
భారతదేశంలో ఆల్ వీల్స్ డ్రైవ్ (AWD), రియర్ వీల్ డ్రైవ్ (RWD) వంటి మోడల్స్ ఉన్నాయి. అయితే ఇందులో రియర్ వీల్ డ్రైవ్ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎక్కువమంది ఈ మోడల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో అత్యంత సరసమైన 10 రియర్ వీల్ డ్రైవ్ కార్లు ఏవి?, వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.
➤టయోటా ఫార్చ్యూనర్: రూ.35.37 లక్షలు
➤మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ: రూ.21.90 లక్షలు
➤ఇసుజు డీ-మ్యాక్స్: రూ.21.50 లక్షలు
➤టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ.19.99 లక్షలు
➤మహీంద్రా బిఈ6: రూ.18.90 లక్షలు
➤మహీంద్రా స్కార్పియో: రూ.13.62 లక్షలు
➤మహీంద్రా థార్: రూ.11.50 లక్షలు
➤మహీంద్రా బొలెరో: రూ.9.79 లక్షలు
➤ఎంజీ కామెట్: రూ. రూ. 7 లక్షలు
➤మారుతి ఈకో: రూ.5.44 లక్షలు
రియర్ వీల్ డ్రైవ్
రియర్ వీల్ డ్రైవ్ కార్లలోని ఇంజిన్.. శక్తిని (పవర్) వెనుక చక్రాలను డెలివరీ చేస్తుంది. అప్పుడు వెనుక చక్రాలను కారును ముందుకు నెడతాయి. అయితే ఈల్ వీల్ డ్రైవ్ కార్లు.. శక్తిని అన్ని చక్రాలను పంపుతాయి. ధరల పరంగా ఆల్ వీల్ డ్రైవ్ కార్ల కంటే.. రియర్ వీల్ డ్రైవ్ కార్ల ధరలే తక్కువ. ఈ కారణంగానే చాలామంది ఈ RWD కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment