృ సంస్థ అయిన ఎస్ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ గతేడాది నవంబర్‌లో జేవీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త స్వరూపం ప్రకారం జేవీలో జేఎస్డబ్ల్యూకి 35 శాతం, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలకు 8 శాతం, ఎంజీ మోటార్ డీలర్లకు 3 శాతం, ఉద్యోగులకు 5 శాతం, మిగతా 49 శాతం వాటాలు ఎస్ఏఐసీకి ఉంటాయి. కాగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ – ఎస్ఏఐసీ మోటార్ జాయింట్ వెంచర్ క్రింద అభివృద్ధి చేసిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ జరిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్త్ జిందాల్, ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పిచ్చెక్కిస్తున్న దీని డిజైన్..SUVలకు విపత్తుగా మారుతోంది..!
-
కొత్త కారు కొన్న రౌడీ రోహిణి..
-
2024 లో మార్కెట్లోకి రానున్న 24 కొత్త మోడల్ కార్లు
-
మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరను పొందిన 'మహీంద్రా థార్' (MahindraThar) 5 డోర్ వేరియంట్ రూపంలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కారు పేరుని మార్చున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ SUV కొత్త పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు చేసింది. ఇందులో 'సెంచూరియన్, కల్ట్, గ్లాడియస్, రెక్స్, రోక్స్, సవన్నా, ఆర్మడ' అనే ఏడు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 'ఆర్మడ' అనేది మహీంద్రా కంపెనీకి చెందిన 1993 నుంచి 2001 మధ్య అమ్ముడైన కారు అని తెలుస్తోంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ దాని 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ పరంగా 3 డోర్ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. థార్ 5 డోర్ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్‌రూఫ్, రియర్ పార్కింగ్ కెమెరా, పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ వంటి వాటితో పాటు ADAS వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇంజిన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2024లో లాంచ్ అవుతుందని సమాచారం, అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. ధరలు, బుకింగ్స్ వంటి వివరాలతో పాటు డెలివరీలకు సంబంధించిన విషయాలు కూడా లాంచ్ సమయంలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
భారత్‌లో విడుదలైన ల్యాండ్ రోవర్ కొత్త కారు - ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ల్యాండ్ రోవర్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8' లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ. 2.01 కోట్ల నుంచి రూ. 2.80 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, 3.0-లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌తో 38.2kWh బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరుని అందిస్తాయి. డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్ ట్రీట్మెంట్, సైడ్ స్కర్ట్స్, డ్యూయల్ ట్విన్ ఎగ్జాస్ట్‌లతో రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. ఇదీ చదవండి: ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే? రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
Shantanu Naidu New Tata Safari Facelift: దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో హారియర్, సఫారీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల మాదిరిగానే అద్భుతంగా ఉన్న ఈ మోడల్స్ చాలా మంది కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రతన్ టాటా మేనేజర్, గుడ్‌ఫెలోస్ వ్యవస్థాపకుడు 'టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్' (Tata Safari Facelift) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతంలో టాటా నానో కారుని ఉపయోగించే రతన్ టాటా మేనేజర్ 'శంతను నాయుడు' (Shantanu Naidu) తాజాగా ఖరీదైన సఫారీ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వైట్ కలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారులో ఇప్పటికే 1000 కిమీ ప్రయాణించినట్లు, దానికి 'యుకీ' అని పేరు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ రూ. 16.19 లక్షల ప్రారంభ ధరలో దేశీయ విఫణిలో లాంచ్ అయిన సఫారీ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. సఫారీ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్, 350 న్యూటన్ మాటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. కాస్మిక్ గోల్డ్, గెలాక్సీ సఫైర్, లూనార్ స్లేట్, స్టార్‌డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్నోవా కాపర్ వంటి ఆరు కలర్ ఆప్సన్లలో లభించే ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. -
సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ 'సైనా నెహ్వాల్' ఇటీవల తన గ్యారేజిలో ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని చేర్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సైనా నెహ్వాల్ కొన్న కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'AMG GLE 53 4MATIC+ Coupe'. దీని ధర రూ.1.8 కోట్లు. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తరువాత ఈ కారుని కొన్న వ్యక్తి 'సైనా నెహ్వాల్' కావడం విశేషం. కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలను ఈమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసింది. మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ దేశీయ మార్కెట్లో ఖరీదైన కార్ల జాబితాలో ఒకటైన 'మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ' మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్లైన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ గరిష్టంగా 435 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 249 కిమీ. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు 12.3 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మరొకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. వీటితో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 13 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
ఫైనల్ మ్యాచ్‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్
Matthew Hayden Mahindra Scorpio N: మహీంద్రా కార్లను సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. దేశీయ విఫణిలో విడుదలైన అతి తక్కువ కాలంలో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లిన 'మహీంద్రా స్కార్పియో ఎన్' (Mahindra Scorpio N) ఎస్‌యూవీని మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' (Matthew Hayden) కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో భారతీయ కార్ల తయారీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ మాథ్యూ హేడెన్ ఇటీవల తన గ్యారేజీకి 'స్కార్పియో ఎన్' జోడించాడు. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా ఆస్ట్రేలియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో మాథ్యూ హేడెన్ క్వీన్స్ల్యాండర్ బ్రిస్బేన్‌లోని మహీంద్రా డీలర్షిప్ చుట్టూ తిరుగుతూ, ఎవరెస్ట్ వైట్ కలర్ స్కీమ్ కలిగిన స్కార్పియో-ఎన్ డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.26 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). వేరియంట్లలో లభించే ఈ కారు 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్లలో లభిస్తుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ SUV 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 175 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 203 పీఎస్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. ఇదీ చదవండి: మస్క్ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు! ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మొదలైనవి ఉంటాయి. -
కొన్న ఏడాదిలో అమ్మేస్తే.. మస్క్ రూల్స్ మామూలుగా లేదుగా!!
టెస్లా తన మొదటి సైబర్‌ట్రక్‌ను ఈ నెలలో విడుదల చేయడానికి సర్వత్రా సిద్ధమైపోయింది. ఎలాన్ మస్క్ ఈ కొత్త కారుని విడుదల చేయడానికి ముందే కొనుగోలుదారులకు కొన్ని షరతులు పెట్టాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా సైబర్‌ట్రక్ (Tesla Cybertrack) త్వరలో విడుదలకానుంది. కంపెనీ నియమాల ప్రకారం ఈ కారు కొన్ని కస్టమర్ కొన్న మొదటి సంవత్సరం లోపల విక్రయించినట్లతే.. 50000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాలి ఉంటుందని వెల్లడించారు. ఈ రూల్ కేవలం సైబర్‌ట్రక్ కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. కంపెనీ నియమాలను ఎవరైనా అతిక్రమిస్తే.. భవిష్యత్తులో వారికి టెస్లా కంపెనీ తమ వాహనాలను విక్రయించాడని కూడా స్పష్టం చేసింది. కాబట్టి సైబర్‌ట్రక్ కొనుగోలు చేసిన కస్టమర్ ఒక సంవత్సరం వరకు విక్రయించడానికి అవకాశం లేదని స్పష్టమైంది. ఇదీ చదవండి: టీసీఎస్ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు! 2019లో మొదటి సారి కనిపించిన సైబర్‌ట్రక్ దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. నాలుగు సంవత్సరంలో కంపెనీ విడుదల చేసిన మొదటి వాహనం కూడా ఇదే అని పలువురు భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర 39900 డాలర్లు ఉండవచ్చు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 33 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
సొగసైన కారుపై 'సాహో' భామ
-
జెనీవా మోటార్ షోలో అడుగెట్టనున్న తాలిబన్ సూపర్‌కారు ఇదే!
ప్రపంచంలోనే అత్యత పాపులర్ ఆటోమోటివ్ షోలలో ఒకటైన 'జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో' వచ్చే నెల 5 నుంచి 14 వరకు జరగనుంది. ఎన్నెన్నో కొత్త వాహనాలకు వేదిక కానున్న ఈ షో ఖతార్‌లోని దోహాలో జరగనుంది. ఇక్కడ ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సూపర్ కారు ENTOP కూడా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త కంపెనీల కార్లు దర్శనమివ్వబోతున్నాయి. ఇందులో తాలిబన్ నియంత్రిత ఆఫ్ఘనిస్తాన్‌లో సూపర్‌కార్ మాడా 9 అడుగెట్టనున్నట్లు ఎన్‌టాప్ వ్యవస్థాపకుడు 'మహమ్మద్ రెజా అహ్మదీ' తెలిపారు. ఇప్పటికే ఈ కారు ఆఫ్ఘనిస్తాన్లోని నిమ్రోజ్ ప్రావిన్స్ నుంచి షిప్పింగ్ కంటైనర్‌లో బయలుదేరినట్లు సమాచారం. ఈ సూపర్కారుని ఎగుమతి చేసే సమయంలో దాని వ్యవస్థపాకుడు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కార్లను ఎగుమతి చేయడాన్ని నిరోధించే కొన్ని చట్టపరమైన నిబంధనలు ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను తాలిబన్లు ఎలా పరిష్కరించారనేది స్పష్టంగా తెలియలేదు. జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోకు హాజరు కావడం కంపెనీకి చాలా ముఖ్యమైనదని మహమ్మద్ రెజా అహ్మదీ తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రోటోటైప్ దశలోనే ఉన్నట్లు.. దానిని నిజమైన కారుగా మార్చడానికి ఆర్థిక సహాయం కావాలని చెబుతున్నారు. ఈ ప్రదర్శన తరువాత బలమైన పెట్టుబడి దారులు సహాయపడే అవకాశం ఉందని.. ఆఫ్ఘన్ ఆటోమోటివ్ తయారీ భవిష్యత్తుకు ఈ దశ చాలా కీలకమని అన్నారు. ఎన్‌టాప్ మడా 9 సూపర్ కార్.. ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ కారు రూపు దిద్దుకుంది. దీనిని ఎన్‌టాప్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సుమారు 30 మంది ఇంజినీర్ల బృందం తయారు చేశారు. ప్రస్తుతం ఇది టయోటా కరోలా ఇంజన్‌తో వస్తుంది. కానీ ఇది ఈ సూపర్ కారు వేగానికి అనుకూలంగా మోడిఫై చేశారు. అయితే ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో లభించే అవకాశం ఉందిని చెబుతున్నారు. -
దినేష్ ఠక్కర్ గ్యారేజిలో మరో సూపర్ కారు.. ధర ఎన్ని కోట్లంటే?
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అన్యదేశ్య కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు విదేశాల నుంచి తమకు ఇష్టమైన కార్లను దిగుమతి చేసుకుంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఏంజెల్ వన్ చైర్మన్ 'దినేష్ ఠక్కర్' తన గ్యారేజిలో అత్యంత ఖరీదైన లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల ఈయన సరికొత్త స్పోర్ట్స్ కారు పోర్స్చే 911 GT3 టూరింగ్ డెలివరీ తీసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అత్యంత స్టైలిష్ సూపర్ కార్ బ్రాండ్ అయిన పోర్స్చే కంపెనీకి చెందిన '911 GT3 టూరింగ్' కారుని ఇటీవల కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. రూ. 2.75 కోట్ల ఎక్స్-షోరూమ్ వద్ద లభించే ఈ కారు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంది. ఈ స్పోర్ట్స్ కారు 4.0 లీటర్ ఫ్లాట్ 6 ఇంజన్‌తో 502 పీఎస్ పవర్ అండ్ 470 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పర్ఫామెన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదీ చదవండి: కోట్ల సంపదను కాదని సన్యాసం పుచ్చుకున్న వజ్రాల వ్యాపారి ఫ్యామిలీ.. ఎందుకో తెలిస్తే.. పోర్స్చే 911 GT3 టూరింగ్ మాత్రమే కాకుండా ఈయన గ్యారేజిలో లంబోర్ఘిని ఉరుస్ (రూ. 4.17 కోట్లు), ఫెరారీ 488 పిస్తా, లంబోర్ఘిని హురాకాన్ పెర్ఫార్మంటే (రూ. 4 కోట్లు), మెర్సిడెస్ AMG జీటీ బ్లాక్ సిరీస్ (రూ. 5.5 కోట్లు), పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్, మెర్సిడెస్-AMG G63, మినీ కూపర్ ఉన్నాయి. అంతే కాకూండా భారతదేశపు మొట్టమొదటి పోర్షే టేకాన్ టర్బో S ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Dinesh Thakkar (@dineshdthakkar) -
రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీ ఏదంటే అందరూ చెప్పే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). ఇప్పటికే బోట్ టెయిల్ అనే ఖరీదైన కారుని విడుదల చేసిన ఈ సంస్థ తాజాగా మరో ఖరీదైన కారు ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఆవిష్కరించిన ఈ కారు పేరు 'డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్' (Droptail Roadster). దీనిని 'లా రోజ్ నోయిర్' అని కూడా పిలుస్తారు. ఈ కారు ధర 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ఆంటే భారతీయ కరెన్సీ ప్రకారం 200 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ఆకర్షయంగా ఉంటుంది. ఇది రిమూవబుల్ హార్డ్‌టాప్ కూడా పొందుతుంది. కావున ఇది ఓపెన్ టాప్ కారు మాదిరిగా ఉంటుంది. ఇదీ చదవండి: ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం - రేపటి నుంచే అమలు! రోల్స్ రాయిస్ డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్ 6.75-లీటర్ V12 ఇంజిన్ కలిగి 563 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు చేతితో రూపొందించిన అల్యూమినియంతో తయారై ఉంటుంది. హ్యాండ్ పెయింటెడ్ కోచ్‌లైన్ అండ్ లాంబ్వుల్-లైన్డ్ ఇంటీరియర్‌తో సహా అనేక బెస్పోక్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో గమనించవచ్చు. లిమిటెడ్ ఎడిషన్‌లో లభిస్తున్న రోల్స్ రాయిస్ కార్ల జాబితాలో ఈ డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్ కూడా ఒకటి కానుంది. ఇది 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ డార్క్ మిస్టరీ పెయింట్ ట్రీట్మెంట్ను కలిగి ఉంది. దూరం నుంచి ఇది నలుపు రంగులోనూ.. దగ్గర నుంచి ముదురు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా.. వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండనున్నాయి. -
Shriya Saran: మెర్సిడస్ బెంజ్ కారు ప్రారంభోత్సవంలో ర్యాంపుపై శ్రియా హొయలు (ఫొటోలు)
-
దేశీయ మార్కెట్లో మరో జర్మన్ కారు - ధర రూ. 1.14 కోట్లు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు క్యూ8 ఇ-ట్రాన్ విడుదల చేసింది. ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారు ధరలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఆడి క్యూ8 ఇ-ట్రాన్ ప్రారంభ ధరలు రూ. 1.14 కోట్లు నుంచి రూ. 1.18 కోట్లు వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారు కోసం రూ. 5 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కొత్త ఆడి క్యూ8 ఇ-ట్రాన్ 55 వేరియంట్లు 114 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి. లోయర్-స్పెక్ 50 వేరియంట్స్ 95 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి. ఈ రెండూ వరుసగా 350 అండ్ 408 హార్స్ పవర్ డెలివరీ చేస్తాయి. రేంజ్ విషయానికి వస్తే 50 వేరియంట్స్ 491 కిమీ (SUV) నుంచి 505 కిమీ (స్పోర్ట్‌బ్యాక్) వరకు.. 55 వేరియంట్స్ 582 కిమీ (SUV) నుంచి 600 కిమీ (స్పోర్ట్‌బ్యాక్) వరకు ఉంటాయని తెలుస్తోంది. ఆడి క్యూ8 ఇ-ట్రాన్ 22 కిలోవాట్ ఏసీ & 170 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇదీ చదవండి: ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక.. యూఐడీఏఐ కీలక ప్రకటన ఇక డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. గ్రిల్ బ్లాక్ సరౌండ్‌లతో కొత్త మెష్ డిజైన్ కలిగి, ట్వీక్డ్ హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. ఇందులో 2డీ లోగో చూడవచ్చు. ఫ్రంట్ ఇప్పుడు గ్లోస్ బ్లాక్‌లో పూర్తయింది, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటీరియర్ దాదాపు దాని ముకుప్టి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం 10.1 ఇంచెస్ స్క్రీన్, HVAC కోసం 8.6 ఇంచెస్ స్క్రీన్ లభిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త జర్మన్ కారు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఇది బీఎండబ్ల్యూ ఐఎక్స్, జాగ్వార్ ఐ-పేస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
కొత్త కారు కొన్న రణబీర్ కపూర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు!
Ranbir Kapoor Range Rover: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ 'రణబీర్ కపూర్' ఇటీవల బ్రిటీష్ బ్రాండ్ 'రేంజ్ రోవర్' (Range Rover) కంపెనీకి చెందిన ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. దీని ధర ఏకంగా రూ. 4 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి కార్ల మీద సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు మక్కువ చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే వారు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు రణబీర్ మరో ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. రేంజ్ రోవర్ ఫీచర్స్.. రణబీర్ కపూర్ కొత్త రేంజ్ రోవర్ లాంగ్ వీల్‌బేస్ వెర్షన్, ఇది VIP నంబర్ ప్లేట్ కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్ అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారులో 35 స్పీకర్లతో కూడిన మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 13.1 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. భారతదేశంలో రేంజ్ రోవర్ మల్టిపుల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కారు - కేవలం 10 మందికి మాత్రమే.. రణబీర్ బెల్గ్రావియా గ్రీన్ షేడ్‌లో కనిపించే కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ బ్రాండ్ కార్లను అజయ్ దేవగన్, సంజయ్ దత్, నిమ్రత్ కౌర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు కూడా కలిగి ఉన్నారు. రణ్‌బీర్ కపూర్‌కు లగ్జరీ ఎస్‌యూవీలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఆతని వద్ద కొత్త రేంజ్ రోవర్ కారుతో పాటు మెర్సిడెస్-AMG G63, ఆడి A8L వంటి మరెన్నో ఖరీదైన కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. -
ఈ కారు కేవలం 10 మందికి మాత్రమే.. ఎందుకింత స్పెషల్ అంటే?
Pininfarina B95 Roadster: ఇప్పటి వరకు ఖరీదైన బైక్ గురించి తెలుసుకున్నాం, ఖరీదైన ఫ్యూయెల్ కారు గురించి తెలుసుకున్నాం.. అయితే ఈ కథనంలో ప్రపంచంలోనే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుని పినిన్‌ఫరినా (Pininfarina) అనే కంపెనీ ఆవిష్కరించింది. దీని ధర 4.4 మిలియన్ యూరోలు.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 39.8 కోట్లు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈవీ కారుగా ఇది ప్రసిద్ధి చెందింది. 10 యూనిట్లు మాత్రమే.. పినిన్‌ఫరినా కంపెనీ ఈ 'బి95 రోడ్‌స్టర్' హైపర్ కారుని కేవలం 10 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నట్లు సమాచారం. కంపెనీ 95వ యానివెర్సరీ సందర్భంగా 2025లో డెలివరీలు చేయనున్నట్లు సమాచారం. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ కారు అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: మనవాళ్లు వారానికి 22గంటలు సోషల్ మీడియాలోనే.. ఆశ్చర్యపరుస్తున్న నిజాలు! గరిష్ట వేగం గంటకు 300 కిమీ.. పినిన్‌ఫరినా బి95 దాని బాటిస్టా మాదిరిగానే అదే పవర్‌ట్రెయిన్ పొందుతుంది. కావున 120 ఇందులోని కిలోవాట్ బ్యాటరీ మంచి పనితీరుని అందిస్తుంది. ఇది కేవలం 2 సెకన్లలోపు గంటకు 0 నుంచి 96 కిమీ/గం వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 300 కిమీ కావడం గమనార్హం. ఇందులో కాల్మా, పురా, ఎనర్జికా, ఫ్యూరియోసా అండ్ కరాటెరే అనే ఐదు డ్రైవింగ్ మోడ్లు లభిస్తాయి. బి95 రోడ్‌స్టర్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 450 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని మోటార్ 1900 హార్స్ పవర్ అండ్ 2340 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 270 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 25 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. -
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కొత్త కారు.. ఎన్ని కోట్లో తెలుసా?
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే తమిళ్ వాళ్ల కంటే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే గ్యాంగస్టర్ సినిమాలతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. 'ఖైదీ', 'విక్రమ్'తో మన దగ్గర కోట్లాది మంది ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్న లోకేశ్.. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్‌తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!) ప్రస్తుతం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో డిఫరెంట్ సినిమాలు తీస్తున్న లోకేశ్ కనగరాజ్.. కార్తీతో 'ఖైదీ' తీశాడు. దానికి కమల్‌హాసన్ 'విక్రమ్' మూవీతో లింక్ చేశాడు. ఇప్పుడు దళపతి విజయ్‌తో 'లియో' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 20న ఇది థియేటర్లలోకి రానుంది. అంటే రెండు నెలల టైముంది. ఈ గ్యాప్‌లో కాస్ట్ లీ బీఎండబ్ల్యూ కారు కొనేశాడు. కార్లలో లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారుని ఇప్పుడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత రూ.కోటి 70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. విజయ్ 'లియో' కోసం రూ.70 కోట్లు అందుకున్నాడనే టాక్ నడుస్తోంది. ఇలా హీరోలని మించి లోకేశ్ క్రేజ్ సంపాదించాడు. Lokesh Kanagaraj gets a brand new BMW 7 series car priced at ₹1.70 cr [Ex Showroom] pic.twitter.com/B2g7gehRfR — Manobala Vijayabalan (@ManobalaV) August 17, 2023 (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!) -
భారత్‌లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: లగ్జరీ వాహనాల తయారీలో ఉన్న మెర్సిడెస్–బెంజ్ ప్రీమియం ఎస్యూవీ జీఎల్సీ కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.73.5 లక్షలు. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్స్‌తో లభిస్తుంది. ఇప్పటికే 1,500ల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో మెర్సిడెస్కు అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ ఇదే. తొలిసారిగా మెర్సిడెస్ కార్లలో ఎన్టీజీ 7 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో తయారైన జీఎల్సీ 300 4మేటిక్ గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. -
కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్
New Toyota Vellfire టయోటా ఇండియా తదుపరి తరం వెల్ఫైర్ ఎంపీవీ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. ఇది హై గ్రేడ్, VIP గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎక్స్టీరియర్ స్టైలింగ్, మూడు ఇంటీరియర్ థీమ్‌లతో పాటు మూడు బాహ్య రంగులను పొందుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వస్తుందని భావిస్తున్న వెల్‌ఫైర్‌ను ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభించింది. ధరలు హాయ్ గ్రేడ్ రూ. 1.20 కోట్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్యాకేజీతో VIP గ్రేడ్ రూ. 1.30 కోట్లుగా ఉండనుంది. వెల్ఫైర్ ఇంజన్: 2.5-లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్, 190bhp , 240Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది 19.28kpl మైలేజీ ఇస్తుందని టయోటా పేర్కొంది.వెల్ఫైర్ కొత్త TNGA-K ప్లాట్‌ఫారమ్ ద్వారా మద్దతునిస్తుంది 2023 వెల్ఫైర్ ఇంటీరియర్ అప్డేట్ క్యాబిన్ సన్‌సెట్ బ్రౌన్, బ్లాక్ , న్యూట్రల్ లేత గోధుమరంగు థీమ్‌లలో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ ఇప్పుడు Apple CarPlay మరియు Android Autoతో పాటు JBL నుండి 15-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో పెద్ద 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ జోడించిది. రెండవ-వరుస లాంజ్ సీట్లు మసాజ్ సీట్లు, పవర్డ్ పుల్-డౌన్ సైడ్ సన్ బ్లైండ్లు అమర్చింది. కొత్త టయోటా వెల్ఫైర్ డిజైన్ విషయానికి వస్తే అవుట్గోయింగ్ మోడల్‌తో పోలిస్తే కొత్త వెల్ఫైర్ డిజైన్ పెద్దగా మారలేదు. టయోటా లోగో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, సిక్స్-స్లాట్ గ్రిల్ మధ్యలో ఉంటుంది.హెడ్‌ల్యాంప్‌ల దిగువ భాగంలో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉంటాయి. U-ఆకారపు క్రోమ్ స్ట్రిప్ రెండు హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ బంపర్ ఉంటుంది. మిడ్-లైఫ్ అప్డేట్గా క్రోమ్ , స్లీకర్ LED హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్ అమర్చింది. స్లైడింగ్ రియర్ పవర్ డోర్లు , ఫ్లాట్ రూఫ్లైన్లో ఎలాంటి మార్పు లేదు, 2023 వెల్ఫైర్ సేఫ్టీ ఫీచర్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా , హిల్-అసిస్ట్ కంట్రోల్‌తో పాటు, వెల్ఫైర్ లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ , హై బీమ్ అసిస్ట్ వంటి ADAS ఫీచర్లనులాంటివి కొత్త అప్‌డేట్స్‌గా ఉన్నాయి. ముందస్తు బుకింగ్‌లను కంపెనీ ఇప్పటికే షురూ చేసింది. రపండుగ సీజన్లో భారతదేశంలో వాహన డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దేవీయ మార్కెట్లో దీని పోటీ గురించి ఆలోచిస్తే కొత్త Lexus LM లాంచ్ అయ్యేవరకు వెల్ఫైర్కి భారత మార్కెట్లో ఎలాంటి పోటీ ఉండదు. -
కొత్త కారు కొన్న ఆనందంతో చిందులేసిన యూట్యూబర్ - వీడియో వైరల్
Youtuber New Toyota Innova Hycross: సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ మంచి ఇల్లు, కారు ఉండాలని కలలు కంటూ ఉంటారు. కన్న కలలు నిజం చేసుకోవడం మాటల్లో అనుకునేంత సులభమైతే కాదు. దీనికోసం అహర్నిశలు కష్టపడాలి. ఈ మార్గంలో ఎవరి ఆలోచన వారిదే..! కొంతమంది జాబ్ చేస్తే మరికొందరు సొంతంగా ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ మార్గంలో నేటి యువత ఎక్కువగా యూట్యూబ్ మీద పడి సంపాదించడం మొదలెట్టారు. గతంలో చాలా సందర్భాల్లో కొంత మంది యూట్యూబర్స్ ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రైడర్ గర్ల్ విశాఖ అనే యూట్యూబర్ (ప్రముఖ ఉమెన్ మోటార్‌సైకిలిస్ట్) తాజాగా టయోటా కంపెనీకి చెందిన కొత్త ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేసింది. కారుని డెలివరీ చేసుకోవడానికి తన ఫ్యామిలీతో షోరూంకి రావడం డెలివరీ తీసుకునే సమయంలో చేసిన హంగామా మొత్తం ఈ వీడియో చూడవచ్చు. ఇప్పటికే ఈమె మహీంద్రా థార్ కూడా కొనుగోలు చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్.. టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ లేటెస్ట్ మోడల్. దీని ధర రూ. 18.82 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ యూట్యూబర్ కొనుగోలు చేసిన కారు బ్రాండ్ హైఎండ్ మోడల్. కావున ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 172 బిహెచ్పి పవర్ అండ్ 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 184 బిహెచ్పి పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. -
జర్మన్ కారు కొనుగోలు చేసిన టైగర్ ష్రాఫ్ - ధర అక్షరాలా..
Tiger Shroff BMW: బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'టైగర్ ష్రాఫ్' (Tiger Shroff) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆయన ఇటీవల జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, టైగర్ ష్రాఫ్ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ సెడాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 60 లక్షల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మూవీజ్ అడ్డా అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఇందులో కారుని స్పష్టంగా చూడవచ్చు. టైగర్ ష్రాఫ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ 330 ఎల్ఐ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 258 పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. (ఇదీ చదవండి: మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫోటోలు వైరల్!) డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, 190 పీఎస్ పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో గంటాకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతంగా అవుతుంది. ఈ లగ్జరీ సెడాన్ డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్స్ లభిస్తాయి. -
Mukku Avinash Buys New Car: కొత్త కారు కొన్న జబర్దస్త్ షో కమెడియన్ ముక్కు అవినాశ్
-
నటి 'వామిక గబ్బి' కారు కొనేసిందోచ్.. ధర ఎన్ని లక్షలంటే?
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగానే పంజాబీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటించిన 'వామిక గబ్బి' (Wamiqa Gabbi) ఇటీవల అమెరికన్ బ్రాండ్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక ఎక్కువగా పంజాబీ సినిమాల్లో కనిపించింది. దీంతో బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కాగా ఈ భామ ఇటీవల కొనుగోలు చేసిన కారు జీప్ కంపెనీకి చెందిన మెరిడియన్. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. జీప్ మెరిడియన్ డెలివరీ తీసుకునే సమయంలో వామిక ముంబైలోని కంపెనీ డీలర్‌షిప్‌లో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇదే ఆమె మొదటి కారు కావడం ఇక్కడ విశేషం. వీడియో పోస్ట్ చేస్తూ నా తల్లితండ్రులు సహకారంతో.. అభిమానుల ఆదరాభిమానాలతో ఇది సాధ్యమైందని వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆ ప్రదేశం చూడగానే ఆకర్షిస్తుంది.. ఒక రాత్రి అక్కడ ఉండగలనా అంటే!) జీప్ మెరిడియన్.. ఇక జీప్ మెరిడియన్ విషయానికి వస్తే.. వామికా కొనుగోలు చేసిన కారు వెల్వెట్ రెడ్ షేడ్‌లో చూడచక్కగా ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ కలిగి.. ఫ్లోటింగ్-టైప్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 170 హార్స్ పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 32.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ధరలు మారుతాయి. వామిక ఏ వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
హ్యుందాయ్ కొత్త కారు - టాటా ప్రత్యర్థిగా నిలుస్తుందా?
Hyundai Exter: భారతీయ మార్కెట్లో విడుదలవుతున్న కొత్త వాహనాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో భాగంగానే నేడు 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ కొత్త మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్' (Exter) లాంచ్ చేసింది. ఈ ఆధునిక మోడల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హ్యుందాయ్ ఎక్స్టర్ మొత్తం ఐదు ట్రిమ్స్‌లో లభిస్తుంది. అవి ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) అండ్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్. వీటి ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.32 లక్షల వరకు ఉంటుంది. ఆటో ట్రిమ్‌లో టాప్ వేరియంట్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇప్పటికే కంపెనీ ఈ ఎస్యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 83 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది CNG వెర్షన్లో కూడా లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి ప్రత్యేకమైన డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్ కలిగి సైడ్ ప్రొఫైల్ 15 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఎస్యువి పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..) ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది హ్యుందాయ్ నియోస్, ఆరా వంటి వాటిని పోలి ఉంటుంది. ఇందులో 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లాక్ అండ్ ఆలివ్-గ్రీన్ షేడ్స్‌లో సెమీ-లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీని పొందుతాయి. అంతే కాకుండా ఇందులో సింగిల్-పేన్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఉంటాయి. ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉందులో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ భారతీయ విఫణిలో టాటా పంచ్, సిట్రోయెన్ సి3, మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
విడుదలకు సిద్దమవుతున్న టయోటా కొత్త ఎమ్‌పివి ఇదే!
Toyota Rumion: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కంపెనీ త్వరలోనే కొత్త 'రూమియన్' (Rumion) అనే కొత్త ఎమ్‌పివి విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ కారు త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టానికి సిద్ధంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి ఎర్టిగా బేస్డ్ రూమియన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 2021 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో విడుదలైన ఈ కారు 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ గడ్డపై అడుగుపెట్టనుంది. దీని కోసం కంపెనీ ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, వెల్ఫైర్ విభాగంలో రూమియన్ నాల్గవ మోడల్ అవుతుంది. త్వరలోనే టయోటా వెల్ఫైర్ ఆధునిక అప్డేట్స్ అందుకునే అవకాశం ఉంది. ఈ కొత్త MPV డిజైన్ దాదాపు ఎర్టిగా మాదిరిగా ఉంటుందని సమాచారం. ఇంటీరియర్ కూడా దాదాపు ఆ మోడల్ మాదిరిగానే ఉండవచ్చు. (ఇదీ చదవండి: నారాయణ మూర్తి లాంటి భర్తకు భార్యగా ఉండటం అంత ఈజీ కాదు!) ఇంజిన్ పరంగా.. రూమియన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 103 హార్స్ పవర్, 137 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభించనుంది. ఇది CNG వేరియంట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 2023 సెప్టెంబర్ నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. -
మొన్న విడుదలైన కారు అప్పుడే విదేశాలకు..
గత కొన్ని రోజులకు ముందు భారతీయ మార్కెట్లో విడుదలైన 'మారుతి ఫ్రాంక్స్' (Maruti Fronx) ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు దేశీయ తీరాలు దాటి విదేశాల్లో అడుగుపెట్టడానికి సన్నద్దమయిపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మారుతి సుజుకి కొత్త కారు ఫ్రాంక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు చేరుకోవడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ముంబై నుంచి 556 వాహనాలు మొదటి బ్యాచ్‌గా ఎగుమతికానున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో చాలా కంపెనీలు ఈ విధంగా ఎగుమతి చేశాయి. 2023 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన మారుతి ఫ్రాంక్స్ ఏప్రిల్ నెలలో అధికారికంగా విడుదలైంది. ఈ SUV ధరలు రూ. 7.47 లక్షల నుంచి రూ. 13.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: రాధిక ధరించిన ఈ డ్రెస్ అంత ఖరీదా? అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది మరి!) మారుతి ఫ్రాంక్స్ ఎస్యువి 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్‌పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి. -
మారుతి మరో సూపర్‌కారు వచ్చేసింది..మీరూ ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
-
ఆధునిక హంగులతో కొత్త సెల్టోస్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
Kia Seltos Facelift Debut: సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ 'కియా మోటార్స్' దేశీయ మార్కెట్లో 'సెల్టోస్' విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇందులో ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించింది. భారతీయ విఫణిలో విడుదలకానున్న కొత్త 'కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' (Kia Seltos Facelift) గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్స్ కియా మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త 'సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్' కోసం సంస్థ జులై 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. 2019లో ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత 2022లో ప్రపంచ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఐదు లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఇప్పుడు కొత్త రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్ సాధారణ మోడల్ కంటే కూడా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కొంచెం పెద్ద బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లో బాడీ కలర్ ఇన్సర్ట్లు, గ్రిల్‌లోకి విస్తరించే ఉండే కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్లతో రీడిజైన్ హెడ్లైట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వెనుక భాగంలో కొత్త ఇన్వర్టెడ్ ఎల్ షేప్ టెయిల్ లైట్లు ఉన్నాయి. ఫీచర్స్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో రెండు 10.25 ఇంచెస్ డిస్ప్లేలతో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఏసీ వెంట్స్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ హెడ్స్-అప్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) సేఫ్టీ ఫీచర్స్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కియా మోటార్స్ కొత్త సెల్టోస్ ఫేస్లిఫ్ట్లోఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. అంతే కాకుండా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 17 కంటే ఎక్కువ ADAS ఫీచర్స్ కలిగి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) పవర్‌ట్రెయిన్ 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 115 hp పవర్ 144 Nm టార్క్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ & 116 hp పవర్, 250 Nm టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVTని.. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ iMT అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇవి కొత్త నిబంధలను అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. -
500 మందికి మాత్రమే.. ఈ కారు - ధర ఎంతో తెలుసా?
Skoda Kushaq Matte Edition: చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో 'కుషాక్' (Kushaq) కారుని విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కంపెనీ ఇందులో ఓ కొత్త ఎడిషన్ విడుదల చేసింది. కుషాక్ కొత్త ఎడిషన్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధర & వేరియంట్స్ స్కోడా ఇండియా విడుదల చేసిన కొత్త కారు పేరు 'కుషాక్ మ్యాట్ ఎడిషన్' (Kushaq Matte Edition). ధరల విషయానికి వస్తే, 1.0 టీఎస్ఐ మాన్యువల్ రూ. 16.19 లక్షలు, 1.0 టీఎస్ఐ ఆటోమేటిక్ రూ. 17.79 లక్షలు, 1.5 టీఎస్ఐ మాన్యువల్ రూ. 18.19 లక్షలు, టాప్ స్పెక్ 1.5 టీఎస్ఐ ఆటోమేటిక్ ధర రూ. 19.39 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ ధర స్టాండర్డ్ కుషాక్ స్టైల్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువ కావడం గమనార్హం. లిమిటెడ్ ఎడిషన్ స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని లైనప్‌లో స్టైల్ అండ్ మోంటే కార్లో వేరియంట్ల మధ్య ఉంటుంది. ఇది కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే ఈ కొత్త కారుని కేవలం 500 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) మ్యాట్ ఎడిషన్ ప్యాకేజీలో భాగంగా, కంపెనీ కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ పొందుతుంది. డోర్ హ్యాండిల్స్‌పై గ్లోస్ బ్లాక్ ట్రిమ్, వింగ్ మిర్రర్స్, గ్రిల్‌పై క్రోమ్ బిట్లు చూడవచ్చు. కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ విజయం పొందిన తరువాత కంపెనీ తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే మ్యాట్ ఎడిషన్ లాంచ్ చేసింది. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ప్రత్యర్థులు కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఈ ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. -
కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్ ఇదే! ప్రత్యర్థులకు తిప్పలు తప్పవా?
Hyundai Exter First Unit Rolls Out: భారతదేశంలో హ్యుందాయ్ కంపెనీ తన 'ఎక్స్టర్' (Exter) ఎస్‌యువిని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే గతంలో అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఈ కారుకి సంబంధించిన టీజర్స్, ఫోటోలు వంటివి కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు తాజాగా దేశీయ విఫణిలో విడుదలయ్యే ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్ చెన్నైలోని కంపెనీ ప్లాంట్ విడుదలైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హ్యుందాయ్ 2023 జులై 10న ఇండియన్ మార్కెట్లో విడుదలచేయనున్న ఎక్స్టర్ ఫస్ట్ యూనిట్లు ఎట్టకేలకు వెల్లడించింది. ఇప్పటికే రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది, డెలివరీలు జులై చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారుకి బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. కలర్ ఆప్షన్స్‌లో అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ ప్లస్ అబిస్ బ్లాక్, కాస్మిక్ బ్లూ, కాస్మిక్ బ్లూ ప్లస్ అబిస్ బ్లాక్, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ టైటాన్ గ్రే, టామ్‌బాయ్ ఖాకీ, టామ్‌బాయ్ ఖాకీ ప్లస్ అబిస్ బ్లాక్ అనే మోనో టోన్ అండ్ డ్యూయెల్ టోన్ వున్నాయి. డిజైన్ పరంగా హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు లభిస్తాయి. వెనుక వైపు వర్టికల్ టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. ఈ SUV 3,595 మిమీ పొడవు, 1,595 మిమీ వెడల్పు, 1,575 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్ మొదలైనవి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్ విత్ ఈబిడీ, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ ఎంకరేజ్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) హ్యుందాయ్ కొత్త ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్‌పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
మొదటి సారి కనిపించిన మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు
Maruti Suzuki eVX: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద్రా, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను దేశీయ విఫణిలో విడుదల చేసిన మంచి అమ్మకాలను పొందుతున్నాయి. కాగా మారుతి సుజుకి కూడా ఈవీ రంగంలో నేను సైతం అంటూ 2023 ఆటో ఎక్స్‌పోలో 'ఈవీఎక్స్' (eVX) కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఈ కారు ఇప్పుడు ఎట్టకేలకు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన తరువాత ఈవీఎక్స్ రోడ్లమీద కనిపించడం ఇదే మొదటి సారి. ఈ కారు ఫోలాండ్ కాకో వీధుల్లో టెస్టింగ్ దశలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. మారుతి సుజుకి ఇప్పటికే జపాన్‌కు చెందిన టయోటాతో ఇప్పటికే అనేక సెగ్మెంట్లలో ఒప్పందాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ రెండు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఓ కొత్త ప్లాట్ఫార్మ్ను రూపొందిస్తున్నాయి. దీని ఆధారంగా 'ఈవీఎక్స్' పుట్టుకొస్తోంది. ఇది 2025 నాటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజైన్ & రేంజ్ మార్కెట్లో విడుదలకానున్న మారుతి సుజుకి ఈవీఎక్స్ మంచి డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మస్క్యులర్ బానెట్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వీ షేప్ డీఆర్ఎల్స్, మౌంటెడ్ ఓఆర్వీఎంలు, అలాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్‌లైట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ఇంటీరియర్ ఫీచర్స్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, కానీ ఆధునిక కాలంలో వినియోగించడానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!) ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన డ్యూయెల్ మోటార్ సెటప్ పొందుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జ్‌తో 550 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు ధర రూ. 18 - 20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
మెర్సిడెస్ టాప్ ఎండ్ రైడ్.. రూ.2.35 కోట్ల కారు విడుదల
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ రూ.1 కోటి కంటే అధిక ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లను భారత్‌కు తీసుకురానుంది. మెట్రోయేతర నగరాల నుండి కూడా డిమాండ్ వేగంగా పెరుగుతుండడం ఇందుకు కారణమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. టాప్ ఎండ్ వెహికల్స్ (టీఈవీ) వాటా సంస్థ మొత్తం విక్రయాల్లో 25 శాతం ఉందన్నారు. ఏఎంజీ ఎస్ఎల్55 4మేటిక్ ప్లస్ రోడ్‌స్టర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.2.35 కోట్లు. -
భారత్‌లో పవర్ఫుల్ కారు లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్ - ధర ఎంతంటే?
Mercedes Benz AMG SL 55: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' (Mercedes Benz India) ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'AMG SL 55' అనే మరో ఖరీదైన కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ బెంజ్ 'ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55' ప్రారంభ ధర రూ. 2.35 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశంలో అమ్ముడవుతుంది. రెండు డోర్లు కలిగిన ఈ కారు ఫోర్ సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. డిజైన్ & డైమెన్షన్ (కొలతలు) డిజైన్ విషయానికి వస్తే, ఇందులో పనామెరికానా ఫ్రంట్ గ్రిల్, యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, రెండు పవర్ డోమ్లతో కూడిన పొడవైన బోనెట్, పెరిగిన విండ్‌స్క్రీన్, క్వాడ్ ఎగ్జాస్ట్‌లు, 20 ఇంచెస్ అల్లాయ్ వంటివి ఉన్నాయి. ఇందులో ట్రిపుల్-లేయర్ ఫాబ్రిక్ రూఫ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి కేవలం 16 సెకన్ల సమయం పడుతుంది. ఇది బ్లాక్, డార్క్ రెడ్, గ్రే కలర్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. కాగా కారు మొత్తం అబ్సిడియన్ బ్లాక్, సెలెనైట్ గ్రే, హైపర్ బ్లూ, ఆల్పైన్ గ్రే, ఒపలైట్ వైట్ బ్రైట్, స్పెక్ట్రల్ బ్లూ మాగ్నో, పటగోనియా రెడ్ బ్రైట్, మోన్జా గ్రే మాగ్నో అనే ఎనిమిది కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4705 మిమీ, వెడల్పు 1915 మిమీ, ఎత్తు 1359 మిమీ వరకు ఉంటుంది. కావున వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇంటీరియర్ ఫీచర్స్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 11.9 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది లేటెస్ట్ MBUX ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, దాని వెనుక ఆప్షనల్ హెడ్స్-అప్ డిస్ప్లే వంటి వాటితో పాటు అల్యూమినియం అండ్ కార్బన్ ఫైబర్ అనే రెండు ఇంటీరియర్ ట్రిమ్స్ మొదలైనవి లభిస్తాయి. (ఇదీ చదవండి: మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?) ఇంజిన్ మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 4.0 లీటర్ లీటర్ ట్విన్ టర్బో, వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 476 హార్స్ పవర్ 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకునే ఈ కారు గరిష్ట వేగం 295 కిమీ/గం. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ప్రత్యర్థులు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 కారు పోర్స్చే 911 కర్రెరా ఎస్ క్యాబ్రియోలెట్, లెక్సస్ 500హెచ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమాంకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
ప్రత్యర్థులను రఫ్ఫాడించడానికి సిద్ధమైన రెనో రఫెల్ - వివరాలు
Renault Rafale Revealed: అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాన్స్ వాహన తయారీ సంస్థ 'రెనాల్ట్' (Renault) యూరప్ మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎస్యువి 'రఫెల్' (Rafale) ఆవిష్కరించింది. మార్కెట్లో అడుగెట్టిన ఈ కొత్త కారు ఆధునిక డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిజైన్ & కొలతలు కొత్త రెనాల్ట్ రఫెల్ CMF-CD ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైంది. ఇందులో అద్భుతమైన గ్రిల్, ఫాస్ట్‌బ్యాక్ రూఫ్, స్లోపింగ్ రూఫ్‌లైన్, పెద్ద బానెట్, వైడ్ ఎయిర్ వెంట్, మాట్రిక్స్ షేప్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. టెయిల్ లైట్, బ్రాండ్ లోగో, స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఈ SUV పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4.7 మీ, ఎత్తు 1.61 మీ, వీల్‌బేస్ 2.74 మీ వరకు ఉంటుంది. కావున ఇది ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఫీచర్స్ ఫీచర్స్ విషయానికొస్తే.. రెనాల్ట్ రఫేల్ పానోరమిక్ సన్‌రూఫ్, ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన భారీ సెంటర్ కన్సోల్, ఫ్లాట్ బాటమ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 9.3 ఇంచెస్ హెడ్అప్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.0 ఇంచెస్ వర్టికల్లీ ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా లభిస్తాయి. (ఇదీ చదవండి: ఇండియన్ ఆర్మీలోకి మహీంద్రా ఆర్మడో కార్లు - వైరల్ వీడియో) ఇంజిన్ రెనాల్ట్ కొత్త కారు 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ 3 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ కలిగి 2 ఎలక్ట్రిక్ మోటార్స్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. సాధారణంగా 130 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే ఈ ఇంజిన్.. ఎలక్ట్రిక్ మోటార్లను కనెక్ట్ చేస్తే 200 హెచ్‌పీ కంటే ఎక్కువ ఔట్పుట్ అందిస్తుంది. (ఇదీ చదవండి: ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి!) భారతదేశంలో ఈ ఎస్యువి బహుశా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ 2025 నాటికి రెనాల్ట్ డస్టర్ అప్డేట్ మోడల్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి మోడల్స్ మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. కాగా యూరప్ మార్కెట్లో విడుదలకానున్న ఈ రఫెల్ ధర 55,000 యూరోలు వరకు ఉండవచ్చు. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 49.3 లక్షల వరకు ఉంటుంది. -
వచ్చేసింది.. ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యాయి, అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కూడా 'స్పెక్టర్' అనే ఎలక్ట్రిక్ కారు విడుదలతో ఈ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన రోల్స్ రాయిస్ కంపెనీ తాజాగా 'స్పెక్టర్' (Spectre) ఎలక్ట్రిక్ కారుని సౌత్ కొరియాలో విడుదల చేసింది. గతంలో వెల్లడించినట్లుగానే కంపెనీ ఎలక్ట్రిక్ కారుని తీసుకువచ్చింది. ఇది గ్లోబల్ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ మోడల్. దీని ధర కొరియాలో 620 మిలియన్ వాన్స్.. అంటే భారతీయ కరెన్సీ దీని విలువ సుమారు 3.98 కోట్లు. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!) దక్షిణ కొరియాలో రోల్స్ రాయిస్ తన ఉనికిని మరింత విస్తరించుకోవడంలో భాగంగానే స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసినట్లు సమాచారం. ఈ కారు డిజైన్ చూడగానే రోల్స్ రాయిస్ తెలిసిపోతుంది. ఇందులో అత్యంత విశాలవంతమైన గ్రిల్ చూడవచ్చు. పరిమాణం పరంగా ఇది చాలా విషయంగా ఉంటుంది. పొడవు 5,453 మిమీ పొడవు, 2,080 మిమీ వెడల్పు, ఎత్తు 1,559 మిమీ వరకు ఉంది. వీల్‌బేస్ 3210 మిమీ. ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ 2,950 కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి.. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 576.6 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. ఇది ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 520 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. -
రోజుకి 150 దాటుతున్న జిమ్నీ బుకింగ్స్ - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
మారుతి సుజుకి జిమ్నీ 2023 ఆటో ఎక్స్పో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన బుకింగ్స్ పొందుతూ ముందుకు సాగుతోంది. విడుదలకు ముందే 30,000 బుకింగ్స్ పొందిన ఈ ఆఫ్ రోడర్ ఇప్పటికి కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ పొందుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి తన జిమ్నీ ధరలను 2023 జూన్ 7న అధికారికంగా ప్రకటించింది. జిమ్నీ బేస్ వేరియంట్ ధరలు రూ. 12.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 15.05 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ధరలు ప్రకటించడానికి ముందు కంపెనీ ఈ SUV కోసం రోజుకి దాదాపు 92 బుకింగ్స్ పొందింది. కాగా ధరలు ప్రకటించిన తరువాత రోజుకి 151 బుకింగ్స్ వస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా సేల్స్ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. డిజైన్ పరంగా నిటారుగా ఉన్న పిల్లర్లు, క్లీన్ సర్ఫేసింగ్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, స్లాట్డ్ గ్రిల్, చంకీ ఆఫ్-రోడ్ టైర్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కలిగి ఉన్న ఈ ఆఫ్ రోడర్ 195/80 సెక్షన్ టైర్లతో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. లోపలి భాగంలో 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంటాయి. జిమ్నీ ఎస్యువి 1.5 లీటర్ 5 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 105 bhp పవర్ 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి తన జిమ్నీ కారుని కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సంస్థ ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించింది. దేశీయ విఫణిలో డెలివరీలను కూడా ప్రారంభించింది. ఇది ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఖరీదైన కారులో షికారు కొడుతున్న రాఖీభాయ్ - వైరల్ వీడియో
Yash Land Rover Range Rover: కన్నడ సినిమా నటుడైనప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినీ నటులలో 'యష్' ఒకరు. కెజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన యస్ ఇటీవల ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాండల్‌వుడ్ హీరో యష్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ధర సుమారు రూ. 4 కోట్లు అని సమాచారం. నిజానికి భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్ ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించడమే కాకుండా.. లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగా ఎక్కువ మంది ఈ కారుని ఎగబడి కొంటుంటారు. (ఇదీ చదవండి: ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!) Range Rover Entered ✅#YashBoss #Yash19@TheNameIsYash pic.twitter.com/erQbftMhxd — Abhi ⚡ (@AbhiYashCult) June 15, 2023 ఇప్పటికే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ డిఎల్ఎస్ 350 డి, మెర్సిడెస్ జిఎల్సి 250 డి కూపే, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 520 డి, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్ వంటి కార్లను కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ కార్ల జాబితాలోకి మరో లగ్జరీ బ్రాండ్ కారు చేరింది. సెలబ్రిటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఈ బ్రాండ్ కారుని చాలా మంది ఈ కారుని కొనుగోలు చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
మారుతి టూర్ హెచ్1 - దుమ్మురేపే మైలేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా టూర్ హెచ్1 పేరుతో సరికొత్త కారును ప్రవేశపెట్టింది. భారత్‌లో అధిక మైలేజీ ఇచ్చే ప్రారంభ స్థాయి కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. మైలేజీ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిలోమీటర్లు, సీఎన్జీ వేరియంట్ కిలోకు 34.46 కిలోమీటర్లు ఇస్తుందని వెల్లడించింది. ధర రూ.4.8 లక్షల నుంచి ప్రారంభం. సీఎన్జీ వేరియంట్ ధర రూ.5.7 లక్షలు. ఆల్టో కే10 ఆధారంగా టూర్ హెచ్1 రూపొందింది. కె–సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్ పొందుపరిచారు. రెండు ఎయిర్‌బ్యాగ్స్, ప్రిటెన్షనర్, ఫోర్స్ లిమిటర్‌తో ముందు సీట్ బెల్ట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి హంగులు జోడించారు. -
జూలై 5న విడుదలకానున్న కొత్త కారు ఇదే - మారుతి సుజుకి
రోజు రోజుకి దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న కొత్త వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జిమ్నీ ఆఫ్-రోడర్ విడుదల చేసిన మారుతి సుజుకి వచ్చే నెలలో మరో MPV విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి 2023 జులై 05న విడుదల చేయనున్న సరికొత్త ఎంపివి పేరు 'ఎంగేజ్' (Engage). ఇది ఇప్పటికే ప్రజాదరణ పొందుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ మాదిరిగానే తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది జులై చివరి నాటికి నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మకానికి రానున్నట్లు సమాచారం. మారుతి సుజుకి విడుదల చేయనున్న ఎంగేజ్ భిన్నమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఈ ఎంపివి ముందు భాగంలో హానీ కూంబ్ మెష్ గ్రిల్, గ్రిల్ మధ్యలో క్రోమ్ బార్లు, ఇరువైపులా హెడ్‌ల్యాంప్‌లు ఉండనున్నాయి. ఫ్రంట్ బంపర్ ట్వీక్ చేసిన విధంగా కనిపిస్తుంది, స్కిడ్ ప్లేట్ మాదిరిగా కనిపించేలా చేయడానికి ఫాక్స్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ పొందుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. (ఇదీ చదవండి: రూ. 77712 వద్ద హోండా డియో హెచ్-స్మార్ట్ - పూర్తి వివరాలు) మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) నిజానికి 2017 లో టయోటా & మారుతి సుజుకి మధ్య సత్సంబంధం ఏర్పడినప్పటి నుంచి బాలెనొ, అర్బన్ క్రూయిజర్, గ్లాంజా వంటి ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. కావున ఇప్పుడు రానున్న ఈ ఎంపివి కూడా రెండు కంపెనీల కలయికతో రీబ్యాడ్జ్ చేసిన టయోటా ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి కొత్త ఎంపివి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
రూ. 2.55 కోట్ల మెర్సిడెస్ జీ–క్లాస్ - పూర్తి వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో జీ–క్లాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్–డిసెంబర్లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్‌లో 4,697 యూనిట్లను విక్రయించింది. -
భారత్‌లో బీఎండబ్ల్యూ ఎం2 లాంచ్ - ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో ఎం2 స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.98 లక్షలు. రెండు డోర్లు, నాలుగు సీట్లను కలిగి ఉంది. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు. బీఎండబ్ల్యూ ఎమ్2 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్లైన్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 460 hp పవర్ & 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 4.1 సెకన్లు, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 4.3 సెకన్లలో అందుకుంటుంది. -
మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్‌లో రూ. 12.7 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఆల్ఫా వేరియంట్లో టాప్ ధర రూ. 15.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీని భారత్‌లో నెక్సా షోరూమ్‌ల ద్వారా కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. కొత్త జిమ్నీ 103 హార్స్పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన విధంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీకి పోటీగా మహీంద్రా 5-డోర్ థార్‌ను రంగంలోకి దించుతోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో దీన్ని పరిచయం చేసింది.మారుతి సుజుకి కొత్త జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు సాధించింది. ఇప్పటి వరకు జిమ్నీ 3-డోర్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త 5-డోర్ వెర్షన్‌తో మారుతి సుజుకి భారతీయ ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చవకైన 4X4 కారు మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో చవకైన 4X4 కారుగా అవతరించింది. లుక్స్ పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్.. 3-డోర్ జిమ్నీని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ గ్రిల్స్ దానిలాగే ఉంటాయి. కారు వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. పొడవైన వీల్‌బేస్ కారణంగా రెండు వైపులా గుర్తించదగిన మార్పు కన్పిస్తుంది. క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్‌లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణికులకు మూడు పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్‌యూవీలు -
హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్‌యూవీలు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా.. భారత మార్కెట్లో 2030 నాటికి అయిదు కొత్త ఎస్‌యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ సైతం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయా సుమురా తెలిపారు. మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎలివేట్ సాయంతో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీ, అమేజ్ సెడాన్లను భారత్‌లో విక్రయిస్తున్నాం. మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో సెడాన్ల వాటా 10 శాతమే. ఈ విభాగంలోనే కంపెనీ పోటీపడుతోంది. అలాగే ఈ మోడళ్లు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయి. ఎలివేట్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టాం. రానున్న రోజుల్లో ఈ మోడల్ ప్రధాన ఉత్పాదనగా ఉంటుంది. కొత్తగా వచ్చే మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడతాయి. ఎలివేట్ ఎగుమతి కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దుతాం. ఇక 2022–23లో 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశాం. 2024–25లో దీనిని 1.7 లక్షల యూనిట్లకు చేరుస్తాం’ అని వివరించారు. 2040 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని హోండా మోటార్ కో ఆసియా హెడ్ తోషియో కువహర తెలిపారు. -
భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - లాంచ్ ఎప్పుడంటే?
zPod Autonomous Driving Consept: భారతదేశంలో డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు కూడా వచ్చేసాయి. అయితే త్వరలోనే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మన దేశంలో అక్కడక్కడా అన్యదేశ్యపు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును బెంగళూరుకు చెందిన 'మైనస్ జీరో' (Minus Zero) సంస్థ ఆవిష్కరించింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో వినియోగంలో ఉన్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారతదేశంలో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మైనస్ జీరో కంపెనీ విడుదల చేయనున్న ఈ కారు పేరు 'జెడ్పాడ్' (zPod). ఇది భారతీయ రోడ్ల మీద త్వరలోనే పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది. భారతదేశపు మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. మైనస్ జీరో జెడ్పాడ్ వెహికల్ చూడటానికి చిన్నగా ఉంటుంది. అయితే ఇది ఎలాంటి పరిస్థితుల్లో అయినా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇందులో స్టీరింగ్ వీల్ లేకపోవడం గమనార్హం. అయితే దీనికి బదులుగా అనేక హై- రిసొల్యూషన్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రాఫిక్ వంటి సమయంలో డ్రైవింగ్ ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది లెవెల్ 5 అటానమీ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కారు అని కంపెనీ చెబుతోంది. (ఇదీ చదవండి: ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. వారు చేసే బిజినెస్ ఏంటో తెలుసా?) లెవెల్ 5 అటానమీ కలిగి ఉండటం వల్ల మనుషుల ప్రమేయం లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంది. ఇందులోని కెమెరా సెన్సార్లు వాహన పరిసరాలను రియల్ టైమ్ ఇమేజ్ వంటి వాటిని క్యాప్చర్ చేసుకోగలదు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కావున వెహికిల్‌ని నావిగేట్ చేస్తుంది. అవసరమైనప్పుడు స్పీడ్ పెరుగుతుంది, ఏవైనా అడ్డంకులు వస్తే వాహనాన్ని ఆపుతుంది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) లాంచ్ టైమ్.. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు క్యాంపస్ లేదా పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారు గూగుల్ అండ్ టెస్లా కార్లకు ధీటుగా ఇండియాలో రూపుదిద్దుకోనుంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందని వివరాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. కానీ త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. -
మహీంద్రా థార్ లాంచ్‌పై కీలక అప్డేట్
మహీంద్రా థార్ (5-డోర్) దేశంలో అత్యంత ఎదురుచూస్తున్న ఎస్యూవీ(SUV)లలో ఒకటి. ఇప్పటి వరకు ఈ ఏడాది ఆగస్టు 15న ఈ ఎస్యూవీ లాంచ్ అవుతుందని పుకారు ఉండేది. అయితే థార్ 5-డోర్ లాంచ్ ఎప్పుడనేది కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాహన ప్రియులను మరింత నిరీక్షణలోకి నెట్టేసింది. మహీంద్రా థార్ 5-డోర్ 2024లో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ సంవత్సరం కంపెనీకి సంబంధించిన కొత్త ఉత్పత్తులేవీ లేవని మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటో & ఫార్మ్ సెక్టార్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో రాజేష్ జెజురికర్ తెలిపారు. ఇప్పటికే 50,000లకుపైగా బుకింగ్‌లు 5-డోర్ థార్‌కు చాలా డిమాండ్ ఉందని, ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయని జెజురికర్ పేర్కొన్నారు. కస్టమర్ల నిరీక్షణకు తెర దించుతూ 2024 సంవత్సరంలో 5-డోర్ థార్‌ను లాంచ్ చేయనున్నట్లు వివరించారు.పెంచాలి మరియు ఇప్పుడు మేము 2024లో వచ్చే థార్ 5-డోర్లను చూస్తున్నాము”, జోడించారు. మహీంద్రా థార్‌కు దేశంలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఎస్యూవీ డెలివరీ పొందాలంటే కస్టమర్లు మరికొంత కాలం వేచి ఉండాలి. కాగా మహీంద్రా ఈ సంవత్సరం ప్రారంభంలో థార్‌లో RWD 4X2 వెర్షన్‌ను కూడా ప్రారంభించింది. ఇక మహీంద్రా థార్ 5-డోర్ డిజైన్, ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే పొడవైన స్తంభాలతో బాక్స్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. వాహనం ముందు, వెనుక భాగాలు ప్రస్తుత థార్ మాదిరిగానే ఉంటాయని తెలిసింది. అయితే కొత్త 5-డోర్ థార్‌లో పొడవైన డోర్లు, వీల్‌బేస్‌తో మరింత విశాలమైన క్యాబిన్ ఉంటుంది. సరికొత్త అల్లాయ్ వీల్స్, హుడ్ కింద 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉంటాయని వెల్లడైంది. ఇదీ చదవండి: మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్‌కు వచ్చేశాయ్! ధరలు ఇవే.. -
మరింత అందంగా తయారైన ఎంజీ గ్లోస్టర్ - అదిరిపోయే లుక్ & అంతకు మించిన ఫీచర్స్!
MG Gloster Blackstorm edition: భారతదేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎంజీ మోటార్' కంపెనీ ఎట్టకేలకు గ్లోస్టర్ ఎస్యువి కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు 'బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్'. ఈ ప్రీమియం కారు ధరలు, అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్' ధర రూ. 40.30 లక్షలు. ఇప్పటికే ప్రీమియం విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న గ్లోస్టర్ ఇప్పుడు మరింత అద్భుతంగా తయారైంది. ఇది తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. డిజైన్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ బయట, లోపలి భాగంలో ఎక్కువ భాగం బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇది రెండు పెయింట్ ఆప్షన్లతో మెటల్ బ్లాక్ అండ్ మెటల్ యాష్‌తో పాటు రూప్ రైల్స్, టెయిల్ల్యాంప్, హెడ్‌ల్యాంప్ హౌసింగ్, విండో చుట్టూ ఉండే ట్రిమ్, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, అల్లాయ్ వీల్స్ వంటివి బ్లాక్‌స్టార్మ్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా బయట వైపు రెడ్ కలర్ యాక్సెంట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది హెడ్‌ల్యాంప్స్, బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, వింగ్ మిర్రర్లపై చూడవచ్చు. పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగం బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్ పొందుతుంది. ఇది ఇంటీరియర్ అపోల్స్ట్రే, స్ట్రీరింగ్, డ్యాష్‌బోర్డ్‌లలో కనిపిస్తుంది. గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ 6 అండ్ 7-సీటర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక దాదాపు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్‌రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) Presenting THE ADVANCED GLOSTER BLACKSTORM with an all-new dark exterior, sporty-red accents and a luxurious dark-theme interior. With its Intelligent 4X4, 7-Terrain Modes & ADAS features you can take on anything the road throws at you and #DriveUnstoppable on your adventures! pic.twitter.com/bTqkG6BaLK — Morris Garages India (@MGMotorIn) May 29, 2023 ఇంజిన్ & పర్ఫామెన్స్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ఇంజిన్, పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు పొందలేదు. 2WD వెర్షన్ 163 hp ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ సింగిల్ టర్బో-డీజిల్ ఇంజన్.. 4WD వెర్షన్ 218 hp పవర్ అందించే 2.0-లీటర్ ట్విన్ టర్బో-డీజిల్ ఇంజన్ పొందుతాయి. రెండు ఇంజిన్స్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ధర తెలియకుండానే దూసుకెళ్తున్న బుకింగ్స్.. అట్లుంటది జిమ్నీ అంటే..
Maruti 5 Door Jimny: మారుతి సుజుకి భారతదేశంలో విడుదల చేయనున్న '5 డోర్ జిమ్నీ' గురించి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు వెల్లడించింది. ఈ SUV జూన్ 7న అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టనుంది. జిమ్నీ ఆఫ్-రోడర్ బుకింగ్స్, డెలివరీలు వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన 3 డోర్స్ జిమ్నీ ఇప్పుడు 5 డోర్స్ జిమ్నీ రూపంలో విడుదలకావడనికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే ధరలు మాత్రమే వెల్లడించాల్సి ఉంది. ధరలు కూడా అధికారికంగా వెల్లడి కాకముందే ఈ ఎస్యువి ఏకంగా 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. బుకింగ్స్ దాదాపు మ్యాన్యువల్ & ఆటోమాటిక్ వేరియంట్లకు సమానంగా వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. కంపెనీ ఈ 5 డోర్ జిమ్నీ కోసం జనవరి నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్న ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా తయారైంది. ఇందులో 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. (ఇదీ చదవండి: తక్కువ ధర వద్ద మంచి మైలేజ్ అందించే టాప్ 5 కార్లు - చూసారా?) డెలివరీలు.. 5 డోర్ మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ 1000 యూనిట్లను రూపొందించినట్లు సమాచారం. కావున డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫస్ట్ బ్యాచ్ డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి. (ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో.. ధర ఎంతో తెలుసా?) మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్‌తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించన్నప్పటికీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల ఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
Nissan Magnite Geza Special Edition: ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న 'నిస్సాన్ మాగ్నైట్' ఇప్పుడు సరికొత్త స్పెషల్ ఎడిషన్‌లో విడుదలైంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు ఇప్పుడు కొత్త అప్డేట్స్ పొందింది. ఈ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ భారతదేశంలో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ పేరు 'గెజా'. నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది ఒనిక్స్ బ్లాక్, సాండ్స్టోన్ బ్రౌన్, స్టార్మ్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, బ్లేడ్ సిల్వర్ అనే ఐదు కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్ కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దాదాపు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే ఫీచర్స్ కొన్ని అప్డేట్ పొందాయి. ఇందులోని 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ టచ్‌స్క్రీన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఇందులో JBL స్పీకర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అత్యంత ఖరీదైన మెక్లారెన్ సూపర్‌కార్ - 330 కిమీ/గం స్పీడ్) ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ మార్కెట్లో విడుదలైంది. కాగా ఇప్పుడు గెజా ఎడిషన్ అడుగు పెట్టింది. ఇందులో యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. దీనిని నిస్సాన్ ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో బేజ్ కలర్ సీట్ కవర్స్ ఉండటం కూడా చూడవచ్చు. ఇందులో రియర్ కెమెరా, షార్క్ న్ యాంటెన్నా వంటివి కూడా ఉన్నాయి. ఇంజిన్ కంపెనీ అందించిన సమాచారం మాగ్నైట్ గెజా స్పెషల్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కావున అదే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 hp పవర్ ప్రోడీసు చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కావున పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు) ప్రత్యర్థులు కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యువి300, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కిగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా ఇది గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
రూ. 5.1 కోట్ల మెక్లారెన్ కొత్త సూపర్‌కార్ ఇదే - పూర్తి వివరాలు
McLaren Artura: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ సూపర్‌కార్ తయారీ సంస్థ 'మెక్లారెన్' (McLaren) ఖరీదైన హైబ్రిడ్ కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సూపర్‌కార్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో అడుగుపెట్టిన 'మెక్లారెన్ ఆర్టురా' హైబ్రిడ్ సూపర్‌కార్ ధర రూ. 5.1 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ప్రపంచములో అత్యంత ఖరీదైన కారు మాత్రమే కాదు అత్యంత వేగవంతమైన కారు కూడా. ఇప్పటికే సంస్థ తన కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించింది. అయితే తన పరిధిని విస్తరించడంతో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కారుని విడుదల చేసినట్లు తెలుస్తోంది. డిజైన్ కొత్త మెక్లారెన్స్ ఆర్టురా మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని హెడ్‌ల్యాంప్ క్రింద అదనపు లైటింగ్ ఎలిమెంట్ కూడా లభిస్తుంది. ఇది చూడటానికి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. రియర్ ప్రొఫైల్ సన్నని టెయిల్-ల్యాంప్ పొందుతుంది. (ఇదీ చదవండి: ఆధునిక ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!) ఫీచర్స్ ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8.0 ఇంచెస్ వర్టికల్ మౌంటెడ్ టచ్స్క్రీన్ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు USB పోర్టులు, ADAS టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఇంజిన్ కొత్త మెక్లారెన్ ఆర్టురా PHEV 3.0-లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజన్ కలిగి 95 hp పవర్, 225 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 585 hp పవర్ డెలివరీ చేస్తుంది. మొత్తం మీద ఈ కారు 680 హార్స్ పవర్ & 720 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇందులో లభిస్తుంది. కావున కేవలం 3.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ట వేగం గంటకు 330 కిమీ వరకు ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. (ఇదీ చదవండి: భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు) మెక్లారెన్ ఆర్టురాలో 7.4 కిలోవాట్ బ్యాటరీ 31 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని బ్యాటరీని కేవలం 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఇందులో ఈ మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, ట్రాక్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది. మెక్లారెన్ ఆర్టురా కార్బన్ లైట్ వెయిట్ ఆర్కిటెక్చర్ (MCLA)ని కలిగిన మొదటి మోడల్. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైన ఈ కారు 4539 మిమీ పొడవు, 2080 మిమీ, 1193 మిమీ ఎత్తు, 2640 మిమీ వీల్‌బేస్‌తో 66 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ కారు ముందు ట్రంక్‌లో 160 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ సూపర్‌కార్‌కు ప్రధాన ప్రత్యర్థి లేదు, కానీ మసెరటి MC 20 మాత్రం ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంది. -
భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు
BMW Z4 Facelift: భారతదేశంలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఖరీదైన కొత్త 'జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్' కారుని విడుదల చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఈ ఖరీదైన కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & డెలివరీ దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్' (BMW Z4 Roadster Facelift) ధర రూ. 89.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిజైన్ బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌తో ఇరువైపులా రీడిజైన్ చేసిన ట్రయాంగిల్ ఎయిర్ ఇన్టేక్స్, హెడ్‌ల్యాంప్, హనీకూంబ్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్ వంటి వాటితో పాటి సైడ్ ప్రొఫైల్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, వెనుక వైపు దాదాపు దాని అవుట్గోయింగ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులోని ఫాబ్రిక్ రూఫ్-టాప్ కేవలం 10 సెకన్లలో ఓపెన్ అవుతుంది లేదా క్లోజ్ అవుతుంది. (ఇదీ చదవండి: ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ & డెలివరీ వివరాలు) ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త ఐడ్రైవ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ డ్రైవర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్, డ్యూయల్ జోన్ ఏసీ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, M స్పోర్ట్స్ సీట్లు, స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఇది 2 డోర్స్ మోడల్. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) ఇంజిన్ బీఎండబ్ల్యూ జెడ్4 రోడ్‌స్టర్ ఫేస్‌లిఫ్ట్ 3.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ ఇన్లైన్-సిక్స్ సిలిండర్ ఇంజన్ 340 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది మార్కెట్లో 'పోర్స్చే 718 బాక్స్‌స్టర్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. This is sportiness turned up to the maximum. The ultimate embodiment of sheer driving pleasure, the new BMW Z4 lets you feel hallmark BMW sporting prowess as you make statements of undeniable athleticism at every moment behind the wheel.#BMW #TheNewZ4 #MaximumOfSportiness… pic.twitter.com/2iVrABywH7 — BMW India (@bmwindia) May 25, 2023 -
టాటా పంచ్ ప్రత్యర్థిగా హ్యుందాయ్ ఎక్స్టర్ - లాంచ్ డేట్ ఫిక్స్
Hyundai Exter: భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ కొత్త కారుని (ఎక్స్టర్) విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ SUV ఫోటోలను, డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలను వెల్లడించినప్పటికీ ఖచ్చితమైన లాంచ్ డేట్ వెల్లడించలేదు. అయితే ఇప్పుడు సంస్థ ఎక్స్టర్ లాంచ్ డేట్ కూడా అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ డేట్ నివేదికల ప్రకారం, హ్యుందాయ్ ఎక్స్టర్ 2023 జులై 10న అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఎస్యువి మార్కెట్లో అడుగుపెట్టడాని మరెన్నో రోజులు లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ. 11,000లతో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. కావున డెలివరీలు జులై చివరినాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. వేరియంట్స్ & డిజైన్ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ మొత్తం ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉండే ఈ కారు ఫీచర్స్ పరంగా కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇది హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్‌కు టెక్స్చర్డ్ ఫినిషింగ్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు లభిస్తాయి. వెనుక వైపు నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ ప్రస్తుతానికి కంపెనీ ఈ ఎస్యువి ఇంటీరియర్ ఫీచర్స్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డ్రైవర్ డిస్ప్లే, ఏసీ వెంట్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటివి వుంటాయని తెలుస్తోంది. మొత్తం మీద ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంజిన్ కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) సేఫ్టీ ఫీచర్స్ ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు కేవలం డిజైన్, ఫీచర్స్, మైలేజ్ వంటి విషయాలతో పాటు సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్లో విడుదలైన తరువాత టాటా పంచ్ మైక్రో ఎస్‌యువికి ప్రత్యర్థిగా నిలబడనున్న ఎక్స్టర్ తప్పకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులోని అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగులు, హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో) ప్రత్యర్థులు & అంచనా ధర హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్‌లో మరో సిఎన్జి కారు లాంచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్
Tata Altroz CNG: ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సిఎన్జి కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఆల్ట్రోజ్ సిఎన్జి (Altroz CNG) విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిఎన్జి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & వేరియంట్స్ టాటా మోటార్స్ విడుదల చేసిన ఆల్ట్రోజ్ సిఎన్జి ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE, XM+, XM+ (S), XZ, XZ+ (S), XZ+ O (S) వేరియంట్లు. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 7.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 10.55 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). దేశీయ విఫణిలో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి సన్‌రూఫ్ కలిగిన మొదటి CNG బేస్డ్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో డ్యూయెల్ సిలిండర్ సెటప్ కలిగి ఉంటుంది, కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో 210 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్ ఆల్ట్రోజ్ బూట్ స్పేస్ 345 లీటర్లు. డిజైన్ & ఫీచర్స్ ఆల్ట్రోజ్ CNG కారు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ దీని టెయిల్‌గేట్‌పై 'iCNG' బ్యాడ్జ్ ఇది కొత్త మోడల్ అని చెప్పకనే చెబుతుంది. బూట్ ప్లోర్ కింద రెండు సిఎన్జి ట్యాంకులు ఉంటాయి. సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ దాదాపు పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. కావున అదే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కలిగి.. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి వారికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ కూడా లభిస్తాయి. XM+ (S), XZ+ (S), XZ+ O (S) వేరియంట్లలో వాయిస్ యాక్టివేటెడ్ సింగిల్-పేన్ సన్‌రూఫ్ లభిస్తుంది. కావున ఇది దాని ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో 5 డోర్ జిమ్నీ లాంచ్ డేట్ ఫిక్స్ - బుక్ చేసుకున్న వారికి పండగే) పవర్‌ట్రెయిన్ ఆల్ట్రోజ్ సిఎన్జి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 88 హార్స్ పవర్, 115 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక సిఎన్జి మోడ్‌లో 77 hp పవర్, 103 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాని పెట్రోల్ వెర్షన్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!) ప్రత్యర్థులు ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జి ఇప్పటికే అమ్ముడవుతున్న మారుతి బాలెనొ సిఎన్జి, టయోటా గ్లాంజా సిఎన్జి వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
జిమ్నీ మైలేజ్ వెల్లడించిన మారుతి సుజుకి - పూర్తి వివరాలు
Maruti Jimny: మారుతి సుజుకి తన జిమ్నీ SUVని ఎప్పుడెప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంపెనీ ఈ కారుని వచ్చే నెలలో విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కానీ అంత కంటే ముందు ఈ కారు మైలేజ్ వివరాలను అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియులను ఆకర్శించిన 5 డోర్స్ జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. ఈ ఆఫ్ రోడర్ 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. మైలేజ్ వివరాలు మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్‌తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఈ గణాంకాలు వాస్తవ ప్రపంచంలో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ ఎస్యువి వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మాన్యువల్ వేరియంట్ల కోసం ఆరు నెలల, ఆటోమేటిక్ వేరియంట్ల కోసం ఎనిమిది నెలల వరకు ఉంటుంది. కాగా సంస్థ ఈ నెల ప్రారంభంలో గురుగ్రామ్‌లోని తన ప్లాంట్ నుంచి 5 డోర్స్ జిమ్నీ విడుదల చేసింది. కావున ధరలు కూడా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అంచనా ధర & ప్రత్యర్థులు మారుతి సుజుకి జిమ్నీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలవుతుందని అంచనా. ఈ ఆఫ్-రోడర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. జిమ్నీ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా?
భారతీయులకు వాహనం అంటే చాలా సెంటిమెంట్. అది కార్ అయినా కావచ్చు.. బైక్ అయినా కావచ్చు. కొత్తగా వాహనం కొంటే ఇంటిల్లిపాదికి అదొక పండుగ లాంటి సందర్భం. ఇలాగే ఛత్తీస్‌గఢ్‌లో ఒక కుటుంబం ఇటీవల నెటిజెన్ల దృష్టిని ఆకర్షించింది. ఇదీ చదవండి: టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? వారు కొన్న మహీంద్రా స్కార్పియో-N ఎస్యూవీ డెలివరీ సందర్భంగా కుటుంబం మొత్తం కారు ముందు డ్యాన్స్ చేశారు. యువకులు పిల్లలు, పెద్దలు అందరూ ఓ హిందీ పాటకు ఉత్సాహంగా చిందులు వేశారు. ఈ వీడియోను కార్ న్యూస్ గురు అనే ట్విటర్ పేజీ షేర్ చేయగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన దానిపై స్పందిస్తూ రీట్వీట్ చేశారు. వారి ఆనందం చూస్తుంటే తాను వాహన తయారీ రంగంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకు మించిన అవార్డులు ఏముంటాయని పేర్కొన్నారు. ఆనంద మహీంద్రా ట్వీట్‌ను వేలాది మంది లైక్ చేశారు. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెట్టారు. This is the real reward and joy of working in the Indian auto industry… https://t.co/ormA7i8sQq — anand mahindra (@anandmahindra) May 19, 2023 ఇలాంటి ఆసక్తికర ట్రెండింగ్ అప్డేట్ల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూస్తూ ఉండిండి -
హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..
Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త మైక్రో SUV 'ఎక్స్టర్' (Exter) లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారికి కంపెనీ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి సమాచారం వెల్లడించిన కంపెనీ తాజాగా లాంచ్ టైమ్ ఎప్పుడనే దానికి సంబంధించిన సమాచారం వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ '2023 జులై' నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రూ. 11,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన హ్యుందాయ్ డెలివరీలను కూడా వేగవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. డిజైన్ & వేరియంట్స్: భారతీయ విఫణిలో అడుగెట్టనున్న ఎక్స్టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఇది కంపెనీ ఇతర మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ చూడవచ్చు. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్‌కు టెక్స్చర్డ్ ఫినిషింగ్ వంటివాటితో పాటు ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ లో నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) సేఫ్టీ ఫీచర్స్: ఇటీవల కంపెనీ తన ఎక్స్టర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయని తెలిసింది. హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో ఉపయోగపడతాయి. ఇంజిన్: ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) అంచనా ధర & ప్రత్యర్థులు: హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డెలివరీలు ఆగస్టు నాటికి ప్రారంభమవుతాయి. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంలో మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?
Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త 'ఎక్స్టర్' మైక్రో SUV గురించి కొంత కొంత సమాచారంగా వెల్లడిస్తూనే ఉంది. ప్రారంభంలో టీజర్లను మాత్రమే విడుదల చేసిన కంపెనీ కొన్ని రోజులకు ముందు కారుకి సంబంధించిన ఒక అధికారిక ఫోటో విడుదల చేసింది. అయితే ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్.. భారతదేశంలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా పంచ్ కారుకి ప్రధాన ప్రత్యర్థిగా నిలబడటానికి సిద్దమవుతున్న ఎక్స్టర్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందని ఇటీవల వెల్లడైన ఫోటోల ద్వారా స్పష్టంగా తెలిసింది. సేఫ్టీ ఫీచర్స్.. హ్యుందాయ్ ఎక్స్టర్ అన్ని వేరియంట్లలోనూ ప్రామాణికంగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అవి డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్, సైడ్ ఎయిర్ బ్యాగ్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి. ఈ నియమాన్ని హ్యుందాయ్ అనుసరిస్తోంది. ఎయిర్ బ్యాగులు మాత్రమే కాకుండా హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. కావున భద్రత పరంగా ఈ కారు పటిష్టంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిపోయింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) లాంచ్ టైమ్ & ఇంజిన్ డీటైల్స్.. ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందనుంది. ఈ కొత్త SUV CNG వెర్షన్ లో కూడా రానున్నట్లు సమాచారం, ఇది కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. ఈ కారు 2023 జులై చివరలో లేదా ఆగష్టు ప్రారంభంలో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
భారత్‌లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్‌కి ఫిదా అవ్వాల్సిందే!
Maruti Suzuki: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో కొత్త XL7 ఎస్‌యువిని విడుదల చేయనుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త 7 సీటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న కొత్త ఎక్స్ఎల్7 ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎక్స్ఎల్6 కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది టయోటా ఇన్నోవా క్రిష్టాకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో పరిచమైన ఈ ఎస్యువి మంచి ప్రజాదరణ పొందుతోంది. కాగా ఇక భారతీయ తీరాలకు రావడానికి సన్నద్ధమవుతోంది. మారుతి ఎక్స్ఎల్7 డిజైన్, ఫీచర్స్ మారుతి సుజుకి కొత్త ఎక్స్ఎల్7 డిజైన్, ఫీచర్స్ చాలా కొత్తగా ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కార్బన్ ఫైబర్ డ్యాష్‌బోర్డ్, స్టాండర్డ్ మిడిల్ ఆర్మ్‌రెస్ట్‌లు, లెదర్డ్ స్ట్రీరింగ్ వీల్, పుష్ బటన్, స్టాప్ కీలెస్ ఎంట్రీ, రియర్‌వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్ఎల్7 ఎస్‌యువిలో 1.5 లీటర్ కే15బి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4,400 rpm వద్ద 138 Nm టార్క్ & 6000 rpm వద్ద 104 bhp పవర్ డెలివరీ చేస్తుంది. ఇంజిన్ 5 మ్యాన్యువల్, 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందనుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుందని ఆశిస్తున్నాము. మారుతి సుజుకి విడుదల చేయనున్న ఈ కొత్త ఎస్యువి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో రానుందా? ఇదిగో సాక్ష్యం..!
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) ఇప్పటికే భారతదేశంలో టాటా పంచ్ మైక్రో SUV విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే కంపెనీ ఈ చిన్న కారుని త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్లో తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పంచ్ ఈవీ ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది. దీనికి సంబంధించని ఫోటోలు ఇటీవల వెల్లడయ్యాయి. ఇది ఒక ఫ్లాట్‌బెడ్‌పై ఉండటం ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ కారు పూర్తిగా బహిర్గతం కాకుండా మొత్తం కప్పి ఉంచారు. కావున డిజైన్, ఫీచర్స్ వంటివి స్పష్టంగా వెల్లడి కాలేదు. ఈ లేటెస్ట్ ఈవీ చూడటానికి దాని పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో రియర్ డిస్క్ బ్రేక్‌లు ప్రత్యేకించి ఒక భిన్నమైన ఫీచర్. ఇందులో ఛార్జింగ్ స్లాట్ స్పష్టంగా కనిపించడం లేదు, కానీ ఇతర మోడల్స్ మాదిరిగానే ఫ్యూయెల్ క్యాప్‌లో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా గణనీయమైన మార్పులు పొందే అవకాశం ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, దీనికి సంబంధించిన ఒక ఫోటో మాత్రమే అందుబాటులో ఉంది. కావున ఇందులో పార్కింగ్ బ్రేక్ అండ్ డ్రైవ్ సెలెక్టర్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో టచ్‌స్క్రీన్ మునుపటి మోడల్ కంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. ఇందులోని మరిన్ని ఫీచర్స్ త్వరలోనే వెల్లడవుతాయి. (ఇదీ చదవండి: ఆగని ఉద్యోగాల కోత! ఆ సంస్థ నుంచి మళ్ళీ 340 మంది..) కొత్త టాటా పంచ్ ఇప్పటికే వినియోగంలో ఉన్న కంపెనీకి చెందిన జిప్ట్రాన్ పవర్‌ట్రెయిన్ ఉపయోగించే అవకాశం ఉంది. కావున ఇందులో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ఉంటుంది. అయితే పవర్‌ట్రెయిన్ ఎలా ఉంటుందనే అధికారిక వివరాలు వెల్లడికాలేదు, కానీ టాటా టిగోర్ మాదిరిగా మంచి పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) టాటా పంచ్ ఈ సంవత్సరం జూన్ నాటికి ఉత్పత్తిలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తరువాత అక్టోబర్ నెలలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 9.5 నుంచి రూ. 10.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. టాటా పంచ్ ఈవీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతి పంచుకోండి. -
ఈ బీఎండబ్ల్యూ కారు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే - ధర ఎంతో తెలుసా?
లగ్జరీ కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'బీఎండబ్ల్యూ' (BMW) దేశీయ మార్కెట్లో ఒక కొత్త కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ లేటెస్ట్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బీఎండబ్ల్యూ విడుదల చేసిన ఈ కొత్త కారు 'ఎక్స్3 ఎమ్40ఐ'. ఈ SUV కేవలం లిమిటెడ్ ఎడిషన్‌గా లభిస్తుంది. కావున ఇది ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. కావున ఆసక్తికలిగిన కొనుగోలుదారులు దీనిని కంపెనీ అధికారిక వెబ్సైట్లలో లేదా, సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఎక్స్3 ఎమ్40ఐ కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది బ్రూక్లిన్ గ్రే అండ్ బ్లాక్ సఫైర్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఎమ్ కిడ్నీ గ్రిల్ చూడవచ్చు. అంతే కాకుండా ముందు భాగంలో మ్యాట్రిక్స్ ఫంక్షన్ తో కూడిన అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సైడ్ ప్రొఫైల్ లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ రెడ్ బ్రేక్ కాలిపర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది మల్టీఫంక్షన్తో లెదర్ స్టీరింగ్ వీల్, కాంట్రాస్ట్ స్టిచింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెల్కమ్ లైట్ కార్పెట్, యాంబియంట్ లైటింగ్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, 16-స్పీకర్ హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎమ్40ఐ 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి 360 hp పవర్, 500 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కినీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ఇక చివరగా ప్రధానమైనది సేఫ్టీ ఫీచర్స్, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, డైనమిక్ బ్రేకింగ్ లైట్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ మొదలైనవి ఉంటాయి. -
మారుతి జిమ్నీ ఫస్ట్ కారు వచ్చేసింది - ఇక లాంచ్ అప్పుడే!
2023 ఆటో ఎక్స్‌పోలో 'మారుతి జిమ్నీ' 5 డోర్ వెర్షన్ కనిపించినప్పటినుంచి ఈ SUV కోసం ఎంతో మంది వాహన ప్రేమికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కంపెనీ ఈ ఆఫ్ రోడర్ కోసం మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే తాజాగా మారుతి సుజుకి ఈ కారు గురించి ఒక అప్డేటెడ్ న్యూస్ అధికారికంగా వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం జిమ్నీ 5-డోర్స్ సిరీస్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక విక్రయాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. బుకింగ్స్ కూడా దాదాపు 30వేలకు చేరువలో ఉన్నట్లు సమాచారం. మారుతి సుజుకి జిమ్నీ ధరలు జూన్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత వారంలో డెలివరీలు మొదలవుతాయని అంచనా. మార్కెట్లో ఈ కారు ఇంకా అధికారికంగా లాంచ్ కాకముందే వెయింటింగ్ పీరియడ్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం దాదాపు ఆరు నెలల వరకు ఉంది. అదే సమయంలో ఆటోమేటిక్ వెయిటింగ్ పీరియడ్ ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది. నాలుగు వేరియంట్లలో విడుదలకానున్న జిమ్నీ టాప్ స్పెక్ వేరియంట్ 'ఆల్ఫా'కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది. జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే కలర్ ఆప్షన్లలో విడుదలవుతుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ కలిగిన జిమ్నీ 105 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మారుతి సుజుకి తన గురుగ్రామ్ ప్లాంట్‌లో ప్రతి సంవత్సరం 1 లక్ష యూనిట్ల జిమ్నీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 66 శాతం దేశీయ విక్రయాలకు, మిగిలిన 34 శాతం ఎగుమతులకు కేటాయించే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ కేవలం భారతీయ మార్కెట్ కోసం ప్రతి నెల 7,000 యూనిట్లు కేటాయించాలని దానివైపు అడుగులు వేస్తోంది. (ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో) భారతీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి జిమ్నీ ఇప్పటికే విపరీతమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మహీంద్రా థార్'కి ప్రత్యేతిగా నిలబడుతుంది. కావున అమ్మకాల పరంగా కంపెనీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మారుతి జిమ్నీ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో 'సోనెట్ ఆరోక్స్' (Sonet Aurochs) అనే కొత్త ఎడిషన్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ హెచ్టిఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ కియా కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ మార్కెట్లో అడుగుపెట్టిన కియా కొత్త ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.85 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 లీటర్ పెట్రోల్ iMT, 1.0 లీటర్ పెట్రోల్ DCT, 1.5 లీటర్ డీజిల్ iMT, 1.5 లీటర్ డీజిల్ AT. కియా సోనెట్ ఆరోక్స్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. అవి గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్. డిజైన్ సోనెట్ ఆరోక్స్ గతంలో అమ్ముడైన యానివెర్సరీ ఎడిషన్ మాదిరిగానే ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, సెంటర్ వీల్ క్యాప్స్, గ్రిల్, డోర్ గార్నిష్, సైడ్ స్కిడ్ ప్లేట్లపై టాన్జేరిన్ యాక్సెంట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో Aurochs బ్యాడ్జ్ చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్ కలిగి రియర్ ఫ్రొఫైల్ లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఫీచర్స్ 2023 సోనెట్ ఆరోక్స్ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & స్పెసిఫికేషన్స్ కొత్త సోనెట్ ఆరోక్స్ ఎడిషన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. -
విడుదలకు ముందే బుకింగ్స్ షురూ.. లాంచ్ అయితే రచ్చ.. రచ్చే!
హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో విడుదల చేయనున్న ఎక్స్టర్ SUV టీజర్లను గత కొన్ని రోజులుగా విడుదల చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ కారుని అధికారికంగా వెల్లడించింది, అంతే కాకుండా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బుకింగ్స్ & లాంచ్ టైమ్ హ్యుందాయ్ ఎక్స్టర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ కారు 2023 జులై లేదా ఆగస్టు నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డెలివరీలు ఆ తరువాత ప్రారంభమవుతాయి. డిజైన్ & ఫీచర్స్ దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ EX, S, SX, SX (O), SX(O) కెనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలకానుంది. ఇప్పటికే సౌత్ కొరియాలో టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అయితే ఇది రేంజర్ ఖాకీ అనే కొత్త కలర్లో లభించనుంది. ఇందులో H షేప్ ఎల్ఈడీ హెడ్ లాంప్, DRL, విశాలమైన ఫ్రంట్ ఫాసియా, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూప్ రెయిల్స్ వంటివి ఉంటాయి. రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎల్ఈడీ టెయిల్ లాంప్ మొదలైనవి ఉంటాయి. కంపెనీ ఏ ఎస్యువి ఇంటీరియర్ ఫీచర్స్, డిజైన్ వంటి వాటిని గురించి అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో ఆధునిక కాలంలో వినియోగదారునికి కావలసిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!) ఇంజిన్ & పర్ఫామెన్స్ హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్‌యువిలో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉండనుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, వెన్యూ కార్లలో అందుబాటులో ఉంది. పర్ఫామెన్స్ ఫిగర్స్ ఇంకా వెల్లడికానప్పటికీ ఇది 83hp పవర్ 114Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని భావిస్తున్నాము. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందనుంది. కంపెనీ ఈ ఎస్‌యువిని లాంచ్ చేసే సమయంలోనే ధరలను గురించి కూడా అధికారికంగా వెల్లడించనుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి. -
ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి
ఎంజి మోటార్ ఇండియా ఇటీవల తన కామెట్ (Comet) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచ్ సమయంలో కంపెనీ కేవలం ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడించింది, కాగా ఇప్పుడు వేరియంట్స్, వాటి ధరలను కూడా అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు: ఎంజి కామెట్ మొత్తం మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి పేస్ (Pace), ప్లే (Play), ప్లస్ (Plus). ఈ మూడు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 7.98 లక్షలు, రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ నెల చివర నాటికి మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే మొదటి బుక్ చేసుకున్న 5000 మందికి మాత్రమే ప్రారంభ ధరలు వర్తిస్తాయి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. (ఇదీ చూడండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) డిజైన్ & ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన ఎంజి కామెట్ చూడటానికి చిన్నదిగా ఉన్నపటికీ మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. రెండు వింగ్ మిర్రర్స్ కనెక్టెడ్ క్రోమ్ స్రిప్ కలిగి ముందు వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బాస్ కలిగి, సైడ్ ప్రొఫైల్ 12 ఇంచెస్ వీల్స్ తో ఉంటుంది. రియర్ ఫ్రొఫైల్ లో కూడా వెడల్పు అంతటా వ్యాపించి ఉండే లైట్ బార్ చూడవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ముందు భాగంలో ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి లోపల వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉంటాయి. ముందు ప్యాసింజర్ సీటులో వన్ టచ్ టంబుల్ అండ్ ఫోల్డ్ ఫీచర్స్ లభిస్తాయి. అయితే రియర్ సీట్లు 50:50 స్ప్లిట్ పొందుతాయి. అంతే కాకుండా ఇందులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చూడండి: భారత్‌లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?) బ్యాటరీ అండ్ రేంజ్: ఎంజి కామెట్ 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ కోసం IP67 రేటింగ్ పొందుతుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. ఇది 42 bhp పవర్ అండ్ 110 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కామెట్ 3.3 కిలోవాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్‌తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. -
భారత్‌లో విడుదలకు సిద్దమవుతున్న మరో ఫ్రెంచ్ కారు, ఇదే! లాంచ్ ఎప్పుడంటే?
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్లో మరో కొత్త SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే సి3 హ్యాచ్‌బ్యాక్, సి5 ఎయిర్ క్రాస్ వంటి వాటిని విడుదల చేసి మంచి అమ్మకాలు పొందుతున్న ఈ కంపెనీ త్వరలోనే తన మూడవ మోడల్ విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ పేరుతొ విడుదలకానున్న ఈ లేటెస్ట్ ఎస్యువి ఎట్టకేలకు దేశీయ విఫణిలో గ్లోబల్ అరంగేట్రం చేసింది. కాగా 2023 ద్వితీయార్థంలో ఈ కొత్త కారు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారు సుమారు 90 శాతం స్థానీకరణను కలిగి ఉంటుంది. డిజైన్: కొత్త సిట్రోయెన్ సి3 CMP మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతుంది. కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక డిజైన్ పొందుతుంది. పొడవు వెడల్పు మాత్రమే కాకుండా గణనీయమైన వీల్ బేస్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!) దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 4.3 మీటర్ల పొడవు కలిగి హ్యుందాయ్ క్రెటా కంటే పొడవుగా ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే బ్రాండ్ మోడల్స్ గుర్తుకు తెచ్చినప్పటికీ ముందు భాగంలో లోగో గ్రిల్ భాగంలో నిక్షిప్తం చేశారు. అంతే కాకుండా హాలోజన్ హెడ్ లాంప్స్ కలిగి ఫ్రంట్ బంపర్ పొడవుగా రౌండ్ ఫాగ్ లాంప్స్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి, రియర్ ప్రొఫైల్ పొవాడైన టెయిల్ గేట్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్స్: ఇంటీరియర్ విషయానికి వస్తే, సి3 ఎయిర్‌క్రాస్ రెండు సీటింగ్ ఆప్షన్స్ పొందుతుంది. 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ కలిగి మూడు వరుసలతో వస్తుంది. 5 సీటర్ కారులో 444 లీటర్ల బూట్ స్పేస్, 7 సీటర్ కార్లు 511 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదే సమయంలో 10.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అలాగే ఉంటుంది. అయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బాగా అప్డేట్ పొందుతుంది. మిగిలిన అన్ని ఫీచర్స్ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) ఇంజిన్ వివరాలు: సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 110 హెచ్‌పి పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటాయి. ఆటోమాటిక్ గేర్ బాక్స్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త SUVలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉండదు. ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సిట్రోయెన్ సి3 ఇప్పటికే విక్రయానికి ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ లేటెస్ట్ SUV ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. ఈ కొత్త సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్ కామెట్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.98 లక్షలు. ఒకసారి చార్జింగ్‌తో 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 17.3 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. ఏడు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. రెండు డోర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, రెండు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో ఎంజీ ఇప్పటికే భారత్‌లో జడ్ఎస్ ఈవీ మోడల్‌ను విక్రయిస్తోంది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో కామెట్ కార్లను తయారు చేస్తున్నారు. -
హ్యుందాయ్ 'ఎక్స్టర్' ఫస్ట్ లుక్ - చూసారా!
ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ కంపెనీ మరో కారుని దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ ఈ కొత్త కారు టీజర్ కూడా విడుదల చేసింది. హ్యుందాయ్ విడుదల చేయనున్న కొత్త కారు పేరు 'ఎక్స్టర్' (Exter). ఇది మైక్రో SUV విభాగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన టీజర్ ప్రకారం ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కారు 2023 జులై నాటికి ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఎక్స్టర్ భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన ఫ్రంట్-ఎండ్ డిజైన్ కలిగి ఉండటం వల్ల కంపెనీకి చెందిన ఇతర మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. H-ఆకారంలో ఉండే ఎల్ఈడీ DRLలతో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ చూడచక్కగా ఉంటుంది. (ఇదీ చదవండి: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!) ఫ్రంట్ బంపర్, బంపర్ వెడల్పు అంతటా విస్తరించి ఉండే బ్లాక్ గ్రిల్ నిటారుగా, అడ్డంగా ఉండటం మీరు ఇందులో గమనించవచ్చు. రెండర్లో ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు విదేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్యాస్పర్ని గుర్తుకు తెస్తుంది. డిజైన్ పరంగా ఇది ఐయోనిక్ 5కి అదగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంటీరియర్ ఫీచర్స్ గురించి ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాదు, కానీ ఇది గ్రాండ్ ఐ10 నియోస్ వంటి ఇంటీరియర్ పొందే అవకాశం ఉంది. అయితే ఇది బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, రీట్యూన్డ్ సస్పెన్షన్ వంటివి పొందనుంది. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంజిన్ వివరాలు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ ఇందులో ఆరా, ఐ20, వెన్యూలోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ కంపెనీ 2023 ఆగస్ట్‌లో 'ఎక్స్టర్'ని లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ధర నియోస్ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ కారు ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన మారుతి ఫ్రాంక్స్ - ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'మారుతి సుజుకి ఫ్రాంక్స్' (Maruti Suzuki Fronx) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. విడుదలకు ముందే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందిన ఈ కొత్త ఎస్యువి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & బుకింగ్స్: దేశీయ విఫణిలో అధికారికంగా విడుదలైన కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 7.47 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 13.14 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మారుతి సుజుకి రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పటికే ఫ్రాంక్స్ 15 వేలకంటే ఎక్కువ సంక్యలో బుకింగ్స్ పొందినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. డిజైన్: మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త ఫ్రాంక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, అల్లాయ్ వీల్స్, వాలుగా ఉండే రూఫ్‌లైన్ వంటి వాటితో పాటు సైడ్ ప్రొఫైల్‌లో 17 ఇంచెస్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. పరిమాణం పరంగా కూడా ఈ SUV చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,765 మిమీ, ఎత్తు 1,550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) ఫీచర్స్: మారుతి ఫ్రాంక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫ్రీ-స్టాండింగ్ 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్ మంచి పట్టుని అందిస్తుంది, ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. కలర్ ఆప్షన్స్: కొత్త మారుతి ఫ్రాంక్స్ ఆర్కిటిక్ వైట్, ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, గ్రాండియర్ గ్రే అనే ఏడు రంగులలో లభిస్తుంది. అంతే కాకుండా డ్యూయల్-టోన్ ఎంపికలుగా ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ అందుబటులో ఉంటాయి. పవర్‌ట్రెయిన్స్: ఫ్రాంక్స్ ఎస్యువి 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్‌పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ) 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఆఫర్లో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఆటోమేటిక్‌తో లభిస్తుంది. పనితీరు పరంగా ఈ కొత్త ఎస్యువి ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి ఫ్రాంక్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
విడుదలకు ముందే లీకైన జిమ్నీ ధరలు - ఇలా ఉన్నాయి
మారుతి సుజుకి తన 5 డోర్స్ జిమ్నీ SUVని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి ఎక్కువ మంది దీని కొనుగోలుకు వేచి చూస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిమ్నీ మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించగలిగింది. కాగా ఈ ఆఫ్ రోడర్ ధరలు విడుదలకు ముందే వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. దేశీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి గట్టి పోటీ ఇవ్వడానికి వస్తున్న మారుతి జిమ్నీ త్వరలోనే అధికారికంగా విడుదలకానుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన ఈ ఎస్యువి ధరలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. షాన్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం, మారుతి సుజుకి జిమ్నీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) అని తెలుస్తోంది. అయితే అధికారిక ధరలను కంపెనీ లాంచ్ సమయంలో ప్రకటిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మారుతి జిమ్నీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. ఇది K15B పెట్రోల్ ఇంజన్ కలిగి 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. -
అప్పుడే మొదలైన 'టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ' బుకింగ్స్ - పూర్తి వివరాలు
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు తన ఆల్ట్రోజ్ సిఎన్జీ కోసం రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాగా డెలివరీలు 2023 మే నాటికి ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & డిజైన్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి XE, XM+, XZ , XZ+. ఇది మొదటిసారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండే ఈ మోడల్ 'iCNG' బ్యాడ్జ్ పొందుతుంది. తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బూట్లో సిఎన్జి ట్యాంక్స్ ఉంటాయి. ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, వాయిస్-యాక్టివేటెడ్ సన్‌రూఫ్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథెరెట్ సీట్లు, రియర్ AC వెంట్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటివి ఉంటాయి. అంచనా ధర: దేశీయ విఫణిలో ఆల్ట్రోజ్ సిఎన్జీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ప్రస్తుతం పెట్రోల్ మాన్యువల్ ధరలు రూ. 6.45 లక్షల నుంచి రూ. 9.10 లక్షల మధ్య ఉన్నాయి. కావున ఆల్ట్రోజ్ సిఎన్జీ ధరలు దాని కంటే రూ. 90వేలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నాము. పవర్‌ట్రెయిన్: ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్, త్రీ-సిలిండర్ ఇంజన్ కలిగి సిఎన్జీ మోడ్‌లో 77 హెచ్‌పి పవర్ 97 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 86 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున మంచి పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము. సేఫ్టీ ఫీచర్స్: టాటా మోటార్స్ ఇతర వాహనాలలో మాదిరిగానే ఆల్ట్రోజ్ సిఎన్జీలో కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ అందిస్తుంది. కావున ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?
ఎంజీ మోటార్స్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి ఉత్పత్తులను ప్రవేశపెట్టి మంచి ఆదరణ పొందగలిగింది. కేవలం ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా చరిత్ర తిరగరాసిన ఈ కంపెనీ త్వరలో ఓ బుజ్జి ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ లాంచ్ డేట్, రేంజ్, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: ఎంజీ మోటార్ ఇండియా ఈ నెల 26న (2023 ఏప్రిల్ 26) దేశీయ మార్కెట్లో 'కామెట్ ఈవీ' (Comet EV) విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ సమయంలో ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడిస్తుంది, ఆ తరువాత అన్ని వేరియంట్స్ ధరలను మే నాటికి వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే భారతదేశంలో అమ్మకానికి ఉన్న 'సిట్రోయెన్ సి3'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. అంచనా ధరలు: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్న కారుని విడుదల చేయనుంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుందని అంచనా. అయితే ధరలు అధికారికంగా వెల్లడికాలేదు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?) డిజైన్: ఈ చిన్న కారు చూడగానే ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుంది. కావున ఇది ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కార్లకంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం రెండు డోర్స్ కలిగి మంచి కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇప్పటికే వెల్లడైన కొన్ని ఫోటోల ద్వారా ఈ కారు డిజైన్ చూడవచ్చు. ఫీచర్స్: ఆధునిక కాలంలో విడుదలవుతున్న దాదాపు అన్ని కార్లు లగ్జరీ ఫీచర్స్ పొందుతాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంజి కామెట్ ఈవీ సరసమైన ధర వద్ద లభించే మంచి ఫీచర్స్ కలిగిన కారు కావడం విశేషం. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. అంతే కాకుండా రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ కలిగిన, నాలుగు-సీట్ల కారు ఈ కామెట్ ఈవీ. కార్ టెక్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, డ్రైవ్ మోడ్స్, వాయిస్ కమాండ్ వంటివి ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) బ్యాటరీ ప్యాక్ & రేంజ్: త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీకి సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు, కానీ ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ ఏప్రిల్ 26 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. -
భారత్‌లో విడుదలైన జపనీస్ బ్రాండ్ కారు: ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న అన్యదేశ బ్రాండ్ కార్లలో లెక్సస్ (Lexus) ఒకటి. ఈ జపనీస్ కంపెనీ ఎట్టకేలకు ఓ కొత్త హైబ్రిడ్ కారు 'ఆర్ఎక్స్' SUVని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధర: భారతీయ విఫణిలో విడుదలైన కొత్త లెక్సస్ నిజానికి 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసింది. కాగా ఇప్పుడు మార్కెట్లో అధికారికంగా అడుగెట్టింది. ఈ కొత్త లెక్సస్ ఆర్ఎక్స్350హెచ్ లగ్జరీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 95.80 లక్షలు. అదే సమయంలో హై పర్ఫామెన్స్ అందించే RX500h F-Sport+ ధర రూ. 1.18 కోట్ల వరకు ఉంటుంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా). డిజైన్: 2023 లెక్సస్ RX మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో భాగంగానే ఈ లగ్జరీ ఎస్యువి స్పిండిల్ బాడీ డిజైన్ కలిగి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునికంగా ఉంటుంది. ఈ కారు పరిమాణం విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 4890 మిమీ, వెడల్పు 1920 మిమీ, ఎత్తు 2850 మిమీ కలిగి 2850 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) ఇంటీరియర్ ఫీచర్స్: కొత్త లెక్సస్ ఆర్ఎక్స్ 14-ఇంచెస్ టచ్‌స్క్రీన్ కలిగి.. వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో వైర్లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటాయి. ఇంటీరియర్ బ్లాక్, డార్క్ సెపియా, సోలిస్ వైట్ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇంజిన్ & పర్ఫామెన్స్: 2023 లెక్సస్ RX రెండు ఇంజిన్ల ఎంపికను పొందుతుంది. అవి CVTతో జతచేసిన 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (RX350h లగ్జరీ). ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 250 హెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఇక RX500h F-Sport+ విషయానికి వస్తే.. ఇందులో 2.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 371 హెచ్‌పి పవర్ మరియు 460 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ లగ్జరీ కారు గంటకు 210 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త లెక్సస్ ఆర్ఎక్స్ కారు జర్మన్ లగ్జరీ కారు అయిన మెర్సిడెస్ బెంజ్ GLE, బిఎండబ్ల్యు ఎక్స్5, రేంజ్ రోవర్ వెలార్, జాగ్వార్ ఎఫ్-పేస్, ఆడి క్యూ7 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?
సౌత్ ఇండియా స్టార్ హీరోలు, కేరళకు చెందిన తండ్రీకొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్‌లకు కార్లంటే అమితమైన మోజు. వారి వద్ద పలు ప్రత్యేకమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. వారికి '0369 గ్యారేజ్' పేరుతో ప్రత్యేక కార్ల కలెక్షన్ ఉంది. అందులో కార్లన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్ 0369. తాజాగా ఈ గ్యారేజీకి సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు చేరింది. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) GLS 600 అనేది మెర్సిడెస్ బెంజ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ. ఈ కారు కంపెనీ అల్ట్రా-లగ్జరీ విభాగమైన మెర్సిడెస్-మేబ్యాక్ కిందకు వస్తుంది. 0369 గ్యారేజ్‌లోకి చేసిన GLS 600 మమ్మద్ కుట్టి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇది మమ్ముట్టి అసలు పేరు. మమ్ముట్టి కుమారుడు యువ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్ కలర్ GLS 600 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో కనిపించింది. ఇది కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసిన మొదటి మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు. తన అన్ని కార్ల మాదిరిగానే ఈ కారును కూడా మమ్ముట్టి 0369 నంబర్‌తో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ప్రత్యేక నంబర్ కోసం రూ.1.85 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇక మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు ధర సుమారు రూ. 2.92 కోట్లు (భారత్‌లో ఎక్స్-షోరూమ్ ధర). దక్షిణ భారతదేశం నుంచి ఈ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారును కొన్న రెండో సినీ నటుడు దుల్కర్ సల్మాన్. ఇతని కంటే ముందు తెలుగు హీరో రామ్ చరణ్ 2022లోనే ఈ కారును కొన్నారు. వీరితో పాటు అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, శిల్పా శెట్టితో సహా మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ కార్ కలెక్షన్లకు ఈ GLS 600ని జోడించారు. -
సిట్రోయెన్ సి3 టాప్ ఎండ్ మోడల్ లాంచ్ - విశేషాలు!
భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ కంపెనీ తన సి3 హ్యాచ్‌బ్యాక్‌లో టాప్ వేరియంట్ అయిన 'షైన్' విడుదల చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న లైవ్, ఫీల్ వేరియంట్ల కంటే దీని ధర ఎక్కువగా ఉంది. ఈ కొత్త వేరియంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ధర: మార్కెట్లో విడుదలైన కొత్త సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ టాప్-స్పెక్ ట్రిమ్ షైన్ ధర రూ. 7.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది లైవ్ అండ్ ఫీల్ ట్రిమ్‌లలో లేని అనేక ఫీచర్లను పొందుతుంది, కావున ఈ కారు ధర దాని మునుపటి మోడల్స్ కంటే రూ. 12,000 ఎక్కువ. డిజైన్ & ఫీచర్స్: చూడటానికి సిట్రోయెన్ సి3 దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగా కనిపించినప్పటికీ కొంత అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, రియర్ పార్కింగ్ కెమెరా, మ్యాన్యువల్ డే/నైట్ రియర్ వ్యూ మిర్రర్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ వంటి వాటిని చూడవచ్చు. అంతే కాకూండా రియర్ వైపర్, వాషర్, డీఫాగర్ ఉన్నాయి.ఇవి ప్రస్తుతం C3 షైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. లైవ్ అండ్ ఫీల్ ట్రిమ్‌లలో మాదిరిగా కాకుండా షైన్ వేరియంట్ 15 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్స్ పొందుతుంది. ఆదిమాత్రమే కాకుండా C3 ఇప్పుడు దాదాపు 35 కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉన్న My Citroen Connect యాప్ కూడా పొందుతుంది. 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటివి ప్రామాణికంగా అందుబాటులో ఉంటాయి. పవర్‌ట్రెయిన్స్: కొత్త సిట్రోయెన్ సి3 షైన్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 82 బిహెచ్పి పవర్ & 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న సిట్రోయెన్ సి3 ఇకపై షైన్ వేరియంట్లో లభిస్తుంది. కావున సి3 అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ లేటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ టాటా పంచ్, మారుతి సుజుకి ఇగ్నిస్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. -
భారత్‌లో విడుదలైన ఇటాలియన్ సూపర్ కారు - ధర అక్షరాలా..
Lamborghini Urus S: ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని 2022లో 'ఉరుస్ ఎస్' (Urus S) SUV గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన తరువాత ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి అంతకంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. ధర: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ ఎస్యువి ధర రూ. 4.18 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ఉరుస్ పెర్ఫార్మంటే కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉరుస్ లైనప్‌లో ఉన్న రెండవ మోడల్. డిజైన్ & ఫీచర్స్: లంబోర్ఘిని ఉరుస్ ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇది కొత్త బంపర్, కూలింగ్ వెంట్స్‌తో కూడిన కొత్త బానెట్‌తో కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందుతుంది. కానీ బయట కనిపించే కార్బన్-ఫైబర్ బానెట్, కార్బన్-ఫైబర్ రూఫ్ మాత్రం పెర్ఫార్మంటే మోడల్ని గుర్తుకు తెస్తుంది. ఫీచర్స్: కొత్త ఉరుస్ ఎస్ లోపలి భాగంలో ఉరుస్ ఎస్ ఉరుస్ పెర్ఫార్మంటే మాదిరిగానే అదే డిజైన్ కలిగి ఉన్నప్పటికీ కొంత విభిన్నమైన మెటీరియల్ చూడవచ్చు. పెర్ఫార్మంటే బ్లాక్ ఆల్కాంటారా ఇంటీరియర్‌ను స్టాండర్డ్‌గా కలిగి చోట ఉరుస్ ఎస్‌లోని ఇంటీరియర్ లెదర్‌ను స్టాండర్డ్‌గా పొందుతుంది. (ఇదీ చదవండి: ChatGPT: మీరు చేసే ఈ ఒక్క పని మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తుంది.. డోంట్ మిస్!) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ సూపర్ SUV 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది 666 హెచ్‌పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ సూపర్ కారు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ చేస్తుంది. ఉరుస్ ఎస్కి శక్తినివ్వడం ఉరుస్ పెర్ఫార్మంటే వలె అదే 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8, 666hp మరియు 850Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఉరుస్ పెర్ఫార్మంటే క్లెయిమ్ చేయబడిన 3.3 సెకన్లలో గంటకు 0-100కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు, ఉరుస్ ఎస్ దానిని 3.5 సెకన్లలో (క్లెయిమ్ చేయబడింది) నిర్వహిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు పంపబడుతుంది. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ జర్మన్ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్, ఆడి RSQ8, ఆస్టన్ మార్టిన్ DBX 707, పోర్స్చే కయెన్ టర్బో జిటి, మసెరటి లెవాంటే ట్రోఫియో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
భారత్‌లో విడుదలైన రూ. 3.30 కోట్ల జర్మన్ లగ్జరీ కారు - పూర్తి వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లో కొత్త కారు 'ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్' (AMG GT 63 S E Performance) లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్, పర్ఫామెన్స్ వంటి విషయాలతో పాటు ధరల గురించి కూడా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ విఫణిలో విడుదలైన కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ ధర రూ. 3.30 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది AMG పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్షిప్ మోడల్‌గా నిలుస్తుంది. ఇది 2021లోనే గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. అయితే ఇప్పటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్: కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ చూడగానే ఆకర్శించే అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది కొత్త ఎగ్జాస్ట్ అవుట్లెట్లు కలిగి, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఉండటం కూడా మీరు గమనించవచ్చు. బ్యాడ్జింగ్ కొత్త ట్విన్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్ వంటివి మరింత అట్రాక్టివ్‌గా ఉంటాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) ఫీచర్స్: ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ డ్యాష్‌బోర్డ్‌లో 12.4 ఇంచెస్ డ్యూయెల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో బకెట్ సీట్లు, AMG స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్లు వంటి లగ్జరీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలను ఈ డిస్ప్లేల ద్వారా చూడవచ్చు. ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ కారు 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ పొందుతుంది. ఇది 639 హెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 204 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ రెండు కలయికతో 843 హెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే టార్క్ 1,470 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గంటకు 316 కిలోమీటర్లు. ఈ సూపర్ సెడాన్‌లో 6.1kWh, 400V బ్యాటరీ ప్యాక్‌తో కేవలం 89 కేజీల బరువుతో ఉంటుంది. ఇది మోటారుకు శక్తినిస్తుంది. దీని పరిధి 12 కిమీ వరకు వస్తుంది. కానీ EV మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 12 కిలోమీటర్లు. ఇందులో ఏడు డ్రైవ్ మోడ్లు & ఫోర్ లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్అందుబాటులో ఉంటుంది. రెండోది కొన్ని పరిస్థితులలో వన్-పెడల్ డ్రైవింగ్‌ను కూడా అనుమతిస్తుంది. -
ఫోర్స్ మోటార్స్ కొత్త ఎమ్‌పివి లాంచ్ - ధర ఎంతంటే?
ఇప్పటి వరకు 5 సీటర్, 7 సీటర్ కార్లను గురించి చాలానే విని ఉంటారు. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో 10 సీటర్ విడుదలైంది. ఫోర్స్ మోటార్స్ విడుదల చేసిన ఈ కారు ఏకంగా 13మంది ప్రయాణించడానికి అనుమతిస్తుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కొత్త MPV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర: భారతదేశంలో విడుదలైన కొత్త 'ఫోర్స్ సిటీలైన్' (Force Citiline) 10-సీటర్ ధర రూ. 15.93 లక్షలు. ఈ ఎంపివి మూడవ వరుసలో సైడ్-ఫేసింగ్ జంప్ సీట్లకు బదులుగా, ఫ్రంట్ ఫేసింగ్ సీట్లతో వస్తుంది. కావున సులభంగా 13 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. డిజైన్: ఫోర్స్ సిటీలైన్ కొత్త ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది, కొత్త గ్రిల్ పొందుతుంది. ఇది బాడీ కలర్ ప్యానల్ కలిగి డోర్ హ్యాండిల్స్, ORVM వంటివి బ్లాక్ కలర్లో పూర్తిచేసి ఉండటం గమనించవచ్చు. ఈ 10 సీటర్ మోడల్ 2+3+2+3 సీటింగ్ లేఅవుట్లో ఫ్రంట్ ఫేసింగ్ సీట్లను అందిస్తుంది. మూడు, నాలుగవ వరుసలోకి వెళ్ళడానికి, బయటకి రావడానికి అనుకూలంగా రెండవ-వరుసలో 60:40 స్ప్లిట్ బకెట్ సీట్లు లభిస్తాయి. ఫీచర్స్: భారతీయ మార్కెట్లో 10 సీటర్ కార్లు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి, కానీ పెద్ద ఫ్యామిలీలు ఒకేసారి జర్నీ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ ఎంపివి ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పవర్ స్టీరింగ్, ముందు & వెనుక ప్రయాణీకులకు ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్, ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) ఇంజిన్: ఫోర్స్ సిటీలైన్ 10 సీటర్ మెర్సిడెస్-బెంజ్-సోర్స్డ్ FM 2.6 CR టర్బో డీజిల్ ఇంజన్ కలిగి, 90 బిహెచ్పి పవర్ & 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. -
కొత్త కారు కొన్న తీన్మార్ బ్యూటీ.. ధర ఎంతో తెలుసా?
హిందీ, కన్నడ భాషలతో పాటు తెలుగులో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన 'కృతి ఖర్బందా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో బోణి చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈమె పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో కూడా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఖరీదైన ఒక రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, కృతి ఖర్బందా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ వెలార్ ధర సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు వైట్ కలర్లో చూడచక్కగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేంజ్ రోవర్ వెలార్ ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఒకటి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే కృతి డీజిల్ కారుని కొన్నట్లు సమాచారం. ఈ ఇంజిన్ 204 పీఎస్ పవర్ 430 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా పవర్ డెలివరీ చేస్తుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటి వాటితో పాటు.. 3D 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, PM2.5 ఎయిర్ ఫిల్టర్, 12 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 14 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు కలిగి వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. రేంజ్ రోవర్ వెలార్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇది భారతీయ విఫణిలో కూడా త్వరలో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు మార్కెట్లో మెర్సిడెస్ GLE, ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, పోర్స్చే మకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
లగ్జరీ కారు కొన్న సురేఖవాణి కూతురు.. సెలబ్రేషన్స్‌తో రచ్చ
నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. చేతిలో సినిమా ఆఫర్లు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. వయసు పెరుగుతున్నా మరింత గ్లామర్‌గా తయారవుతున్న సురేఖవాణి కూతురు సుప్రీతతో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టిపొట్టి బట్టలతో గ్లామర్ ఫోటోలను తరచూ షేర్ చేస్తుంటారు. పార్టీలు, పబ్స్, వెకేషన్స్‌కు అంటూ తల్లీకూతుళ్లు కలిసే తిరుగుగూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. తాజాగా సురేఖవాణి కూతురు సుప్రీత కొత్త కారు కొనేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్చేస్తూ.. మంచి విషయాలు జరగడానికి కొంచెం టైం పడుతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సుప్రీతకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) -
మార్కెట్లో కియా నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ ఇప్పుడు 'లగ్జరీ (ఓ)' వెర్షన్ రూపంలో విడుదలైంది. ఈ లేటెస్ట్ కారు చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ధరలు, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ధరలు రూ. 17 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ కారు రియల్ డ్రైవ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతుంది, కావున డెలివరీలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!) కియా కారెన్స్ లగ్జరీ వేరియంట్ మాన్యువల్ వెర్షన్ అమ్మకానికి లేదు, ఇది కేవలం 7-సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎంచుకున్న డ్రైవ్ మోడ్ వంటివి మారుతాయి. ఇప్పటికే ఉన్న లగ్జరీ ట్రిమ్ మాత్రమే 6 సీటర్‌గా లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్: కియా కారెన్స్ లగ్జరీ (ఓ) డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో 16 ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్స్ చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో లెదర్డ్ స్టీరింగ్ వీల్, రెండవ వరుసలలో కూల్డ్ కప్హోల్డర్లు, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు నాలుగు స్పీకర్లు, ఐదు USB C-టైప్ ఛార్జర్ వంటివి పొందుతుంది. అన్ని సీట్లు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు కలిగి ఉంటాయి. సేఫ్టీ ఫీచర్స్: కొత్త కియా కారెన్స్ ఇతర అన్ని మోడల్స్ మాదిరిగానే డ్రైవర్, ప్యాసింజర్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి కావున వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రత లభిస్తుంది. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ కియా కారెన్స్ లగ్జరీ (ఓ) ట్రిమ్ కేవలం ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో మాన్యువల్ ఆప్షన్ లేదు. కావున ఇందులోని 1.5 లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ DCTతో 160 హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ కలిగి 116 హెచ్‌పి పవర్ అందిస్తుంది. (ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా కారెన్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ధరల పరంగా కారెన్స్ ఎక్కువ అయినప్పటికీ ఆధునిక ఫీచర్స్, శక్తివంతమైన ఇంజిన్ లభిస్తాయి. -
మహీంద్రా థార్ ప్రత్యర్థికి క్రేజు మామూలుగా లేదు! విడుదలకు ముందే..
మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో కొత్త జిమ్నీ ఎస్‌యువిని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఆఫ్ రోడర్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కాకముందే ఇటీవల డీలర్ యార్డ్‌లో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ కోసం మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న జిమ్నీ 3-డోర్స్ ఎడిషన్, ఇండియన్ మార్కెట్లో 5-డోర్స్ వెర్షన్ రూపంలో విడుదలకానుంది. ఈ SUV ఆటో ఎక్స్పో 2023లో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచింది. అదే సమయంలో కంపెనీ ఈ కారు కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డీలర్ యార్డ్‌లో కొత్త మారుతి జిమ్నీ, స్విఫ్ట్ పక్కన పార్క్ చేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే 18,000 బుకింగ్స్ పొందిన ఈ కారు నెక్సా షోరూమ్‌లలో కస్టమర్ల సందర్శనార్థం ప్రదర్శించారు. డెలివరీలు ఈ నెల చివరిలో లేదా మే ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..) డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మారుతి జిమ్నీ పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంది. దీని పొడవు 3,985 మిమీ, 1,720 వెడల్పు, వీల్‌బేస్ 2,590 మిమీ వరకు ఉంటుంది. కావున ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. త్వరలో విడుదలకానున్న మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్ కలిగి 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. (ఇదీ చదవండి: మళ్ళీ పెరిగిన అమూల్ పాల ధరలు: ఈ సారి ఎంతంటే?) జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 9.99 లక్షల ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా కంపెనీ ఈ ఎస్యువి డెలివరీలను వేగవంతం చేయడానికి సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!
భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి అత్యధిక అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మహీంద్రా థార్' (Mahindra Thar) త్వరలో మరో కొత్త వేరియంట్లో విడుదలకానుంది. ఇది థార్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ అని సమాచారం. ఇది భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనున్న మారుతీ సుజుకీ జిమ్నీకి ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశం ఉంటుంది. మహీంద్రా కంపెనీ 2020లో థార్ SUVని లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారీ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరిస్తూనే ఉంది. అయితే కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా తన థార్ ఎస్‌యువిలో నిరంతరం అప్డేట్స్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే థార్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ కూడా విడుదలైంది. ఇప్పటికి వెల్లడైన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవెల్ 4X4 థార్ వేరియంట్‌ను కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది. ఇది బేస్ లెవెల్ ఏఎక్స్ మోడల్ మాదిరిగా ఉండే అవకాశం ఉంది. కావున ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందనుంది. అయితే ఈ ఇంజిన్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి మాత్రమే పరిమితమవుతాయి. (ఇదీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..) మహీంద్రా విడుదల చేయనున్న థార్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఎక్కువ ఫీచర్స్ పొందే అవకాశం లేదు. కావున ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 13.59 లక్షల కంటే తక్కువ ఉండవచ్చు. మహీంద్రా థార్ SUV మారుతీ జిమ్నీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. మార్కెట్లో ఆఫ్ రోడ్ కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా వాటి అమ్మకాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే అమ్మకాల పరంగా జిమ్నీకి మహీంద్రా థార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. మారుతి సుజుకి తన జిమ్నీ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 9.5 లక్షల కంటే తక్కువ ఉండవచ్చు. -
మారుతి జిమ్నీ డెలివరీలు అప్పుడే!
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో త్వరలో జిమ్నీ SUVని అధికారికంగా విడుదల చేయనుంది, ఇప్పటికే ఈ కొత్త మోడల్ కోసం 23,500 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి. కాగా ఎంపిక చేసిన నెక్సా అవుట్లెట్లలో ఈ కొత్త కారు డిస్ప్లే కూడా ప్రారంభమైంది. త్వరలో మరిన్ని అవుట్లెట్లలో దర్శనమిచ్చే అవకాశం ఉంది. 2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన జిమ్నీ మే నెలలో విక్రయానికి రానున్నట్లు సమాచారం, కానీ అంతకంటే ముందు ఏప్రిల్ 7 నుంచి భారతదేశంలో మరికొన్ని నగరాల్లోని డీలర్‌షిప్‌లలో కనిపించనుంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ NCR, అహ్మదాబాద్, చండీగఢ్, మొహాలి, లూథియానా, రాయ్‌పూర్, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రదర్శన మొదలైపోయింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు అక్కడ జిమ్నీ కారుని పరిశీలించవచ్చు. మారుతి జిమ్నీ ఉత్పత్తి గురుగ్రామ్ ప్లాంట్‌లో జరుగుతుంది. ఇక్కడ నుంచే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విక్రయించనుంది. కంపెనీ సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ప్రతి నెల 7,000 యూనిట్లను భారతీయ మార్కెట్లో, మిగిలినవాటిని విదేశీయ మార్కెట్లో విక్రయించనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..) మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్స్‌లో విడుదలకానుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌తో 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్యువి ధరలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 12 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము. -
భారత్‌లో బీఎండబ్ల్యూ హవా: మళ్ళీ కొత్త కారు లాంచ్
జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యు దేశీయ మార్కెట్లో 2023 ప్రారంభం నుంచి కొత్త కార్లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కారుని లాంచ్ చేసింది. ఇది ఎక్స్3 లైనప్‌లో చేరిన కొత్త వేరియంట్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ధర: భారతదేశంలో విడుదలైన కొత్త బీఎండబ్ల్యు ఎక్స్3 20డి ఎక్స్లైన్ (BMW X3 20d xLine) ధర రూ. 67.5 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లగ్జరీ కారు ధర దాని మునుపటి అవుట్గోయింగ్ లగ్జరీ ఎడిషన్ ఎక్స్3 కంటే రూ. 20,000 ఎక్కువ. డిజైన్: బీఎండబ్ల్యు ఎక్స్3 ఎక్స్లైన్ కిడ్నీ గ్రిల్‌తో మునుపటి అదే స్టైలింగ్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్, వెనుక భాగం మొత్తం విస్తరించి ఉండే టెయిల్ లైట్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఎక్స్టీరియర్ లైన్స్, రూఫ్ రైల్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: భారత్‌లో మసెరటి రూ. 3.69 కోట్ల సూపర్‌కార్ విడుదల - పూర్తి వివరాలు) ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్3 ఎక్స్లైన్ 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ కలిగి హెడ్స్-అప్ డిస్ప్లే, 3D వ్యూ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్-కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ & పనితీరు: కొత్త BMW X3 మోడల్ 2-లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 హెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కావున పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది. తద్వారా అద్భుతమైన పనితీరు లభిస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 213 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి: బంగారం నుంచి మొబైల్స్ వరకు!) ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త బిఎండబ్ల్యు ఎక్స్3 కారు వోల్వో ఎక్స్‌సి60, ఆడి క్యూ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీని తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ కొత్త లగ్జరీ కారు కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్సన్లో మాత్రమే లభిస్తుంది. -
Maserati MC20: భారత్‌లో రూ. 3.69 కోట్ల సూపర్‌కార్ విడుదల - పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో SUV, MPV వంటి కార్లకు మాత్రమే కాకుండా లగ్జరీ కార్లకు, సూపర్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బెంజ్, ఆడి, మసెరటి కంపెనీలు కొత్త ఉత్పత్తులను కూడా దేశీయ విఫణిలో విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మసెరటి ఇటీవల MC20 సూపర్‌కార్ లాంచ్ చేసింది. ధర: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'మసెరటి ఎమ్‌సి20' సూపర్‌కార్ ధర అక్షరాలా రూ. 3.69 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). 2021 జులై నాటి నుంచి కంపెనీ ఈ ఆధునిక కారుని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉంది. కాగా ఎట్టకేలకు ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. డెలివరీలు 2023 మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: జీవితాన్ని మార్చేసిన బొమ్మల వ్యాపారం: గార్డు నుంచి బిజినెస్ మ్యాన్‌గా..) డిజైన్: చాలా సంవత్సరాల తరువాత దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త సూపర్‌కార్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంది. ఇది దాని మునుపటి MC12 నుంచి ప్రేరణ పొందటం వల్ల ట్రెడిషినల్ స్పోర్ట్స్ కూపే సిల్హౌట్ పొందుతుంది. ఇందులోని ఫ్లోయింగ్ లైన్స్, ఏరోడైనమిక్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. డోర్ సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్: మసెరటి ఎమ్‌సి20 సూపర్‌కార్ లోపలి భాగంలో కార్బన్ ఫైబర్ అల్కాంటారాతో కప్పబడి ఉంటుంది. ఇందులో 10 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటాయి. అంతే కాకుండా వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ హోల్డర్, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, కార్బన్ ఫైబర్-కవర్డ్ సెంట్రల్ కన్సోల్‌లో డ్రైవ్ మోడ్ సెలెక్టర్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎమ్ఆర్పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త మసెరటి ఎమ్‌సి20 కారు 3 లీటర్ వి6 ఇంజిన్ కలిగి కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఇంజిన్ 630 హెచ్‌పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ సుమారు 1,500 కేజీల బరువు కలిగిన ఈ సూపర్‌కార్ గరిష్ట వేగం గంటకు 325కిమీ. ప్రత్యర్థులు & త్వరలో విడుదలకానున్న మసెరటి కార్లు: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మసెరటి ఎమ్‌సి20 కారు పోర్స్చే 911 టర్బో ఎస్, లంబోర్ఘిని హురాకాన్, ఫెరారీ 296 జీటీబీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. రానున్న రోజుల్లో కంపెనీ కన్వర్టిబుల్ వెర్షన్, MC20 సీఏలో కార్లను విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. కానీ ఇవి ఎప్పుడు విడుదలవుతాయనే దానికి సంబంధించిన అధికారిక సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. -
భారత్‌లో స్కోడా కుషాక్ కొత్త ఎడిషన్ లాంచ్ - పూర్తి వివరాలు
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. స్లావియా, ఆక్టావియా అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న సంస్థ ఇప్పుడు కుషాక్ న్యూ ఎడిషన్ 'ఒనిక్స్' (Onyx) విడుదల చేసింది. దీని గురించి మరిన్ని ఈ కథనంలో చూసేద్దాం.. ధర: భారతీయ విఫణిలో విడుదలైన కుషాక్ ఒనిక్స్ ఎడిషన్ ధర రూ. 12.39 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ బేస్ మోడల్ కంటే రూ. 80,000 ఎక్కువ. ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న కుషాక్ యాక్టివ్, యాంబిషన్ ట్రిమ్‌ల మధ్యలో ఉంటుంది. ఎక్ట్సీరియర్ ఫీచర్స్: ఒనిక్స్ ఎడిషన్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. డోర్లపై స్టైలైజ్డ్ గ్రే గ్రాఫిక్స్, B-పిల్లర్‌పై 'ఓనిక్స్' బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఫ్రంట్ బంపర్‌పై ఫాక్స్ డిఫ్యూజర్, ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ సరౌండ్, సైడ్ ప్రొఫైల్‌లో 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్: లోపలి భాగంలో 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్, 6 స్పీకర్ ఆడియో సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, హెడ్రెస్ట్లపై ఒనిక్స్ బ్యాడ్జింగ్, బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ కలర్ థీమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫైయర్తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: ఇంజిన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ కుషాక్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందినప్పటికీ ఒనిక్స్ ఎడిషన్ మాత్రం 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 114 బీహెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడుతుంది. సేఫ్టీ ఫీచర్స్: భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన వాహనాల జాబితాలో ఒకటి కుషాక్. కావున ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ పాయింట్ సీట్‌బెల్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX ఎంకరేజ్ వంటివి ఉంటాయి. ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త ఒనిక్స్ ఎడిషన్ మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
దూసుకెళ్తున్న కొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్స్: ఇప్పటికే..
2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన కొత్త హ్యుందాయ్ వెర్నా ఇటీవలే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. కంపెనీ ఈ సెడాన్ కోసం గత నెలలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పటికి ఈ కొత్త మోడల్ కోసం ఎనిమిది వేల కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. 2023 వెర్నా బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లించి హ్యుందాయ్ డీలర్షిప్ ద్వారా లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో లొకేషన్, బుక్ చేసుకునే వేరియంట్ ఆధారంగా వెయిటింగ్ పీరియడ్ సుమారు రెండు నెలల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT)తో వచ్చే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డిసిటి కలిగిన 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఇవి రెండూ ఉత్తమమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కొత్త హ్యుందాయ్ వెర్నా డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అప్డేట్ పొందింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దేశీయ విఫణిలో హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న ఈ సెడాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన 2023 హ్యుందాయ్ వెర్నా: పూర్తి వివరాలు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా బ్రాండ్ 'హ్యుందాయ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో తన '2023 వెర్నా' (2023 Verna) లాంచ్ చేసింది. ఈ కొత్త సెడాన్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు, వేరియంట్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు ధరలు & బుకింగ్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ వెర్నా నాలుగు వేరియంట్లలో విడుదలైంది. అవి EX, S, SX, SX(O). ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ సెడాన్ కోసం ఇప్పటికే రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ కూడా 8,000 దాటినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. డిజైన్ & కలర్ ఆప్సన్స్: కొత్త హ్యుందాయ్ వెర్నా మొత్తం ఏడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అవి టైఫూన్ సిల్వర్, ఫైరీ రెడ్, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్ కలర్స్. డిజైన్ విషయానికి వస్తే, 2023 హ్యుందాయ్ వెర్నా సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించబడింది. కావున ఇందులో విస్తృతంగా ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్లాంప్, వెడల్పు అంతటా వ్యాపించి ఉండే డిఆర్ఎల్, కలిగి డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌పై క్రోమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. వెనుక వైపు పారామెట్రిక్ కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 2023 వెర్నా పరిమాణం పరంగా కూడా దాని ప్రత్యర్థుల కంటే పెద్దదిగా ఉంటుంది. దీని పొడవు 1,765, వెడల్పు 1765 మిమీ, వీల్‌బేస్ 2670 మిమీ ఉంటుంది. కావున ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. (ఇదీ చదవండి: వేల కోట్ల కంపెనీకి బాస్ 'జయంతి చౌహాన్' గురించి ఆసక్తికర విషయాలు) ఇంటీరియర్ ఫీచర్స్: హ్యుందాయ్ వెర్నా డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌లపై డ్యూయల్ టోన్ బేజ్-బ్లాక్ కలర్ సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది 64 కలర్ యాంబియంట్ లైటింగ్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో క్లైమేట్ కంట్రోల్ నాబ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి లేటెస్ట్ ఫీచర్లతో పాటు 2 స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. లేటెస్ట్ వెర్నా ఆడియో అండ్ నావిగేషన్ కోసం 10.25 ఇంచెస్ కలర్ TFT MID ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వాలెట్ మోడ్ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది హిందీ, ఇంగ్లీష్ మిక్స్‌లో వాయిస్ కమాండ్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు.. పెళ్లి కోసం కూడా!) ఇంజిన్ & మైలేజ్: భారతీయ విఫణిలో అడుగుపెట్టిన సరికొత్త హ్యుందాయ్ వెర్నా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో 1.5l MPi పెట్రోల్ ఇంజన్ 115 హెచ్‌పి పవర్, 143.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ & ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ IVTతో లభిస్తుంది. ఇది 18.6 కిమీ/లీ (MT), 19.6 కిమీ/లీ (IVT) అందిస్తుంది. ఇక రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ విషయానికి వస్తే, ఇది 160హెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ప్యాడిల్ షిఫ్టర్లతో కూడిన 7 స్పీడ్ DCTతో జతచేయబడి ఉంటుంది. ఇది 20 కిమీ/లీ(MT), 20.6 కిమీ/లీ (DCT) మైలేజ్ అందిస్తుంది. (ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు) సేఫ్టీ ఫీచర్స్: హ్యుందాయ్ వెర్నా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, నాలుగు డిస్క్ బ్రేక్‌లు వంటి భద్రతా ఫీచర్లతో పాటు ఆధునిక ADAS సిస్టం కూడా పొందుతుంది. కావున ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, స్మార్ట్ క్రూయిస్ కంట్రోల్, లేన్ కీప్ వార్నింగ్, అసిస్ట్ బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ప్రత్యర్థులు: ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో విడుదలైన కొత్త హ్యుందాయ్ వెర్నా దేశీయ మార్కెట్లో హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ సెడాన్ మీద 3 సంవత్సరాల అపరిమిత కిమీ వారంటీ అందిస్తుంది.