హోండా కంపెనీ.. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 15.51 లక్షలు. కాగా ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ధరలు రూ. 15.71 లక్షలు (ఎక్స్ షోరూమ్). బ్లాక్ ఎడిషన్ ఎలివేట్ టాప్-ఆఫ్-ది-లైన్ ZX గ్రేడ్ ఆధారంగా తయారైంది. ఇది మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
బ్లాక్ ఎడిషన్ కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్ పొందింది. ఇది బ్లాక్ అల్లాయ్ వీల్స్ & నట్‌లను పొందుతుంది. ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఎగువ గ్రిల్, సిల్వర్ ఫినిషింగ్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్‌లు, లోయర్ డోర్ గార్నిష్.. రూఫ్ రైల్స్‌పై క్రోమ్ యాక్సెంట్‌లను కలిగి ఉంది. వెనుకవైపు ప్రత్యేక 'బ్లాక్ ఎడిషన్' చిహ్నం ఉండటం చూడవచ్చు.
సిగ్నేచర్ ఎడిషన్‌లో ఫ్రంట్ అప్పర్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ గార్నిష్‌లు, రూఫ్ రెయిల్‌లు, డోర్ లోయర్ గార్నిష్ నలుపు రంగులో పూర్తయ్యాయి. ఇది ఫ్రంట్ ఫెండర్‌పై 'సిగ్నేచర్ ఎడిషన్' చిహ్నం ఉంది.
రెండు ఎడిషన్‌లు ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను కలిగి ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్‌లో బ్లాక్ స్టిచింగ్‌తో బ్లాక్ లెథెరెట్ సీట్లు, బ్లాక్ డోర్ ప్యాడ్‌లు, ఆర్మ్‌రెస్ట్‌లు పీవీసీ, ఆల్ బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌తో చుట్టి ఉంటాయి. సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ అదనంగా రిథమిక్ 7 కలర్ యాంబియంట్ లైటింగ్‌ను పొందుతుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెథెరెట్ సీటింగ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కెమెరా బేస్డ్ ఏడీఏఎస్, ఆటో హెడ్‌లైట్లు, వైపర్‌లు, సెమీ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,7.0 ఇంచెస్ TFT డిస్‌ప్లే మాత్రమే కాకుండా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కూడా అదే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 121 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. భారతదేశంలోని హోండా డీలర్‌షిప్‌లలో ఈ కారు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సీవీటీ వేరియంట్ డెలివరీలు జనవరి నుంచి ప్రారంభమవుతాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ డెలివరీలు ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్, ఎంజీ ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా బ్లాక్ ఎడిషన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది హోండా ఎలివేట్ క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, హైరిడర్, కుషాక్, టైగన్ వంటి వాటికి అమ్మకాల పరంగా పోటీ ఇస్తుంది.
హోండా, నిస్సాన్ విలీనం
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది.
Comments
Please login to add a commentAdd a comment