Upcoming
-
పల్లె పిలిచింది
పల్లెటూరి కథలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా సిటీ చుట్టూ తిరిగే కథలే చూస్తుంటారు కాబట్టి పల్లె కథలు వచ్చినప్పుడు ప్రేక్షకులు చూడాలని అనుకుంటారు. పైగా ఆ కథల్లో స్టార్ హీరోలు నటిస్తే క్రేజ్ రెండింతలు ఉంటుంది. అలా ‘పల్లె పిలిచింది’ అంటూ కొందరు హీరోలు రూరల్ స్టోరీలతో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. పల్లెటూరి ఆట రామ్‌చరణ్ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటే ప్రేక్షకులకు ‘రంగస్థలం’ (2018) సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు రామ్‌చరణ్. కాగా తనకు ‘రంగస్థలం’ వంటి హిట్ ఫిల్మ్‌ను అందించిన సుకుమార్‌తో మరో సినిమాకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ‘రంగస్థలం’కు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.అలాగే ఇది వార్ డ్రామా మూవీ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబుతో రామ్‌చరణ్ హీరోగా చేయనున్న సినిమా మాత్రం పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాయే. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో అన్నదమ్ముల పాత్రలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ పల్లె కథలో జాన్వీ కపూర్ హీరోయిన్. రాజు కథ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు 2018లో జీవనోపాధికి గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. ఈ ఘటనలో ఉన్న ఓ మత్స్యకారుడి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తండేల్’. ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. రాజు పాత్ర కోసం నాగచైతన్య పూర్తిగా మేకోవర్ అయ్యారు. అలాగే శ్రీకాకుళం యాస కూడా నేర్చుకున్నారు. ‘తండేల్’ను డిసెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు. దసరా కాంబో రిపీట్‘దసరా’ వంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. హీరో నాని– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రానుంది. ఈ సినిమా కథాంశం కూడా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. అలాగే ‘బలగం’ దర్శకుడు వేణు ఎల్దండి గ్రామీణ నేపథ్యంలో నాని హీరోగా ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందని సమాచారం. మాస్ కుర్రాడు సిల్వర్ స్క్రీన్‌పై విజయ్ దేవరకొండ ఎక్కువగా సిటీ అబ్బాయిలానే కనిపించారు. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నారు. ‘రాజావారు రాణిగారు’ వంటి పల్లె ప్రేమకథను తీసిన దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు ఈ నెల 9న... విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా వెల్లడి కానున్నాయి. లంకల రత్న విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. గోదావరి పరిసర ్రపాంతాల్లోని గ్రామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. చీకటి సామ్రాజ్యంలో లంకల రత్న అనే సాధారాణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎలా చేరుకుంటాడు? అన్నదే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కథ అని యూనిట్ పేర్కొంది. లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. అలాగే హీరోలు రక్షిత్ అట్లూరి ‘శశివదనే’, నార్నే నితిన్ ‘ఆయ్..’ సినిమాలు గోదావరి నేపథ్యంలో సాగే కథలే. ఇంకా గ్రామీణ నేపథ్యంలో పలు చిత్రాలు ఉన్నాయి. -
హాలీవుడ్లో సీక్వెల్ జోరు
హాలీవుడ్లో సీక్వెల్ అనగానే దాదాపు అందరి దృష్టి ‘అవతార్’ మీద ఉంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు (2022) పట్టింది. మూడు, నాలుగు, ఐదు భాగాలను ప్రకటించారు కామెరూన్. మూడో భాగం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ‘అవతార్’ అభిమానులను ఇది నిరాశపరిచే విషయమే. అయితే ఈ ఏడాది దాదాపు పది సీక్వెల్స్ రానున్నాయి. పలు హిట్ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న ఆ సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. సమ్మర్లో సైన్స్ ఫిక్షన్ ఈ వేసవికి రానున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017)కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఫ్రాంచైజీలో ఇది నాలుగో భాగం. మూడు భాగాలూ సూపర్ హిట్టయిన నేపథ్యంలో తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వెస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలియమ్ టీగ్, ఫ్రెయా అలన్ తదితరులు నటించారు. మే 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఫుల్ యాక్షన్‌తో బ్యాడ్ బాయ్స్ జూన్‌లో బ్యాడ్ బాయ్స్ తెరపైకి రానున్నారు. బడ్డీ కాప్ యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. 2003లో వచ్చిన ‘బ్యాడ్ బాయ్స్’కి నాలుగో భాగం ఇది. మూడో భాగం ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’ (2020) విడుదలైన నాలుగేళ్లకు వస్తోన్న సీక్వెల్ ఇది. ఈ చిత్రంలో డిటెక్టివ్ ల్యూటినెంట్ మైఖేల్‌గా లీడ్ రోల్‌ని విల్ స్మిత్ చేశారు. రెండో, మూడో భాగానికి దర్శకత్వం వహించిన ఆదిల్, బిలాల్ ద్వయం తాజా చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. నాలుగు భాగాల్లోనూ మైఖేల్ పాత్రను విల్ స్మిత్‌నే చేశారు. యాక్షన్, కామెడీతో రూపొందిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఆరేళ్లకు డెడ్‌పూల్ ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డ సీక్వెల్ చిత్రాల్లో ‘డెడ్‌పూల్ 3’ది ప్రముఖ స్థానం. ర్యాన్ రేనాల్డ్స్ టైటిల్ రోల్లో షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. మార్వెల్ కామిక్ బుక్స్‌లోని డెడ్‌పూల్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందిన తొలి చిత్రం ‘డెడ్‌పూల్’ (2016). టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ సూపర్ హిట్టయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా షానీ లెవీ దర్శకత్వంలో రూపొందిన ‘డెడ్‌పూల్ 2’ (2018) కూడా బంపర్ హిట్. ఆరేళ్లకు మూడో భాగం ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్’ వస్తోంది. మూడు భాగాల్లోనూ డెడ్‌పూల్ పాత్రను ర్యాన్ రేనాల్డ్స్ చేశారు. జూలై 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. హారర్ జూయిస్ దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ ‘బీటిల్ జూయిస్’ (1988) సంచలన విజయం సాధించింది. టిమ్ బర్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ పోషించారు. దాదాపు 35 ఏళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా టిమ్ బర్టన్ దర్శకత్వంలోనే ‘బీటిల్ జూయిస్ 2’ రూపొందింది. సీక్వెల్లోనూ బీటిల్ జూయిస్ పాత్రను మైఖేల్ కీటన్ చేశారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది. అక్టోబర్‌లో జోకర్ అక్టోబర్ నెల రెండు సీక్వెల్స్‌ని చూపించనుంది. ఒకటి ‘జోకర్’ సీక్వెల్... మరోటి ‘వెనమ్’ సీక్వెల్. అమెరికన్ కామిక్స్ ఆధారంగా మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జోకర్’ (2019). టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జోకర్ అనే ఆర్థర్ ఫ్లెక్స్ పాత్రను జోక్విన్ ఫీనిక్స్ పోషించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ‘జోకర్’కి సీక్వెల్‌గా ‘జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్’ చిత్రం రూపొందింది. అక్టోబర్ 4న ఈ జోకర్ తెరపైకి రానున్నాడు. ఇదే ఆఖరి వెనమ్ కొలంబియా పిక్చర్స్ నిర్మించిన స్పైడర్‌మేన్ యూనివర్స్‌లో ఆరో చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్. ‘వెనమ్’ (2018), ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ (2021) చిత్రాలకు సీక్వెల్ ఇది. ఈ మూడో భాగంతో ‘వెనమ్’ సీక్వెల్ ముగుస్తుందని టాక్. కెల్లీ మార్సెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వెనమ్ పాత్రను టామ్ హార్డీ పోషించారు. ఈ చిత్రం జూలైలోనే రిలీజ్ కావాల్సింది. అయితే వేతనాల పెంపుకి రచయితలు చేపట్టిన సమ్మె వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రెండు దశాబ్దాలకు గ్లాడియేటర్ రెండు దశాబ్దాల క్రితం వచ్చిన హిస్టారికల్ డ్రామా ‘గ్లాడియేటర్’ (2000) అనూహ్యమైన విజయం సాధించింది. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రసెల్ క్రో, జోక్విన్ ఫీనిక్స్ తదితరులు నటించారు. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు వసూలు చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రిడ్లీ స్కాట్ దర్శకత్వంలోనే రూపొందిన ‘గ్లాడియేటర్ 2’ నవంబర్ 22న రిలీజ్ కానుంది. పౌల్ మెస్కల్, డెంజల్ వాషింగ్టన్ తదితరులు నటించారు. ఈ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ ‘సోనిక్ ది హెడ్హాగ్ 3’ డిసెంబర్ 20న, అదే రోజున యానిమేటెడ్ మూవీ ‘హూ ఫ్రేమ్డ్ రాగర్ రాబిట్ 2’, ‘ది కరాటే కిడ్’ ఆరో భాగం డిసెంబర్ 13న... ఇంకా వీటితో పాటు ఈ ఏడాది మరికొన్ని సీక్వెల్స్ వచ్చే చాన్స్ ఉంది. -
లాంచ్‌కు ముందే వివరాలు లీక్.. ఐఫోన్ 16 ఇలాగే ఉంటుందా!
ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ విడుదల చేస్తున్న యాపిల్.. ఐఫోన్ 16 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. విడుదల చేయడానికి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే దీనికి సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 డిజైన్, కెమెరా, చిప్సెట్ వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డిజైన్ లీకైన సమాచారం ప్రకారం, రానున్న కొత్త ఐఫోన్ సాలిడ్-స్టేట్ బటన్లను పొందే అవకాశం ఉంది. కంపెనీ దీనిని ఐఫోన్ 16 ప్రో మోడల్‌లలో క్యాప్చర్ బటన్‌గా అందించే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, స్పర్శను వంటి వాటిని గుర్తించేలా ఉంటుంది. డిస్ప్లే 2024లో విడుదల కానున్న కొత్త ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ స్క్రీన్, ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. కాగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్క్రీన్లు వరుసగా 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ వరకు ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా రాబోయే ఈ కొత్త మోడల్స్ శాంసంగ్ అందించే ఓఎల్ఈడీ మెటీరియల్ కలిగి.. బ్లూ ఫాస్ఫోరోసెన్స్‌తో బ్లూ ఫ్లోరోసెంట్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చు. మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే టెక్నాలజీ ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ 16 సిరీస్ మల్టిపుల్ కలర్స్‌లో లాంచ్ అవ్వనున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. చిప్సెట్ వచ్చే సంవత్సరం విడుదలకానున్న కొత్త ఐఫోన్ 16 చిప్‌సెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు, కానీ ఇది ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలోని A17 ప్రో చిప్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ రానున్న కొత్త ఐఫోన్స్ కోసం 3 నానోమీటర్ A18 చిప్ అందించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. చిప్‌సెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా సెటప్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లు 'టెట్రా-ప్రిజం' టెలిఫోటో కెమెరాను పొందే అవకాశం ఉంది. అద్భుతమైన ఫొటోల కోసం ఆప్టికల్ జూమ్ 3ఎక్స్ నుంచి 5ఎక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఉపయోగించే 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా తక్కువ వెలుతురులో (లైటింగ్) కూడా మంచి పనితీరుని అందిస్తుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు - వివరాలు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది, విస్తరిస్తున్న మార్కెట్ అవసరాలను తీర్చడానికి వాహన తయారీదారులు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. దేశీయ విఫణిలో త్వరలో విడుదలయ్యే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక అమ్మకాలు పొందిన మారుతి సుజుకి సరికొత్త అవతార్‌లో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త కారు ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది 2024 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. ఇది జెనరేషన్ 2 ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఒక ఛార్జ్‌తో సుమారు 300 కిమీ నుంచి 350 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. సరైన గణాంకాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుడలవుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అవుట్గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుందని, ఇందులో ADAS వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. 2024 ప్రారంభంలో విడుదల కానున్న ఈ కారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందిన మహీంద్రా థార్.. త్వరలో 5 డోర్ రూపంలో విడుదలకానుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు అవుట్గోయింగ్ వెర్షన్‌తో పోలిస్తే అదనపు టెక్నాలజీ, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్పీరియన్స్.. టాటా కర్వ్ ఈవీ 2023 ఆటో ఎక్స్‌పోలో కనువిందు చేసిన టాటా కర్వ్ ఈవీ 2024 చివరి నాటికి భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు ఫుల్ ఛార్జ్‌తో 400 కిమీ నుంచి 500 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్ - వివరాలు
భారతదేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. దీంతో కొత్త వాహనాలు, కొత్త మొబైల్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కావున ఈ కథనంలో ఈ నెల (అక్టోబర్) దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్ గురించి తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్ 04 న విడుదలకానున్నట్లు సమాచారం. ఇది పిక్సెల్ 8 & పిక్సెల్ 8 ప్రో అనే రెండు మోడల్స్‌లో విడుదలకానున్నట్లు సమాచారం. పిక్సెల్ 8లో 6.2 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే, ప్రో మోడల్ 6.7 ఇంచెస్ LTPO డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. పిక్సెల్ 8 లో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 'ప్రో' లో 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా ఉండవచ్చు. వీటి ధరలు వరుసగా రూ. 58170 & రూ. 74814 వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. వివో29 సిరీస్ వివో వి29 సిరీస్ కూడా ఈ నెల 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కూడా వీ29, వీ29 ప్రో అనే రెండు వేరియంట్లలో విడుదలకానుంది. వీ29 లో 120 Hz రేటుతో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉండవచ్చని సమాచారం. రెండు వేరియంట్లు మంచి కెమెరా సెటప్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నాయి. రెడ్మీ నోట్ 13 5జీ చైనాలో విడుదలైన రెడ్మీ నోట్ 13 5జీ అక్టోబర్ చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 6.6 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే పొందుతుంది. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ధరలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. వన్‌ప్లస్ ఓపెన్ అక్టోబర్ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ ఓపెన్ ఒకటి. ఈ మొబైల్ ఈ నెల మధ్యలో లేదా చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 7.8 ఇంచెస్ 2కే అమోల్డ్ స్క్రీన్, 6.3 ఇంచెస్ అమోల్డ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. ధర & వివరాలు తెలియాల్సి ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఈ నెల మొదటి వారంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉండనుంది. అంతే కాకుండా స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 లేదా ఎక్సీనోస్ 2200 చిప్ సెట్ ఉండనున్నట్లు సమాచారం. కెమరా సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు, ఇవే!
వినాయక చవితి, విజయ దశమి, దీపావళి ఇలా.. రానున్నది అసలే పండుగ సీజన్. ఈ సమయంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెలలో (2023 సెప్టెంబర్) విడుదలకానున్న కొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హోండా ఎలివేట్ హోండా కంపెనీ ఈ నెల 4న తన ఎలివేట్ కారుని విడుదల చేయనుంది. మిడ్ సైజ్ విభాగంలో చేరనున్న ఈ SUV చూడటానికి చాలా ఆకర్షణీయంగా అద్భుతమైన డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కూడా ఉండనుంది. 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 121 హార్స్ పవర్, 145 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ అండ్ 7 స్టెప్ CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. వోల్వో సీ40 రీఛార్జ్ స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉంది. కావున కంపెనీ త్వరలో సీ40 రీఛార్జ్ కూపే విడుదల చేయనుంది. ఇది XC40 రీఛార్జ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ SUV కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందనుంది. 408 హార్స్ పవర్ అండ్ 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే డ్యూయల్-మోటార్ సెటప్ ఇందులో ఉంటుంది. ఒక సింగిల్ చార్జ్‌తో 418 కిమీ నుంచి 530 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ నెల 14న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయనుంది. ఈ కారు కర్వ్ & హారియర్ స్టైల్ కలిగి పెద్ద స్క్రీన్లు, టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్స్ అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు - టాప్ స్పీడ్ 120 కిమీ/గం మహీంద్రా బొలెరో నియో ప్లస్ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెల చివరలో బొలెరో నియో ప్లస్ విడుదల చేయనుంది. ఇది కంపెనీ మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఇది 7 సీటర్ అండ్ 9 సీటర్ వెర్షన్లలో అందుబాటులోకి రానుంది. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనుంది. 'మహీంద్రా బొలెరో నియో ప్లస్'కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్‌కమింగ్ కార్లు
TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్చల్ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మెంట్లలో కార్లను లాంచ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల కార్లను ఓసారి చూద్దాం! Maruti suzuki invicto మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్‌పివిని జీటా ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్పి ,206 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్‌ను కలిగి ఉంది. ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్ షోరూం) Honda Elevate హోండా ఎలివేట్ వచ్చే నెల ( సెప్టెంబరు) లో దేశంలో సేల్ కు రానుంది.హోండా ఎలివేట్ 1.5L NA పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ లాంటివాటికి గట్టి పోటీగా ఉండనుంది. Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ బెస్ట్ ఆప్షన్. బోల్డ్ స్టైలింగ్‌తో, బెస్ట్ ఇంటీరియర్‌తో వస్తోంది. అయితే ఇది 1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా. Toyota Rumion మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్. ఈమధ్యనే లాంచ్ అయినా ఈ కారు త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. విజువల్ ఫ్రంట్‌లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్‌తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్‌ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో అంతా సేమ్. Tata Punch EV SUV టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్‌తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా. Tata Nexon facelift ప్రమోషనల్ షూట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ పండుగ సీజన్లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా. Volvo C40 Recharge వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40) XC40 రీఛార్జ్ SUV-కూపే వెర్షన్. మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్‌తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా 4.7 సెకన్లలో 100kmph వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్ -
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
పాన్ ఇండియా రేంజులో విజయ్ మరో సినిమా!
హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే మూడుప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతుండగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’(వర్కింగ్ టైటిల్), పరశురామ్ డైరెక్షన్లో ‘వీడీ 13’ (వర్కింగ్ టైటిల్) సినిమాలకు కొబ్బరికాయ కొట్టారు విజయ్. తాజాగా ఇంద్రగంటి–విజయ్‌ల కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తారని టాక్. ఈ మూవీకి ‘జటాయు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తోందట చిత్రబృందం. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని, ప్రీ ప్రోడక్షన్ పనులు కూడాప్రారంభమయ్యాయని భోగట్టా. కాగా ‘గీత గోవిందం’ వంటి హిట్ తర్వాత విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లోప్రారంభమైన ‘వీడీ 13’ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్–ఇంద్రగంటి కాంబినేషన్ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారట ‘దిల్’ రాజు. -
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. త్వరలో రానున్న లేటెస్ట్ మోడల్స్ ఇవే!
భారతదేశంలో పండుగ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది, అయితే ఇప్పటికే అనేక కంపెనీలు ఆధునిక మోడల్స్ (కార్లు & బైకులు) విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని కార్లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో టాటా పంచ్ ఈవీ, ఫోర్స్ గూర్ఖా 5-డోర్, హోండా ఎలివేట్ మొదలైన మోడల్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఇప్పటికే ఉత్తమ అమ్మకాలు పొందుతున్న టాటా పంచ్ మైక్రో ఎస్‌యువిని ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో అనేక సందర్భాల్లో కనిపించింది. కావున ఇది 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఫోర్స్ గూర్ఖా 5-డోర్ (Force Gurkha 5 Door) అత్యంత శక్తివంతమైన ఆఫ్ రోడర్ ఫోర్స్ గూర్ఖా కూడా త్వరలో 5 డోర్స్ వెర్షన్లో విడుదలకావడానికి సిద్ధంగా ఉంది. కేరళ మార్కెట్లో విపరీతమైన అమ్మకాలు పొందిన ఈ SUV మరిన్ని ఆధునిక హంగులతో విడుదలైతే తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తోంది. ఇది 5 డోర్ మోడల్ కాబట్టి సీటింగ్ కాన్ఫిగరేషన్ మారుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. హోండా ఎలివేట్ (Honda Elevate) 2023 సెప్టెంబర్ నాటికి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కారు మిడ్ సైజ్ విభాగంలో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది మన దేశంలో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer) 2023 ఆటో ఎక్స్పో వేదికపై కనిపించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇది హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ హ్యాచ్‌బ్యాక్ ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుందని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో హైదరాబాద్ ఎక్కడుందంటే?) టయోటా రూమియన్ (Toyota Rumion) ఎమ్‌పివి విభాగంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మాత్రమే కాకుండా వినియోగదారుల కోసం టయోటా కొత్త 'రూమియన్' విడుదల చేయనుంది. మారుతి ఎర్టిగా బేస్డ్ రూమియన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 2021 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో విడుదలైన ఈ కారు 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ గడ్డపై అడుగుపెట్టనుంది. దీని కోసం కంపెనీ ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది. ఇవి మాత్రమే కాకుండా మార్కెట్లో విడుదలకావడానికి హ్యుందాయ్ ఐ20 పేస్లిఫ్ట్ (2023 నవంబర్), ఫోక్స్‌వ్యాగన్ పోలో (2023 నవంబర్), ఎంజి 3 (MG 3) హ్యాచ్‌బ్యాక్ కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
త్వరలో విడుదలకానున్న కొత్త కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ వంటి అత్యంత ఖరీదైన కార్లు దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. కాగా వచ్చే నెలలో కూడా కొన్ని కార్లు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఇన్విక్టో, హ్యుందాయ్ ఎక్స్టర్, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా 2023 జులై 5న ఇన్విక్టో అనే కొత్త ఎంపివిని విడుదల చేయనుంది. కంపెనీ దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రూ. 25,000 టోకెన్ మొత్తంతో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న మైక్రో ఎస్యువి 'ఎక్స్టర్'. కంపెనీ రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరిస్తుంది. ఇది జులై 10న అధికారికంగా విడుదలకానున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు సింగిల్ అండ్ డ్యూయెల్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?) హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్జీ ఇంజన్ తక్కువ అవుట్‌పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న కియా సెల్టోస్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త మోడల్ ట్వీక్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ లాంప్స్ వంటి వాటితో పాటు సరి కొత్త బంపర్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్‌లో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 115 హార్స్పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు.. 116 హార్స్పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఈ కారుకి సంబంధించిన అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు. జులై మధ్య నాటికి లేదా చివరి నాటికి అధికారిక ధరలు తెలుస్తాయి. -
భారతదేశంలో రాబోయే టాప్ 10 ఎక్స్‌ప్రెస్‌వేలు
-
శర్వానంద్‌పై ఆశలు పెట్టుకున్న కృతి శెట్టి
-
మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే..
ఫేవరెట్ కార్ల కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్న కస్టమర్లకు వాహన సంస్థలు శుభవార్త చెప్పాయి. మే నెలలో పలు ప్రముఖ కార్లు లాంచ్ అవుతున్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఎంజీ కామెట్ ఈవీ, 2023 లెక్సస్ ఆర్ఎక్స్ వంటి కొన్ని కార్లు ఏప్రిల్ నెలలోనే విడదలయ్యాయి. ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు! చాలా కాలంగా ఊరిస్తున్న జిమ్నీని మే నెలలో విడుదల చేయడానికి మారుతి సుజికి సిద్ధమైంది. టాటా మోటార్స్ తన సీఎన్జీ లైనప్‌ను రెండు కొత్త మోడళ్లతో విస్తరిస్తోంది. అలాగే బీఎండబ్ల్యూ కూడా రెండు మోడళ్లను లాంచ్ చేస్తోంది. కొన్ని కార్లకు ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. మారుతీ సుజుకి జిమ్నీ మారుతీ సుజుకి జిమ్నీ (Jimny) కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన లాంచ్ ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. మారుతి జిప్సీకి వారసత్వంగా ఇది వచ్చేస్తోంది. భారత్ కోసం ప్రత్యేకంగా ఐదు-డోర్ల బాడీ స్టైల్‌తో దీన్ని రూపొందించారు. దీని నో-నాన్సెన్స్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలు, నిచ్చెన-ఫ్రేమ్ చట్రం, తక్కువ-శ్రేణి 4x4 ఫీచర్లతో లైఫ్ వాహనంగా గుర్తింపు పొందుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇది 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ ద్వారా 105 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండవచ్చని అంచనా . బీఎండబ్ల్యూ ఎం2 బీఎండబ్ల్యూ రెండవ తరం M2 (G87)ని భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి కానుంది. టాప్-రంగ్ కాంపిటీషన్ రూపంలో వచ్చే ఈ లగ్జరీ కార్ అంతకుముందున్న కార్ మాదిరిగా కాకుండా కొత్త M2 ప్రామాణిక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కార్ 460 హార్స్ పవర్‌ను, 550Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్ ట్విన్-టర్బో ఇన్లైన్ సిక్స్ ఇంజన్ ఉంటుంది. స్టాండర్డ్‌గా 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. M2 ఎక్స్-షోరూమ్ అంచనా ధర సుమారు రూ. 1 కోటి. టాటా ఆల్ట్రోజ్ CNG దేశంలో సీఎన్జీ అత్యంత ఆదరణ పొందడంతో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ CNGని విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్జీ కిట్‌తో వస్తున్న దేశంలోని మూడవ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అవుతుంది. ఆల్ట్రోజ్ CNG కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టోకెన్ మొత్తం రూ. 21,000. మే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని ఇదివరకే ప్రకటించింది. CNG కిట్ ఆల్ట్రోజ్ XE, XM+, XZ, XZ+ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. టాప్-స్పెక్ ట్రిమ్ అల్లాయ్ వీల్స్, ఆటో AC, సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో ఈ కార్ నడుస్తుంది. ఇది సీఎన్జీ మోడ్‌లో 77 హార్స్ పవర్, 97Nm టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. బీఎండబ్ల్యూ X3 M40i బీఎండబ్ల్యూ X3 M40i అనేది X3 కార్లలో హై పర్ఫార్మెన్స్ వేరియంట్. ఇది BMW M340i సెడాన్‌తో దాని పవర్‌ట్రెయిన్‌ను పంచుకుంటుంది. ఇది 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 360 హార్స్ పవర్, 500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. X3 M40i M స్పోర్ట్ స్టైలింగ్ ప్యాకేజీని ప్రామాణికంగా కలిగి ఉంది. అలాగే వేరియబుల్ స్పోర్ట్ స్టీరింగ్, M స్పోర్ట్ బ్రేక్‌లు, M స్పోర్ట్ డిఫరెన్షియల్, అడాప్టివ్ M సస్పెన్షన్ వంటి హై పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్ మొత్తం రూ. 5 లక్షలు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! -
వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్, ఇవే!
2023 ఏప్రిల్ నెల దాదాపు ముగిసింది. మే నెల ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వచ్చే నెలలో (మే 2023) విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఏవి? వాటి వివరాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7A): 2023 మే నెలలో విడుదలకానున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌లో 'గూగుల్ పిక్సెల్ 7ఏ' (Google Pixel 7A) ఒకటి. వచ్చే నెల 10న జరగనున్న గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ వేదికగా ఈ మొబైల్ విడుదలకానున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. 6.1 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే కలిగిన గూగుల్ పిక్సెల్ 7ఏ 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్787 కెమెరా, లేటెస్ట్ టెన్సార్ జీ2 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడికానున్నాయి. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold): గూగుల్ విడుదలచేయనున్న పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మొబైల్ మే 10న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 5.8 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.69 ఇంచెస్ ఇన్నర్ డిస్ప్లే స్క్రీన్స్ కలిగి అద్భుతమైన కెమెరా ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. రియల్మీ 11 ప్రో (Realme 11 Pro): భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో రియల్మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాగా కంపెనీ వచ్చే నెలలో 11 ప్రో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ 7000 సిరీస్ చిప్సెట్ కలిగి 108mp ప్రైమరీ, 2mp డెప్త్ కమెరా సెటప్ పొందనుంది. ఖచ్చితమైన లాంచ్ డేట్, ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!) రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro Plus): మే 2023లో విడుదలకానున్న మరో రియల్మీ మొబైల్ '11 ప్రో ప్లస్'. ఇది వచ్చే నెలలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే సమాచారం అందుబాటులో లేదు, కానీ ఇది దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమ డిజైన్, ఫీచర్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ .. సూపర్ క్యూట్ సంయుక్త మీనన్
-
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
శేఖర్ కమ్ములతో సినిమా ఎప్పుడు?
-
ఊర మాస్ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ..
-
కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..
భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న కియా మోటార్స్ మరో నాలుగు కొత్త కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో సిఎన్జి, 5 సీటర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 2025 నాటికి ఎలక్ట్రిక్ SUV విడుదలచేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. కొత్త కియా సెల్టోస్: కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకువస్తున్న ఉత్పత్తులలో కియా సెల్టోస్ ఒకటి. ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. ఈ మోడల్ సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. కావున ఈ ఏడాది చివరినాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కియా సోనెట్ సిఎన్జి: ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ సిఎన్జి రూపంలో విడుదలవుతుందని కంపెనీ తెలిపింది. సిఎన్జి వాహనాల వినియోగం పెరుతున్న తరుణంలో సోనెట్ సిఎన్జి విడుదలకు సిద్ధమవుతోంది. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనుంది, దీని ధర పెట్రోల్ వెర్షన్ కంటే రూ. 1 లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్: జూన్ 14 లాస్ట్ డేట్.. ఇలా చేస్తే అంతా ఫ్రీ) కియా కారెన్స్ 5 సీటర్: సెవెన్ సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్న కియా కారెన్స్ త్వరలో 5 సీటర్ రూపంలో విడుదలకానుంది. ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్‌లో లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఫైవ్ సీటర్ కేవలం బేస్ వేరియంట్లకు మాత్రమే సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. న్యూ జనరేషన్ కార్నివాల్: 2023 కియా కార్నివాల్ 2023 ప్రారంభమలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో దర్శనమిచ్చింది. ఈ MPV ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో విడుదలకానుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న కార్నివాల్ కంటే 2023 మోడల్ కొంత పెద్దదిగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
ఎలక్ట్రిక్ కారుగా సుజుకి జిమ్ని, ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ దృష్టిలో ఉంచుకుని సైకిల్స్ నుంచి పెద్ద కమర్షియల్ వాహనాల వరకు ఎలక్ట్రిక్ వెర్షన్స్‌లో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి తమ పాపులర్ ఆఫ్ రోడర్ జిమ్నీని ఎలక్ట్రిక్ రూపంలో విడుదలచేయడానికి సన్నద్ధమవుతోంది. మారుతి సుజుకి తన జిమ్నీ ఎస్‌యువిని 2026 నాటికి ఎలక్ట్రిక్ కారుగా తీసుకురానుంది. ఇది డిజైన్ పరంగా ఎక్కువ మార్పులకు లోనయ్యే అవకాశం లేదు. అయితే జిమ్ని ఎలక్ట్రిక్ కారు కావున ఫ్రంట్ బంపర్ కొత్తగా ఉంటుంది. ఇందులో ఛార్జింగ్ పోర్ట్ అమర్చిందట. (జిమ్ని, ఫైల్ ఫోటో) గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జిమ్ని 3-డోర్స్ మోడల్ ఎలక్ట్రిక్ కారుగా మొదట యూరప్ దేశాలలో విడుదలవుతుంది. కంపెనీ అనుకున్నట్లుగానే జిమ్ని ఎలక్ట్రిక్ విడుదల చేస్తే అమ్మకాలలో తప్పకుండా చరిత్ర సృష్టిస్తుంది. జిమ్ని ఇటీవల 2023 ఆటో ఎక్స్‌పోలో 5 డోర్స్ రూపంలోవిడుదలైంది. రాబోయే జిమ్నీ ఎలక్ట్రిక్ కారుని పూర్తిగా రీ-డిజైన్ చేయడం సులభమైన పని కాదు. పెట్రోల్ మోడల్ ఎలక్ట్రిక్ కారుగా రోపుదిద్దుకునే సమయంలో ఎక్కువ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ వంటి వాటిని అమర్చడం ఇతర మార్పులు ఇందులో చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కంపెనీ 2026 నాటికి విడుదల చేయనున్న తెసులుస్తోంది. జిమ్నీ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికె ఆటో ఎక్స్‌పోలో కనిపించిన eVX కాన్సెప్ట్‌లో ఉపయోగించిన అదే 60kWh బ్యాటరీ ఉపయోగించే అవకాశం ఉంది. కంపెనీ ఇంజనీర్లకు మరింత స్థలం అవసరమైతే డబుల్-డెక్ బ్యాటరీ మాడ్యూల్ ఉపయోగించవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 90 స్థానాలు గెలుస్తుంది : బండి సంజయ్
-
స్నాప్‌చాట్ గుడ్ న్యూస్: వారికి నెలకు రూ. 2 లక్షలు
న్యూఢిల్లీ: కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే పాపులర్ ఫొటో మెసేజింగ్ ట్యాప్ స్నాప్‌చాట్ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రకటించింది. భారతదేశంలో స్నాప్‌చాట్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్‌ను ప్రారంభించినట్లు స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్మంగళవారం ప్రకటించింది. ఇందుకు డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ డిస్ట్రోకిడ్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా నెలకు 20 మంది బడ్డింగ్ ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి 2,500 (దాదాపు రూ. 2,04,800) ప్రోత్సాహాన్ని అందించనుంది. కొత్తగా ప్రకటించిన స్నాప్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్ ద్వారా దేశంలోని అభివృద్ధి చెందుతున్న కళాకారులను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలను అందించనుంది. నెలకు మొత్తంగా 50వేల డాలర్ల (దాదాపు రూ.41 లక్షలు) వరకు గ్రాంట్లను అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తు కళాకారులే లక్ష్యంగా ప్లాట్‌ఫారమ్‌లోని స్నాప్‌లు, ఇతర క్రియేషన్‌లకు లైసెన్స్ పొందిన సంగీతాన్ని జోడించేలా సౌండ్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. నవంబర్ మధ్య నాటికి ఈ గ్రాంట్ ప్రోగ్రాం షురూ అవుతుందని అంచనా. స్నాప్‌చాట్ సౌండ్స్ ఫీచర్ మ్యూజిక్ వీడియోలు 2.7 బిలియన్లకు పైగా క్రియేట్ అయ్యాయని, వీటిని 183 బిలియన్లకు పైగా వీక్షించారని కంపెనీ తెలిపింది. కాగా ఈ ఏడాది ఆగస్టులో స్నాప్‌చాట్+సబ్స్క్రిప్షన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా యూజర్లు ప్రత్యేకమైన ప్రయోగాత్మక, ప్రీ-రిలీజ్ ఫీచర్లకు ముందస్తుగానే యాక్సెస్ పొందొచ్చు. అంతేకాదు దేశంలో స్నాప్‌చాట్ ప్లస్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.49గా నిర్ణయించగా, యూఎస్‌లో ప్లస్ సర్వీస్‌కు నెలకు 3.99 డాలర్లు ( సుమారు రూ.330) వసూలు చేస్తోంది. -
నోకియా పోరాటం.. అదరిపోయే ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్..
ఒకప్పుడు ఇండియాలో నంబర్ వన్ బ్రాండ్‌గా వెలుగు వెలిగిన నోకియా కాలానుగుణంగా ఫీచర్లను జోడించకుండా వెనుకబడి పోయింది. ఆ తర్వాత తన ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి నుంచి మార్కెట్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ క్రమంలో అదిరిపోయే ఫీచర్లతో మరో ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఎన్ సిరీస్‌లో త్వరలో నోకియా మార్కెట్లోకి తేబోయే ఫోనుకు సంబంధించిన ఫీచర్లను చైనాకు చెందిన ప్రముఖ సంస్థ సీఎన్ఎమ్వో రిపోర్టు చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. 2006లో నోకియాలో సక్సెస్‌పుల్ మొబైల్గా ఎన్73 నిలిచింది. ఇందులో ఉపయోగించిన సింబియాన ఆపరేటింగ్ సిస్టమ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ అనుభూతిని అందిచింది. అయితే ఆండ్రాయిడ్ హవాలో మిగిలిన ఫోన్లలానే నోకియా శకం కూడా క్రమంగా కొడగట్టిపోయింది. అయితే త్వరలో లాంచ్ చేయబోయే ఫోన్‌ను ఎన్ 73 సిరీస్‌లోనే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఫీచర్లు - నోకియా రాబోయే ఫోనులో ఐదు కెమరాలను వినియోగించనున్నారు. ఇందులో ఒక కెమెరాకు 200 మెగా పిక్సెల్ సామర్థ్యం అందివ్వనున్నారు. దీనికి శామ్సంగ్ ఐసోసెల్ హెచ్‌పీ వన్ సెన్సార్లు వినియోగించనున్నారు. వెనుక వైపు ఉండే ఐదు కెమెరాల్లో రెండు కెమరాలకు శక్తివంతమైన సెన్సార్లు ఉంటాయి. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ అందిస్తున్నారు. - 2019లోనే నోకియా ఐదు కెమెరాల సెటప్‌తో ప్యూర్ వ్యూ అనే మోడల్ రిలీజ్ చేసినా.. అందులో సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావడంతో ఆ మోడల్ పెద్దగా క్లిక్ కాలేదు. కానీ కెమెరాలకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో ఈ సారి ఆ కెమెరా సెటప్‌ను మరింత సమర్థంగా అప్‌గ్రేడ్ చేశారు. - డిస్ప్లేలో కర్వ్డ్ ఎడ్జ్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇకనైనా ఇక రాబోయే ఫోన్ ఈ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ సంగతేంటి, ధర ఎంత ఉండవచ్చనే అంశాలను అతి త్వరలోనే అందిస్తామని సీఎన్ఎంవో పేర్కొంది. కనీసం ఈ ఫోనుతో అయినా నోకియా మార్కెట్లో తన ఉనికి చాటుకోవాలని ఆ బ్రాండ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చదవండి: ఎయిర్టెల్, జియో యూజర్లకు బంపరాఫర్! -
సిమ్‌కార్డ్, నెట్‌వర్క్‌లతో పని లేదు... ఆపిల్ నుంచి సరికొత్త టెక్నాలజీ?
టెక్నాలజీ వరల్డ్‌లో అనేక నూతన ఆవిష్కరణలకు కేరాప్ అడ్రస్‌గా యాపిల్ నిలిచింది. ఏదైనా ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తెచ్చిందంటే మిగిలిన కంపెనీలన్నీ ఆ బాటలోనే నడుస్తాయి. మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, టాప్‌నాచ్ ఒకటేమిటి ఇప్పుడు పాపులర్ ఫీచర్లలో సగానికి పైగా యాపిల్ వల్లే ట్రెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటిని మించి మరో పాత్ బ్రేకింగ్ ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తేనుందని మార్కెట్ వర్కాలు అంటున్నాయి. లియోతో మార్పులు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు అన్నీ కూడా నెట్వర్క్ ఆధారంగా పని చేస్తున్నాయి. 2జీ మొదలుకుని ఇప్పుడు ఎల్టీఈ (లాంగ్‌టర్మ్ ఎవల్యూషన్), 5జీ వరకు వచ్చాం. శాటిలైట్ తరంగాల ఆధారంగా ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ఈ నెట్‌వర్క్‌లు పని చేస్తున్నాయి. అయితే వీటిని మించేలా భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా లియో టెక్నాలజీలో సిమ్‌తో అవసరం లేకుండా నేరుగా హ్యండ్‌సెట్ ద్వారానే ఇటు కాల్స్, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్ కొనసాగించవచ్చు. ఐఫోన్ 13తో మొదలు ? లియో టెక్నాలజీని ముందుగా అందిపుచ్చుకునేందుకు యాపిల్ అడుగులు వేస్తోంది. త్వరలో రిలీజ్ చేయబోతున్న యాపిల్ 13 మోడల్ లియో ఆధారంగా పని చేసే అవకాశం ఉందని మార్కెట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మొబైల్ ఆపరేటర్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్నట్టుగా ప్రత్యేకంగా ఏమైనా రీఛార్జీలు ఉంటాయా? లేక హ్యండ్‌సెట్ ధరలోనే అఅన్నీ పొందు పరుస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి యాపిల్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. లియో అంటే నెట్వర్క్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ప్రస్తుతం భూ వాతావరణం ఆవల ఉన్న శాటిలైట్లను ఉపయోగిస్తున్నారు. ఇకపై వాటితో సంబంధం లేకుండా భూమి నుంచి కేవలం 500 కి.మీ ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్లను మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించుకోబోతున్నారు. దీని కోసం లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను ప్రయోగించేందుకు బడా సంస్థలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆమెజాన్, ఎయిర్టెల్ , స్పేస్ఎక్స్,, టాటా, టెలిశాట్ వంటి కంపెనీలు ఈ పనిలో బిజీగా ఉన్నాయి. ఈ టెక్నాలజీ 90వ దశకం నుంచి అందుబాటులో ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేలా అనుమతులు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం తరఫున భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ సైతం ఇదే టెక్నాలజీపై ఆధారపడి పని చేయనుంది. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
కార్ల కంపెనీతో జియో ఒప్పందం.. నెట్ కనెక్టివిటీలో కొత్త శకం
ముంబై: ప్రయాణం చేసేప్పుడు మారుమూల ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌లు చేతులు కలిపాయి. అంతరాయం లేని ఇంటర్నెట్ అందిస్తామంటూ వినియోగదారులకు హమీ ఇస్తున్నాయి, ఈ మేరకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఎంజీ ప్లస్ జియో మోరిసన్ గ్యారెజేస్ (ఎంజీ) ఇండియా నుంచి ఇప్పటికే హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. కాగా త్వరలోనే మిడ్ రేంజ్ ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్‌యూవీలో ఇన్ఫోంటైన్‌మెంట్‌కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌తో జోడీ కట్టింది. నెట్ కనెక్టివిటీ త్వరలో రిలీజ్ చేయబోతున్న మిడ్ రేంజ్ ఎస్‌యూవీలో నిరంతం నెట్ కనెక్టివిటీ ఉండే ఫీచర్‌ని ఎంజీ మోటార్స్ జోడించనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్వర్క్ అందిస్వనుంది. కారులో నిరంతరం నెట్ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను జియో అందివ్వనుంది. దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్నెట్ను పొందవచ్చు. ఏమూలనైనా కొత్తగా వస్తున్న కార్లలో ఇన్ఫోంటైన్మెంట్ విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీపీఎస్ నావిగేషన్‌తో పాటు ఆడియో, వీడియోలకు సంబంధించి లేటెస్ట్ ఫీచర్లు యాడ్ చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లేకపోతే ఇందులో సగానికి పైగా ఫీచర్లు నిరుపయోగమే,. దీంతో కారులో ప్రయాణించే వారు పల్లె పట్నం తేడా లేకుండా ఏ మూలకు వెళ్లినా నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. టెక్నాలజీలో నంబర్ 1 జియోతో చేసుకున్న తాజా ఒప్పందం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీకి సంబంధించి తమ బ్రాండ్ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఎంజీ మోటార్స్ ప్రెసిడెంట్స్, ఎండీ రాజీవ్ చాబా అన్నారు. కనెక్టివీటీ, ఇన్ఫోంటైన్మెంట్, స్ట్రీమింగ్, టెలిమాటిక్స్ విషయంలో ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న అవరోధాలు తీరిపోతాయని జియో ప్రెసిడెంట్ కిరణ్ థామస్ అన్నారు. -
ఐఫోన్13 ఫీచర్లు హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయిన నెలరోజుల అయిందో లేదో అపుడే ఆపిల్ ఐఫోన్13 పై పలు నివేదికలు హల్చల్ చేస్తున్నాయి. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కుయో ప్రకారం టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు ఆపిల్ 2021లో ఐఫోన్ 13ను ఆవిష్కరించనుంది. స్వల్ప మార్పులతో ఐఫోన్ 12 తరహాలోనే, నాలుగు వేరియంట్లలో దీన్ని విడుదల చేయాలని భావిస్తోంది. తాజా అంచనా ప్రకారం ఐఫోన్ 13 ఫీచర్లపై అంచనాలు: 2021 ఐఫోన్లను పూర్తిగా వైర్లెస్ అనుభవంతో 5.4, 6.1, 6.7 అంగుళాల స్క్రీన్లతో మూడు పరిమాణాల్లో నాలుగు మోడల్స్ లాంచ్ చేయనుంది. రెండింటిని "ప్రో" మోడల్స్ గాను, మిగిలినవి బేసిక్ మోడల్స్‌గా రానున్నాయి. ఐఫోన్ 13లో వేగవంతమైన ఏ సిరీస్, క్వాల్కం కొత్త చిప్ సెట్‌ను జోడించనుంది. అలాగే కెమెరాసెటప్‌ను కూడా భారీగా అప్డేట్ చేయనుంది. కెమెరా టెక్నాలజీ పరంగా, హై-ఎండ్ 40 నుండి 64 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్‌లతో పాటు నాలుగు కెమెరాలనుఅమర్చనుంది. ఇంకా పోర్టింగ్ లెస్ డిజైన్, వైర్లెస్ ఛార్జింగ్, ఫేస్ఐడి ఆన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లను సెటప్‌లను చూడవచ్చు. 5జీ చిప్ విషయానికి వస్తే, ఆపిల్ 2021 ఐఫోన్లో క్వాల్కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 60 మూడవ తరం 5 జీ మోడెమ్‌ను ఉపయోగించవచ్చు. అలాగే రాబోయే మరిన్ని ఐఫోన్లలో కూడా ఎక్స్ 65, ఎక్స్ 70 క్వాల్కమ్ మోడెమ్ చిప్‌లను వినియోగించనుంది. అంతేకాదు ఐఫోన్ 12 ధరతో పోలిస్తే సాఫ్ట్ బ్యాటరీ బోర్డ్ డిజైన్‌ద్వారా దాదాపు 30 నుంచి 40 శాతం రేటును తగ్గించనుందనే ఊహాగానాలు ఐఫోన్ ప్రేమికులకు ఊరటనిస్తున్నాయి. -
స్పెషల్ ఎడిషన్ : హాలీవుడ్ మొనగాళ్లు
-
హోప్... సక్సెస్!
వరుస హిట్స్‌తో హుషారు మీదున్న అప్‌కమింగ్ స్టార్ శ్రద్ధాకపూర్... దాన్ని కొనసాగించాలని తాపత్రయపడుతోంది. ఈ ఏడాది విడుదలైన ‘ఏక్ విలన్, హైదర్’ చిత్రాలు మంచి విజయం సాధించడం... ఈ అమ్మడిలో ఉత్సాహం నింపాయట. 2015 కూడా ఇలాగే దూసుకుపోవాలని కోరుకుంటుందట. ‘వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే గానీ... వాటి కోసం ఆరాటపడను. నాదంతా ప్రవాహం ఎటుంటే అటు కొట్టుకుపోయే మనస్తత్వం. 2014 హ్యాపీ ఇయర్. రాబోయే సంవత్సరం కూడా ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంది శ్రద్ధా. ప్రస్తుతం ఈ లవ్లీ గాళ్ ‘ఏబీసీడీ 2’లో నటిస్తోంది. వరుణ్‌ధావన్ హీరో. వచ్చే ఏడాది మధ్యలో విడుదల అవుతుంది. -
ఎంబీఏలో వినూత్న స్పెషలైజేషన్లు ఎన్నో..
ప్రపంచంలోనే తొలిసారిగా 1908లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి మారుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలు.. కార్పొరేట్ కంపెనీల అవసరాలకు తగ్గట్లు మేనేజ్మెంట్ విద్య ఎన్నో మార్పుచేర్పులకు లోనైంది. గతంలో ఎంబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లకే పెద్దపీట ఉండేది. ఇప్పుడు ప్రపంచీకరణతోపాటే దేశ పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో కార్పొరేట్ ప్రపంచానికి విభిన్నమైన నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో జాబ్‌మార్కెట్‌కు అనుగుణంగా ఎంబీఏలో సరికొత్త స్పెషలైజేషన్లు తెరపైకి వచ్చాయి. ఆయా విశ్వవిద్యాలయాలు, బీస్కూల్స్‌లో ఎంబీఏలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విభిన్న అప్‌కమింగ్ స్పెషలైజేషన్లపై ప్రత్యేక ఫోకస్.. 1-రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ 2-పెట్రోలియం మేనేజ్మెంట్ 3-పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ 4-ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ 5- టెలికం మేనేజ్మెంట్ 6-హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ 7-ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ గ్రామీణాభివృద్ధి.. దేశ ప్రగతికి ప్రథమ సోపానం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉన్న మన దేశంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతి ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. అందుకే ఈ రంగాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల పరంగా ప్రతి ఏటా సుమారు రూ. లక్ష కోట్ల కేటాయింపులు చేస్తూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఎన్‌ఎల్‌ఆర్‌ఎం, ఎన్హెచ్ఆర్ఎం వంటి పలు పథకాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ పథకాలు సమర్థంగా అమలు కావాలంటే.. అందుకు అవసరమైన ఆర్థిక నిర్వహణ నైపుణ్యాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ నైపుణ్యాలను అందించే కోర్సు.. రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్! ఈ కోర్సును అభ్యసించిన విద్యార్థులకు రూరల్ డెవలప్మెంట్ మార్కెటింగ్, మేనేజీరియల్ ఎకనామిక్స్, మేనేజీరియల్ అకౌంటింగ్, రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనువర్తనాలు తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఇక.. అవకాశాల పరంగా చూస్తే.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు, పథకాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. దాంతో గ్రామీణాభివృద్ధి రంగంలో సుశిక్షితులైన వందల మంది మానవ వనరుల డిమాండ్ నెలకొనడం ఖాయం. మన దేశంలో ఈ కోర్సును అందిస్తున్న కళాశాలల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కోర్సుల గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన, సమాచారం కూడా అందుబాటులో లేదు. అయితే విద్యార్థులు ఈ కోర్సును చక్కటి ఉపాధికి వేదికగా భావించి ఎంచుకోవాలి. రూరల్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ విద్యార్థులు.. ప్రభుత్వ రంగంలో ప్రణాళిక సంఘం, ఆయా పథకాల నిర్వహణ విభాగాలు, వ్యవసాయం తదితర విభాగాలు.. ప్రైవేటు రంగంలో స్వచ్ఛంద సంస్థలు మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. అంతేకాకుండా ఇటీవల కాలంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పేరిట కార్పొరేట్ సంస్థలు కూడా పలు సామాజిక అభివృద్ధి కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో ఎంఎన్సీ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు వివిధ సంస్కృతుల ప్రజలతో కలిసిపోయే తత్వం.. గ్రామీణ ప్రాంతాలపై సహజమైన ఆసక్తి, అంకిత భావం.. కెరీర్ ప్రారంభంలోనే భారీ మొత్తాలతో వేతనాలు ఆశించకుండా పనిచేయగల సంసిద్ధత వంటి ప్రత్యేక లక్షణాలు ఉండాలి. డా॥ఎస్.ఎం. ఇలియాస్ డెరైక్టర్, సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఎన్ఐఆర్డీ, హైదరాబాద్ పెట్రోలియం మేనేజ్మెంట్ పెట్రోల్.. పెట్రోలియం అంటే.. పెట్రోల్ నిక్షేపాల వెలికితీత, పెట్రోల్ వినియోగం.. ఇవే సాధారణంగా మనందరికీ తెలిసిన విషయాలు! కానీ, క్షేత్రస్థాయిలో పెట్రోలియం నిక్షేపాలను కనుగొనడానికి, వెలికితీయడానికి ఎంతటి సాంకేతిక సామర్థ్యం అవసరమో.. అంతే స్థాయిలో నిర్వహణ నైపుణ్యాలూ ఉండాలి. ఎక్స్‌ప్లొరేషన్, ఉత్పత్తి, రిఫైనింగ్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా క్షేత్ర స్థాయి నుంచి వినియోగదారులకు చేరే వరకూ ప్రతి దశలోనూ నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ నైపుణ్యాలను అందించే కోర్సే.. పెట్రోలియం మేనేజ్మెంట్. ఇప్పటికే అన్ని దేశాలు సహజ, పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. పెట్రోలియం వనరుల అన్వేషణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ముఖ్యంగా షెల్ గ్యాస్, ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్, క్రూడ్ నాణ్యత నిర్ధారణ వంటి అంశాల్లో సాంకేతికపరమైన అవసరాలతోపాటు నిర్వహణ నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల డిమాండ్ పెరగనుంది. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారికి మరింత కలిసొచ్చే కోర్సుగా పెట్రోలియం మేనేజ్మెంట్ను పేర్కొనొచ్చు. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే కీలక ఇంధనాలు.. చమురు, సహజ వాయువు. ఎంబీఏ పెట్రోలియం పూర్తయ్యాక.. చమురు, గ్యాస్ కంపెనీల్లో ఫైనాన్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, పెట్రోలియం ఎకనామిక్స్ తదితర రంగాల్లో స్థిరపడొచ్చు. కన్సల్టింగ్ ఏజెన్సీల్లోనూ పనిచేయొచ్చు. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు సాంకేతిక దృక్పథం, న్యూమరికల్ స్కిల్స్, ‘థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అప్రోచ్’ ఎంతో అవసరం. అంతేకాకుండా ‘డూ ఇట్’ అనే వైఖరి ఉంటే తక్కువ సమయంలోనే కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయిదారు ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నప్పటికీ.. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా వీటి సంఖ్య కూడా సమీప భవిష్యత్తులోనే పెరగడం ఖాయం. ఈ కోర్సులో చేరాలనుకునేవారికి విస్తృత ఆలోచన పరిధి.. కష్టపడి పనిచేసే స్వభావం.. ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యం.. నిరంతరం నేర్చుకునే తత్వం.. అంతర్జాతీయ విపణిపై నిరంతర అవగాహన ఎంతో అవసరం. ప్రొ॥హేమంత్ సి. త్రివేది డెరైక్టర్, స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్మెంట్, పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ ఆవశ్యకత ఎంతో ఉంది. దేశంలో ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. కానీ వాటి అమలులో మరెన్నో లోపాలు. వీటిని సరిదిద్దుతూ అసలైన లబ్ధిదారులకు వాటిని చేర్చే విధంగా నైపుణ్యాలను అందించే కోర్సు.. పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కొన్ని దశాబ్దాల పాటు పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ కేవలం సివిల్ సర్వెంట్లకు, ఇతర ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమైంది. తర్వాత మారుతున్న కాలంతోపాటు ప్రభు త్వ ఆలోచనా దృక్పథంలోనూ మార్పు వచ్చింది. దీనికి అనుగుణంగా.. ప్రభుత్వం తాను చేపడుతున్న పథకాలపై విశ్లేషణ, సలహాలు, సూచనల కోసం కేవలం సివిల్ సర్వెంట్లే కాకుండా.. సమాజంలో నిపుణులు, మేధావుల సహకారం తీసుకుంటోంది. ఈ క్రమంలో.. ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలు, వాటికి సంబంధించి పర్యవసానాలు, లాభనష్టాలు, పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా చేరేందుకు గల మార్గాలు వంటి వాటిపై శిక్షణనిచ్చేందుకు తెరపైకి వచ్చిన కోర్సు.. పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్. పబ్లిక్ పాలసీ అనేది నిర్దేశిత లక్ష్యాల సాధనకు సంబంధించి సంస్థాగత నిర్ణయాలు, నిర్వహణ, ఆర్థిక, పరిపాలన విధానాల రూపకల్పన వంటి విషయాల్లో నైపుణ్యం అందిస్తుంది. ముఖ్యంగా విధాన సమస్యల సమీక్ష, డేటా అనాలిసిస్, సాధారణ ప్రజానీకానికి ఎదురవుతున్న సమస్యల పరిష్కార మార్గాలపై నిర్వహణ పరమైన నైపుణ్యాలను పూర్తి స్థాయిలో అందించేలా ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన వారు అవకాశాల గురించి ఆందోళన చెందనక్కర్లేదు. ప్రస్తుతం పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న ఈ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరిశోధనా సంస్థల్లో అనలిస్ట్‌లు, ప్రభుత్వ శాఖల్లో.. అదే విధంగా స్వచ్ఛంద సంస్థల్లో సలహాదారులు లేదా మేనేజర్లుగా అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కాన్సెప్ట్ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రైవేట్ సంస్థల్లో కూడా అవకాశాలు లభిస్తున్నాయి. కోర్సును ఎంచుకోవాలనుకునేవారికి ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి, అవగాహన ఉండాలి. ఇక.. అకడమిక్ పరంగా డేటా అనాలిసిస్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అవసరం. ప్రొ॥ఆర్. సుదర్శన్ డీన్, జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ, ఒ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ- హర్యానా ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ దేశంలో ఇన్సూరెన్స్ రంగం శరవేగంగా వృద్ధి చెందుతున్న తరుణమిది. భారత్‌లో బీమా రంగంలో ప్రభుత్వంతోపాటు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు సైతం ప్రవేశించాయి. మరోవైపు బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఇన్సూరెన్స్ డొమైన్ ఏరియాలో.. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోలు, వినియోగదారుల సేవాపరమైన అంశాలు, నిర్వహణ విభాగాల్లో సమర్థవంతమైన నిర్వహణ అత్యవసరంగా మారింది. అందుకు అనుగుణంగా బీమా రంగానికి అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే కోర్సు.. ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్! ఈ కోర్సులో భాగంగా.. జీవితబీమా సంబంధ వ్యవహారాల నిర్వహణతోపాటు జనరల్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలు (ఉదా: మెరైన్ కార్గో ఇన్సూరెన్స్, హెల్త్ అండ్ పర్సనల్ ఇన్సూరెన్స్, మిస్లేనియస్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్) బోధిస్తారు. అంతేకాకుండా రిస్క్ మేనేజ్మెంట్, యాక్చుయేరిల్ సైన్స్ వంటి సాంకేతిక అంశాలపైనా శిక్షణ ఉంటుంది. ఫలితంగా.. కోర్సు పూర్తయ్యే సమయానికి ఒక విద్యార్థి బీమా రంగ కార్యకలాపాలకు సంబంధించి అన్ని విభాగాల్లో పరిపూర్ణత సాధిస్తాడు. ఎంబీఏ ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌ను అభ్యసిస్తే బీమా సంస్థల్లో ఉద్యోగం దక్కించుకోవచ్చు. ఆసక్తిని బట్టి బీమా సలహాదారుగా పనిచేయొచ్చు. భవిష్యత్తులో మరిన్ని బీమా సంస్థలు ప్రవేశించే అవకాశముంది. కాబట్టి సమర్థులైన మానవ వనరుల అవసరం మరింత పెరగనుంది. అయితే, ఔత్సాహిక అభ్యర్థులకు ఇన్సూరెన్స్ రంగంతోపాటు.. ఈ రంగాన్ని ప్రభావితం చేసే దేశ ఆర్థిక పరిస్థితులపై నిరంతర అవగాహన ఉండాలి. దీంతోపాటు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, బృందంలో పనిచేసే లక్షణాలు ఉంటే మరింతగా రాణించగలరు. ప్రొ॥డి. విజయ లక్ష్మి చైర్ ప్రొఫెసర్, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ- పుణె టెలికం మేనేజ్మెంట్ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం టెలికం. ప్రపంచంలోని అతిపెద్ద రంగాల్లో భారత టెలికం రంగం కూడా ఒకటి. ఆర్థిక సంస్కరణల తర్వాత టెలికం రంగంలో ప్రైవేట్ రంగానికి అనుమతినిచ్చారు. అదేసమయంలో టెలికం సేవల వినియోగం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు ప్రైవేట్ రంగం విస్తరణ.. మరోవైపు సేవలకు డిమాండ్ వెరసి.. ఈ రంగంలో భారీగా నిపుణుల అవసరం ఏర్పడింది. టెలికం రంగం నిర్వహణకు సుశిక్షితులైన నిపుణులను తీర్చిదిద్దే కోర్సు.. టెలికం మేనేజ్మెంట్! అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఈ కోర్సు ఆవశ్యకత ఎంతో ఉంది. కోర్సులో భాగంగా.. మార్కెటింగ్, మేనేజీరియల్ ఎకనామిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్ వంటి రెగ్యులర్ ఎంబీఏ సబ్జెక్టులతోపాటు టెలికం విభాగానికి సంబంధించి.. టెలికం సర్వీసెస్ టెక్నాలజీస్, వైర్లెస్ కమ్యూనికేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, టెలికం సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఐటీ సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, కన్వర్జెన్స్ ఆఫ్ టెలికం నెట్వర్క్, సర్వీసెస్ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ టెలికం, కేస్ స్టడీస్ ఇన్ టెలికం మేనేజ్మెంట్ వంటి కోర్ సబ్జెక్ట్‌లలో శిక్షణ ఉంటుంది. ఇక.. ఈ రంగం భవిష్యత్ కోణంలో విశ్లేషిస్తే.. రోజుకో సరికొత్త టెక్నాలజీ.. కొత్త సంస్థల ప్రవేశంతో సేవల రంగంలో ఒకటైన కమ్యూనికేషన్‌కు సంబంధించి టెలికం విభాగం వేగంగా పురోగమిస్తోంది. ఈ నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బ్యాచిలర్ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు కెరీర్ ఉన్నతి పరంగా టెలికం మేనేజ్మెంట్ మరింత కలిసొచ్చే కోర్సు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు కష్టించేతత్వం, నిరంతరం ఆవిష్కృతమవుతున్న కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకునే దృక్పథం అవసరం. ప్రొ॥సునీల్ పాటిల్ డెరైక్టర్, సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికం మేనేజ్మెంట్- పుణే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దేశంలో హెల్త్‌కేర్ రంగం సగటున 15.5 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసుకుంటూ శరవేగంగా పయనిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆధునిక హంగులతో హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్స్ భారీగా ఏర్పాటవుతున్నాయి. అంతేకాకుండా హెల్త్‌కేర్ సంబంధిత హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ తదితర విభాగాలు కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ఫలితంగా క్లినికల్ నిపుణులతోపాటు ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు సేవలందించే విషయంలో నిర్వహణా నిపుణుల ఆవశ్యకత ఏర్పడుతోంది. వైద్యులు.. రోగులకు చికిత్సపరంగా సేవలందిస్తే.. సదరు ఆస్పత్రి పరిపాలన వ్యవహారాలు, రోగులకు సేవలందించేందుకు పలు విభాగాలను సమన్వయం చేయడం వంటి విధులను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు నిర్వర్తిస్తారు. ఈ క్రమంలో ఆదాయ-వ్యయాల విషయంలో అటు సంస్థకు, ఇటు రోగులకు అనుకూలమైన విధానాలు రూపొందించడం.. నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలు ఎంతో అవసరం. అటువంటి స్కిల్స్‌ను అందించే కోర్సు.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్! ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం, అదే విధంగా ప్రభుత్వం మెడికల్ టూరిజం కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఈ రంగంలో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించొచ్చు! కేవలం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్గానే కాకుండా.. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, హెల్త్ ఎన్జీఓలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు అకడమిక్ నేపథ్యంతోపాటు వైద్యులతో సమానంగా ప్రజలకు సేవలందిస్తున్నామనే ఆత్మ సంతృప్తి, సేవా దృక్పథం, పలు సంస్కృతుల ప్రజలతో మమేకం కావడం, కష్టపడి పనిచేసే తత్వం వంటి లక్షణాలు ఉంటే కెరీర్ మరింత ఉజ్వలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య రంగం అనేది ఆర్థిక మాంద్యం సెగ తగలని విభాగం కాబట్టి.. కెరీర్ పరంగా దీన్ని ఎవర్‌గ్రీన్‌గా పేర్కొనొచ్చు. డా॥ధీరేంద్ర కుమార్ డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, బెంగళూరు. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ భారత ఆర్థిక వ్యవస్థకు కుటుంబ వ్యాపారాలే వెన్నెముకలు. దేశంలోని మొత్తం వ్యాపారాల్లో 90 శాతం సంస్థలు, పరిశ్రమలు కుటుంబాల నిర్వహణ పరిధిలోనివే. ఈ సంస్థలపైన మరెన్నో అనుబంధ వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయి (ఉదా: వెండర్స్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్ట్ సంస్థలు తదితర). ఎన్ని బహుళ జాతి సంస్థలు దేశంలో అడుగుపెట్టినా భవిష్యత్తులోనూ దేశ ప్రగతి విషయంలో ఫ్యామిలీ బిజినెస్ కీలక పాత్ర పోషించనుంది. ఇంతలా ప్రాధాన్యం సంతరించుకున్న ఫ్యామిలీ బిజినెస్‌కు సంబంధించి.. సదరు యజమాని లేదా వారసుల్లో వ్యాపార వృత్తి నిర్వహణ నైపుణ్యాలు లేకపోవడం.. నిర్వహణ లోపం వంటివి సమస్యగా మారుతోంది. ఇలాంటి నైపుణ్యాలను అందించే కోర్సే.. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్. గతంలో సాధారణంగా ఈ తరహా కోర్సులను ఆయా సంస్థల యాజమాన్యాల వారసులే అభ్యసించేవారు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో.. ఒక కుటుంబ అధీనంలోని వ్యాపార సంస్థల నిర్వహణ దిశగా ఆయా యాజమాన్యాలు తమకు సహకరించేందుకు ఫ్యామిలీ బిజినెస్‌లో నిష్ణాతులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కోర్సులో భాగంగా సాధారణ ఎంబీఏ సబ్జెక్ట్‌లతోపాటు ఫ్యామిలీ బిజినెస్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలలో(స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ బిజినెస్, ఎంటర్ప్రెన్యూరియల్ బయోగ్రాఫిక్స్, ఎంటర్ప్రెన్యూర్ మేనేజ్మెంట్) శిక్షణ ఉంటుంది. కోర్సు ఔత్సాహికులకు అకడమిక్ లక్షణాలకంటే ప్రధానంగా మూడు సహజ లక్షణాలు అవసరం. అవి.. వ్యాపార నిర్వహణపై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, వ్యాపారంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలనే ఉత్సాహం. ఇవి ఉంటే ఫ్యామిలీ బిజినెస్ విభాగంలో రాణించడం ఎంతో తేలిక. ప్రొ॥పరిమళ్ మర్చెంట్ డెరైక్టర్- పీజీపీఎఫ్ఎంబీ, ఎస్.పి.జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై