వినాయక చవితి, విజయ దశమి, దీపావళి ఇలా.. రానున్నది అసలే పండుగ సీజన్. ఈ సమయంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెలలో (2023 సెప్టెంబర్) విడుదలకానున్న కొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హోండా ఎలివేట్
హోండా కంపెనీ ఈ నెల 4న తన ఎలివేట్ కారుని విడుదల చేయనుంది. మిడ్ సైజ్ విభాగంలో చేరనున్న ఈ SUV చూడటానికి చాలా ఆకర్షణీయంగా అద్భుతమైన డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కూడా ఉండనుంది. 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 121 హార్స్ పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ అండ్ 7 స్టెప్ CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
వోల్వో సీ40 రీఛార్జ్
స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉంది. కావున కంపెనీ త్వరలో సీ40 రీఛార్జ్ కూపే విడుదల చేయనుంది. ఇది XC40 రీఛార్జ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ SUV కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందనుంది. 408 హార్స్ పవర్ అండ్ 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే డ్యూయల్-మోటార్ సెటప్ ఇందులో ఉంటుంది. ఒక సింగిల్ చార్జ్‌తో 418 కిమీ నుంచి 530 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే?
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ నెల 14న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయనుంది. ఈ కారు కర్వ్ & హారియర్ స్టైల్ కలిగి పెద్ద స్క్రీన్‌లు, టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్స్ అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి.
ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు - టాప్ స్పీడ్ 120 కిమీ/గం
మహీంద్రా బొలెరో నియో ప్లస్
మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెల చివరలో బొలెరో నియో ప్లస్ విడుదల చేయనుంది. ఇది కంపెనీ మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఇది 7 సీటర్ అండ్ 9 సీటర్ వెర్షన్లలో అందుబాటులోకి రానుంది. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనుంది. 'మహీంద్రా బొలెరో నియో ప్లస్'కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment