Upcoming cars to launch in May, Maruti Suzuki Jimny, BMW M2 and more - Sakshi
Sakshi News home page

ఊరిస్తున్న కార్లు వచ్చేస్తున్నాయి.. మే నెలలో లాంచ్‌ అయ్యే కార్లు ఇవే.. 

Published Thu, Apr 27 2023 9:05 PM | Last Updated on Thu, Apr 27 2023 9:17 PM

upcoming cars in may maruti suzuki jimny bmw m2 and more - Sakshi

ఫేవరెట్‌ కార్ల కోసం ఎంతోగానో ఎదురుచూస్తున్న కస్టమర్లకు వాహన సంస్థలు శుభవార్త చెప్పాయి. మే నెలలో పలు ప్రముఖ కార్లు లాంచ్‌ అవుతున్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఎంజీ కామెట్ ఈవీ, 2023 లెక్సస్ ఆర్‌ఎక్స్‌ వంటి కొన్ని కార్లు ఏప్రిల్ నెలలోనే విడదలయ్యాయి.

ఇదీ చదవండి: ఐఫోన్‌ యూజర్లకు కొత్త యాప్‌.. విండోస్‌ కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు! 

చాలా కాలంగా ఊరిస్తున్న జిమ్నీని మే నెలలో విడుదల చేయడానికి మారుతి సుజికి సిద్ధమైంది. టాటా మోటార్స్ తన సీఎన్‌జీ లైనప్‌ను రెండు కొత్త మోడళ్లతో విస్తరిస్తోంది. అలాగే బీఎండబ్ల్యూ కూడా రెండు మోడళ్లను లాంచ్‌ చేస్తోంది. కొన్ని కార్లకు ఇ‍ప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

మారుతీ సుజుకి జిమ్నీ
మారుతీ సుజుకి జిమ్నీ (Jimny) కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన లాంచ్ ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. మారుతి జిప్సీకి వారసత్వంగా  ఇది వచ్చేస్తోంది. భారత్‌ కోసం ప్రత్యేకంగా ఐదు-డోర్ల బాడీ స్టైల్‌తో దీన్ని రూపొందించారు.

దీని నో-నాన్సెన్స్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలు, నిచ్చెన-ఫ్రేమ్ చట్రం, తక్కువ-శ్రేణి 4x4 ఫీచర్లతో లైఫ్‌ వాహనంగా గుర్తింపు పొందుతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇది 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ ద్వారా 105 హార్స్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండవచ్చని అంచనా .

బీఎండబ్ల్యూ ఎం2
బీఎండబ్ల్యూ రెండవ తరం M2 (G87)ని భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.  ఇది పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి కానుంది. టాప్-రంగ్ కాంపిటీషన్ రూపంలో వచ్చే ఈ లగ్జరీ కార్‌ అంతకుముందున్న కార్‌ మాదిరిగా కాకుండా కొత్త M2 ప్రామాణిక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ కార్‌ 460 హార్స్‌ పవర్‌ను, 550Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.0-లీటర్ ట్విన్-టర్బో ఇన్‌లైన్ సిక్స్ ఇంజన్ ఉంటుంది. స్టాండర్డ్‌గా 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. M2 ఎక్స్-షోరూమ్ అంచనా ధర సుమారు రూ. 1 కోటి.

టాటా ఆల్ట్రోజ్ CNG
దేశంలో సీఎన్‌జీ అత్యంత ఆదరణ పొందడంతో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ CNGని విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది ఫ్యాక్టరీ అమర్చిన సీఎన్‌జీ కిట్‌తో వస్తున్న దేశంలోని మూడవ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అవుతుంది. ఆల్ట్రోజ్ CNG కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టోకెన్ మొత్తం రూ. 21,000. మే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని ఇదివరకే ప్రకటించింది.

CNG కిట్ ఆల్ట్రోజ్ XE, XM+, XZ, XZ+ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. టాప్-స్పెక్ ట్రిమ్ అల్లాయ్ వీల్స్, ఆటో AC, సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌తో ఈ కార్‌ నడుస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 77 హార్స్‌ పవర్‌, 97Nm టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంటుంది.

బీఎండబ్ల్యూ X3 M40i 
బీఎండబ్ల్యూ X3 M40i అనేది X3 కార్లలో హై పర్ఫార్మెన్స్‌ వేరియంట్.  ఇది BMW M340i సెడాన్‌తో దాని పవర్‌ట్రెయిన్‌ను పంచుకుంటుంది. ఇది 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 360 హార్స్‌ పవర్‌,  500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది.  

X3 M40i M స్పోర్ట్ స్టైలింగ్ ప్యాకేజీని ప్రామాణికంగా కలిగి ఉంది. అలాగే వేరియబుల్ స్పోర్ట్ స్టీరింగ్, M స్పోర్ట్ బ్రేక్‌లు, M స్పోర్ట్ డిఫరెన్షియల్, అడాప్టివ్ M సస్పెన్షన్ వంటి హై పర్ఫార్మెన్స్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్‌ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  బుకింగ్ మొత్తం రూ. 5 లక్షలు.

ఇదీ  చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్‌.. స్టాక్‌ మార్కెట్‌ యువ సంచలనం ఈమె!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement