భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది, విస్తరిస్తున్న మార్కెట్ అవసరాలను తీర్చడానికి వాహన తయారీదారులు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. దేశీయ విఫణిలో త్వరలో విడుదలయ్యే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
2024 మారుతి సుజుకి స్విఫ్ట్
దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక అమ్మకాలు పొందిన మారుతి సుజుకి సరికొత్త అవతార్‌లో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త కారు ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది 2024 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
టాటా పంచ్ ఈవీ
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. ఇది జెనరేషన్ 2 ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఒక ఛార్జ్‌తో సుమారు 300 కిమీ నుంచి 350 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. సరైన గణాంకాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుడలవుతాయి.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుందని, ఇందులో ADAS వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. 2024 ప్రారంభంలో విడుదల కానున్న ఈ కారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.
మహీంద్రా థార్ 5 డోర్
ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందిన మహీంద్రా థార్.. త్వరలో 5 డోర్ రూపంలో విడుదలకానుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు అవుట్‌గోయింగ్ వెర్షన్‌తో పోలిస్తే అదనపు టెక్నాలజీ, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్‌పీరియన్స్..
టాటా కర్వ్ ఈవీ
2023 ఆటో ఎక్స్‌పోలో కనువిందు చేసిన టాటా కర్వ్ ఈవీ 2024 చివరి నాటికి భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు ఫుల్ ఛార్జ్‌తో 400 కిమీ నుంచి 500 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment