ఫెస్టివల్‌ సీజన్‌ వచ్చేస్తోంది...సూపర్‌ అప్‌కమింగ్‌ కార్లు  | Festive season Upcoming top cars in india watch out | Sakshi
Sakshi News home page

ఫెస్టివల్‌ సీజన్‌ వచ్చేస్తోంది...సూపర్‌ అప్‌కమింగ్‌ కార్లు 

Published Fri, Aug 25 2023 11:34 AM | Last Updated on Fri, Aug 25 2023 2:26 PM

 Festive season Upcoming top cars in india watch out - Sakshi

TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్‌ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్‌, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మె​ంట్‌లలో కార్లను లాంచ్‌ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల  కార్లను ఓసారి చూద్దాం!

Maruti suzuki invicto
మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్‌పివిని జీటా  ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్‌పి ,206 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్‌పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్‌ను కలిగి ఉంది.   ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్‌ షోరూం)

Honda Elevate
హోండా ఎలివేట్ వచ్చే నెల (  సెప్టెంబరు) లో దేశంలో  సేల్‌ కు రానుంది.హోండా ఎలివేట్  1.5L NA పెట్రోల్ ఇంజన్‌తో  6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్  లాంటివాటికి  గట్టి పోటీగా ఉండనుంది.  

Citroen C3 Aircross 
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్  బెస్ట్‌ ఆప్షన్‌. బోల్డ్ స్టైలింగ్‌తో, బెస్ట్‌ ఇంటీరియర్‌తో వస్తోంది. అయితే ఇది  1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా.

Toyota Rumion
మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్.  ఈమధ్యనే లాంచ్‌ అయినా ఈ కారు  త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.  విజువల్ ఫ్రంట్‌లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్‌తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్‌ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో  అంతా సేమ్‌. 

Tata Punch EV SUV 
టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్‌తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి  టాటా మోటార్స్  సన్నాహాలు చేస్తోంది. ఇది  జిప్‌ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో  వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్‌ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా.

Tata Nexon facelift 
ప్రమోషనల్ షూట్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్‌లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ  పండుగ సీజన్‌లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా.

Volvo C40 Recharge
వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40)  XC40 రీఛార్జ్  SUV-కూపే వెర్షన్.  మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్‌తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా   4.7 సెకన్లలో 100kmph  వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర  రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement