కొత్త కారు కొనాలనుకుంటున్నారా? టేక్ ఏ లుక్‌! | top 10 cars realesed in indian market | Sakshi
Sakshi News home page

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? టేక్ ఏ లుక్‌!

Published Tue, Feb 23 2016 8:25 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? టేక్ ఏ లుక్‌!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? టేక్ ఏ లుక్‌!

ఒకప్పుడు కారు మధ్య తరగతి వారి కల. అది కేవలం డబ్బున్న వారికే సొంతం. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారికి కార్లు అందుబాటులోకి వచ్చాయి. మీరు కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా? త్వరలో భారత మార్కెట్లోకి విడుదల కానున్న టాప్-10 కార్లను ఇక్కడ ఇస్తున్నాం. కొనాలనుకంటే ఓ లుక్కేయండి.
 
 1. టాటా జికా/టాటా సెడన్: కార్ల తయారీలో భారత దిగ్గజ సంస్థ టాటా కంపెనీ జికా మోడల్‌తో ఈ మార్చి నాటికి కొత్త కారును మార్కెట్లోకి తీసుకురానుంది. వాస్తవానికి జనవరిలోనే ఈ కారు విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రపంచాన్ని వణికించిన ఓ వైరస్‌కు కూడా ఈ పేరే ఉండటంతో ఊహించని సమస్యలను  ఎదుర్కొంది. ముందుగా జిప్పీకార్ అనే పదం నుంచి జికా పేరు పెట్టారు. ఇప్పుడు కొత్త పేరుగా అడోర్, సివెట్, లేదా టియాగోల్లో ఒక దాన్ని ఖరారు చేయనున్నారు. కైట్ 5 అనే పేరుతో ఈ కారును ఇప్పటికే ఆటో ఎక్స్‌పో 2016లో ప్రదర్శించారు. 3 సిలిండర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్ యూనిట్లతో టాటా ఈ మోడల్‌ను తీసుకురానుంది. మారుతీ సుజుకీ సెలేరియో, హ్యూండయ్ ఐ10 కార్లకు పోటీగా టాటా జికాను విడుదల చేస్తోంది. దీని ధర రూ.3.5 నుంచి 5 లక్షల మధ్య ఉండనుంది.
 
 2. మారుతీ సుజుకీ వితారా బ్రెజ్జా: ఈ ఎస్‌యూవీని ఆటో ఎక్స్‌పో 2016లో కంపెనీ ప్రదర్శించింది. ఏప్రిల్‌లో దీన్ని విడుదల చేయనుంది. మహీంద్రా టీయువీ 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌కు పోటీగా ఈ మోడల్ ను మారుతీ తీసుకొస్తోంది. 5 గేర్లు ఉండే ఈ కారులో ఏవీటీ కూడా ఉండే అవకాశాలున్నాయి. 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చే ఈ మోడల్ ధర రూ.6 నుంచి 9 లక్షలు ఉంటుంది.
 
 3. రెనాల్ట్ డస్టర్: ఈ కారు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. మార్చిలో విడుదల చేయనున్నారు. ఈ కొత్త మోడల్లో బయటికి కనిపించే పెద్ద మార్పులేమీ చేయలేదు. సీట్ కవర్లను రీ డిజైన్ చేశారు. దీని ధర రూ.9.5 నుంచి 15 లక్షలు ఉండే అవకాశాలున్నాయి.
 
4. ఫోక్స్‌వాగన్ అమియో: ఈ కారును భారత్‌లోనే తయారుచేశారు. ఆటో ఎక్స్‌పో 2016లో కూడా ప్రదర్శించారు. 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. 5 గేర్లు ఉండే ఈ కారు, డీజిల్ వేరియంట్లో మాత్రం 7 స్పీడ్ డీఎస్టీ ఆటోబాక్స్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.5.5 నుంచి 8.5 లక్షల మధ్య ఉండనుంది.
 
 5. స్కోడా సూపర్బ్ : ఈ కారును మంగళవారమే విడుదల చేశారు. 1.8 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లతో లభిస్తుంది. దీని ధర రూ.22 నుంచి 28 లక్షలు ఉండే అవకాశం ఉంది.
 
 6. టాటా నెక్సాన్: ఈ మోడల్ జికాను పోలి ఉంటుంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా టీయూవీ 300, వితారా బ్రెజ్జాలకు పోటీగా టాటా కంపెనీ ఈ మోడల్‌ను తీసుకొస్తోంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. 6 మ్యాన్యువల్ గేర్లు ఉండే ఈ కారును 2016లో అక్టోబరులో విడుదల చేయనున్నారు. దీని ధర రూ.7 నుంచి 10 లక్షలు ఉంటుంది.
 
 7. టాటా హెక్సా: ఈ మోడల్‌ను టాటా కంపెనీ ఇన్నోవా క్రిస్టాకు పోటీగా తీసుకురానుంది. 6 సీట్లు, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండడం దీని ప్రత్యేకత. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉండే ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్‌తో వస్తుంది. దీన్ని ఈ ఏడాది జూన్‌లో విడుదల చేయనున్నారు. ధర రూ.13 నుంచి 18 లక్షలు ఉంటుంది.
 
 8. టయోటా ఇన్నోవా: ఈ ఇన్నోవా క్రిస్టా మోడల్ 2.0 లీటర్ పెట్రోల్, 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్లతో లభించనుంది, డీజిల్ వేరియంట్లో 6 గేర్లు ఉంటాయి. దీన్ని ఈ ఏడాది మార్చి నుంచి జూన్ మధ్యలో విడుదల చేస్తారు. ధర రూ.10 నుంచి 16 లక్షలు ఉంటుంది.
 
 9. మారుతీ సుజుకీ ఇగ్నిస్: ఈ ఎస్‌యూవీని మారుతీ కంపెనీ, మహీంద్రా కేయూవీ 100కు పోటీగా తీసుకొస్తోంది. ప్రస్తుతం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు అందుబాటులోకి రానుంది. 1.3 లీటర్ కూడా వచ్చే అవ కాశం ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ లేదా సీవీటీ యూనిట్‌తో వస్తుంది. దీన్ని పండుగ సీజన్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. అక్టోబరు నాటికి మార్కెట్లోకి రావొచ్చు. ధర రూ.4.5 నుంచి 5 లక్షలు ఉండొచ్చు.
 
 10. హోండా బీఆర్-వీ: హ్యూండయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, మారుతీ సుజుకీ ఎస్-క్రాస్‌లకు పోటీగా హోండా తీసుకొస్తున్న ఈ కారులో 7 సీట్లు ఉంటాయి. 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్, 1.5 లీటర్ ఐ-డీటెక్ డీజిల్ వేరియంట్లలో రానుంది. ఇది కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ లేదా సీవీటీ యూనిట్‌తో పనిచేస్తుంది. దీన్ని సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ధర రూ.9 నుంచి 13 లక్షలు ఉండే అవకాశం ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement