Honda Cars
-
ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు, ఇవే!
వినాయక చవితి, విజయ దశమి, దీపావళి ఇలా.. రానున్నది అసలే పండుగ సీజన్. ఈ సమయంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెలలో (2023 సెప్టెంబర్) విడుదలకానున్న కొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హోండా ఎలివేట్ హోండా కంపెనీ ఈ నెల 4న తన ఎలివేట్ కారుని విడుదల చేయనుంది. మిడ్ సైజ్ విభాగంలో చేరనున్న ఈ SUV చూడటానికి చాలా ఆకర్షణీయంగా అద్భుతమైన డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కూడా ఉండనుంది. 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 121 హార్స్ పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ అండ్ 7 స్టెప్ CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. వోల్వో సీ40 రీఛార్జ్ స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉంది. కావున కంపెనీ త్వరలో సీ40 రీఛార్జ్ కూపే విడుదల చేయనుంది. ఇది XC40 రీఛార్జ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ SUV కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందనుంది. 408 హార్స్ పవర్ అండ్ 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే డ్యూయల్-మోటార్ సెటప్ ఇందులో ఉంటుంది. ఒక సింగిల్ చార్జ్‌తో 418 కిమీ నుంచి 530 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ నెల 14న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయనుంది. ఈ కారు కర్వ్ & హారియర్ స్టైల్ కలిగి పెద్ద స్క్రీన్లు, టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్స్ అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు - టాప్ స్పీడ్ 120 కిమీ/గం మహీంద్రా బొలెరో నియో ప్లస్ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెల చివరలో బొలెరో నియో ప్లస్ విడుదల చేయనుంది. ఇది కంపెనీ మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఇది 7 సీటర్ అండ్ 9 సీటర్ వెర్షన్లలో అందుబాటులోకి రానుంది. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనుంది. 'మహీంద్రా బొలెరో నియో ప్లస్'కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెరగనున్న హోండా కార్ల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా వచ్చే నెల నుంచి సిటీ, అమేజ్ కార్ల ధరలను పెంచనుంది. ముడిసరుకు వ్యయం క్రమంగా అధికం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తాజాగా ప్రకటించింది. అయితే ధర ఎంత పెంచేదీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధర రూ.7.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మధ్యస్థాయి సెడాన్ సిటీ రూ.11.57 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక హైబ్రిడ్ మోడల్ అయిన సిటీ ఈ:హెచ్ఈవీ రూ.18.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న ఎలివేట్ - బుకింగ్స్ ఎప్పుడంటే?
Honda Elevate Bookings: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హోండా ఇండియా' (Honda India) త్వరలోనే 'ఎలివేట్' (Elevate) ఎస్‌యువిని విడుదల చేయడానికి సిద్ధమైంది. కాగా ఇప్పుడు బుకింగ్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడించింది. బుకింగ్స్ & లాంచ్ టైమ్ నివేదికల ప్రకారం, హోండా ఎలివేట్ బుకింగ్స్ 2023 జులై 03 నుంచి ప్రారంభమవుతాయి. రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మిడ్ సైజ్ ఎస్యువి ధరలు ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే అప్పటికి ఈ కారు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది. అంతే కాకుండా ఈ నెల చివరి నాటికి డిస్ప్లే, ఆగష్టు చివరి నాటికి టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & ఇంజిన్ డీటైల్స్ హోండా ఎలివేట్ నాలుగు ట్రిమ్‌లలో విడుదలయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన వివరాలు లాంచ్ నాటికి తెలుస్తాయి. ఎలివేట్ ఎస్యువి 1.5-లీటర్, ఫోర్ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటీ గేర్‌బాక్స్ పొందనుంది. పవర్‌ట్రెయిన్ మాత్రం హోండా సిస్టయి మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. డిజైన్ & ఫీచర్స్ డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. విశాలమైన ఫ్రంట్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ లోగో, హెడ్ లైట్, ఫాగ్ లైట్స్, వంటివి ఇందులో గమనించవచ్చు. ఈ ఎస్యువి 4312 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1650 మిమీ ఎత్తు, 2650 మిమీ వీల్‌బేస్ కలిగి.. 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కావున పరిమాణం పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం!) హోండా ఎలివేట్ సాఫ్ట్ టచ్ ప్యానెల్స్, విశాలమైన సీటింగ్‌తో క్యాబిన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లేన్-వాచ్ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ADAS వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇది సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ను మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - వివో వై36 నుంచి వన్‌ప్లస్ నార్డ్ వరకు..) ప్రత్యర్థులు కొత్త హోండా ఎలివేట్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదలైన కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 12 లక్షల ధర వద్ద విడుదలయ్యే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
హోండా కస్టమర్లకు షాక్.. 13 లక్షల కార్లు వెనక్కి!
Honda Recall: ప్రపంచ మార్కెట్లో వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో అనేక కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ 'హోండా' (Honda) సుమారు 13 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ఎక్కడ ప్రకటించింది? దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, హోండా అమెరికాలోనే 12 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. అంతే కాకుండా కెనడా నుంచి 88,000 & మెక్సికోలో 16,000 కార్ల మీద ఈ ప్రభావం పడినట్లు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) తెలిపింది. ఇందులో 2018 నుంచి 2023 మధ్య నిర్మించిన 'ఒడిస్సి', 2019 నుంచి 2022 మధ్య తయారైన పైలట్, 2019 - 2023 మధ్య విడుదలైన హోండా పాస్‌పోర్ట్ మోడల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో ఎక్కువ అమ్ముడయ్యే కార్లు - ఇక్కడ చూడండి!) రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. లోపభూయిష్టమైన కమ్యూనికేషన్ కోక్సియల్ కేబుల్ కనెక్టర్ కలిగి ఉండటం వల్ల 'రియర్ వ్యూ కెమెరా'లో సమస్య ఏర్పడే అవకాశం ఉండటమే. ఈ సమస్యను తొలగించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది. సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ సంవత్సరాల్లో ఉత్పత్తయిన కార్లు కలిగిన వినియోగదారులు సమస్యను ఈ రీకాల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సమస్య మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ముందుగానే కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడం కోసం రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రీకాల్ భారతదేశంలో ప్రకటించలేదు. -
Honda: ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తి బంద్
గతంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత చాలా కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే 2023 ఏప్రిల్ 01నుంచి బిఎస్6 ఫేజ్-2 రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్చయించాయి. ఇందులో హోండా కంపెనీ కూడా ఉంది. నివేదికల ప్రకారం.. హోండా కంపెనీ ఏప్రిల్ ప్రారంభం నుంచి జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం సిటీ వంటి మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలు క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ల వంటి భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. బిఎస్6 ఫేస్-2 నిబంధనలు కొంత కఠినంగా ఉంటాయి, కావున కంపెనీ ఉత్పత్తులు మరింత పటిష్టంగా తయారవుతాయి, తద్వారా ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ హోండా సిటీ ఐదవ తరం మోడల్, అమేజ్ వంటి వాటిని కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వచ్చే నెల ప్రారంభం నుంచే తమ ఉత్పత్తుల ధరలు రూ. 12,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే బాటలో మరిన్ని కంపెనీలు ముందుకు సాగనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే ఈ ధరల పెరుగుదల వాహనాల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా? లేదా? అనేది త్వరలో తెలియాల్సి ఉంది. -
హాట్ సమ్మర్లో హోండా కార్లపై కూల్ ఆఫర్స్: ఈ నెల చివరి వరకే!
జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా దేశీయ మార్కెట్లో తమ వాహనాల కొనుగోలుమీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో హోండా అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ మోడల్స్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరిలోపు కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. హోండా అమేజ్: హోండా కంపెనీ తన అమేజ్ మోడల్ మీద రూ. 26,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ సెడాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 88.5 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా జాజ్: ఇక హోండా జాజ్ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 8.01 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ మోడల్ మీద కంపెనీ రూ. 15,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 88.5 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డబ్ల్యూఆర్-వీ: హోండా కంపెనీ తన డబ్ల్యూఆర్-వీ మోడల్ మీద రూ. 17,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 9.11 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88.5 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా సిటీ: కంపెనీ పాపులర్ మోడల్ అయిన హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేసే కస్టమర్లు ఈ నెలలో రూ. 17,000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీని ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ 125 హెచ్‌పీ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, ఇక 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 119.35 హెచ్‌పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెలలో పైన తెలిపిన కార్లు కొనుగోలు చేయాలనునే కస్టమర్లు మరింత ఖచ్చితమైన సమాచారం కోసం సమీపంలో ఉన్న కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఇయర్ ఎండ్ ఆఫర్: ఆ కంపెనీ కార్లపై భారీ తగ్గింపు!
ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌గా తమ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్‌ని అందిస్తోంది. ఈ జాబితాలో న్యూ హోండా అమేజ్, జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం హోండా సిటీ, ఐదవ తరం సిటీ వంటి కొన్ని మోడళ్లపై రూ.72,340 వరకు తగ్గింపు అందిస్తోంది. కంపెనీ ప్రకటించిన ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. హోండా అందిస్తున్న అద్భుతమైన ఈ ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం! హోండా అమేజ్ ►కొత్త హోండా అమేజ్ కారుపై రూ. 43వేల తగ్గింపు ప్రయోజనాలతో అందిస్తోంది. ► రూ. 10,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 12,144 వరకు FOC ఉపకరణాలను అందిస్తోంది. ► కొనుగోలుదారులు న్యూ హోండా అమేజ్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ. 20,000 పొందవచ్చు. ►అంతేకాకుండా, ఈ కారుపై రూ. 5000 కస్టమర్ లాయల్టీ బోనస్ , రూ. 6,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉంది. 5 జనరేషన్ హోండా సిటీ ►5 జనరేషన్ హోండా సిటీ కారుపై రూ. 72,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. మాన్యువల్ గ్రేడ్లు ►రూ. 30,000 వరకు నగదు తగ్గింపు ►కార్ ఎక్స్ఛేంజ్లో రూ. 20,000 తగ్గింపు ►హోండా సిటీ 5వ తరం రూ. 7,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ రూ. 8,000. ►కంపెనీ రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్‌ను కూడా అందిస్తోంది. హోండా WR-V ► హోండా WR-V కారుపై రూ. 72,340 వరకు అద్భుతమైన తగ్గింపు ఆఫర్‌ని ప్రకటించింది. ►రూ. 30,000 నగదు తగ్గింపు , రూ. 35,340 వరకు FOC ఉపకరణాలకు అందిస్తోంది. ►కార్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా రూ. 20,000 వరకు అందిస్తోంది. ►కస్టమర్ లాయల్టీ బోనస్‌గా రూ. 5,000 పొందవచ్చు. ►కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.7,000 ► రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు హోండా జాజ్ ►5-సీటర్ హ్యాచ్‌బ్యాక్, హోండా జాజ్ కోరుకునేవారి కోసం రూ. 37,047 వరకు తగ్గింపు ఆఫర్‌ను లభిస్తుంది. ►రూ. 10,000 వరకు నగదు తగ్గింపుతో పాటు FOC ఉపకరణాలు రూ. 12,047 వరకు ఉంది. ►కార్ ఎక్స్ఛేంజ్లో తగ్గింపు విలువ రూ. 10,000. ►ఈ కారుపై రూ. 5,000 విలువైన కస్టమర్ లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ రూ. 3,000. ►అంతేకాకుండా, రూ. 7,000 విలువైన హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
హోండా కార్లకు ఐడీబీఐ బ్యాంక్ రుణాలు
హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా ఐడీబీఐ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హోండా కార్స్ కస్టమర్లకు సులభ రుణ పథకాలను ఐడీబీఐ బ్యాంక్ ఆఫర్ చేయనుంది. అందుబాటు ధరలకే, వేగంగా, సులభంగా రుణాలను కస్టమర్లు పొందొచ్చని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, నామమాత్రపు ప్రాసెసింగ్ చార్జీలపై రుణాలు అందిస్తున్నట్టు తెలిపాయి. చదవండి: రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ -
ఎస్‌యూవీల్లోకి హోండా రీ–ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా కార్స్.. భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతం వాటా కలిగి ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఇక్కడి విపణిలో వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా ఆశిస్తోంది. ఎస్యూవీ విభాగంలో ఉత్పత్తుల కొరత అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటా తగ్గడానికి దారితీసింది. కొత్త ఎస్యూవీ మోడల్ అభివృద్ధి దాదాపు పూర్తి అయింది. ప్రస్తుతం ఈ కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎస్‌యూవీలైన సీఆర్–వి, బీఆర్–వి, మొబిలియో మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే కంపెనీ నిలిపివేసింది. డబ్ల్యూఆర్–వి, జాజ్ ఎస్‌యూవీలతోపాటు నాల్గవ తరం సిటీ సెడాన్ మోడళ్లు 2023 మార్చి నుంచి కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో సెడాన్స్ అయిన సిటీ హైబ్రిడ్, అయిదవతరం సిటీ, కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కార్ల అమ్మకాలపైనే కంపెనీ ఆధారపడింది. నిష్క్రమించే ఆలోచనే లేదు.. హోండా అంతర్జాతీయంగా 2030 నాటికి 30 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏటా 20 లక్షల ఈ–కార్లు తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్లాలని హోండా నిర్ణయించుకుంది. భారత్‌తో సహా కొన్ని దేశాల్లో ప్లాంట్లు మూతపడ్డాయి. ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ‘నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ నుంచి నిష్క్రమించే ఆలోచనే లేదు. రెండు దశాబ్దాలుగా కార్య కలాపాలు సాగించాం. తప్పుకోవడానికి కారణమే లేదు. ఇక్కడ కొనసాగుతాం’ అని స్పష్టం చేసింది. -
కొత్త కారు కొనేవారికి బంపరాఫర్.. హోండా కార్లపై భారీగా డిస్కౌంట్!
కొత్త కారు కొనేవారికి హోండా శుభవార్త అందించింది. హోండా కంపెనీ మార్చి నెలలో కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. హోండా అమేజ్, హోండా సిటీ 5వ జనరేషన్, హోండా సిటీ 4వ జనరేషన్, హోండా డబ్ల్యుఆర్-వీ, హోండా జాజ్ కార్లపై డిస్కౌంట్ అందిస్తుంది. కారు మోడల్ & వేరియంట్ బట్టి డిస్కౌంట్ ₹35,596 వరకు లభిస్తుంది. 5వ జనరేషన్ కాంపాక్ట్ సెడాన్ హోండా సిటీ మీద ₹35,596 అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. ఇంతక ముందు హోండా ఇదే మోడల్ కారుపై దాదాపు ₹36,000 డిస్కౌంట్ ఇచ్చింది. హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై డిస్కౌంట్ లో భాగంగా ₹10,000 వరకు నగదు డిస్కౌంట్, కారు ఎక్స్ఛేంజ్ కింద ₹5000, హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ ₹5000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹7000, అలాగే ₹8000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హోండా సిటీ 4వ జనరేషన్ కారు మీద కూడా ₹20000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వీటిలో హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కింద ₹7000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద ₹8000 ఉన్నాయి. హోండా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ మీద ₹33,158 రెండవ అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ.10,000 వరకు నగదు డిస్కౌంట్ లేదా ₹12,158 వరకు ఎఫ్ఓసీ యాక్ససరీస్, రూ.5,000 విలువైన కారు ఎక్స్ఛేంజ్'పై డిస్కౌంట్, ₹5,000 హోండా కస్టమర్ లాయల్టీ బోనస్, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.7,000, కార్పొరేట్ డిస్కౌంట్ ₹4,000 వరకు ఉన్నాయి. హోండా సబ్ కాంపాక్ట్ ఎస్యువి డబ్ల్యుఆర్-వీ హోండా మోడల్స్ మీద దాదాపు ₹26,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ అన్ని హోండా డబ్ల్యుఆర్-వీ పెట్రోల్ వేరియంట్, గ్రేడ్'లపై చెల్లుబాటు అవుతుంది. దీనిలో ₹10,000 విలువైన కారు ఎక్స్ఛేంజ్, హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కింద ₹7,000, కార్పొరేట్ డిస్కౌంట్ ₹4,000 వరకు ఉన్నాయి. హోండా అమేజ్ సబ్ కాంపాక్ట్ సెడాన్ అన్ని వేరియెంట్ల మీద ₹15,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్'లో హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ₹5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹6,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద ₹4,000 ఇస్తున్నట్లు తెలిపింది. ఈ జపనీస్ కార్ల తయారీసంస్థ జనవరిలో తన అమ్మకాల్లో మూడు శాతం తగ్గినట్లు పేర్కొంది. గత జనవరి నెలలో 12,149 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తెలిపింది. ఏడాది క్రితం ఇదే నెలలో కంపెనీ మొత్తం 12,552 యూనిట్లను విక్రయించింది. 2021 జనవరిలో 11,319 యూనిట్ల దేశీయ అమ్మకాలతో పోలిస్తే జనవరిలో 10,427 యూనిట్లు అమ్మినట్లు పేర్కొంది. (చదవండి: Joy E-Bike: 500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.115 ఖర్చు..!) -
హోండా కార్లపై అదిరిపోయే ఫెస్టివల్ ఆఫర్.. భారీ డిస్కౌంట్
మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక భారీ శుభవార్త. పండుగ సీజన్ నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా పలు మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత ఐదవ తరం హోండా సిటీ కారుపై ₹53,500 వరకు అత్యధిక డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, తన నాల్గవ తరం హోండా సిటీ కారుపై ₹22,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ సీజన్ పురస్కరించుకొని ఈ ఆఫర్లు ప్రకటించుకొని ఆఫర్లు ప్రకటించినట్లు సంస్థ ప్రకటించింది. పలు మోడల్ శ్రేణి కార్లపై హోండా మోటార్స్ అందిస్తున్న డిస్కౌంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ & డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ.. "పండుగలు మా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఈ పండుగ సీజన్ సమయాల్లో ఎక్కువ మందికి చేరుకోవడం కోసం కార్లపై అద్భుతమైన ఆఫర్లు, ప్రమోషన్లను అందించడం మాకు సంతోషంగా ఉంది" అని అన్నారు. పండుగ ఉత్సాహం మొత్తం ఆటో పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాము అని అన్నారు. సెమీకండక్టర్ కొరత కారణంగా సంస్థ ఇప్పటికీ సరఫరా విషయంలో అడ్డంకులను ఎదుర్కొంటోంది. గత ఏడాది క్రితం విక్రయించిన 10,199 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ 2021లో 6,765 యూనిట్లను మాత్రమే విక్రయించింది.(చదవండి: టెస్లా కంటే తోపు...! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..!) Models Offers 5వ తరం హోండా సిటీ ₹53,500 వరకు 4వ తరం హోండా సిటీ ₹22,000 వరకు కొత్త హోండా అమేజ్ ₹18,000 వరకు కొత్త హోండా డబ్ల్యుఆర్-వి ₹40,100 వరకు కొత్త హోండా జాజ్ ₹45,900 వరకు -
నీ లుక్ అదిరే, సరికొత్త ఫీచర్లతో విడుదలైన సెడాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న హోండా కార్స్ ఇండియా కొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది.ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధరలు వేరియంట్‌నుబట్టి రూ.6.32 లక్షల నుంచి రూ.11.15 లక్షల మధ్య ఉంది.పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్స్‌లో వేరియంట్లను ప్రవేశపెట్టింది.పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్లో ఇంజన్‌ను రూపొందించింది. వేరియంట్‌నుబట్టి పెట్రోల్ అయితే 18.6 కిలోమీటర్లు, డీజిల్ 24.7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది ఎనిమిదేళ్లలో అమేజ్ శ్రేణిలో ఇప్పటి వరకు దేశంలో కంపెనీ 4.5 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో 68 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి సమకూరిందని కంపెనీ ప్రెసిడెంట్ గాకు నకనిశి ఈ సందర్భంగా తెలిపారు. 40% మంది కస్టమర్లు తొలిసారిగా అమేజ్‌ను సొంతం చేసుకున్నారని చెప్పారు. దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్‌కు సైతం భారత్ నుంచి అమేజ్ కార్లు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. చదవండి: ప్రైవేట్ ట్రైన్స్, రూ.30వేల కోట్ల టెండర్లను రిజెక్ట్ చేసిన కేంద్రం -
రివర్స్‌గేర్‌లోనే కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు మళ్లీ భారీ తగ్గుదలను నమోదుచేశాయి. ఆగస్టులో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, హోండా కార్స్ అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. మారుతీ విక్రయాలు 33 శాతం తగ్గాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్–6 ఉద్గార నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్ వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ (సేల్స్) రాజేష్ గోయెల్ అన్నారు. ఆగస్టులోనూ ఇవే ప్రతికూలతలు కొనసాగినందున ఈ స్థాయి క్షీణత నమోదైందని టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ తమ కంపెనీ రిటైల్ అమ్మకాలపై దృష్టిసారిస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. -
తగ్గిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు మరింత నీరసించాయి. జూలైలో మొత్తం పీవీ అమ్మకాలు రెండంకెల క్షీణతను నమోదుచేశాయి. హోండా కార్స్ ఇండియా విక్రయాలు ఏకంగా 49 శాతం క్షీణించగా.. ఈ విభాగంలో మార్కెట్ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు 36 శాతం తగ్గాయి. అశోక్ లేలాండ్ విక్రయాలు 29 శాతం పడిపోయాయి. వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతిన్న కారణంగా ఆటో రంగం అమ్మకాలు పడిపోతూ వస్తున్నాయని ఎం అండ్ ఎం చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా అన్నారు. కొనుగోళ్లు వాయిదా పడిన నేపథ్యంలో విక్రయాలు తగ్గాయని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ వ్యాఖ్యానించారు. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వర్షాకాలం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండీ ఎన్ రాజా అన్నారు. -
మార్కెట్లోకి హోండా ‘అమేజ్’ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో నూతన వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘వీఎక్స్ సీవీటీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకారు ధరల శ్రేణి రూ.8.56 లక్షల నుంచి రూ.9.56 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. మార్గదర్శకాలతో కూడిన వెనుక కెమెరా, అంతరాయం లేని స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు తాజా వేరియంట్లో ఉన్నట్లు వివరించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో ఈకారు అందుబాటులో ఉంది. మా కస్టమర్లలో 20 శాతం మంది సీవీటీ టెక్నాలజీని ఎంపికచేసుకున్నారు. నూతన వేరియంట్‌తో వీరి ముందున్న ఆప్షన్లు మరింతగా పెరిగాయి’ అని అన్నారు. ఈ వేరియంట్‌కు మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నామన్నారు. -
హోండా కార్ల ధరలు పెంపు!
న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా తన మోడల్స్‌పై ధరలను పెంచింది. వచ్చే నెల నుంచి తన మోడల్స్‌పై 35 వేల రూపాయల వరకు ధరలు పెరగనున్నట్టు హోండా కార్స్ ప్రకటించింది. ఇన్పుట్ కాస్ట్‌లు పెరగడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 10 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు ధరలను పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తుందని, ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) ప్రకటించింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం, గత కొన్ని నెలలుగా కస్టమ్స్ డ్యూటీల ప్రభావం, ఎక్కువ ఫ్రైట్ రేట్లు వంటివి తమ కార్ల ధరలను పెంచేలా ప్రభావితం చేశాయని హెచ్‌సీఐఎల్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు. ఇటీవల లాంచ్ చేసిన కొత్త అమేజ్ ధరను కూడా ఆగస్టు నుంచి సమీక్షించనున్నట్టు పేర్కొన్నారు. హెచ్‌సీఐఎల్ తన మోడల్స్ హ్యాచ్‌బ్యాక్ బ్రియోను ప్రారంభ ధర రూ.4.73 లక్షలకు అందిస్తుండగా.. అకార్డు హైబ్రిడ్‌ను రూ.43.21 లక్షలకు విక్రయిస్తోంది. ఈ రేంజ్లో హోండా కార్లు మార్కెట్లో ఉన్నాయి. ఏప్రిల్‌లో లగ్జరీ కారు తయారీదారులు ఆడి, జేఎల్ఆర్, మెర్సిడెస్ బెంజ్‌లు కూడా లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో ధరలను పెంచాయి. కస్టమ్ డ్యూటీలు పెరగడంతో, తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్స్ కూడా జూన్ నుంచి 2 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. ఇలా కార్ల సంస్థలు తమ మోడల్స్‌పై ధరల పెంపును ప్రకటిస్తున్నాయి. -
మెక్‌డి, హోండాలకు జీఎస్టీ నోటీసులు
న్యూఢిల్లీ : హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు, వెస్ట్, సౌత్‌లోని మెక్‌డొనాల్డ్స్, రిటైల్ లైఫ్‌స్టయిల్, హోండా డీల్స్ సంస్థలు తప్పుడు జీఎస్టీతో వినియోగదారులను మోసం చేస్తున్నట్టు వెల్లడైంది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా.. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నందున్న ఈ సంస్థలపై యాంటీ-ప్రాఫిటరింగ్ చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. కనీసం ఐదు సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్‌గార్డ్స్(డీజీ సేఫ్‌గార్డ్స్) ఈ నోటీసులు జారీచేసింది. వాసెలిన్ ఉత్పత్తులపై పన్ను రేటును 18 శాతానికి తగ్గించినప్పటికీ, ఇంకా 28 శాతమే విధిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిప్పటికీ, ఒక్క కప్ కాఫీ ధరను రూ.142 నుంచి తగ్గించనట్టు తెలిసింది. డిసెంబర్ 29నే డీజీ సేఫ్‌గార్డ్స్ ఈ నోటీసులు జారీచేసింది. కానీ ఇంకా తమకు ఎలాంటి నోటీసులు అందలేదని హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్లు చెబుతోంది. లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ కూడా నవంబర్ 22న 28 శాతం జీఎస్టీ విధించిందని, కానీ ఆ వారం ప్రారంభంలోనే జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించినట్టు ఫిర్యాదులో తెలిసింది. ఈ విషయంపై స్పందించడానికి లైఫ్ స్టయిల్ ఇంటర్నేషనల్ స్పందించడానికి తిరస్కరించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాలను తమకు అందించడం లేదని 36 మంది కొనుగోలుదారులు చెప్పడంతో, ఫిరామిడ్ ఇన్‌ఫ్రాటెక్‌కు కూడా ఈ నోటీసులు అందాయి. బారెల్లీకు చెందిన కారు డీలర్ హోండా కారు కూడా ఎక్కువ మొత్తంలో పన్నులను విధిస్తున్నట్టు తెలిసింది. ఈ అన్ని ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని, యాంటీ ప్రాఫిటరింగ్ చర్యలు తీసుకోబోతున్నారు. -
పెరగనున్న హోండా కార్ల ధరలు
న్యూఢిల్లీ : ఇయర్-ఎండ్ అమ్మకాల్లో భాగంగా వాహన కంపెనీలన్నీ భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటే.. దానికి భిన్నంగా హోండా కార్స్ ఇండియా తన మోడల్స్‌పై ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి 1 నుంచి హోండా కారు మోడల్స్‌పై రూ.25వేల వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో, మోడల్స్‌పై ధరలను పెంచుతున్నట్టు పేర్కొంది. ''జనవరి నుంచి తమ అన్ని మోడల్స్‌పై 1 శాతం నుంచి 2 శాతం వరకు ధరలు పెంచాలని మేము ప్లాన్ చేస్తున్నాం'' అని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అధికార ప్రతినిధి ప్రకటించారు. బేస్ మెటల్స్ వ్యయాలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. హోండా కార్స్ రూ.4.66 లక్షల నుంచి హ్యాచ్‌బ్యాక్ బ్రియోను విక్రయిస్తుండగా.. అకార్డ్ హైబ్రిడ్‌ను రూ.43.21 లక్షలకు విక్రయిస్తోంది. అడ్వెంచర్ యుటిలిటీ వెహికిల్ వీ క్రాస్ మోడల్ రూ.13.31 లక్షలుగా ఉంది.. గత నెలలో స్కోడా ఆటో ఇండియా కూడా జనవరి 1 నుంచి తన వాహనాలపై 2 శాతం నుంచి 3 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. -
హోండా కార్ల ధరలు పెరిగాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్ల ఇండియా కూడా తన మోడల్స్ ధరలను పెంచేసింది. జీఎస్టీ సెస్‌కు అనుగుణంగా ధరలను పెంచుతున్నట్టు ఈ కంపెనీ కూడా ప్రకటించింది. సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ మోడల్స్‌పై రూ.7,003 నుంచి రూ.89,069 మధ్యలో ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సమీక్షించిన ధరలు అమల్లోకి తెస్తున్నామని హోండా కార్ల ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. జీఎస్టీలో 2-7 శాతం అదనపు సెస్ భారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. తన మిడ్‌సైజు సెడాన్ సిటీ ధరలు వేరియంట్లను బట్టి రూ.7,0003 నుంచి రూ.18,791 వరకు పెరిగాయి. ఎస్యూవీ బీర్-వీ ధరలను రూ.12,490 నుంచి రూ. 18,242 మధ్యలో పెంచింది. అదేవిధంగా ప్రీమియం ఎస్యూవీ సీఆర్-వీ ధరలను రూ.75,304 నుంచి రూ.89,069 వరకు పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా ఎంపికచేసిన మోడల్స్‌పై ధరలను రూ.13వేల నుంచి రూ.1.6 లక్షల వరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం సెస్‌ను పెంచడంతో మిడ్‌సైజు కార్ల జీఎస్టీ రేటు 45 శాతం, పెద్ద కార్ల జీఎస్టీ రేటు 48 శాతం, ఎస్యూవీ రేటు 50 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
ప్రీమియం బ్రాండ్‌గానే కొనసాగుతాం..
⇔ పరిశ్రమ కంటే అధిక వృద్ధి నమోదు చేస్తాం ⇔ హోండా కార్స్ ఇండియా సీఈవో యొయిచిరో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ కార్ల మార్కెట్లో ప్రీమియం బ్రాండ్‌గానే కొనసాగుతామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. మోడళ్ల నాణ్యత, అమ్మకాలు, సర్వీస్ పరంగా ప్రీమియం బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో యొయిచిరో ఒయినో శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎంట్రీ లెవెల్లో కూడా ఈ ఇమేజ్ను కొనసాగిస్తామని చెప్పారు. బ్రియో కంటే చిన్న కారును తెచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. విదేశాల్లో ప్రస్తుతం లభిస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ హెచ్ఆర్–వి, ప్రీమియం సెడాన్ అయిన సివిక్తోపాటు మరో ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టే అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మోడళ్లు 2018–19లోనే ఎంట్రీ ఇస్తాయని కంపెనీ మార్కెటింగ్ ఏవీపీ రాకేశ్ సిడన తెలిపారు. 2020 నుంచి మొదలు.. భారత్‌లో 2020–30 మధ్య కాలంలో కార్ల మార్కెట్ కొత్త శిఖరాలను చేరుకుంటుందని యొయిచిరో తెలిపారు. ‘2020 నాటికి చైనా, యూఎస్ తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంటుంది. 2017–18లో పరిశ్రమ 7–8 శాతం వృద్ధి నమోదు చేయనుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని హోండా ఆశిస్తోంది. ఇటీవల భారత్‌లో హోండా విడుదల చేసిన కొత్త సిటీ 30,000లకుపైగా, కొత్త డబ్లు్యఆర్–వి 16,000లకుపైగా బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ రెండు మోడళ్లు తోడవడంతో ఏప్రిల్‌లో 38 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం 345 షోరూంలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా 22 నగరాల్లో అడుగు పెట్టి మరో 29 ఔట్లెట్లు ఏర్పాటు చేయనున్నాం’ అని వివరించారు. ఎలక్ట్రిక్ కార్లకు.. దేశంలో ఎలక్ట్రిక్ కార్లు పెద్ద ఎత్తున పరుగెత్తడానికి మరింత సమయం పడుతుందని యొయిచిరో వెల్ల డించారు. తమ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేస్తోందని, అయితే భారత మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనేదీ ఇప్పుడు చేయడం లేదని చెప్పారు. ఈ కార్లు తిరగడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడి మార్కెట్లో లేవని గుర్తు చేశారు. పైగా సాధారణ కార్లతో పోలిస్తే వీటి ఖరీదు రెండింతలు ఉండడం కూడా పెద్ద అడ్డంకి అని స్పష్టం చేశారు. ఇంత ధర వెచ్చించేందుకు కస్టమర్లు సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు. -
హోండా కాంపాక్ట్ క్రాసోవర్.. డబ్ల్యూఆర్–వీ
రెండు వేరియంట్లలో లభ్యం ⇒ పెట్రోల్: రూ.7.75 లక్షలు – రూ.8.99 లక్షలు ⇒ డీజిల్: రూ.8.79 లక్షలు – రూ. 9.99 లక్షలు న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా కంపెనీ కాంపాక్ట్ క్రాసోవర్ మోడల్, హోండా ‘డబ్ల్యూఆర్–వీ’ని గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ధరలు రూ.7.75 లక్షల నుంచి రూ.9.99 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. ఈ కారును జాజ్ ప్లాట్ఫార్మ్పై తయారు చేశామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుందని హోండా కార్స్ ఇండియా తెలిపింది. 1.2 లీటర్ ఇంజిన్‌తో రూపొందిన పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.7.75 లక్షల నుంచి రూ.8.99 లక్షల రేంజ్లో ఉన్నాయని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యునొ చెప్పారు. 1.5 లీటర్ ఇంజిన్‌తో రూపొందిన డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.79 లక్షల నుంచి 9.99 లక్షల రేంజ్లో ఉన్నాయని వివరించారు. ఈ డబ్ల్యూఆర్–వీ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. హోండా కంపెనీ, జపాన్ ఆర్ అండ్ డీ విభాగం సహకారంతో భారత హోండా ఆర్ అండ్ డీ విభాగం అభివృద్ధి చేసిన తొలి మోడల్ ఇదని వివరించారు. డీజిల్ వేరియంట్ మైలేజీ 25.5 కిమీ. శాటిలైట్ అనుసంధాన నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సన్ రూఫ్, ఇంటర్నెట్కు వై–ఫై సపోర్ట్, 1.5 జీబీ ఇంటర్నల్ మెమెరీ తదితర ఫీచర్లతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ వంటి ప్రత్యేకతలున్నాయని యునొ వివరించారు. డీజిల్ వేరియంట్లో స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. డీజిల్ వేరియంట్ 25.5 కిమీ. మైలేజీనిస్తుందని, ఈ సెగ్మెంట్ కార్లలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. ఈ కారు మారుతీ సుజుకీ విటారా బ్రెజా, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, టయోట ఇటియోస్ క్రాస్, ఫియట్ అవెంచురా, హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మరిన్ని ప్రీమియమ్ మోడళ్లు..! ఈ ఏడాది తమకు శుభారంభం పలికిందని యునొ పేర్కొన్నారు. గత నెలలో మార్కెట్లోకి తెచ్చిన కొత్త సిటీ కారుకు ఇప్పటివరకూ 14,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు. తాజాగా అందిస్తున్న డబ్ల్యూఆర్–వీ కారుతో తాము మంచి వృద్ధిని సాధించగలమని పేర్కొన్నారు. మరిన్ని ప్రీమియమ్ మోడళ్లను భారత్‌లోకి తెచ్చే విషయమై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తమ అమ్మకాలపై బాగానే ప్రభావం చూపిందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నొరియాకె అబె చెప్పారు. గత నెల నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నాయని వివరించారు. -
ఆ కారు కొనాలంటే.. నోటు బాధలేదు!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల ప్రభావం.. కారు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపకూడదనే అభిప్రాయంతో హోండా కార్స్ ఇండియా కొనుగోలుదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టిన హోండా కార్స్, కొనుగోలుదారులకు 100 శాతం రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ప్రకటించింది. దీంతో కస్టమర్లు నోట్ల బాధ నుంచి తప్పించుకుని, కార్లను తేలికగా కొనుగోలు చేస్తారని హోండా కార్స్ తెలిపింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్ల కొనుగోలు ప్రక్రియలో అతిపెద్ద అవాంతరంగా ఏర్పతుందని, నగదుతో కార్లను కొనుగోలు చేసే స్థాయి పడిపోతున్నట్టు అంచనావేస్తున్నట్టు హెచ్‌సీఐఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా, ఎక్స్‌షోరూం, ఆన్‌రోడ్ ఫండింగ్ డీల్స్‌లో 100 శాతం రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టినట్టు చెప్పారు. కార్లను కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లకు నోట్ల రద్దుతో ఏర్పడిన అసౌకర్యానికి ఈ దోస్తి బాగా సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది. వేతనదారులకు, స్వయం ఉపాధి వ్యక్తులకు ఈ డీల్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్‌షిప్స్‌లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, హెచ్‌సీఐఎల్ లైన్-అప్ అన్ని మోడల్స్‌కు ఈ రుణ సౌకర్యం కవర్ చేస్తుందన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఎక్స్ షోరూం ధరల్లో 100 శాతం, ఆన్-రోడ్ ధరల్లో 90 శాతం స్పెషల్ రిటైల్ ఫైనాన్స్ ఆఫర్స్ ఉంటాయని, హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోల్డర్స్‌కు అన్ని హోండా కార్ల ఆన్-రోడ్ ధరల్లో 100 శాతం లోన్ అందుబాటులో ఉంటున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు కూడా రూ.25వేల కంటే ఎక్కువగా వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, 7వ వేతన కమిషన్ కిందకు వచ్చే పెన్షన్ స్కీమ్ లబ్దిదారులకు రోడ్ ఫండింగ్‌లో 100 శాతం ఆఫర్ చేయనుంది. బ్రియో, జాజ్, అమేజ్, మొబిలియో, సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ రేంజ్ వెహికిల్స్‌ను విక్రయిస్తోంది. -
జోరుగా వాహన విక్రయాలు
మారుతీ, హోండా కార్స్ మినహా అన్ని కంపెనీల విక్రయాలు వృద్ధిలోనే ♦ జూన్ నెల వాహన అమ్మకాల తీరు.. ♦ ‘వేతన సిఫారసు’లతో మరిన్ని విక్రయాలు ♦ భవిష్యత్‌పై కంపెనీల ఆశాభావం న్యూఢిల్లీ: వాహన విక్రయాలు జూన్‌లో జోరుగా ఉన్నాయి. వర్షాలు బాగానే కురుస్తుండడం, కొత్త మోడళ్ల కారణంగా జూన్ నెలలో వాహన అమ్మకాలు పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే సుబ్రోస్ సంస్థలో అగ్నిప్రమాదం కారణంగా మారుతీ అమ్మకాలు మాత్రం 14 శాతం పడిపోయాయి. అయితే జిప్సి, గ్రాండ్ విటారా, ఎర్టిగ, ఎస్-క్రాస్, కాంపాక్ట ఎస్యూవీ విటారా బ్రెజ్జాలతో కూడిన యుటిలిటి వాహన విక్రయాలు 76 శాతం పెరగడం విశేషం. హోండా కార్స్ ఇండియా అమ్మకాలు కూడా క్షీణించాయి. మిగిలిన అన్ని కార్ల కంపెనీలు-టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, రెనో, మహీంద్రా అన్ని కంపెనీలు విక్రయాల్లో మంచి వృద్ధిని సాధించాయి. ద్విచక్ర వాహన కంపెనీలు కూడా మంచి అమ్మకాలనే సాధించాయి. హీరో మోటొకార్ప్ ఒక శాతం వృద్ధిని సాధించగా, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్, యమహా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వర్షాలు మంచిగా కురుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయని, దీంతో సెంటిమెంట్, డిమాండ్ మెరుగుపడతాయని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ నెల విక్రయానికి సంబంధించి వివరాలు... మారుతీ సుజుకీ: దేశీయ విక్రయాలు 10 శాతం క్షీణించాయి. చిన్నకార్ల విక్రయాలు 19 శాతం, కాంపాక్ట్ కార్ల విక్రయాలు 13 శాతం, వ్యాన్ల విక్రయాలు 6 శాతం చొప్పున తగ్గాయి. ఎగుమతులు 45 శాతం పడిపోయాయి హ్యుందాయ్: గ్రాండ్ ఐ10, ఇలీట్ ఐ20, క్రెటా కార్లు మంచి అమ్మకాలు సాధించాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. వర్షాలు మంచిగా కురుస్తుండటం, ఏడవ వేతన సంఘం సిఫారసుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా అమ్మకాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. ⇔ మహీంద్రా ఎగుమతులు 41 శాతం, ఫోర్డ్ ఇండియా ఎగుమతులు మూడు రెట్లు, టాటా మోటార్స్ ఎగుమతులు 11 శాతం చొప్పున పెరిగాయి. ⇔ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా మోటార్ బైక్‌ల అమ్మకాలు 27 శాతం, స్కూటర్ల అమ్మకాలు 21 శాతం, ఎగుమతులు 13 శాతం చొప్పున పెరిగాయి. ⇔ పూర్తిగా స్వదేశీ ఆర్ అండ్ డీ టీమ్ అభివృద్ధి చేసిన స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 మోటార్‌బైక్‌ను త్వరలో మార్కెట్లోకి తెస్తామని హీరో మోటోకార్ప్ తెలిపింది. -
త్వరలో హోండా కార్స్ కొత్త ప్లాంటు
♦ రూ.380 కోట్లతో రాజస్తాన్‌లో నిర్మాణం ♦ 340కి అవుట్‌లెట్స్ పెంపు లక్ష్యం ♦ హోండా సీనియర్ వీపీ జ్ఞానేశ్వర్ సేన్ వెల్లడి హైదరాబాద్, బిజినె స్ బ్యూరో: దాదాపు రూ. 380 కోట్లతో రాజస్తాన్‌లో నిర్మిస్తున్న కొత్త ప్లాంటు మరో 2-3 నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్ విభాగం) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్ కల్లా ఉత్పత్తి ప్రారంభం కాగలదని వివరించారు. ప్రస్తుతం 2.4 లక్షలుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం కొత్త ప్లాంటు రాకతో 3 లక్షలకు పెరుగుతుందన్నారు. అక్టోబర్ నాటికి కొత్తగా అకార్డ్ హైబ్రీడ్ వాహనాన్ని తెస్తున్నామని సేన్ చెప్పారు. ఇక ప్రస్తుతం 298 అవుట్‌లెట్స్ ఉండగా ఈసారి 340కి పెంచుకోనున్నట్లు తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి కాంపాక్ట్ ఎస్యూవీ వాహనం బీఆర్-వీని ప్రవేశపెట్టిన సందర్భంగా బుధవారం విలేకరులకు ఆయన ఈ విషయాలు తెలిపారు. డీజిల్ వాహనాలపై ఆంక్షలు, ఇన్ఫ్రా సెస్సు విధింపు తదితర అంశాలతో గత ఆర్థిక సంవత్సరం పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దీనివల్ల తమ అమ్మకాలపై కూడా ప్రతికూల ప్రభావం పడిందన్నారు. డీజిల్ వాహనాల మీద ఆంక్షల భయాలతో కస్టమర్లు పెట్రోల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండటంతో తాము కూడా ఆ దిశగా తయారీ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని సేన్ చెప్పారు. గందరగోళానికి తావు లేకుండా సహేతుకమైన, పారదర్శకమైన విధానాలను పరిశ్రమ కోరుకుంటోందన్నారు. రాష్ట్ర మార్కెట్లోకి హోండా బీఆర్-వీ..: తెలుగు రాష్ట్రాల మార్కెట్లో అమ్మకాలకు సంబంధించి కాంపాక్ట్ ఎస్యూవీ బీఆర్-వీని సేన్ ఆవిష్కరించారు. దీని ధర రూ. 8,91,200-రూ.13,13,700 మధ్య ఉంటుంది. మూడు వరుసల సీటింగ్, పెట్రోల్..డీజిల్ వేరియంట్‌ను బట్టి 15.4 కి.మీ.-21.9 కి.మీ. మైలేజీ మొదలైనవి దీని ప్రత్యేకతలు. ఇప్పటిదాకా 4,600 బుకింగ్స్ వచ్చాయని, వీటిలో ఏపీ.. తెలంగాణ నుంచి 300 దాకా ఉన్నాయని సేన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఎస్యూవీ విభాగం 35 శాతం వృద్ధి చెందగా, ఎంట్రీ స్థాయి వాహనాల విక్రయాలు 43 శాతం వృద్ధి నమోదు చేసినట్లు సేన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాము సైతం బీఆర్-వీతో కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించినట్లు వివరించారు. -
వాహన విక్రయాలకు జన‘వర్రీ’!
♦ టాటా మోటార్స్, హోండా కార్స్ ♦ అమ్మకాల్లో క్షీణత ♦ స్వల్ప వృద్ధిని సాధించిన మారుతీ న్యూఢిల్లీ: వాహన విక్రయాలు జనవరిలో మందగించాయి. దేశీయ విక్రయాల్లో మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధిని సాధించగా, హ్యుందాయ్, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు ఒక్క అంకె వృద్ధినే సాధించాయి. మరోవైపు టాటా మోటార్స్, హోండా కార్స్ దేశీయ అమ్మకాలు క్షీణించాయి. నిల్వలు క్లియర్ చేసుకోవడానికి పలు కంపెనీలు గత ఏడాది చివరి నెల డిసెంబర్లో భారీగా డిస్కౌంట్లు ఇచ్చాయని, ఈ ప్రభావంతో జనవరి నెలలో అమ్మకాలు మందకొడిగా ఉన్నాయని డెలాయిట్ ఇండియా సీనియర్ డెరైక్టర్ సావన్ గొడియావాలా చెప్పారు. మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు)ఈ ఏడాది తొలి నెల జనవరిలో 3 శాతం తగ్గాయి. దేశీయ అమ్మకాలు స్వల్పంగా 0.8 శాతం పెరిగాయి. ఎగుమతులు 35 శాతం క్షీణించాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 9 శాతం పెరిగాయి. ఎగుమతులు 38 శాతం తగ్గాయి. టాటా మోటార్స్ దేశీయ, వాణిజ్య ప్రయాణికుల వాహన విక్రయాలు 7 శాతం పెరిగాయి. వాణిజ్య వాహన విక్రయాలు 20 శాతం, ఎగుమతులు 42 శాతం చొప్పున పెరిగాయి. ప్రయాణికుల వాహన విక్రయాలు మాత్రం 18 శాతం తగ్గాయి. టయోటా దేశీయ అమ్మకాలు 30%, ఎగుమతులు 54% చొప్పున తగ్గాయి. 2,000 సీసీ ఇంజిన్‌కు మించిన డీజిల్ వాహనాలపై ఢిల్లీలో నిషేధం కారణంగా అమ్మకాలు తగ్గాయ ని టయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. రాజా చెప్పారు.