ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ భారతదేశంలో 'ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్' కారును లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్లస్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.23 లక్షల నుంచి రూ. 14.79 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇది దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎయిర్‌క్రాస్ హుడ్ గార్నిష్, బాడీ డీకాల్స్ వంటివి ఉన్నాయి. లోపల వెనుక సీట్లు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం డిస్‌ప్లే కూడా ఉంటుంది. డాష్ కెమెరా, ఫుట్‌వెల్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్‌లు కూడా ఇందులో గమనించవచ్చు.
ఇదీ చదవండి: లక్షల ఖరీదైన బైకులు: మరింత కొత్తగా..
డిజైన్, ఫీచర్స్ పరంగా అప్డేట్స్ పొందిన ఈ కారు 82 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, 110 హార్స్ పవర్ అందించే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్స్ వరుసగా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment