Maruti
-
అప్పట్లో ఒకడుండేవాడు!
1993 నుంచి 2009 వరకు: పొడవాటి జుట్టు... ముఖంలో నిర్లక్ష్య ధోరణి... పోలీసులు పక్కనున్నా ధాటిగా మాట్లాడగలిగే తెగింపు... 2009 నుంచి 2012 వరకు: నీట్‌గా కట్ చేసిన హెయిర్... పైకి వినయ విధేయతలు... పోలీసులతో మర్యాద పూర్వక ధోరణి...హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు శివారు జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 172 చోరీలు చేసిన మహ్మద్ ఖాజా నయీముద్దీన్ అలియాస్ మారుతి నయీం వ్యవహారశైలి ఇది. పోలీసు విభాగంతో పాటు నగర వాసుల్లో అనేకమందికి ‘సుపరిచితుడైన’ ఈ ఘరానాదొంగ కథ 2012 మే 18న ముగిసింది. ఎప్పటికప్పుడు కొత్త అనుచరులను తయారు చేస్తూ, వరుస చోరీలు చేసే మారుతి నయీం చివరకు ఆ చోరీ సొత్తు పంపకాల్లో జరిగిన గొడవల్లో అనుచరుల చేతిలోనే హతమయ్యాడు.యాకుత్‌పురలోని నాగాబౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా నయిముద్దీన్ అలియాస్ మారుతి నయీం అలియాస్ అయూబ్ నేర ప్రస్థానం దాదాపు పంతొమ్మిదేళ్లకు పైగా కొనసాగింది. 1993లో చిల్లర దొంగతనాలతో మొదలుపెట్టిన నయీంపై 2012 వరకు 172 కేసులు నమోదయ్యాయి. రికార్డుల్లోకి ఎక్కనివి ఇంకా అనేకం ఉంటాయని పోలీసులు చెబుతుంటారు. నయీంపై రెయిన్‌బజార్ పోలీసుస్టేషన్లో నోన్ డెకాయిటీ షీట్ ఉండేది. పేరుకు మాత్రం కారు మెకానిక్‌గా చలామణీ అయ్యే ఇతగాడు నానా నేరాలు చేసేవాడు. 2002 అక్టోబర్‌లో జరిగిన బేగంబజార్‌లోని శాంతి ఫైర్ వర్క్స్ ఉదంతం ఇతని నేరజీవితంలో అతి దారుణమైంది. ఆ దుకాణంలో దొంగతనానికి వెళ్లి, ఏమీ దొరకలేదనే అక్కసుతో దుకాణంలోని టపాసులకు నిప్పు పెట్టాడు. ఈ దుకాణం పై అంతస్తులో కార్తికేయ లాడ్జి ఉండేది. ఫైర్ వర్క్స్‌లో మొదలైన మంటలు పైకి విస్తరించాయి. దీంతో లాడ్జిలో నిద్రపోతున్న 13 మంది అమాయకులు సజీవ దహనమయ్యారు. ఉదంతం జరిగిన రోజు ఇది షార్ట్‌సర్క్యూట్ ప్రమాదంగా భావించారు. కొన్నాళ్లకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అన్ని కేసులున్నా, పోలీసులు మాత్రం అతడికి ఒక్క కేసులోనూ శిక్ష పడేలా చేయలేకపోయారు. పైగా, అతడు సాక్షాత్తు పోలీసుల కస్టడీ నుంచే మూడుసార్లు పరారయ్యాడు.జైలుకు వెళ్లిన ప్రతిసారీ అక్కడి చిల్లర నేరగాళ్లను చేరదీస్తాడు. వారితో జైల్లోనే ఓ కొత్త ముఠా కట్టి బయటకు వస్తుండటం నయీం నైజం. ఆ ముఠాలో ఉండి, బెయిల్ పొంది బయటకు వచ్చే వారితో తనకూ బెయిల్ ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. విడుదల చేయించాక వాళ్లతో కలిసే దొంగతనాలు చేస్తాడు. స్నాచింగ్స్, చోరీలు, షట్టర్ లిఫ్టింగ్స్ వంటి నేరాలు చేయడంలో దిట్ట అయిన ఖాజా నయీముద్దీన్‌కు మారుతీ కారుతో అనుబంధం ఉంది. మెకానిక్ కావడంతో తేలిగ్గా కారు చోరీలు చేస్తాడు. ఎక్కువగా మారుతీ కారునే ఎంచుకుని, అందులో తిరుగుతూ దాన్ని షట్టర్‌కు అడ్డుపెట్టి, తాళం పగులకొట్టి దర్జాగా లోపలికి ప్రవేశించి, దుకాణాలను లూటీ చేసేవాడు. అందుకే ‘ఖాజా’ స్థానంలో ‘మారుతి’ వచ్చింది. పాత నేరగాళ్లతో పాటు ప్రతిసారీ కొత్తగా మరికొందరిని దొంగలుగా తయారు చేస్తుంటాడు. ఒకసారి తన ముఠాలో వాడిన నేరగాళ్లను మరోసారి వినియోగించేవాడు కాదు. వారి ద్వారా తన ఉనికి బయటపడుతుందనే ఉద్దేశంతో వారిని దూరంగా ఉంచేవాడు. చోరీ సొత్తులో కేవలం కొంత మాత్రమే వారికి పంచి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్లకు చోర విద్యలో ఆరితేరే వాళ్లు విడిగా ముఠాలు కట్టుకుని నేరాలు చేసే వాళ్లు. మారుతి నయీం 1993–2012 మధ్య 21 సార్లు అరెస్టయ్యాడు. ఇతడు తొలిసారి, చివరిసారి అరెస్టయింది పాతబస్తీలోనే! తొలిసారిగా 1993లో డబీర్‌పుర పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసులు 1994, 2000, 2002ల్లో హుమయూన్‌నగర్ పోలీసులు 1996లో, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు 2001లో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2005లో, షాహినాయత్‌గంజ్ పోలీసులు 2006 ఏప్రిల్‌లో, తూర్పు–పశ్చిమ మండలాల పోలీసులు సంయుక్తంగా 2006లో అరెస్టు చేశారు. 2011లో ఆయుధచట్టం కింద ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. 2009, 2010ల్లో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆఖరిగా 2012 జనవరి 12న ఫలక్‌నుమా పోలీసులు మహ్మద్ తారిఖ్, మహ్మద్ ముజాహిద్‌లతో కలిసి అరెస్టు అయ్యాడు. అదే ఏడాది మే 18న హతమయ్యాడు. నగరంలోని దాదాపు అన్ని పోలీసుస్టేషన్ల పరి«ధిలోనూ చేతివాటం ప్రదర్శించిన నయీంపై ఒక్క కేసులోనూ నేర నిరూపణ జరగలేదు. నేరాల్లో దిట్ట అయిన నయీం నగరానికి చెందిన ఓ వితంతువును పెళ్లి చేసుకున్నాడు. మారుతి నయీంను పట్టుకోవడం అప్పట్లో పోలీసులకు పెద్ద సవాల్ లాంటిది. అతడిని అరెస్టు చేస్తే, ఏమాత్రం ఇంటరాగేషన్ అవసరం లేకుండానే రూ.లక్షల సొత్తు రికవరీ ఇస్తుండేవాడు. బంగారం, వాహనాలు, వెండి, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు ఇలా అనేకం అతడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకునేవాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త అనుచరులను తయారు చేస్తూ, వరుస చోరీలు చేసే మారుతి నయీం చివరకు ఆ చోరీ సొత్తు పంపకాల్లో జరిగిన గొడవల ఫలితంగా అనుచరుల చేతిలోనే హతమయ్యాడు. -
బార్బరిక్ కొత్తగా ఉంటుంది: మారుతి
‘‘మైథలాజికల్ పాయింట్లో ఉన్న పాత్ర ప్రస్తుత తరానికి వస్తే ఎలా ఉంటుందో ‘బార్బరిక్’(Barbaric) లో చూపించారు. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. కానీ, మోహన్, రాజేశ్ ఎంతో నమ్మకంతో ఈ సినిమాని చాలా ఖర్చు పెట్టి తీశారు. ఈ మూవీ సరికొత్తగా ఉంటుంది.. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. సత్యరాజ్, వశిష్ఠ ఎన్. సింహా, సాంచీ రాయ్, ‘సత్యం’ రాజేశ్, ఉదయ భాను ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘బార్బరిక్’(Barbaric) . మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించారు. ఈ మూవీ టీజర్ లాంచ్(Teaser Launch) ఈవెంట్‌కి మారుతి అతిథిగా హాజరై, విడుదల చేశారు.ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ– ‘‘ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది’’ అని విజయపాల్ రెడ్డి తెలిపారు. ‘‘బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు ఈ మూవీకి సంబంధించి నాకు మూడు అస్త్రాలు ఉన్నాయి. ఒకరు డీఓపీ రమేశ్, రెండు ఫ్యూజన్ బ్యాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్. ఈ మూడు అస్త్రాలతో నేను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అన్నారు మోహన్ శ్రీవత్స. ‘‘బార్బరిక్’ మినీ ‘బాహుబలి’ మూవీలా ఉంటుంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్. ‘‘ఇది నాకు తొలి తెలుగు సినిమా’’ అని సాంచీ రాయ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: కుశేందర్ రమేశ్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్. -
30 లక్షల యూనిట్లు ఎగుమతి!
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తంగా ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్ల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, సియాజ్, డిజైర్, ఎస్–ప్రెస్సో వంటి మోడళ్లతో కూడిన 1,053 యూనిట్ల రవాణాతో కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది. 2030–31 నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల యూనిట్లను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో మరింత స్థానికీకరణ, ఎగుమతులను రెట్టింపు చేయడం కోసం కట్టుబడి ఉన్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్లలో మూడు రెట్లు..భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వాటా తమ సంస్థ కైవసం చేసుకుందని టాకేయూచీ చెప్పారు. దేశం నుంచి కంపెనీ ఎగుమతులు నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ గ్లోబల్ డిమాండ్ ద్వారా ప్రేరణ పొంది 2030–31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, కొన్ని మార్కెట్లతో వాణిజ్య ఒప్పందాలు కంపెనీ ఎగుమతుల వృద్ధిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో మారుతీ సుజుకీ ఇండియా 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.83 లక్షల యూనిట్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది.ఇదీ చదవండి: ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్అత్యంత వేగంగా 10 లక్షల యూనిట్లు ఎగుమతిప్రస్తుతం కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 100 దేశాల్లో 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, డిజైర్, ఎస్–ప్రెస్సో అధికంగా ఎగుమతి అవుతున్న టాప్ మోడళ్లుగా నిలిచాయి. 1986 నుంచి మారుతీ సుజుకీ భారత్‌లో తయారైన కార్లను విదేశాలకు సరఫరాను ప్రారంభించింది. కంపెనీ వాహన ఎగుమతుల్లో తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 2012–13లో సాధించింది. తొమ్మిదేళ్లలోనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని 2020–21లో అందుకుంది. 30 లక్షల యూనిట్ల స్థాయికి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే సంస్థ సాధించింది. ఇది కంపెనీకి అత్యంత వేగవంతమైన మిలియన్గా నిలవడం విశేషం. -
Prabhas New Look: ప్రభాస్ లేటేస్ట్ లుక్.. వీడియో చూశారా?
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్రి యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మరో చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు ది రాజాసాబ్ సెట్స్‌లో అడుగుపెట్టారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రభాస్ సరికొత్త హెయిర్ కట్ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు రెబల్ స్టార్‌పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రబాస్ మిర్చి సినిమాలో లాగా స్టైలిష్‌గా ఉన్నారంటూ పోస్టులు పెడుతున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో సరికొత్త వింటేజ్ లుక్‌లో ప్రభాస్ సందడి చేశారు. Latest Look of our Rebel star #Prabhas 🥵😍🔥🔥 pic.twitter.com/YtTByjybJ5 — Prabhas FC (@PrabhasRaju) April 17, 2024 Darling😘🖤#Prabhas pic.twitter.com/nkFUzITdwa — Ashhu🖤 (@PrabhAshhu) April 18, 2024 -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. క్రేజీ హింట్ ఇచ్చిన బేబీ నిర్మాత!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. భాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. అయితే మూడు నెలలుగా ది రాజాసాబ్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన నిర్మాత ఎస్కేఎన్ హింట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మొదటి సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ నిర్మాత ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఈ ట్వీట్‌కు డైరెక్టర్ మారుతి రిప్లై ఇవ్వడంతో ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 👑🎵🎶💖🔥❤️🔥💥 — SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 16, 2024 -
కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది.. అవి కేవలం రూమర్స్: బేబీ నిర్మాత
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ట్రూ లవర్". ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి పాల్గొన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - 'ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగల్తో మా సినిమాకు పోటీ లేదు. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. బేబి హిందీ రీమేక్‌లో నేను నటిస్తున్నాననే అనే వార్తల్లో నిజం లేదు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - 'నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ఈ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ మూవీతో వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నా. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్‌తో సినిమా రాలేదు.' అన్నారు. -
ప్రభాస్-మారుతి క్రేజీ కాంబో.. టైటిల్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్ మారుతితో జతకడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే సలార్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ప్రభాస్- మారుతి కొత్త చిత్రానికి 'ది రాజాసాబ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కొత్త లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ప్రభాస్ మరోవైపు కల్కి అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా.. దర్శకుడు మారుతి గతంలో "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు", "ప్రతి రోజు పండగే" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్‌ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో అలా "రాజా సాబ్" మూవీని మారుతి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ది "రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #TheRajaSaab It is… 👑 Wishing you all a very Happy and Joyous Sankranthi! ❤️ 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by @Vishwaprasadtg A @MusicThaman Musical… pic.twitter.com/kvmUxIcXFC — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 -
నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్
ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్‌లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) వాహనాలకు డిమాండ్ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. ♦ టాటా మోటార్స్ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి. ♦మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్ ఆటో(10% క్షీణత) మినహా రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి. ♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. -
డబుల్ ఇస్మార్ట్‌లో..
తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ఓ కీలక పాత్రకు సంజయ్ దత్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో భాగం కావడానికి సంజయ్ దత్ సుముఖంగా ఉన్నారని టాక్. -
మారుతీ, హ్యుండై వాటా తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన రంగంలో దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌లో రెండు ప్రధాన కంపెనీల మార్కెట్ వాటా తగ్గింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. మారుతీ సుజుకీ 2022–23లో 14,79,221 యూనిట్లతో 40.86 శాతం వాటాకు వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 12,39,688 యూనిట్లతో 42.13 శాతం వాటా నమోదు చేసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఎదుర్కొంటున్నామని, 3.8 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ గతంలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండై మోటార్ ఇండియా 5,25,088 యూనిట్లతో 14.51 శాతం వాటాకు పరిమితమైంది. 2021–22లో కంపెనీ 4,79,027 యూనిట్లతో 16.28 శాతం వాటా పొందింది. ఇతర కంపెనీలు ఇలా.. టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 నుంచి 2022–23లో 13.39 శాతానికి ఎగబాకింది. విక్రయాలు 3,31,637 యూనిట్ల నుంచి 4,84,843 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటా 6.77 నుంచి 8.94 శాతానికి ఎగసింది. విక్రయాలు 1,99,125 నుంచి 3,23,691 యూనిట్లకు పెరిగాయి. కియా ఇండియా వాటా 5.3 నుంచి 6.42 శాతానికి, విక్రయాలు 1,56,021 నుంచి 2,32,570 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సైతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,435 ఆర్టీవోలకుగాను 1,349 కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఎఫ్ఏడీఏ తెలిపింది. -
వరుస షూటింగులతో ఫుల్ బిజీ బిజీగా ప్రభాస్
‘సలార్’, ప్రాజెక్ట్ కె’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ వీలైనప్పుడుల్లా ‘రాజా డీలక్స్’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ అని టాక్. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ వారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, మాళవిక మోహనన్‌లపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే మళ్లీ ‘సలార్’ సెట్స్‌లో జాయిన్ అవుతారట ప్రభాస్. కాగా ‘సలార్’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న, ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ఈ జూన్ 16న రిలీజ్ కానుంది. అదేవిధంగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ రూపొందనుంది. ఈ సినిమాల వరుస షూటింగ్‌లు, వాటి తాలూకు ప్రమోషన్స్‌తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆసక్తి రేపుతున్న ఆది సాయికుమార్ 'టాప్ గేర్' టీజర్
ఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి కె. శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన మేకర్స్ తాజాగా సినిమా టీజర్‌ను వదిలారు. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 21 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. కార్ గేరేసి కారులో ఆది సాయి కుమార్ దూసుకుపోవడం, ఆయన్ను వెంబడిస్తున్న పోలీసులు, మధ్యలో ఫోన్ కాల్స్ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతున్నాయి. విజువల్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. -
ఈ కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు!
ముంబై: దేశీయంగా వ్యక్తిగత రవాణా గిరాకీ పుంజుకోవడంతో నవంబర్‌లో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, ఎంజీ మోటార్స్ సంస్థలు సైతం చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,59,044 వాహనాలు విక్రయించింది. గతేడాది నవంబర్ నాటి 1,39,184 అమ్మకాలతో పోలిస్తే ఇవి 14 శాతం అధికం. డిసెంబర్‌తో కలుపుకొని ఈ ఏడాదిలో మొత్తం 38 లక్షల కార్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా నవంబర్ విక్రయాలు 36 శాతం పెరిగి 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,910 వాహనాలను అమ్మింది. టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 62,192 నుంచి 21 శాతం పెరిగి 75,478కు చేరాయి. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 69 శాతం పెరిగి 24,025 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ద్విచక్ర వాహనాల గణాంకాలను పరిశీలిస్తే.., హీరో మోటోకార్ప్ అమ్మకాలు నవంబర్‌లో 12 శాతం పెరిగి మొత్తం 3.90 లక్షల యూనిట్లను విక్రయించిట్లు ఆ కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో విక్రయాలు 19 శాతం మేర క్షీణించాయి. -
ప్రభాస్-మారుతి రెగ్యులర్ షూటింగ్ అప్పుడే
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్స్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా లుక్ టెస్ట్ నిర్వహించారట మారుతి. వీలైనంత త్వరగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. అయితే ఈ వారంలోనే రెగ్యులర్ షూట్ జరిపేందుకు అంతా సిద్ధం చేశారట మారుతి. ఫస్ట్ షెడ్యూల్లో వారం రోజులు మాత్రమే ప్రభాస్ పాల్గొంటారట. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే తాత–మనవడి కథగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ప్రభాస్-మారుతి చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదోక రూమర్ తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. చదవండి: ‘వరహరూపం..’ కాంతార లిరికల్ సాంగ్ రిలీజ్ బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించనున్నాడని అంటున్నారు. ఇందులో ఆయన ప్రభాస్ తాతగా కనిపించనున్నారని ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా బొమన్ గతంలో పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పవన్ కల్యాణ్ తాత, బడా వ్యాపారవేత్తగా కనిపించారరు. దీంతో ఈ చిత్రంలో కూడా ప్రభాస్ తాతగా కనిపించనున్నాడని తెలిసి మరిన్ని అంచనా నెలకొన్నాయి. ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, అసలు మారుతి ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఆసక్తిని సంతరించుకుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు -
పక్కా కమర్షియల్ అంటున్న గోపీచంద్
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్ల, సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి. -
మారుతి జోరులో టాటా పంచ్‌లు !?
కరోనా తీసుకొచ్చిన సెమికండక్టర్ చిప్‌ల కొరత ఉక్రెయిన్ మోసుకొచ్చిన సప్లై చైయిన్ ఇబ్బందుల మధ్య ఇండియాలో కార్ల అమ్మకాలు మార్చిలో చెప్పుకోతగ్గ రీతిలోనే జరిగాయి. ఎప్పటి లాగే టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో అధిక భాగం మారుతి సుజూకివే ఉన్నాయి. మరోవైపు భారత్ మార్కెట్లో మారుతికి సమీప ప్రత్యర్థిగా ఎదిగేందుకు టాటా దూసుకొస్తోంది. Maruti Wagon R - 2022 మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి వ్యాగన్ ఆర్ నిలిచింది. గతేడాది వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కె్ట్లో దూసుకుపోతోంది. గతేడాది టాప్ సెల్లర్‌గా నిలిచిన వ్యాగన్ ఆర్ ఈ మార్చిలోనూ హవా కొనసాగించింది. 2022 మార్చిలో 24,636 మారుతి వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.5.18 లక్షలుగా ఉంది. Swift Dezire - మారుతిలో అత్యంత సక్సెస్ఫుల్ మోడళ్లలో ఒకటైన స్విఫ్ట్ డిజైర్ మార్చిలో తన ప్రతాపం చూపించింది. మారుతి స్విఫ్ట్‌ని క్రాస్ చేసి ఏకంగా 18,623 కార్లు సేల్ అయ్యాయి. స్విఫ్ట్ డిజైర్ ప్రారంభ ధర రూ.6.09 లక్షలుగా ఉంది. Suzuki Baleno - సూజుకి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్లో ఎక్కువ ప్రభావం చూపించిన కారుగా బాలేనోకి గుర్తింపు ఉంది. మార్చిలో దేశవ్యాప్తంగా 14,520 కార్లు అమ్ముడయ్యాయి. సగటున 22 కి.మీ మైలేజ్ ఇవ్వడం ఈ కారు ప్రత్యేకత. ప్రారంభ ధర రూ. 9.49 లక్షలుగా ఉంది. Tata Nexon - ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కేటగిరిలో టాటాకి సిరుల పంట పండించిన మోడల్‌గా నెక్సాన్ నిలిచింది. ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కేటగిరిలో మార్కెట్ లీడర్లుగా ఒక వెలుగు వెలిగిన బ్రెజా విటారా, క్రెటాలను నెక్సాన్ వెనక్కి నెట్టింది. ఇదే ఊపులో మార్చిలో 14,315 కార్ల అమ్మకాలు సాగాయి. ఈ కారు ధరలు రూ.7.42 లక్షల నుంచి మొదలు. Maruti Swift - ఇండియాలో ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లిన కనిపించే కారుగా మారుతి స్విఫ్ట్ గురించి చెప్పుకోవచ్చు. పదేళ్లుగా ఈ మోడల్ రారాజుగా వెలుగుతోంది. కొత్త మోడళ్లు ఎన్ని వచ్చినా స్విఫ్ట్ వాటా స్విఫ్ట్‌దే అన్నట్టుగా పరిస్థితి ఉంది. 2022 మార్చిలో 13,623 కార్ల అమ్మకాలు జరిగాయి. ప్రారంభ ధర రూ.5.90 లక్షలు Maruti Brezza Vitara - ఇండియాలో ఎంట్రీ లెవల్ ఎస్యూవీ మార్కెట్ సత్తా ఎంటో ప్రపంచానికి చాటిన మోడల్ మారుతి విటారా బ్రెజా. సగటున 17.5 కి.మీ మైలేజీ ఇవ్వడం ఈ ఎస్యూవీ ప్రత్యేకత. మార్చిలో 12,.439 కార్లు రోడ్లపైకి వచ్చాయి. Hyundai CRETA - వివిధ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నా ఇప్పటికీ హ్యుందాయ్‌కి మార్కెట్లో మేజర్ షేర్ ఉండటానికి కారణం క్రెటా మోడల్. మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో క్రెటా రారాజుగా వెలుగుతోంది. మార్చిలో 19,532 కార్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 10.23 లక్షలు TATA PUNCH - ఊహించనదానికి కంటే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది టాటా మైక్రో ఎస్యూవీ పంచ్ కారు. ఈ కారు విడుదలకు ముందే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకోగా.. తర్వాత కూడా అదే జోరు చూపించింది. చిప్సెట్ల సమస్య తీవ్రంగా వేధిస్తున్నప్పటికీ దేశ్యాప్తంగా ఏకంగా 10,526 పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.5.67 లక్షలు. చదవండి: హాట్ కేకుల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు.. మరీ ఈ రేంజ్‌లోనా! -
చేతులు కలిపాయ్..దుమ్ము దులిపేస్తున్నాయ్! దేశీయ రోడ్లపై ఎస్యూవీ చక్కెర్లు!
ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్ ఎస్యూవీ వెహికల్స్‌కు యమా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ తో పాటు వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్ కార్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అదే సమయంలో దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సైతం ఎస్యూవీ మార్కెట్‌ను గ్రాబ్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మనదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా భాగస్వామ్యంలో కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థ భాగస్వామ్యంలో తయారైన తొలి ఎస్యూవీ వెహికల్స్ టెస్ట్‌లో భాగంగా దేశీయ రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వెహికల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. వెహికల్ ఒక్కటే.. కోడ్లు మాత్రం రెండు మారుతి సుజుకీ - టయోటా సంస్థలు మిడ్ రేంజ్ ఎస్యూవీ వెహికల్స్‌ను తయారు చేశాయి. కానీ ఆ కార్ల కోడ్లు మాత్రం విడి విడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజికి ఎస్యూవీ కోడ్ వైఎఫ్జీ కాగా..టయోటా కారు కోడ్ డీ22 అని పేరు పెట్టారు. ఇక ఆ కార్ల ముందు భాగం చూడటానికి చాలా స్పెషల్ గా ఉంది. హెడ్ ల్యాంప్‌లను విడగొట్టి.. అదే ప్లేస్‌లో బంపర్, ఎల్ఈడీ లైట్లతో పాటు హెడ్ లైట్లతో కారును డిజైన్ చేశారు. ఫ్రంట్ ఫాసియా పాక్షికంగా కనిపిస్తుంది. ప్రత్యేక టయోటా, మారుతి కార్ల తరహాలో ఉంటున్నాయి. అయితే, టొయోటా డీ22 ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్ లు కనిపిస్తున్నప్పటికీ, మారుతి వైఎఫ్జీకి కింద భాగంలో ఏ ఆకారంలో పెద్ద హెడ్‌ల్యాంప్‌తో ఎల్ఈడీ డీఆర్ఎల్లు ఉన్నాయి. రెండు ఎస్‌యూవీల మంచి గ్రౌండ్ క్లియరెన్స్,వెనుకవైపు ఒకేలా డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఫీచర్లు, సెక్యూరిటీ పరంగా కొనుగోలు దారుల్ని అట్రాక్ట్ చేస్తాయని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా పరికరాల పరంగా, అవి మొప్పలకు లోడ్ అవుతాయని ఆశించవచ్చు. మారుతీ సుజుకి, టయోటా ఆల్ న్యూ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు కర్ణాటక బిడాడిలో టయోటా రెండవ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ ఎస్‌యూవీలు దీపావళికి ముందు ఈ పండుగ సీజన్లో దేశీయ మార్కెట్ లో విడుదల కానుండగా.. ఆ కార్ల ధరలు అవి రూ. 10 లక్షలు, రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెగ్మెంట్లో ఉండనున్నాయి. చదవండి: ఉద్యోగులకు బిగ్‌షాక్.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
SUV: గేర్ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా
ముంబై: దేశీయంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్) కొత్తగా పలు ఎస్‌యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్‌లో నెక్సాన్, పంచ్ మోడల్స్ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్‌కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్‌యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్‌యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్‌యూవీల మార్కెట్ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్‌ను లాంచ్ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిల్చింది. వ్యూహరచనలో మారుతీ .. ఎస్యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మినహా స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్–ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీకి మరే ఇతర మోడల్స్ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్యూవీ మోడల్స్‌లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్‌తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు. హ్యుందాయ్ ఆధిపత్యం.. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్‌లో ప్రీమియం వెర్షన్‌ను, మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్ రూఫ్, కనెక్టెడ్ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్‌యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్ గ్రూప్‌లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్ 5 ఆటోమొబైల్ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్ మోడల్స్ ఇందుకు తోడ్పడ్డాయి. కియా ఎస్యూవీ సెగ్మెంట్‌పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
బ్రాండ్ మారుతి.. విదేశాల్లో పెరిగిన డిమాండ్
ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది(2021)వాహన ఎగుమతుల్లో అరుదైన మైలురాయిని అందుకుంది. అన్ని విభాగాల్లో కలిపి కిందటేడాది మొత్తం 2.05 లక్షల యూనిట్లను విదేశాలకు పంపింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఈ స్థాయి ఎగుమతులను సాధించడం ఇదే తొలిసారని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ 15 మోడళ్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. వీటిలో 2021 ఏడాదిలో బాలినో, డిజైర్, సిఫ్ట్, ఎస్–ప్రెస్సో, బ్రెజా మోడళ్లు టాప్–5 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ కంపెనీ 1987లో తొలిసారి హంగేరీకి కార్లను పంపింది. ఈ 34 ఏళ్లలో మొత్తం 21.85 లక్షల కార్లను ఎగుమతి చేసింది. నాణ్యత, సాంకేతిక, భద్రత, డిజైన్, విషయంలో మారుతీ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నందునే రెండు లక్షల అమ్మకాల మైలురాయిని అందుకోగలిగామని కంపెనీ ఎండీ కెనిచి అయుకవా తెలిపారు. ఉత్పత్తి తగ్గింది వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ గత నెలలో మొత్తం 1,52,029 యూనిట్లు ఉత్పత్తి చేసింది. 2020 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల అని కంపెనీ సోమవారం ప్రకటించింది. ప్యాసింజర్ వాహనాలు 1,53,475 నుంచి 1,48,767 యూనిట్లకు వచ్చి చేరాయి. ఆల్టో, ఎస్–ప్రెస్సో 27,772 నుంచి 19,396 యూనిట్లుగా ఉంది. కాంపాక్ట్ కార్స్ వేగన్–ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వాహనాల సంఖ్య 85,103 నుంచి 86,696 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వెహికిల్స్ జిప్సీ, ఎర్టిగా, ఎస్–క్రాస్, వితారా బ్రెజ్జా, ఎక్స్ఎల్6 వాహనాలు 28,006 నుంచి 31,794 యూనిట్లకు చేరుకున్నాయి. ఈకో వ్యాన్ ఉత్పత్తి 11,219 నుంచి 9,045 యూనిట్లుగా ఉంది. తేలికపాటి వాణిజ్య వాహనమైన సూపర్ క్యారీ తయారీ దాదాపు రెండింతలై 3,262 యూనిట్లకు ఎగిసింది. చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..! -
సైన్స్ ఫిక్షన్ డ్రామా "రామ్ అసుర్" ట్రైలర్ విడుదల
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ నటీనటులుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా పీనట్ డైమండ్". మాస్ ఆడియోన్స్‌కు రీచ్ అయ్యేలా టైటిల్‌ను ''రామ్ అసుర్'' గా మార్చిన సంగతి తెలిసిందే. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్19న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి, బుచ్చిబాబు, బెల్లంకొండ సురేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని మూవీ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. మారుతి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. -
హలో హాలీవుడ్ అంటున్న రాజ్ దాసిరెడ్డి
ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొంది మంచి విజయం సాధించిన ‘భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ’తో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి తాజాగా హాలీవుడ్ కి హలొ చెబుతున్నాడు. ఆ మూవీ తర్వాత హాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. నేడు రాజ్ దాసిరెడ్డి బర్త్‌డే.ఈ సందర్బంగా ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. ప్రధాని నుంచి శుభాకాంక్షలు అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు రాజ్ దాసిరెడ్డి. మన తెలుగువారంతా గర్వపడేలా హాలీవుడ్ లో తన కెరీర్ తీర్చిదిద్దుకుంటానని, తెలుగులోనూ కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తానని చెప్పారు. -
ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. గత నెలలో 1,70,719 కార్లను తయారీ చేసింది. గతేడాది జులైలో 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసింది. వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తి సామర్థ్యంలో 58 శాతం వృద్ధి నమోదయిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఏడాది క్రితంతో పోలిస్తే వాహన తయారీ గణాంకాలలో పెరుగుదల ఉన్నప్పటికీ ఈ పోలిక అర్ధవంతమైనది కాదని.. ఎందుకంటే గతేడాది జులైలో కరోనా అంతరాయం కారణంగా విక్రయాలు చాలా తక్కువ స్థాయిలో జరిగాయని తెలిపింది. 2018 జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలోని ఉత్పత్తి సామర్థ్యం తక్కువేనని పేర్కొంది. ఈ ఏడాది జులైలో 1,67,825 ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయగా.. గతేడాది జులైలో ఇవి 1,05,345 యూనిట్లుగా ఉన్నాయి. మోడళ్ల వారీగా చూస్తే.. ఈ ఏడాది జులైలో ఆల్టో, ఎస్ప్రెస్సో 24,899 కార్లు తయారయ్యాయి. గతేడాది ఇదే నెలలో వీటి సంఖ్య 20,638గా ఉన్నాయి. వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్లు 55,390 యూనిట్ల నుంచి 90,604 యూనిట్లకు పెరిగాయి. అదేవిధంగా జిప్సీ, ఎర్టిగా, ఎస్–క్రాస్, విటారా బ్రెజా, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలు 19,130 నుంచి 40,094 యూనిట్లకు వృద్ధి చెందాయి. లైట్ కమర్షియల్ వెహికిల్స్ ఉత్పత్తి గత నెలలో 2,894 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది జులైలో ఇవి 2,342 యూనిట్లుగా ఉన్నాయి. చదవండి: మనదేశంలో ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా కొంటున్నారో మీకు తెలుసా? -
కార్ల ధరలు పెంచిన మారుతి.. ఏ మోడళ్లపై అంటే?
ఢిల్లీ: వినియోగదారులకు మారుతి ఆటో షాక్ ఇచ్చింది. మారుతిలో మోస్ట్ పాపులర్ మోడల్ స్విఫ్ట్‌తో పాటు ఇతర వేరియంట్లకు ధరలను అమాంతం పెంచేసింది. కారు తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మారుతి ప్రకటించింది. రూ. 15,000 మారుతి కార్ల ధరలు పెంచుతామంటూ 2021 జూన్ 21న ఇప్పటికే ప్రకటించామని, దానికి తగ్గట్టుగా స్విప్ట్ మోడల్‌తో పాటు అన్ని సీఎన్జీ వేరియంట్ల కార్ల ధరలు పెంచుతున్నామని మారుతి ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం కనీసం రూ.15,000 ధర పెంచామని వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మోడళ్లపై ప్రస్తుతం మారూతిలో స్విఫ్ట్ డిజైర్ టూర్‌తో పాటు ఎర్టిగా, వ్యాగన్ ఆర్, ఆల్టో, సెలేరియో, ఎస్ప్రెస్సో, ఏకో మోడళ్లలో సీఎన్జీ కార్లు లభిస్తున్నాయి. మొత్తంగా మారుతిలో ఎక్కువగా అమ్ముడయ్యే మోడల్స్‌పై ధరలు పెరిగాయి. ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే స్టాక్మార్కెట్లో మారూతి షేర్ల ధరలు కూడా పెరిగాయి. -
బంపర్ ఆఫర్ : భారీగా తగ్గిన అంబులెన్స్ వాహనాల ధర
ముంబై: మారుతీ సుజుకీ తన అంబులెన్స్ వెర్షన్ ‘‘వ్యాన్ ఎకో’’ వాహన ధరలను రూ.88 వేలు తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.6.16 లక్షలుగా ఉంది. ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్టీ రేటును 28% నుంచి 12 శాతానికి తగ్గిస్తూ గతవారంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంబులెన్స్ మోడళ్ల ధరలపై కోత విధించామని కంపెనీ వివరణ ఇచ్చింది. తగ్గింపు ధరలు జూన్ 14 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. చదవండి: పబ్జీ లవర్స్‌కు మరో షాక్, ఊపందుకున్నబ్యాన్ డిమాండ్ -
మారుతీ సేల్స్13,865 యూనిట్లు..షేర్లు 3% అప్
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి మే నెలలో 13,865 యూనిట్లను దేశీయంగా విక్రయించినట్లు ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమలుచేస్తోన్న లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో హర్యాణాలోని గురుగావ్,మానేసర్ కేంద్రాల్లో ఉత్పత్తి పునరుర్దరించింది. పునరుద్దరణ తరువాత మే నెలలో 13,865 యూనిట్ల వాహన విక్రయాలు జరిపినట్లు ఈకంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మే నెలలో 125,552 యూనిట్ల వాహనాలను దేశీయంగా విక్రయించినట్లు మారుతీ పేర్కొంది. ముంబై పోర్ట్ ద్వారా 4,651 యూనిట్ల వాహనాలను, టయోటాతో కలిసి మరో 23 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొన్ని షోరూంలను తెరిచామని, కంటైన్మెంట్ లేని జోన్లలో కూడా ఆ ప్రాంత నిబంధనలను అనుసరించి మిగతా వాటిని కూడ తెరుస్తామని ఒక ప్రకటనలో మారుతీ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో మారుతీ సుజుకీ ఇండియా షేరు 2.7 శాతం పెరిగి రూ.5763.70 వద్ద ట్రేడ్ అవుతోంది. -
‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!
కరచాలనం వద్దు నమస్కారాం చేద్దాం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రంగా కడుక్కుందాం, సామాజిక దూరం పాటిద్దాం.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పద్దతులు తప్పక పాటించాలని అటు ప్రభుత్వాలు ఇటు నిపుణులు పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయితే గతంలోనే ‘మహానుభావుడు’ చిత్రంలో పై నియమాలను ప్రస్తావిస్తూ కాస్త హాస్యం జోడించి ప్రజలకు చూపించారు డైరెక్టర్ మారుతి. హీరో(శర్వానంద్)కు ఉన్న అతి ఓసిడి(ఓవర్ క్లీనింగ్ డిజార్డర్)తో వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. అయితే గతంలో ఈ సినిమా చూసి నవ్వుకున్నాం కానీ ఇప్పుడు అలాంటి పద్దతులు పాటించక తప్పడం లేదు. మెగాస్టార్ చిరంజీవి మాదిరి ఆలస్యంగా సోషల్‌మీడియాలో అడుగుబెట్టాడు హీరో శర్వానంద్. ఈ క్రమంలో ఆదివారం ట్విటర్ ఆకౌంట్ ఓపెన్ చేసిన శర్వా కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్టూన్ రూపంలో తెలిపాడు. ‘మన ప్రపంచం, మన దేశం, మన ప్రజల కోసం ప్రతీ ఒక్కరు ‘మహానుభావుడు’గా మారాలి, మారదాం’అంటూ శర్వా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం శర్వా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వ్యక్తిగత పరిశుభ్రత గురించి ‘మహానుభావుడు’అప్పట్లోనే చెప్పాడు.. అప్పుడు నవ్వుకున్నాం ఇప్పుడు పాటిద్దాం’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Be a Mahaanubhaavudu for our people, for our country, for the world 😊 pic.twitter.com/D1YkpGDZW9 — Sharwanand (@ImSharwanand) March 29, 2020 #StayHome #StaySafe pic.twitter.com/hOr1RJayKG — Sharwanand (@ImSharwanand) March 29, 2020 -
డిసెంబర్ వాహన విక్రయాలు అటు ఇటుగానే..
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గతేడాది డిసెంబర్లో కాస్త మెరుగుదలను కనబర్చాయి. ఏడాది ప్రారంభం నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చిన అమ్మకాలు.. పండుగల సీజన్ నేపథ్యంలో చివరి నెలల్లో గాడిన పడ్డాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో భారీగా క్షీణించినప్పటికీ.. 2019 ఏడాది చివరి నెలల్లో నిలదొక్కుకున్నాయి. డిసెంబర్లో మారుతీ, మహీంద్రా కంపెనీల విక్రయాలు స్వల్ప వృద్ధిని నమోదుచేయడమే ఇందుకు నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ కాలంలో మారుతీ విక్రయాలు 17% తగ్గగా.. గత నెల్లో మాత్రం 2.4% వృద్ధిని ప్రదర్శించాయి. మహీంద్రా అమ్మకాల్లో ఒక శాతం వృద్ధి నమోదైంది. కొత్త ఏడాదిలో బీఎస్–6 వాహనాల విడుదలపై దృష్టిసారించామని, అధునాతన వాహనాల విడుదలతో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు ఎం అండ్ ఎం లిమిటెడ్ చీఫ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా అన్నారు. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలను విడుదలచేయడం ద్వారా అమ్మకాలను పెంచుకోనున్నామని, ఇన్వెంటరీని తగ్గించే చర్యలను ఇప్పటికే కొనసాగిస్తున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ వెల్లడించారు. ఇక గతనెల అమ్మకాలు తాము ఆశించిన స్థాయిలోనే ఉన్నట్లు హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ అన్నారు. నెమ్మదించిన ఆటో రంగంలో కనీసం గతేడాది చివర్లో అయినా అమ్మకాలు మెరుగుపడడం ఆశాజనకంగా ఉందని టయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని వ్యాఖ్యానించారు. -
అదే మా బ్యానర్ విజయ రహస్యం
‘‘శైలజా రెడ్డి అల్లుడు’ తర్వాత కొన్ని నెలలు ఓ కథ మీద వర్క్ చేశాడు మారుతి. ఆ తర్వాత మరో ఆలోచనను పంచుకున్నాడు. అది నచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం. అయితే మా అమ్మగారి వల్ల ఈ సినిమా చేయాలనుకున్నాను’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’’ వాస్. సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్ నిరి్మంచారు. సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ‘బన్నీ’ వాస్ చెప్పిన విశేషాలు. ►దర్శకుడు మారుతి, నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, యస్కేయన్ (ఈ చిత్ర సహనిర్మాత) మంచి ఫ్రెండ్స్. ఏ ఐడియా వచి్చనా నలుగురం పంచుకుంటాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లా ఎప్పుడూ ఉండం. మారుతి క్రియేటర్ కాబట్టి అతని ఆలోచనల్ని నేను గౌరవిస్తాను. ►‘ప్రతి రోజూ పండగే’ కథ బాగానే అనిపించింది కానీ అమ్మానాన్నలను అశ్రద్ధ చేసేవాళ్లు ఎవరుంటారు? కనెక్ట్ అవుతారా? అనే డౌట్‌ని కొందరు వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మా అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ‘ఐదు రోజులుగా నీతో మాట్లాడటానికి ప్రయతి్నస్తున్నాను రా’ అన్నారు. నాకు వెంటనే తల్లిదండ్రులను అశ్రద్ధ చేసేవాళ్లలో నేను కూడా ఉన్నానా? అని భయం వేసింది. మేం పట్టించుకోనప్పుడు మీకెలా ఉంటుంది అమ్మా? అని అడిగాను. ‘పెద్దయిపోయారు. మీకు బాధ్యతలు ఉంటాయని సర్ది చెప్పుకుంటాం రా’ అని చెప్పింది. అందరం ఏదో ఒకసారి మన పేరెంట్స్‌ను అశ్రద్ధ చేస్తున్నవాళ్లమే. అలాంటి కథ కాబట్టి మారుతిని గోఎహెడ్ అన్నాను. ►ఈ చిత్రంలో తేజ్ ఫిట్బాడీతో కనిపిస్తాడు. ‘బాడీ మీద క్రమశిక్షణ తప్పింది. వర్కౌట్ చేస్తాను’ అని ఈ సినిమా కోసం బాడీని రెడీ చేశాడు. యాక్టర్‌గా తనను తాను చాలా మెరుగుపరుచుకుంటున్నాడు. ►చావు అనివార్యం. పెళ్లి, పుట్టినరోజుని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో చావుని కూడా అలానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని సీరియస్‌గా, ఫన్నీగా చెప్పాం. ►అల్లు అరవింద్‌గారి సలహాలు బావుంటాయి. మనం చెప్పినదాంట్లో పాయింట్ ఉందంటే తీసుకుంటారు. మూడు జనరేషన్స్ (అరవింద్‌గారు , నేను, నూతన దర్శకులు) కలసి పని చేయడమే మా బేనర్ విజయ రహస్యం. ►ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్, అఖిల్– ‘బొమ్మరిల్లు’ భాస్కర్ చిత్రం, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, నిఖిల్– సూర్యప్రతాప్ సినిమాలు చేస్తున్నాం. ►సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించను. కానీ ఎప్పుడైనా బాధ కలిగినా, నా అభిప్రాయాలను పంచుకోవాలన్నా ఫేస్బుక్లో స్పందిస్తా. ►మేం అడ్వాన్స్ ఇచ్చినా ఆ దర్శకుడికి వేరే ఆఫర్ ఉంటే చేసుకోమంటాం. దర్శకులను మా దగ్గరే ఉండాలని నిబంధన పెట్టం. ప్రాజెక్ట్ ఓకే అయ్యాక మాత్రం వదలం (నవ్వుతూ). -
ఐదు స్టార్టప్‌లతో మారుతి జత
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) నూతన ఆవిష్కరణలకోసం కీలక నిర్ణయం తీసుకుంది. తన మొబిలిటీ అండ్ ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు సోమవారం తెలిపింది. ప్రధానంగా కృత్రిమ మేధస్సు పై పనిచేస్తున్న సెన్స్ గిజ్, క్సేన్, ఐడెంటిఫై, ఎన్మోవిల్, డాకెట్‌రన్ అనే ఐదు స్టార్టప్‌లతో జతకట్టింది. ఈ ఒప్పందాల ద్వారా ఆటోమొబైల్ రంగంలో వినూత్న, అత్యాధునిక సొల్యూషన్స్‌తో ముందుకు వస్తున్న స్టార్టప్‌లను గుర్తించి, ఒకచోటకు తీసుకొచ్చినట్టు తెలిపింది. మారుతి సుజుకి వాటాదారుల ప్రయోజనాలను నిలుపుకుంటూ, భారతీయ కస్టమర్ల అవసరాలకు అవసరాల కంటే ముందుగానే అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీ సేవలను అందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎంఎస్ఐ ఎండి, సీఈవో కెనిచి ఆయుకావా వెల్లడించారు. ఈ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కావడం ద్వారా ఆటోమొబైల్ సొల్యూషన్ కొత్త యుగంలోకి ప్రవేశించామన్నారు. స్టార్టప్‌లతో పాటు పనిచేయడం ద్వారా పరిష్కారాల స్కేలబిలిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇవి కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. ప్రస్తుతానికి మారుతి సుజుకిలోని డొమైన్ నిపుణుల మార్గనిర్దేశనంపాటు, భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ స్టార్టప్ మార్కెట్ నిపుణుల ద్వారా మొత్తం ఐదు స్టార్టప్‌లకు మూడు నెలల సుదీర్ఘ యాక్సలరేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. -
సెట్లో అడుగుపెట్టిన సుప్రీం హీరో
వరుస ఫెయిల్యూర్స్ నుంచి ‘చిత్రలహరి’ ఇచ్చిన ఉపశమనంతో ముందుకు వెళ్తున్న సాయి ధరమ్‌తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాన్ని ఓకే చేశాడు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ లాంటి ఫ్లాప్ సినిమాతో వెనకబడిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలె పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజాగా చిత్రయూనిట్ షూటింగ్‌ను కూడా మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘సుప్రీమ్’ తరువాత రాశీఖన్నా, సాయి ధరమ్‌తేజ్ మళ్లీ జోడిగా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ డే షూటింగ్‌కు సంబంధించిన వీడియోను సాయి ధరమ్‌తేజ్ పోస్ట్ చేస్తూ... మళ్లీ సెట్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉంది. ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే షూటింగ్’అంటూ ట్వీట్ చేశాడు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. So good to be back on set...first day of shoot #PratiRojuPandaage @DirectorMaruthi @GeethaArts @UV_Creations pic.twitter.com/ajt2y0Cpgu — Sai Dharam Tej (@IamSaiDharamTej) June 28, 2019 -
సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం
-
మొదలైన ‘ప్రతిరోజు పండగే’
వరుస ప్లాఫ్లతో సతమతమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు.. చిత్రలహరి సినిమా సక్సెస్‌ను రుచి చూపించింది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా పర్వాలేదనిపించడంతో ఈ హీరో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సారి మరో హిట్‌తో పలకరించాలని కాస్త గ్యాప్ తీసుకుని మరో ప్రాజెక్ట్‌తో సిద్దమయ్యాడు. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో కాస్త వెనుకబడ్డ మారుతి.. మరో వైవిధ్యమైన కథతో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజు పండగే’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, షూటింగ్ సోమవారం జరిగింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
‘వ్యాగన్ఆర్ బీఎస్–6’ వెర్షన్
న్యూఢిల్లీ: బీఎస్–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వ్యాగన్ఆర్ కారును శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ప్రకటించింది. నూతన ప్రమాణాలతో కూడిన 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కారు ధరల శ్రేణి రూ.5.15 లక్షల నుంచి రూ.5.96 లక్షలుగా నిర్ణయించింది. అయితే, ఢిల్లీ–ఎన్సీఆర్లో మోడల్ ఆధారంగా ధరల శ్రేణి రూ.5.10 లక్షల నుంచి రూ.5.91 లక్షలుగా కాగా.. మునుపటి వెర్షన్‌తో పోల్చితే అన్ని ప్రాంతాల్లో ఈ నూతన వ్యాగన్ఆర్ బీఎస్–6 కారు ధర రూ.16,000 వరకు పెరిగినట్లు తెలిపింది. కేవలం 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే నూతన వెర్షన్ అందుబాటులో ఉన్నట్లు స్పష్టంచేసింది. మరోవైపు 1–లీటర్ పెట్రోల్ ఇంజిన్ వ్యాగన్ఆర్ ధరల్లో కూడా మార్పులు చేసింది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఈ మోడల్ ధరల శ్రేణి రూ.4.34 లక్షల నుంచి రూ.5.33 లక్షలు కాగా, మిగిలిన ప్రాంతాల్లో ధరల శ్రేణి రూ.4.39 లక్షల నుంచి రూ.5.38 లక్షలకు సవరించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లు ఇప్పుడు ఏఐఎస్–145 భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొంది. -
కొత్త బాలెనో బుకింగ్స్ షురూ..
న్యూఢిల్లీ: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కారు కొత్త వెర్షన్ ముందస్తు బుకింగ్స్‌ను.. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ప్రారంభించింది. రూ.11,000 ఇనీషియల్ పేమెంట్ కింద చెల్లించి నూతన కారును బుక్ చేసుకోవచ్చని మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల్లో ఈ నూతన వెర్షన్ మార్కెట్లోకి విడుదల కానుండగా.. ఫిబ్రవరి తొలినాళ్లలోనే లాంచింగ్ కార్యక్రమం ఉండవచ్చని భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కారు ముందు వైపు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అతివేగాన్ని తెలియజేసే వ్యవస్థ, డ్రైవర్ పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ రిమైండర్, వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఈ నూతన వెర్షన్లో ఉన్నాయి.’ అని ఎంఎస్ఐ ప్రకటనలో పేర్కొంది. -
దేశంలోనే పొడగరి..జీవితం ఎలామరి?
యశవంతపుర: ఇతడి పేరు మారుతీ హనుమంత్... అయితే ఏమిటీ విశేషం అని అడగొచ్చు. ఇతని ఎత్తు 7 అడుగుల 9 అంగుళాలు. వయసు 36 ఏళ్లు. ఊరు కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా చింతాకి గ్రామం. భారతదేశంలోనే ఎత్తైన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. మారుతీని చూసిన కొత్తవారు అతడితో ఫోటోలు తీయించుకొని మురిసిపోతున్నారు. సాధారణ వ్యక్తి అతడి ముందు నిలుచుంటే మరుగుజ్జు అయిపోతాడు. మారుతి ఎత్తు ఎక్కువే అయినా, కుటుంబం మాత్రం నిరుపేదది. తల్లీ వీరవ్వ, ముగ్గురు సోదరులు రోజూ కష్టపడి కూలీ చేసి సంపాదిస్తేగానీ మారుతీకి పూటగడవటం కష్టం. నడుం వంచి పని చేయలేడనే నెపంతో గ్రామంలోనివారు ఎవరూ మారుతీని పనికి పిలవటం లేదు. నడిచేటప్పుడు భూమికి రాసుకుని రెండు కాళ్లకు పుండు కావటంతో నడవటం కూడా అతడికి కష్టంగా మారింది. ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో రూ. వెయ్యి పెన్షన్ అందిస్తోంది. ఒక్క సెంట్ కూడా భూమి లేకపోవటంతో భవిష్యత్తు మీద బెంగ పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలని కోరికగా ఉన్నా ‘తగిన’సంబంధాలు దొరకటంలేదు. ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇల్లే ఆశ్రయం. ఇంత ఎత్తు ఉన్నా దానివల్ల తనకు, కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదని మారుతి, సోదరులు, తల్లి ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మారుతీ తల్లి ప్రభుత్వాన్ని కోరారు. -
మారుతీ లక్ష్యం.. ఏటా 22.5 లక్షల కార్ల తయారీ
మెహసానా: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై దృష్టిపెట్టింది. 2020 నాటికి గుజరాత్ ప్లాంటులోని మూడు యూనిట్ల నుంచి తయారీని 7.5 లక్షల యూనిట్లకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. దీంతో మొత్తం తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 22.5 లక్షల యూనిట్లకుపైగా తీసుకెళ్లాలని చూస్తోంది. అలాగే 2020 తర్వాత తయారీని దీని కన్నా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే మార్గాలను అన్వేషిస్తోంది. ‘‘గుజరాత్ ప్లాంటులో మూడు యూనిట్లున్నాయి. ఇందులో ఒక దానిలో తయారీ ప్రారంభమైంది. దీని సామర్థ్యం ఏడాదికి 2.5 లక్షల యూనిట్లు. ఇదే తయారీ సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ కార్యకలాపాలు ఈ ఏడాది చివరకు ప్రారంభమవ్వొచ్చు. 2020 నాటికి మూడో యూనిట్ అందుబాటులోకి రావొచ్చు. ఈ మూడు ఫెసిలిటీల్లో 5,000–6,000 మంది ఉద్యోగులు ఉండేలా చూసుకుంటాం’’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన జపాన్–ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ (జేఐఎం) తొలి బ్యాచ్ ముగింపు సందర్భంగా మాట్లాడారు. కాగా కంపెనీ మరోవైపు గుర్గావ్, మానేసర్ ప్లాంట్లలో ఏడాదికి 15 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
కారు, బైక్ రయ్.. ట్రాక్టర్ స్పీడ్
ముంబై: వాహన విక్రయాల్లో మార్చి నెలలో మొత్తంగా చూస్తే మంచి గణాంకాలే నమోదయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్ అమ్మకాలు దూసుకెళ్లగా... హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, మహీంద్రా కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి. అయితే టయోటా, హోండా కార్స్ విక్రయాలు మాత్రం తగ్గాయి. ద్విచక్ర వాహన కంపెనీలైన టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. మహీంద్రా ట్రాక్టర్ విక్రయాలు దాదాపు రెట్టింపయ్యాయి. హ్యుందాయ్: హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం విక్రయాలు 8.8 శాతం వృద్ధితో 60,507 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ గతేడాది మార్చిలో 55,614 యూనిట్లను విక్రయించింది. ఇక దేశీ విక్రయాలు 7.3 శాతం పెరిగాయి. ఇవి 44,757 యూనిట్ల నుంచి 48,009 యూనిట్లకు ఎగిశాయి. టయోటా: టయోటా కిర్లోస్కర్ దేశీ విక్రయాలు 9.11% క్షీణతతో 12,539 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు 13,796 యూనిట్లుగా ఉన్నాయి. ఫోర్డ్ ఇండియా: ఫోర్డ్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 11.06% వృద్ధి చెందాయి. 24,832 యూనిట్ల నుంచి 27,580 యూనిట్లకు పెరిగాయి. ఇక కంపెనీ దేశీ అమ్మకాలు 9,016 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలోని 8,700 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 3.63 శాతం వృద్ధి కనిపించింది. హోండా కార్స్: హోండా కార్స్ ఇండియా దేశీ విక్రయాల్లో ఏకంగా 28.36 శాతం క్షీణత నమోదయ్యింది. 13,574 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు 18,950 యూనిట్లు రికార్డయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా: మొత్తం విక్రయాలు 10% వృద్ధి చెందాయి. ఇవి 56,202 యూనిట్ల నుంచి 62,077 యూనిట్లకు పెరిగాయి. దేశీ విక్రయాలు కూడా 10% వృద్ధితో 53,493 యూనిట్ల నుంచి 58,653 యూనిట్లకు చేరాయి. మహీంద్రా ట్రాక్టర్: మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ విక్రయాలు 46.23% వృద్ధితో 28,277 యూనిట్లకు ఎగశాయి. గతేడాది ఇదే నెలలో 19,337 యూనిట్లను విక్రయించింది. దేశీ అమ్మకాలు 50% వృద్ధితో 17,973 యూనిట్ల నుంచి 26,958 యూనిట్లకు పెరిగాయి. 2017–18లో మొత్తం విక్రయాలు 20.68% పెరుగుదలతో 3,17,383 యూనిట్లకు చేరాయి. అశోక్ లేలాండ్: అశోక్ లేలాండ్ మొత్తం అమ్మకాలు 20 శాతం వృద్ధితో 15,277 యూనిట్ల నుంచి 17,057 యూనిట్లకు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం విక్రయాలు 21 శాతం వృద్ధితో 1,74,873 యూనిట్లకు చేరాయి. 2016–17లో అమ్మకాలు 1,45,085 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహన కంపెనీలు... టీవీఎస్ మోటార్: టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాలు 27 శాతం వృద్ధితో 3,26,659 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 2,56,341 యూనిట్లను విక్రయించింది. మొత్తం టూవీలర్ అమ్మకాలు 25.8 శాతం ఎగిశాయి. ఇవి 2,50,979 యూనిట్ల నుంచి 3,15,765 యూనిట్లకు చేరాయి. సుజుకీ మోటార్‌సైకిల్: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాలు 23.2% వృద్ధితో 51,858 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో: బజాజ్ ఆటో మొత్తం విక్రయాలు 23 శాతం వృద్ధితో 2,72,197 యూనిట్ల నుంచి 3,34,348 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 20 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,69,279 యూనిట్ల నుంచి 2,03,600 యూనిట్లకు పెరిగాయి. హెచ్ఎంఎస్ఐ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) విక్రయాలు 20.3 శాతం వృద్ధితో 4,40,499 యూనిట్లకు పెరిగాయి. సొనాలికా లక్ష ట్రాక్టర్ల విక్రయం సొనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష ట్రాక్టర్లను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22% వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2013 ఆర్థిక సంవత్సరంలో 50,853 ట్రాక్టర్లను విక్రయించామని.. 2018 క్యూ4లో 56 శాతం వృద్ధిని నమోదు చేశామని ఐటీఎల్ ఈడీ రామన్ మిట్టల్ పేర్కొన్నారు. -
వారికోసం సరికొత్త హంగులతో మారుతి
న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారతదేశంలోని రిటైల్ నెట్‌వర్క్‌ను రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి ఎరీనా అంటూ కస్టమర్లను తమ డైనమిక్ న్యూ వరల్డ్‌కి ఆహ్వానిస్తోంది. మారుతున్న డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ ప్రాధాన్యతల నేపథ్యంలో తమ మోడ్రన్ కస్టమర్లకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మాస్ మార్కెట్ మోడల్స్‌ను విక్రయిస్తున్న మారుతి షోరూంలు ఇప్పుడు ‘మారుతి సుజుకి ఎరీనా’ చైన్ క్రిందకి రానున్నాయి. ప్రస్తుతం నెక్సా రిటైల్ చైన్ కింద ప్రీమియం ఉత్పత్తులను విక్రయిస్తుంస్తోంది. ఇకపై మారుతి షోరూం లను ‘మారుతి సుజుకి ఎరీనా’ పేరుతో నిర్వహించనుంది. కంపెనీ "ట్రాన్స్ఫర్మేషన్ 2.0’’ లో ఇది భాగమని మారుతి సుజుకి ఇండియా ఒక ప్రకటన లో తెలిపింది. ఈరీ బ్రాండింగ్ దశలా వారీగా ఉంటుందని, రాబోయే రెండు మూడేళ్లలో మొత్తం ప్రక్రియ పూర్తికానుందని మారుతి ఎండీ, డైరెక్టర్ ,సీఈవో కెనిచీ అయుకవా విలేకరులతో చెప్పారు. మార్చి, 2018 నాటికి 80 మారుతి సుజుకి ఎరానీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. భారతదేశంలో దాదాపు 75 శాతం కారు కొనుగోలుదారులు కొనుగోలుపై నిర్ణయం తీసుకోవటానికి ముందుగా ఆన్లైన్ పరిశోధన చేస్తున్నట్లు మారుతి పేర్కొంది. కాగా ప్రస్తుతం, మారుతి 1,683 నగరాల్లో 2,050 షోరూమ్‌లను కలిగి ఉంది. ప్రతి నెలలో 1.26 లక్షల వినియోగదారులతో ప్రతిరోజు తొమ్మిది కార్లను విక్రయిస్తోంది. 2020 నాటికి రెండు లక్షల కార్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోవాలనే కంపెనీ పథకాలు రచిస్తోంది. -
పదేళ్ల పాటు గుర్తుండే సినిమా ఇది – మారుతి
‘‘గల్ఫ్’ సినిమా కోసం సునీల్‌కుమార్ రెడ్డిగారు ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. ఒక సమస్యను డిస్కస్ చేయడానికి, స్క్రీన్‌పైకి తీసుకు రావడానికి ఆయన ముందుంటారు. సునీల్‌గారు మన ఇండస్ట్రీలో ఉండటం గర్వకారణం. ప్రేక్షకులకు పదేళ్ల పాటు గుర్తుండే సినిమా ‘గల్ఫ్’’ అని దర్శకుడు మారుతి అన్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ హీరోహీరోయిన్లుగా పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘గల్ఫ్’. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరచిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు. నటుడు ఎల్బీ శ్రీరాం మాట్లాడుతూ– ‘‘నాకు వచ్చిన నాలుగు నంది అవార్డుల్లో రెండు సునీల్కుమార్గారి ‘సొంతూరు’ సినిమాకు వచ్చినవే. ‘గల్ఫ్’ కోసం ఆయన రెండేళ్లు కష్టపడి, రెండున్నర గంటల సినిమాగా రూపొందించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రయాణంలో సపోర్ట్ చేసిన నా మిత్రులు, చిత్ర యూనిట్‌కి థ్యాంక్స్. ఈ చిత్రంలోని పాటలు అందరికీ నచ్చుతాయి’’ అన్నారు సునీల్‌కుమార్. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ‘గల్ఫ్’ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. చేతన్ మద్దినేని, డింపుల్, ప్రవీణ్ ఇమ్మడి, నటుడు నాగినీడు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యస్. వి. శివరాం, మాటలు: పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు: డాక్టర్ ఎల్. ఎస్. రావు, విజయ్, రాజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. బాపిరాజు. -
గ్రామాల్లో కార్లకు గిరాకీ!
♦ జూన్ క్వార్టర్లో 30 శాతం పెరిగిన విక్రయాలు ♦ మారుతి, హ్యుందాయ్‌లకు కలిసొచ్చిన కాలం న్యూఢిల్లీ: కార్ల కంపెనీలపై ఈ వర్షకాలం లాభాల జల్లు కురిపిస్తోంది. సాధారణ వర్షపాతం అంచనాలతో మొదటి త్రైమాసికంలో కార్ల విక్రయాలు అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో 30% పెరగ్గా, హ్యుందాయ్ అమ్మకాల్లో 23%కి పైగా వృద్ధి నమోదైంది. దేశీయ కార్ల మార్కెట్లో ఈ రెండు సంస్థల ఉమ్మడి వాటా 67%. వీటి విక్రయాల ద్వారా పరిశ్రమ ప్రగతిని తేలిగ్గా అంచనా వేయొచ్చు. మొత్తం విక్రయాల వృద్ధి కన్నా గ్రామీణ ప్రాంతాల్లో అధిక వృద్ధి నమోదైంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మారుతీ 1,34,624 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,04,059తో పోలిస్తే 30% అధికం. మరోవంక దేశ వ్యాప్తంగా మారుతీ కార్ల విక్రయాల్లో వృద్ధి 14 శాతమే. ఈ ఏడాది వర్షపాతం 98%గా ఉంటుందంటూ గత నెలలో భారత వాతావరణ విభాగం తన అంచనాలను సవరించడం తెలిసిందే. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ మెరుగైందని, జూన్ త్రైమాసిక విక్రయాల్లో వృద్ధి గణాంకాలు తమ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని మారుతీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక హ్యుందాయ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 18,337 కార్లను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 14,879తో పోలిస్తే 23% అధికం. అయితే ఇదే త్రైమాసికంలో మొత్తం మీద భారత మార్కెట్లో హ్యుందాయ్ కార్ల విక్రయాల్లో వృద్ధి 1%లోపే ఉండటం గమనార్హం. మెరుగైన వర్షపాత అంచనాలతో కస్టమర్లలో సెంటిమెంట్ బలపడిందని, దీంతో అధిక వృద్ధి నమోదైందని హ్యుందాయ్ అంటోంది. నెట్వర్క్ విస్తరణపై దృష్టి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను గమనించిన ప్రధాన కంపెనీలు తమ రూరల్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టాయి. కస్టమర్లను చేరుకునేందుకు విక్రయాలు, సేవలకు సంబంధించి సిబ్బందిని నియమించుకుంటున్నాయి. బ్యాంకులతోనూ ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. హ్యుందాయ్‌కు గ్రామీణ ప్రాంతాల్లో 300 ఔట్‌లెట్లున్నాయి. వీటికి అదనంగా కంపెనీ కార్ల విక్రయాల కోసం ఫ్లోట్వ్యాన్స్ను రంగంలోకి దింపింది. ఈ వ్యాన్లు ఒకే చోట స్థిరంగా ఉండకుండా వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ కార్ల విక్రయాలు చేపడతాయి. ఇక, పండుగల ప్రారంభ సీజన్ కావడంతో ఈ క్వార్టర్లోనూ విక్రయాలు మరింత మెరుగ్గా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. వర్షాకాలం సాగు పనుల నేపథ్యంలో ట్రాక్టర్లకూ, అదే సమయంలో ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ ఉంటుందని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశిస్తోంది. -
బెస్ట్ సెల్లింగ్ మోడల్ మళ్లీ ‘ఆల్టో’నే
♦ కొనసాగుతోన్న మారుతీ ఆధిపత్యం ♦ టాప్–10లో ఏడు మోడళ్లు ఈ కంపెనీవే న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటిలాగే ఈ కంపెనీకి చెందిన ఏడు కార్లు ‘టాప్–10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్’ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. తాజాగా మే నెల వాహన విక్రయాల్లో ‘ఆల్టో’.. మళ్లీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవతరించింది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ♦ మారుతీ ఆల్టో విక్రయాలు ఈ మే నెలలో 23,618 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఇదే నెలలో ఆల్టో అమ్మకాలు 19,874 యూనిట్లుగా ఉన్నాయి. ♦ ఏప్రిల్ నెలలో టాప్‌లో నిలిచిన మారుతీ స్విఫ్ట్.. ఈసారి రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దీని విక్రయాలు 12,355 యూనిట్ల నుంచి 16,532 యూనిట్లకు పెరిగాయి. ♦ మారుతీకి చెందిన వ్యాగన్–ఆర్ 15,471 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానం దక్కించుకుంది. గతేడాది ఇదే నెలలో వ్యాగన్–ఆర్ విక్రయాలు 13,231 యూనిట్లుగా ఉన్నాయి. ♦ 14,629 యూనిట్ల విక్రయాలతో మారుతీ బాలెనో నాల్గవ స్థానంలో ఉంది. ♦ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఐదో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,055 యూనిట్ల నుంచి 12,984 యూనిట్లకు పెరిగాయి. ♦ మారుతీ విటారా బ్రెజా 12,375 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో ఈ కారు 7,193 యూనిట్లతో పదో స్థానంలో ఉంది. ♦ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏడో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 10,667 యూనిట్లుగా ఉన్నాయి. ♦ 9,073 యూనిట్ల అమ్మకాలతో మారుతీ డిజైర్ ఎనిమిదో స్థానంలో ఉంది. ♦ హ్యుందాయ్ క్రెటా 8,377 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ♦ మారుతీ ఎర్టిగ పదో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 7,121 యూనిట్లుగా నమోదయ్యాయి. ♦ టాప్–10లో మారుతీ, హ్యుందాయ్ మోడళ్లు తప్పు వేరే ఇతర వాహన కంపెనీల కార్లు లేకపోవడం గమనార్హం. -
అందుకే పేరు వేసుకున్నా : మారుతి
రక్షిత్, స్వాతి జంటగా ‘వీడు తేడా’ ఫేమ్ చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లండన్ బాబులు’. మారుతి టాకీస్ పతాకంపై దర్శకుడు మారుతి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ–‘‘స్వీట్ మ్యాజిక్ ప్రసాద్‌గారు ‘ఆండవన్ కట్టళై’ అనే తమిళ సినిమాను చూసి, నన్ను చూడమన్నారు. ఫక్తు కమర్షియల్ సినిమా అనుకున్నా, కానీ విజయ్ సేతుపతితో మాట్లాడాక చాలా ప్యాషన్‌తో చేశారని తెలిసింది. అందుకే రీమేక్ చేశాం. పాస్‌పోర్ట్ కోసం పడే తిప్పల్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. మామూలుగా నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ, నాకు ‘లండన్ బాబులు’ బాగా నచ్చడంతో వేసుకున్నా’’ అన్నారు. ‘‘సినిమాలకు దూరంగా వైజాగ్‌లో ఉన్న నన్ను పిలిచి మరీ మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. రక్షిత్ అనే మంచి హీరోని పరిచయం చేశాననే ఆనందం నాకు ఎప్పుడూ ఉంటుంది’’ అన్నారు చిన్నికృష్ణ. రక్షిత్, స్వాతి, హీరో నిఖిల్, దర్శకులు పరశురామ్, అనిల్ రావిపూడి, సుధీర్‌వర్మ, చందు మొండేటి, ‘డార్లింగ్’ స్వామి, శ్రీకాంత్ అడ్డాల, నటులు జీవా, ఉద్ధవ్, విఠల్, అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: కె. -
వాహన విక్రయాలు రయ్ రయ్
మారుతీ, హోండా, మహీంద్రా అమ్మకాల్లో రెండంకెల వృద్ధి న్యూఢిల్లీ: దేశీ వాహన విక్రయాల్లో మే నెలలో బలమైన వృద్ధి నమోదైంది. మరీ ముఖ్యంగా మారుతీ సుజుకీ, హోండా కార్స్, మహీంద్రా, ఫోర్డ్ కంపెనీల వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. ఈ వృద్ధికి కొత్త మోడళ్ల ఆవిష్కరణ, యుటిలిటీ వెహికల్స్ డిమాండ్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే టయోటా వాహన విక్రయాలు మాత్రం క్షీణించాయి. టూవీలర్ల విభాగానికి వస్తే.. హీరో మోటొకార్ప్ విక్రయాలు 8.7 శాతం వృద్ధితో 6,33,884 యూనిట్లకు చేరాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం విక్రయాలు 24.87 శాతం వృద్ధితో 60,696 యూనిట్లకు పెరిగాయి. ఇండియా యమహా అమ్మకాలు 10.65 శాతం వృద్ధితో 69,429 యూనిట్లకు ఎగశాయి. -
కార్ లవర్స్ కు కొత్త సంవత్సరంలో షాక్!
ముంబై: నూతన సంవత్సరం 2017 కార్ లవర్స్ కు భారీగానే షాకిచ్చింది. కొత్త ఏడాదిలో కారు కొనుక్కుందామనుకున్న వారికి భారీగా పెరిగి ధరలు పలకరించనున్నాయి. ఇప్పటికే పలు ధరల పెంపును ప్రకటించగా, తాజా ఈ కోవలోకి మరో రెండు దిగ్గజాలు కూడా చేరిపోయాయి. ప్రముఖ కార్ల దిగ్గజాలు కూడా కొత్త సంవత్సరంలో కార్ లవర్స్ కు నిరాశనే మిగల్చనున్నాయి. మార్కెట్లో టాప్ టు కంపెనీలు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను అమాంతం పెంచేశాయి. గత కొన్ని నెలల్లోముడి పదార్థం ధరల భారీ పెరుగుదల, ఇటీవలి భారీ డిస్కౌంట్లు, బలహీనపడిన రూపాయి తదితర పరిణామాలను తమ మార్జిన్ మీద ప్రభావం చూపించాయని వెల్లడించాయి. ఆయా మోడల్స్ పై రూ. 2500 నుంచి లక్ష రూపాయలను పెంచుతున్నట్టు మారుతి ప్రకటించింది. ఇటీవలి కాలంలో అధిక డిస్కౌంట్లు, రూపాయి విలువతగ్గడం సహా పలు కారణాలతో ధరలను పెంచక తప్పలేదని మారుతి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆర్ఎస్ కల్సి తెలిపారు. జనవరిలో రెండు శాతం ధరలు పెంచనున్నట్టు తెలిపారు. ఏ మోడల్ కు ఎంత ధర పెరగనుందీ తమ టీమ్ లెక్కిస్తోందని చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా వినియోగదారులు కార్లకొనుగోలుకు మొగ్గు చూపుతారనే అంచనాలతో ఆటోమోటివ్ పరిశ్రమలో కార్ల ధరలను పెంచడం ఆనవాయితీ. కానీ భారత్ లో అమ్ముడుబోయే ప్రతి రెండు వాహనాల్లో ఒకదాన్ని సాధించే మారుతి సుజికి మాత్రం సంవత్సర ఆరంభంలో వాహనాల ధరల పెంపునకు ఇప్పటి వరకూ దూరంగా ఉంటోందనే చెప్పాలి. మరోవైపు ఆరు నెలల్లో మారుతి కార్ల ధరలను పెంచడం ఇది రెండవ సారి. దాదాపు ఇదే కారణాలతో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా కార్ల ధరలను 4 వేల లక్షలవరకు పెంచనుంది. తమ అన్ని రకాల కార్లపై ఈ పెంపును జనవరి నుంచి వర్తింప జేయనున్నట్టు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీనివాస్తవ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ ప్రీమియం ఎస్ యూవీ ధర శాంటా ఫే ధర లక్ష రూపాయలు పెరగనుంది. కాగా డీమానిటైజేషన్ కారణంగా ఇప్పటికే టయోటా, హోండా,మహీంద్రా, టాటా మోటార్స్ ఇప్పటికే ఈ కొత్త సంవత్సరం లో కార్ల ధరలను 3శాతం పెంచాయి. ఇపుడు ఈ దిగ్గజాల అడుగుజాడల్లో మిగిలిన కార్ కంపెనీలు కూడా త్వరలో కార్ల ధరల్ని పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
భారీగా పెరగనున్న మారుతీ, హ్యుందాయ్ ధరలు!
ముంబై : దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్లు కార్ల ధరలను భారీగా పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. జనవరిలో ఈ వాహన సంస్థలు కార్ల ధరలను రూ. 2500 నుంచి లక్ష రూపాయల వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడం, గత కొన్ని నెలలుగా వరుసగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, రూపాయి విలువ పతనమవడం వంటివి కార్ల ధరలు పెంపుకు దోహదం చేస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి చేసుకునే కార్ల విడిభాగాల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో జనవరిలో తమ వాహన ధరలను పెంచాలని కార్ల తయారీ సంస్థలు యోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కార్ల సంస్థలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించేశాయి. మిగతా సంస్థలు కూడా ధరల పెంపు ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. న్యూఇయర్ ప్రారంభంలో మారుతీ సుజుకీ ధరలు పెంచడానికి ఎప్పుడూ మొగ్గుచూపదు. కమోడిటీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకే సిద్దమై ఉంటుంది. కానీ భారీ డిస్కౌంట్లు, రూపాయి పతనం వంటివి ఈ సంస్థ రెవెన్యూలకు గండికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి కార్ల ధరలను పెంచనున్నామని మారుతీ సుజుకీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సీ చెప్పారు. అయితే ధరలు ఎంతపెంచాలనే దానిపై తమ ధరల నిర్ణయ టీమ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలో రెండో సారి మారుతీ కార్ల ధరలను పెంచుతోంది. హ్యుందాయ్ సైతం జనవరిలో తన కార్ల ధరలను పెంచనున్నట్టు తెలిసింది. తమ మోడల్స్‌పై రూ.4000 నుంచి రూ.1 లక్ష వరకు ధరలు పెంచేందుకు యోచిస్తున్నామని హ్యుందాయ్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. హ్యుందాయ్ ప్రీమియం ఎస్యూవీ, సాంటా ఫీలపై లక్ష రూపాయల ధర పెరగనుంది. -
లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
పన్ను రేట్లు తగ్గించాల్సిన అవసరముందన్న జైట్లీ వ్యాఖ్యలకు మంగళవారం సూపర్ ర్యాలీ నిర్వహించిన స్టాక్‌మార్కెట్లు నేడూ అదే ఛాయలో లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. 76.01 పాయింట్ల లాభంలో ఎగిసిన సెన్సెక్స్ , ప్రస్తుతం 60.44 పాయింట్ల లాభంలో 26,273 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 21.10 పాయింట్ల లాభంలో 8,053గా ట్రేడ్ అవుతోంది. మారుతీ, విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాలార్జిస్తుండగా... ఓఎన్జీసీ, హీరో మోటో కార్ప్, ఏషియన్ పేయింట్స్, భారతీ, ఎల్ అండ్ టీ నష్టాలు గడిస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్ప నష్టంలో 68.10గా ప్రారంభమైంది. డాలర్ విలువ బలపడుతుండటంతో రూపాయిలో ఒడిదుడుకులు కొనసాగుతాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంచనావేసిన దానికంటే అమెరికా హౌసింగ్ డేటా విడుదల కావడంతో డాలర్ విలువ భారీగా పెరుగుతోంది. దీంతో అమెరికా స్టాక్స్ లాభాల్లోకి ఎగిశాయి. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు రూ.133 ఎగిసి, 27,170గా ట్రేడ్ అవుతున్నాయి. -
గతవారం బిజినెస్
ట్రాయ్‌పై ట్రిబ్యునల్‌కు ఎయిర్టెల్ రిలయన్స్ జియో 90 రోజుల కాల పరిమితి తీరిన తర్వాత కూడా ఉచిత సేవలు కొనసాగించేందుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అనుమతించడాన్ని సవాలు చేస్తూ భారతీ ఎయిర్టెల్ సంస్థ టెలికం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. జియో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ట్రాయ్ ప్రేక్షక పాత్ర వహిస్తోందని పేర్కొంది. డిసెంబర్ 3 తర్వాత జియో ఉచిత వాయిస్, డేటా సేవలు కొనసాగించకుండా ట్రాయ్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్టెల్ తన 25 పేజీల పిటిషన్లో ట్రిబ్యునల్‌ను కోరింది. ట్రాయ్ టారిఫ్ ఆదేశాల ఉల్లంఘన ఈ ఏడాది మార్చి నుంచి కొనసాగుతోందని, దీంతో తమకు రోజువారీ నష్టాలు వాటిల్లుతున్నాయని... ఉచిత కాల్స్ వల్ల విపరీతమైన ట్రాఫిక్‌తో తమ నెట్‌వర్క్‌కు విఘాతం కలుగుతున్నట్టు ఎయిర్టెల్ ఆరోపించింది. మారుతీకి డీమోనిటైజేషన్ దెబ్బ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం గణనీయంగానే పడింది. గతేడాది అక్టోబర్–నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే వ్యవధిలో బుకింగ్స్ 20 శాతం మేర క్షీణించాయి. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా నగదు కొరత నెలకొనడంతో డిమాండ్ పడిపోవడమే ఇందుకు కారణమని సంస్థ పేర్కొంది. అయితే, ఈ నెలలో మా త్రం పరిస్థితులు కాస్త మెరుగయ్యాయని.. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈసారి బుకింగ్‌లు 7% మేర పెరిగాయని వివరించింది. కింగ్‌ఫిషర్ విల్లా కొనేవారు లేరు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాకు చెందిన గోవాలోని విల్లాను కొనేవారే కరువయ్యారు. విల్లా రిజర్వు ధర ను 5 శాతం తగ్గించి.. రూ.81 కోట్లుగా నిర్ణయించినా కూడా కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం. మాల్యా నుంచి రూ.9,000 కోట్ల రుణ మొత్తాన్ని రాబట్టుకోవడానికి బ్యాంక్ కన్సార్షియం విల్లాను విక్రయానికి పెట్టిన ప్రతిసారీ విఫలమౌతూనే ఉంది. ‘డీమోనిటైజేషన్ కారణంగా రియల్టీలో స్తబ్ధత నెలకొంది. ప్రాపర్టీ ధరలు తగ్గాయి. దీంతో బ్యాంకుల కన్సార్షియం విల్లా ధరను మరింత తగ్గించొచ్చని బిడ్డర్లు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుత వేలానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా ఆర్థిక సేవల రంగంలో పేరొందిన ఆదిత్యా బిర్లా గ్రూప్.. తొలిసారిగా ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ (ఏబీహెచ్‌ఐసీఎల్) బ్రాండ్ పేరిట మార్కెట్లోకి ప్రవేశించింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఎంఎంఐ హోల్డింగ్స్‌తో కలిసి 51:49 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించినట్లు ఏబీహెచ్‌ఐసీఎల్ సీఈఓ మయాంక్ భత్వాల్ తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రూపుల్లో 4 రకాల పాలసీలు, ఒక రిటైల్ పాలసీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది యూటీఐ ఎంఎఫ్ ఐపీఓ! మ్యూచువల్ ఫండ్ దిగ్గజం యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓకు రానుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయని యూటీఐ ఎండీ, లియో పురి చెప్పారు. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, ఏ క్షణమైనా అనుమతి లభించగలదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే మర్చంట్ బ్యాంకర్లను నియమిస్తామని, సెబీ ఆమోదం కోసం దరఖాస్తు చేస్తామని వివరించారు. వేదాంత రిసోర్సెస్‌కు జరిమానా దేశీ దిగ్గజ మైనింగ్ కంపెనీ ’వేదాంత రిసోర్సెస్’కు లండన్ హైకోర్టు 10 కోట్ల డాలర్లమేర (దాదాపు రూ.680 కోట్లు) జరిమానా విధించింది. 2013 కాపర్ ప్రైజ్ అగ్రిమెంట్‌కు సంబంధించి.. జాంబియన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ మొత్తాన్ని 30 రోజుల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది. దీంతో వేదాంతకు జాంబియాలో ఉన్న కొన్కొలా కాపర్ మైన్స్ (కేసీఎం) అనే అనుబంధ కంపెనీ... ప్రభుత్వ రంగ జాంబియా కన్సాలిడేటెడ్ కాపర్ మైన్స్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్స్ (జెడ్సీసీఎం–ఐహెచ్)కు దాదాపు 10 కోట్ల డాలర్లను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాల్ డ్రాప్స్‌కి టోల్‌ఫ్రీ నెంబర్.. ’1955’! కేంద్ర ప్రభుత్వం కాల్ డ్రాప్స్‌కు ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాల్ డ్రాప్స్‌కు ’1955’ నెం బర్ కేటాయించినట్లు అధికారిక సమాచారం. ఈ నెంబర్ ద్వారా టెలికం సబ్స్క్రైబర్ల కాల్ డ్రాప్స్‌పై ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. ’1955’ నెంబర్ కేటాయింపు అన్ని టెల్కోలకు తప్పనిసరి. ఈ నెంబర్ ఎస్టీడీ, లోకల్ కాలింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్ఎల్ ఈ నెంబర్ అమలు, నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. దీని నుంచి టెల్కోలు ఎలాంటి ఫీజులను వసూలు చేయకూడదు. ఇక టెలికం మంత్రి మనోజ్ సిన్హా ఈ నెంబర్‌ను ప్రారంభిస్తారని సమాచారం. ఫ్రీచార్జ్ ఈ–వాలెట్ ప్రొటెక్షన్ ప్లాన్... డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ’ఫ్రీచార్జ్’ తాజాగా తన యూజర్ల కోసం కొత్త ఈ–వాలెట్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కస్టమర్లు/వ్యాపారులు వారి మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్న సందర్భాల్లో వాలెట్ బ్యాలెన్స్‌పై రూ.20,000 వరకూ ఉచిత బీమాను పొందొచ్చు. ఇందుకోసం ఫ్రీచార్జ్ కంపెనీ.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్లైన్లో బిల్లు చెల్లిస్తే డిస్కౌంట్! ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ’బీఎస్ఎన్ఎల్’ వినియోగదారులు వారి బిల్లులను ఆన్లైన్లో చెల్లించడం ద్వారా 0.75 శాతం డిస్కౌంట్ పొందొచ్చని టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. క్యాష్‌లెస్ లావాదేవీలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ పోర్టల్ లేదా బీఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్ ద్వారా పోస్ట్–పెయిడ్ (ల్యాండ్‌లైన్/బ్రాడ్‌బాండ్/జీఎస్ఎం) బిల్లులు లేదా జీఎస్ఎం ప్రి–పెయిడ్ రీచార్జ్‌లను చెల్లించడం ద్వారా డిస్కౌంట్ పొందొచ్చని తెలిపారు. ఈ సౌలభ్యం డిసెంబర్ 22 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుందని వివరించారు. మధుమేహం ఔషధాల రేట్లు తగ్గింపు! హెచ్ఐవీ, మధుమేహం మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే 50 పైగా ఔషధాల ధరలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో వీటి ధరలు 5 నుంచి 44 శాతం దాకా తగ్గనున్నాయి. 29 ఫార్ములేషన్ల రిటైల్ ధరలపై కూడా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) పరిమితులు విధించింది. జాబితాలోని నిర్దిష్ట ఔషధాల ధరలు 5–44 శ్రేణిలో తగ్గుతాయని, తగ్గుదల సగటున 25 శాతం మేర ఉండగలదని ఎన్పీపీఏ చైర్మన్ భూపేంద్ర సింగ్ తెలిపారు. డీల్స్.. ⇔ ఒడిశా కేంద్రంగా పనిచేసే ఐరన్‌ఓర్ పెల్లెట్ తయారీ కంపెనీ బీఆర్‌పీఎల్‌ను రూ.900 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు టాటా స్టీల్ ప్రకటించింది. మెటాలిక్ అవసరాలు తీర్చుకునేందుకు, కళింగ్‌నగర్/జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్లకు ముడి పదార్థాల అవసరాలను తీర్చేందుకు ఈ కొనుగోలు వీలు కల్పిస్తుందని టాటా స్టీల్ తెలిపింది. ⇔ ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా తాజాగా అమెరికాకు చెందిన ఎస్సీ ఫార్మాస్యూటికల్స్‌లో 14.6 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం 13 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 88 కోట్లు) వెచ్చించింది. అలాగే ఇది నొవార్టిస్‌కు చెందిన ఒడొమ్జో అనే క్యాన్సర్ ఔషధాన్ని 17.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనుంది. ⇔ గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీఎస్పీసీ)కి చెందిన కేజీ బేసిన్ గ్యాస్ బ్లాక్‌లో 80 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 995 మిలియన్ డాలర్లుగా (దాదా పు రూ.6,700కోట్లు) ఉండనున్నట్లు సంస్థ వివరించింది. ⇔ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ తన టవర్ల వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రా కంపెనీకి విక్రయించనుంది. అంతా నగదు చెల్లింపులతో కూడిన ఈ డీల్ విలువ రూ.11,000 కోట్లు. భారత మౌలిక రంగంలో అతి పెద్ద విదేశీ ఇన్వెస్ట్మెంట్ డీల్ ఇదేనని ఆర్‌కామ్ తెలిపింది. -
మారుతి బుకింగ్స్‌కు పెద్దనోట్ల రద్దు సెగ
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు సెగ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థమారుతి సుజికికి భారీగానే తాకింది. మారుతీ సుజుకి అక్టోబర్- నవంబర్ కాలానికి అమ్మకాలు భారీగా పడిపోయాయి. గత ఏడాడితోపోలిస్తే రీటైల్ అమ్మకాలు6-7 శాతం పెరుగుదలనునమోదుచేసినా బుకింగ్స్ మాత్రం 20 శాతం క్షీణతనునమోదు చేశాయి. నగదు కష్టాల కారణంగా తమ బుకింగ్స్ డిమాండ్ 20శాతం క్షీణించిందని మారుతి శుక్రవారం వెల్లడించింది. డీ మానిటైజేషన్ కారణంగా ప్రజల్లో నెలకొన్న అనిశ్చితి , ఆందోళన కారణంగా మారుతి ట్రూ వేల్యూ కేంద్రాల నుంచి అమ్మకాలు తగ్గాయని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) ఛైర్మన్ ఆర్సీభార్గవ విలేకరులతో చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 20శాతం పడిపోయాయన్నారు. గత డిశెంబర్ తో పోలిస్తే అమ్మకాలు 7 శాతం ఎగిసి మొత్తంగా పరిస్థితి కొంత మెరుగ్గా వున్నప్పటికీ, నోట్ల రద్దు నేపథ్యంలో అమ్మకాలు తగ్గినట్టు గుర్తించామన్నారు. భారీ విస్తరణకు మరోవైపు మారుతి భారీ విస్తరణకు దిగుతోంది. 2019 మార్చి నాటికి రోహతక్ ప్లాంట్ లో దాదాపు రూ.3,800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టుతెలిపింది. ఇప్పటికే మార్చి 2016 నాటికిఈ ప్రాజెక్టు మీద సుమారు రూ 1,700 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు.అలాగే గుజరాత్లో ప్లాంట్ గురించి ప్రశ్నించినపుడు తయారీ ప్లాంటు షెడ్యూల్లో ఉందనీ, ఇక్కడినుంచి మొదటి కారు వచ్చే ఏడాది ఫిబ్రవరి కి బయటకు రావచ్చని చెప్పారు. త్వరలోనే ఇగ్నిస్ ,బాలెనో ఆర్ఎస్ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. -
నోట్ల రద్దైనా మారుతీ, హ్యుందాయ్‌లు....
పాత నోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో డిమాండ్ సన్నగిల్లి తెగ ఆందోళన చెందుతుంటే, రెండు అతిపెద్ద కారు తయారీసంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ ఇండియాలు మాత్రం తమ విశ్వాసాన్ని కోల్పోవడం లేదు. తాము నిర్దేశించుకున్న వార్షిక ఉత్పత్తి టార్గెట్‌ను చేధిస్తామని ఈ రెండు కారు కంపెనీలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి కల్లా మారుతీ సుజుకీ 1.58 మిలియన్ యూనిట్ల నుంచి 1.6 మిలియన్ యూనిట్ల అమ్మకాలు చేపడుతుందని తెలిసింది. అయితే కంపెనీ నిర్దేశించుకున్న ఇంటర్నల్ టార్గెట్ 1.565 మిలియన్లు మాత్రమే. పెద్దనోట్లు రద్దైనప్పటికీ, తాము 1.5 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ వార్షిక లక్ష్యాన్ని చేధిస్తామని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ్ చెప్పారు. నవంబర్‌లో బుకింగ్స్ పడిపోయాయని, ప్రస్తుతం బుకింగ్స్ వెల్లువ కొనసాగుతుందని పేర్కొన్నారు. జనవరి కల్లా తమ వార్షిక లక్ష్యాన్ని సాధిస్తామన్న క్లారిటీ తమకుందని వెల్లడించారు. అక్టోబర్ పండుగ సీజన్లో తిరిగి రిటైల్ అమ్మకాలు పుంజుకుని, నవంబర్ నెలలో కంపెనీ విక్రయాలు రికార్డు స్థాయిలో 14 శాతం దూసుకుపోయాయి. అదేనెలలో పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రద్దు ప్రభావం మిగతా ఆటో కంపెనీలపై భారీగానే చూపింది. అదేవిధంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తమ 2016 టార్గెట్ 6,65,000 యూనిట్ల ఉత్పత్తిని చేధిస్తామని చెప్పింది. డీమానిటైజేషన్ ప్రభావం స్వల్పకాలంలోనే ఉంటుందని, ఫైనాన్స్‌ల ద్వారా మంచి అమ్మకాలు చేపడుతున్నామని హ్యుందాయ్ ఇండియా తెలిపింది. -
విక్రయాల్లో మారుతి హవా
ముంబై: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతు సుజుకి దేశీయ అమ్మకాల్లో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆటో దిగ్గజం మారుతీ వాహనాల అమ్మకాల్లో మరోసారి తన హవాను చాటుకుంది. నవంబర్ మాసానికిగాను కార్ల విక్రయంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశంలో డీమానిటైజేషన్ నేపథ్యంలో కూడా దేశీయ మార్కెట్లో నవంబరులో మినీ (ఆల్టో, వ్యాగన్ఆర్) , కాంపాక్ట్ (స్విఫ్ట్, బాలెనో మరియు డిజైర్) విభాగంలో భారీ అమ్మకాలను సాధించింది. మొత్తం అమ్మకాల్లో 12.2 శాతం వృద్ధితో 1.35 లక్షల యూనిట్లను విక్రయించింది. దేశీయ అమ్మకాలు మరింత అధికంగా 14 శాతం పెరిగాయి. 1.26 లక్షల వాహనాలను అమ్మింది.అయితే ఎగుమతులు మాత్రం 10 శాతం(9.8) క్షీణించాయి.గత ఏడాది 10,225 యూనిట్లను ఎగుమతి చేయగా ఈ ఏడాది కేవలం 9,225 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేయగలిగింది.దీంతో ఆరంభంలో లో మారుతీ సుజుకీ షేరు 0.43 శాతం బలపడినా ప్రస్తుతం 0.19 నష్టాల్లో కొనసాగుతోంది. కాగా దీపావళి సీజన్ తరువాత రీటైల్ డీలర్ల అమ్మకాలు స్వల్పంగా ప్రభావితమైనప్పటికీ మొత్తం అమ్మకాలు పెరిగాయి. దేశీయ మార్కెట్ లో 47శాతం వాటా ను ఆక్రమించిన మారుతి పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులతో ఒప్పందం చేసుకుని 100 శాతం ఫైనాన్స్ సదుపాయంతో కార్లను అందిస్తోంది. -
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారత్‌లో అసాధ్యం: మారుతీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై అత్యంత ఆశావహంగా ఉంది. వాహన కంపెనీలు పూర్తిస్థారుు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మార్కెట్లోకి తేవటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారుు. అరుుతే ఈ అటానమస్ కార్లు భారత్‌లో నడిచే అవకాశం లేదని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్.ఎస్.భార్గవ తెలిపారు. ‘సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అంటేనే నిబంధనల ప్రకారం నడిచేవి. కానీ దేశంలో ఎంత మంది డ్రైవింగ్ నిబంధలను పాటిస్తూ వాహనాలను నడుపుతున్నారు? కస్టమర్ ప్రవర్తనను అంచనా వేసే టెక్నాలజీతో ఒక ఉపకరణాన్ని ఎలా రూపొందిస్తాం? కస్టమర్ నడవడికను, వైఖరిని ఎవరైనా అంచనా వేయగలరా?’ అని ప్రశ్నించారు. ఇక్కడి డ్రైవింగ్ స్థితిగుతులకు సెల్ఫ్ టెక్నాలజీ అనుకూలం కాదని పేర్కొన్నారు. అరుుతే భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో నడిచే వాహనాలు తిరుగుతుంటే చూడాలని ఉందన్నారు. అలాగే ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ అగ్రిగేటర్ల వల్ల కార్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇలాంటి కంపెనీలు భవిష్యత్తులో అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. -
బైక్ కొనివ్వలేదని...
దావణగెరె : బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నగరంలోని శివకుమారస్వామి బడావణెలో జరిగింది. నగరానికి చెందిన మారుతి(17) అనే యువకుడికి గతంలో కుటుంబ సభ్యులు ఒక బైక్‌ని కొనివ్వగా, ఆ బైక్ నడుపుతూ ప్రమాదం బారిన పడటంతో వారు ఆ బైక్‌ను ఇటీవల అమ్మేశారు. అయితే తనకు మళ్లీ కొత్త బైక్ కొనివ్వాలని మారుతి పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు తన కోరికను పెడచెవిన పెట్టడంతో మనస్తాపం చెందిన మారుతి సోమవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేటీజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
దూసుకెళ్లిన మారుతీ...
న్యూఢిల్లీ : దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీదారిగా పేరున్న మారుతీ సుజుకీ, ఎగుమతుల్లో రయ్ రయ్‌మని పరిగెడుతోంది. క్యూములేటివ్ ఎగుమతుల్లో కంపెనీ 15 లక్షల వాహనాల మైలురాయిని చేధించిందని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి 100 దేశాలకు పైగా ఈ ఎగుమతులు జరిపినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో మోడల్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా భారత్‌లోనే తయారు చేసింది. ఇండియా నుంచి జపాన్‌కు ఎగుమతి అయిన మొదటికారు ఇదే కావడం విశేషం. 1987-88 మధ్య కాలంలో మారుతీ సుజుకీ ఇండియా యూరప్‌కు వాహనాలు ఎగుమతి చేయడం ప్రారంభించింది. మొదట మెల్లగా ఎగుమతులు ప్రారంభించిన ఈ కంపెనీ, ఆయా దేశాల్లోనే ఎకనామిక్, పాలసీ విధానాలకు అనుగుణంగా ఎగుమతులను పెంచింది. గత కొంతకాలంగా కంపెనీ ఎగుమతుల్లో శరవేగంగా దూసుకెళ్తూ, అప్‌వర్డ్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నట్టు కంపెనీ హర్షం వ్యక్తంచేసింది. కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి ఆవిష్కరిస్తూ, మరిన్ని కొత్త దేశాలకు తమ మోడల్స్‌ను ఎగుమతి చేస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో తమకున్న స్థానాన్ని ఇలానే కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తంచేసింది. వాహన రంగంలో తీవ్ర పోటీ ఉన్న యూరప్ వంటి దేశాల్లో జెన్, ఏ-స్టార్, మారుతీ 800, ఆల్టో మోడల్స్ దూసుకెళ్తున్నాయని కంపెనీ పేర్కొంది. 2015-16లో టాప్ ఎక్స్పోర్ట్ మోడల్స్‌గా ఆల్టో, సిఫ్ట్, సెలిరియో, బెలెనో, సియాజ్లు నిలిచాయి. శ్రీలంక, చిల్లీ, ఫిలిప్పీన్స్, పెరూ, బొలివియాలు టాప్ ఎక్స్పోర్ట్ మార్కెట్లుగా ఉన్నాయి. -
మారుతి, ఎన్‌ఎస్‌డీసీతో ఉబెర్ భారీ ప్రణాళిక
న్యూఢిల్లీ: ప్రముఖ టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటో మేజర్ మారుతి సుజుకి, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో క్యాబ్ డ్రైవర్ల శిక్షణ, మరియు సంక్షేమం కోసం ఒక పథకాన్ని ప్రకటించింది. సుమారు నాలుగు లక్షలమంది డ్రైవర్లతో అమెరికా తరువాత దేశంలో రెండవ అతిపెద్ద క్యాబ్ ప్రొవైడర్ గా ఉన్న ఉబెర్ డ్రైవర్లకు మెరుగైన శిక్షణ, సదుపాయాలకోసం కృషి చేస్తోంది. 2018 నాటికి పది లక్షల మందికి జీవనోపాధి అవకాశాలు సృష్టించే యోచనలో మారుతీ, ఎన్ఎస్డీసీ భాగస్వామ్యంతో 'ఉబెర్ షాన్ ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మారుతీ సుజుకి భాగస్వామ్యంతో 2018 నాటికి సుమారు పదిలక్షలమందికి జీవనోపాధి అవకాశాలను కల్పించాలనే తమ లక్ష్యం నెరవేరనుందని ఉబెర్ తెలిపింది. ఈ కార్యక్రమం కింద 30,000 డ్రైవర్లకు శిక్షణ అందించాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సి తెలిపారు. నైపుణ్యం లేని డ్రైవర్లకు శిక్షణ అందించి తీర్చిదిద్దేందుకు ఈ పథకం ఉద్దేశించిందని ఉబెర్ భారతదేశం అధ్యక్షుడు అమిత్ జైన్ పీటీఐకి తెలిపారు. అలాగే డ్రైవర్లు వాణిజ్య లైసెన్సుల, వాహనం ఫైనాన్సింగ్, లీజింగ్ పరిష్కారాల్లో ఈ ప్రణాళిక సహాయాన్నంది స్తుందన్నారు. ఢిల్లీ / ఎన్సీఆర్, హైదరాబాద్, చెన్నైలలో 4నెలల పైలట్ ప్రోగ్రాంను నిర్వహించనున్నామన్నారు. ఇది పూర్తయ్యాక దీని ఆధారంగా భారతదేశం అంతటా ఇతర నగరాలకు విస్తరిస్తామని జైన్ ప్రకటించారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్డీసీ శిక్షణా కేంద్రాల ద్వారా కొత్త, పాత డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ అందిస్తామని, ఆటోమొబైల్ సెక్టార్ లో స్కిల్ బిల్డింగ్ కు ఇది ప్రోత్సాహాన్నందిస్తుందని పేర్కొన్నారు. -
స్వల్ప లాభాల్లో నడుస్తున్న మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో దేశీయ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 38.37 పాయింట్ల లాభంలో 28,028 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ తన కీలకమార్కు 8,650 దిగువకు పడిపోయింది. 10.65 పాయింట్ల స్వల్ప లాభంతో 8,643 వద్ద ట్రేడ్ అవుతోంది. అరబిందో ఫార్మా కంపెనీ క్యూ1 ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమించడంతో మార్కెట్లో కంపెనీ షేర్లు దూసుకెళ్తున్నాయి. 5 శాతం మేర లాభాలను నమోదుచేస్తూ..నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలుస్తున్నాయి..ఐడియా సెల్యులార్ నిఫ్టీలో టాప్ లూజర్‌గా 4 శాతం మేర డౌన్ అయింది. వెల్సపన్ ఇండియా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. గత సెషన్లలో 36 శాతం మేర క్రాష్ అయిన ఆ కంపెనీ షేర్లు, నేటి ట్రేడింగ్‌లో 10 శాతం పతనమయ్యాయి. మారుతీ, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ లాభాల బాటలో నడుస్తుండగా.. లుపిన్, టీసీఎస్, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్పొ, టాటా స్టీల్‌లు సెన్సెక్స్‌లో నష్టాలను గడిస్తున్నాయి. ఆగస్టు నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల గడువు రేపటితో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో నేడు కూడా మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడిచే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. కాగ నిన్నటి ట్రేడింగ్‌లో కూడా మార్కెట్లు ఒడిదుడుకులమయంగా నడిచాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.03 పైసలు బలహీనపడి 67.08గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 87 రూపాయల నష్టంతో 31,283గా ట్రేడ్ అవుతోంది. -
లాభాల్లో దేశీయ సూచీలు
ముంబై : బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగనుందన్న నేపథ్యంలో మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. దాదాపు 150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 105.36 పాయింట్ల లాభంతో 28,108 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27.95 పాయింట్ల లాభంతో 8664 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఐటీసీ, ఎల్&టీ, మారుతీ సుజుకీ షేర్లలో కొనుగోలు మద్దతు జోరు కొనసాగుతుండటంతో, ఈ షేర్లు మార్కెట్లో లాభాలను పండిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, విప్రోలు నష్టాలను గడిస్తున్నాయి. 8,625 కు 8750 మార్కుకు మధ్య కీలకమైన పరిధిలో నిఫ్టీ నేడు ట్రేడ్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మార్నింగ్ సెషన్లో నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి.. అమెరికా మార్కెట్లు సైతం సోమవారం రోజు కిందకే నమోదయ్యాయి. దీంతో గ్లోబల్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడొచ్చని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.26 పైసలు బలపడి, 66.74గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పడిపోయి 31,545గా నమోదవుతోంది. -
జోరుగా వాహన విక్రయాలు
మారుతీ, హోండా కార్స్ మినహా అన్ని కంపెనీల విక్రయాలు వృద్ధిలోనే ♦ జూన్ నెల వాహన అమ్మకాల తీరు.. ♦ ‘వేతన సిఫారసు’లతో మరిన్ని విక్రయాలు ♦ భవిష్యత్‌పై కంపెనీల ఆశాభావం న్యూఢిల్లీ: వాహన విక్రయాలు జూన్‌లో జోరుగా ఉన్నాయి. వర్షాలు బాగానే కురుస్తుండడం, కొత్త మోడళ్ల కారణంగా జూన్ నెలలో వాహన అమ్మకాలు పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే సుబ్రోస్ సంస్థలో అగ్నిప్రమాదం కారణంగా మారుతీ అమ్మకాలు మాత్రం 14 శాతం పడిపోయాయి. అయితే జిప్సి, గ్రాండ్ విటారా, ఎర్టిగ, ఎస్-క్రాస్, కాంపాక్ట ఎస్యూవీ విటారా బ్రెజ్జాలతో కూడిన యుటిలిటి వాహన విక్రయాలు 76 శాతం పెరగడం విశేషం. హోండా కార్స్ ఇండియా అమ్మకాలు కూడా క్షీణించాయి. మిగిలిన అన్ని కార్ల కంపెనీలు-టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, రెనో, మహీంద్రా అన్ని కంపెనీలు విక్రయాల్లో మంచి వృద్ధిని సాధించాయి. ద్విచక్ర వాహన కంపెనీలు కూడా మంచి అమ్మకాలనే సాధించాయి. హీరో మోటొకార్ప్ ఒక శాతం వృద్ధిని సాధించగా, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్, యమహా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వర్షాలు మంచిగా కురుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయని, దీంతో సెంటిమెంట్, డిమాండ్ మెరుగుపడతాయని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ నెల విక్రయానికి సంబంధించి వివరాలు... మారుతీ సుజుకీ: దేశీయ విక్రయాలు 10 శాతం క్షీణించాయి. చిన్నకార్ల విక్రయాలు 19 శాతం, కాంపాక్ట్ కార్ల విక్రయాలు 13 శాతం, వ్యాన్ల విక్రయాలు 6 శాతం చొప్పున తగ్గాయి. ఎగుమతులు 45 శాతం పడిపోయాయి హ్యుందాయ్: గ్రాండ్ ఐ10, ఇలీట్ ఐ20, క్రెటా కార్లు మంచి అమ్మకాలు సాధించాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. వర్షాలు మంచిగా కురుస్తుండటం, ఏడవ వేతన సంఘం సిఫారసుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా అమ్మకాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. ⇔ మహీంద్రా ఎగుమతులు 41 శాతం, ఫోర్డ్ ఇండియా ఎగుమతులు మూడు రెట్లు, టాటా మోటార్స్ ఎగుమతులు 11 శాతం చొప్పున పెరిగాయి. ⇔ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా మోటార్ బైక్‌ల అమ్మకాలు 27 శాతం, స్కూటర్ల అమ్మకాలు 21 శాతం, ఎగుమతులు 13 శాతం చొప్పున పెరిగాయి. ⇔ పూర్తిగా స్వదేశీ ఆర్ అండ్ డీ టీమ్ అభివృద్ధి చేసిన స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 మోటార్‌బైక్‌ను త్వరలో మార్కెట్లోకి తెస్తామని హీరో మోటోకార్ప్ తెలిపింది. -
ఆ మలుపు థ్రిల్‌కి గురి చేస్తుంది!
‘‘ఒకప్పుడు ప్రేమలు పెళ్లికి దారితీసేవి. ఇప్పుడు ప్రేమ వల్ల జీవితాలు చాలా మలుపులు తిరుగుతున్నాయి. సోషల్ మీడియా కారణంగా ప్రేమకు ఆప్షన్లు పెరిగాయి. ఈ మీడియా ద్వారా లవ్‌లో పడిన ఓ నాలుగు పాత్రల చుట్టూ ‘రోజులు మారాయి’ తీశాం’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన కథ, స్క్రీన్-ప్లే అందించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. మారుతి మాట్లాడుతూ - ‘‘ఇవాళ చిన్న సినిమాలు థియేటర్లలో నిలబడటం లేదు. అందుకే కొత్త నటీనటుల సినిమాలకు కథా బలం ఎక్కువగా ఉండాలి. ‘రోజులు మారాయి’కి మేము అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాం. నాలుగు పాత్రల చుట్టూ సరదాగా తిరిగే కథ చివర్లో ఒక ట్విస్టుతో థ్రిల్ కలిగిస్తుంది. ఎక్కువగా రొమాన్స్ చూపించలేదు. దర్శకుడు మురళీకృష్ణ తెరకెక్కించిన విధానం సంతృప్తిగా అనిపించింది’’ అన్నారు. -
కార్ల విక్రయాలు జూమ్..
♦ మే నెలలో ఆటోమొబైల్ రంగం జోరు... ♦ 10% పెరిగిన మారుతీ, హ్యుందాయ్ సేల్స్ న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీల మే నెల దేశీ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు వాటి ప్యాసెంజర్ వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. కొత్త మోడళ్లు, రుతుపవ నాలపై సానుకూల అంచనాలు విక్రయాల పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి. ♦ మారుతీ దేశీ విక్రయాలు 10.6 శాతం వృద్ధితో 1,02,359 యూనిట్ల నుంచి 1,13,162 యూనిట్లకు పెరిగాయి. స్విఫ్ట్, రిట్జ్, డిజైర్, బాలెనో వంటి కార్ల అమ్మకాల పెరుగుదలే కంపెనీ దేశీ విక్రయాలు ఎగయటానికి కారణం. ♦ హ్యుందాయ్ దేశీ విక్రయాలు 10.41 శాతం వృద్ధితో 37,450 యూనిట్ల నుంచి 41,351 యూనిట్లకు ఎగశాయి. క్రెటా, ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10 కార్ల డిమాండే కంపెనీ దేశీ విక్రయాల పెరుగుదలకు కారణమని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ♦ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ వాహన విక్రయాలు 10 శాతం వృద్ధితో 33,369 యూనిట్ల నుంచి 36,613 యూనిట్లకు ఎగశాయి. సానుకూల రుతుపవన అంచనాలు కచ్చితంగా డిమాండ్ వృద్ధికి దోహదపడుతాయని ఎం అండ్ ఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటో డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు. ♦ టూవీలర్ విభాగానికి వస్తే.. హీరో మోటోకార్ప్ వాహన విక్రయాలు 2.32 శాతం వృద్ధితో 5,69,876 యూనిట్ల నుంచి 5,83,117 యూనిట్లకు పెరిగాయి. -
జోరుగానే వాహన విక్రయాలు
♦ మారుతీ, రెనో ఇండియాల జోరు ♦ రేట్ల కోతపై కంపెనీల ఆశలు న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది మార్చి నెలలో జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్, హీరో మోటొకార్ప్, అశోక్ లేలాండ్ కంపెనీల వాహన విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ ఇండియా, హీరో మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఆఫ్ ఇండియాల వాహన అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలున్నాయని, దీంతో వడ్డీరేట్లు తగ్గుతాయని, అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్(ప్రవీణ్ షా) వ్యాఖ్యానించారు. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమ పనితీరు మిశ్రమంగా ఉందని హీరో మోటొకార్ప్ పేర్కొంది. వర్షాలు మంచిగా కురిస్తే, సకాలంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు బాగా ఉంటాయని వివరించింది. అన్ని మోడళ్లను బీఎస్-4 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా అందుబాటులోకి తెస్తామని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తెలిపింది. మరింతగా గ్రామీణ మార్కెట్లలోకి విస్తరిస్తామని పేర్కొంది. గత నెలలో 50వేలకు పైగా బైక్‌లు విక్రయించామని, ఒక్క నెలలో 50వేల బైక్‌లు విక్రయించడం చెప్పుకోదగ్గ మైలురాయని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. మారుతీ, హ్యుందాయ్ రికార్డ్ వార్షిక అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, హోండా కార్స్ కూడా మంచి అమ్మకాలు సాధించాయి. మారుతీ సుజుకీ అమ్మకాలు 11 శాతం వృద్ధితో 14.2 లక్షలకు, హ్యుందాయ్ అమ్మకాలు 15 శాతం వృద్ధితో 4.8 లక్షలకు చేరాయి. దేశీయంగా వాహన పరిశ్రమ 7 శాతం వృద్ధి సాధిస్తే తమ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయని మారుతీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 13,05,351 దేశీయంగా అమ్మకాలు సాధించామని, గత ఆర్థిక సంవత్సరంలో తమ అమ్మకాలు 2 శాతం పెరిగాయని హోండా కార్స్ పేర్కొంది. -
మారుతీ వడ్డింపు రూ.34,494 వరకూ
మౌలిక సెస్ విధింపు ఫలితం న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ తన కార్ల ధరలను రూ.34,494 వరకూ పెంచింది. 2016-17 బడ్జెట్లో వాహనాలపై మౌలిక సెస్‌ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించడంతో వాహన కంపెనీలు ఆ మేరకు ధరలను పెంచుతున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ తన అన్ని మోడళ్లపై ధరలను రూ.1,441 నుంచి రూ.34,494 వరకూ పెంచుతోంది. సియాజ్ ఎస్హెచ్వీఎస్, ఎర్టిగ ఎస్హెచ్వీఎస్ మోడళ్లపై మౌలిక సెస్ లేనందున ఈ కార్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. మారుతీ సుజుకీ కంపెనీ రూ.2.54 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.11.69 లక్షల ధర ఉన్న ప్రీమియం క్రాసోవర్ ఎస్-క్రాస్ వరకూ వివిధ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. కాగా వాహనాలపై మౌలిక సెస్ విధింపు కారణంగా ఇప్పటికే మెర్సిడెస్-బెంజ్ తన కార్ల ధరలను రూ.5 లక్షల వరకూ పెంచింది. ఇక టాటా మోటార్స్ రూ.2,000 నుంచి రూ.35,000 వరకూ, హ్యుందాయ్ ఇండియా, హోండా కార్స్ కంపెనీలు రూ.3,000 నుంచి రూ.80,000 వరకూ పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
నెమ్మదించిన దేశీ కార్ల విక్రయాలు
♦ హరియాణా జాట్ రిజర్వేషన్ ఆందోళన కారణం ♦ స్వల్ప వృద్ధిని ప్రకటించిన మారుతీ ♦ హ్యుందాయ్ అమ్మకాల వృద్ధి 9 శాతం న్యూఢిల్లీ: దేశీ కార్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో నెమ్మదించాయి. హరియాణాలో జరిగిన జాట్ రిజర్వేషన్ అందోళన ప్రభావం విక్రయాలపై పడింది. దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ తన దేశీ విక్రయాల్లో స్వల్ప వృద్ధిని ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా కార్ల విక్రయాలు పెరిగాయి. టాటా మోటార్స్ దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాలు మాత్రం తగ్గాయి. ఇక టూవీలర్ల విక్రయాలు బాగా జరిగాయి. టాటా మోటార్స్ ప్యాసెంజర్ వాహన ధరలు అప్ న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తాజాగా ప్యాసెంజర్ వాహన విక్రయాలను రూ.35,000 వరకు పెంచింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. జైట్లీ తన తాజా 2016 -17 బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు విధిస్తున్నట్లు ప్రకటించడమే తమ ధరల పెంపు నిర్ణయానికి కారణమని పేర్కొంది. వివిధ విభాగాలపై ఉన్న సెస్సు శాతాన్ని బట్టి ఆయా వాహన ధరలు పెంపు రూ.2,000-రూ.35,000 శ్రేణిలో ఉంటుందని వివరించింది. వీటి ధరలు రూ. 2.04 లక్షలు- రూ.15.79 లక్షల శ్రేణిలో ఉన్నాయి. ఇవి ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇం డియా కంపెనీలు కూడా వాటి ప్యాసెంజర్ వాహన ధరలను పెంచాలని భావిస్తున్నాయి. 2.5 శాతం వరకూ సెస్‌కు నోటిఫికేషన్... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా పాసింజర్ కార్లపై 2.5 శాతం వరకూ ఇన్ఫ్రా సెస్ అమలుకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. అయితే పెద్ద డీజిల్ ఎస్‌యూవీలు, కార్లపై 4 శాతం సుంకాల విధింపు అంశం నోటిఫికేషన్లో పేర్కొనలేదు. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? టేక్ ఏ లుక్!
ఒకప్పుడు కారు మధ్య తరగతి వారి కల. అది కేవలం డబ్బున్న వారికే సొంతం. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారికి కార్లు అందుబాటులోకి వచ్చాయి. మీరు కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా? త్వరలో భారత మార్కెట్లోకి విడుదల కానున్న టాప్-10 కార్లను ఇక్కడ ఇస్తున్నాం. కొనాలనుకంటే ఓ లుక్కేయండి. 1. టాటా జికా/టాటా సెడన్: కార్ల తయారీలో భారత దిగ్గజ సంస్థ టాటా కంపెనీ జికా మోడల్‌తో ఈ మార్చి నాటికి కొత్త కారును మార్కెట్లోకి తీసుకురానుంది. వాస్తవానికి జనవరిలోనే ఈ కారు విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రపంచాన్ని వణికించిన ఓ వైరస్‌కు కూడా ఈ పేరే ఉండటంతో ఊహించని సమస్యలను ఎదుర్కొంది. ముందుగా జిప్పీకార్ అనే పదం నుంచి జికా పేరు పెట్టారు. ఇప్పుడు కొత్త పేరుగా అడోర్, సివెట్, లేదా టియాగోల్లో ఒక దాన్ని ఖరారు చేయనున్నారు. కైట్ 5 అనే పేరుతో ఈ కారును ఇప్పటికే ఆటో ఎక్స్పో 2016లో ప్రదర్శించారు. 3 సిలిండర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్ యూనిట్లతో టాటా ఈ మోడల్‌ను తీసుకురానుంది. మారుతీ సుజుకీ సెలేరియో, హ్యూండయ్ ఐ10 కార్లకు పోటీగా టాటా జికాను విడుదల చేస్తోంది. దీని ధర రూ.3.5 నుంచి 5 లక్షల మధ్య ఉండనుంది. 2. మారుతీ సుజుకీ వితారా బ్రెజ్జా: ఈ ఎస్‌యూవీని ఆటో ఎక్స్పో 2016లో కంపెనీ ప్రదర్శించింది. ఏప్రిల్‌లో దీన్ని విడుదల చేయనుంది. మహీంద్రా టీయువీ 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌కు పోటీగా ఈ మోడల్ ను మారుతీ తీసుకొస్తోంది. 5 గేర్లు ఉండే ఈ కారులో ఏవీటీ కూడా ఉండే అవకాశాలున్నాయి. 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చే ఈ మోడల్ ధర రూ.6 నుంచి 9 లక్షలు ఉంటుంది. 3. రెనాల్ట్ డస్టర్: ఈ కారు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. మార్చిలో విడుదల చేయనున్నారు. ఈ కొత్త మోడల్లో బయటికి కనిపించే పెద్ద మార్పులేమీ చేయలేదు. సీట్ కవర్లను రీ డిజైన్ చేశారు. దీని ధర రూ.9.5 నుంచి 15 లక్షలు ఉండే అవకాశాలున్నాయి. 4. ఫోక్స్‌వాగన్ అమియో: ఈ కారును భారత్‌లోనే తయారుచేశారు. ఆటో ఎక్స్పో 2016లో కూడా ప్రదర్శించారు. 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. 5 గేర్లు ఉండే ఈ కారు, డీజిల్ వేరియంట్లో మాత్రం 7 స్పీడ్ డీఎస్టీ ఆటోబాక్స్తో కూడా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.5.5 నుంచి 8.5 లక్షల మధ్య ఉండనుంది. 5. స్కోడా సూపర్బ్ : ఈ కారును మంగళవారమే విడుదల చేశారు. 1.8 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లతో లభిస్తుంది. దీని ధర రూ.22 నుంచి 28 లక్షలు ఉండే అవకాశం ఉంది. 6. టాటా నెక్సాన్: ఈ మోడల్ జికాను పోలి ఉంటుంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా టీయూవీ 300, వితారా బ్రెజ్జాలకు పోటీగా టాటా కంపెనీ ఈ మోడల్‌ను తీసుకొస్తోంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. 6 మ్యాన్యువల్ గేర్లు ఉండే ఈ కారును 2016లో అక్టోబరులో విడుదల చేయనున్నారు. దీని ధర రూ.7 నుంచి 10 లక్షలు ఉంటుంది. 7. టాటా హెక్సా: ఈ మోడల్‌ను టాటా కంపెనీ ఇన్నోవా క్రిస్టాకు పోటీగా తీసుకురానుంది. 6 సీట్లు, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండడం దీని ప్రత్యేకత. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉండే ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్‌తో వస్తుంది. దీన్ని ఈ ఏడాది జూన్‌లో విడుదల చేయనున్నారు. ధర రూ.13 నుంచి 18 లక్షలు ఉంటుంది. 8. టయోటా ఇన్నోవా: ఈ ఇన్నోవా క్రిస్టా మోడల్ 2.0 లీటర్ పెట్రోల్, 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్లతో లభించనుంది, డీజిల్ వేరియంట్లో 6 గేర్లు ఉంటాయి. దీన్ని ఈ ఏడాది మార్చి నుంచి జూన్ మధ్యలో విడుదల చేస్తారు. ధర రూ.10 నుంచి 16 లక్షలు ఉంటుంది. 9. మారుతీ సుజుకీ ఇగ్నిస్: ఈ ఎస్‌యూవీని మారుతీ కంపెనీ, మహీంద్రా కేయూవీ 100కు పోటీగా తీసుకొస్తోంది. ప్రస్తుతం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు అందుబాటులోకి రానుంది. 1.3 లీటర్ కూడా వచ్చే అవ కాశం ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ లేదా సీవీటీ యూనిట్‌తో వస్తుంది. దీన్ని పండుగ సీజన్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. అక్టోబరు నాటికి మార్కెట్లోకి రావొచ్చు. ధర రూ.4.5 నుంచి 5 లక్షలు ఉండొచ్చు. 10. హోండా బీఆర్-వీ: హ్యూండయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, మారుతీ సుజుకీ ఎస్-క్రాస్‌లకు పోటీగా హోండా తీసుకొస్తున్న ఈ కారులో 7 సీట్లు ఉంటాయి. 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్, 1.5 లీటర్ ఐ-డీటెక్ డీజిల్ వేరియంట్లలో రానుంది. ఇది కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ లేదా సీవీటీ యూనిట్‌తో పనిచేస్తుంది. దీన్ని సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ధర రూ.9 నుంచి 13 లక్షలు ఉండే అవకాశం ఉంది. -
అక్కడ కార్ల తయారీ నిలిపేశారు!
హర్యాణా జాట్ రిజర్వేషన్ల గొడవ మారుతీ సంస్థకు తీవ్ర నష్టాలను తీసుకొచ్చింది. స్థానికంగా జరుగుతున్న ఆందోళనల కారణంగానే మానేసార్, గుర్గావ్ ప్లాంట్లలో కార్ల తయారీని నిలిపివేసినట్లు మారుతీ సుజుకి సంస్థ ఇప్పటికే వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్పత్తిని నిలిపివేశామన్న సంస్థ... తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనే వివరాలను మాత్రం తెలుపలేదు. ప్లాంట్లకు కావలసిన వస్తువులను వివిధ పంపిణీదారుల నుంచి సేకరిస్తామని, ఇప్పుడు ఆందోళనల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కార్ల తయారీని నిలిపివేయాల్సి వచ్చిందని మారుతీ సంస్థ చెప్తోంది. ఇదే పరిమాణంలో ఇతర ప్రాంతాలనుంచి వస్తువులను తెప్పించుకునే అవకాశం కూడా లేదని, అది ఎంతో కష్టంతో కూడుకున్న పని అంటోంది. రోజుకు మానేసార్, గుర్గావ్ రెండు ప్లాంట్లలో కలిపి సుమారు 5,000 యూనిట్ల వాహనాలు తయారవుతాయని రిజర్వేషన్ గొడవల నేపథ్యం సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల నూతనంగా ప్రవేశ పెట్టిన మారుతి సుజుకీ బాలెనోకి భారీ డిమాండ్ ఉన్నా... తయారీ నిలిపివేయడం సంస్థకు కష్టాలను తెచ్చిపెట్టిందని చెప్తోంది. హర్యాణా ఆందోళనలు రోటాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే రోజువారీ జీవితాలపై కూడ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఆహారం, పాలు, పెట్రోల్ వంటి వస్తువుల పంపిణీ కూడ కష్టంగా మారింది. ఆందోళనలను అరికట్టడంలో భాగంగా రోటాక్ జిల్లాలో ఏకంగా ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను కూడ నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
హిట్ కాంబినేషన్‌తో... మారుతి
‘లక్ష్మి’, ‘తులసి’ తర్వాత మళ్ళీ వెంకటేశ్, నయనతారల హిట్ కాంబినేషన్లో ఇప్పుడు ఓ కొత్త సినిమా మొదలైంది. మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు స్విచాన్ చేయగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ -‘‘గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ ఇప్పటికే మూడు పాటలకు ట్యూన్లిచ్చారు. ఈ చిత్రానికి ఛాయాగ్ర హణం: వివేక్ ఆనంద్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ. -
కార్ల విక్రయాలకు పండుగ కళ..
రికార్డ్ అమ్మకాలు సాధించిన మారుతీ, హ్యుందాయ్ న్యూఢిల్లీ: పండుగ కళతో అక్టోబర్ నెల వాహన విక్రయాలు కళకళలాడాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు తమ తమ కంపెనీల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ విక్రయాలు జోరుగా సాగాయి. వివరాలు.., కొత్త మోడళ్లు, కొత్త వేరియంట్లతో మంచి అమ్మకాలు సాధించామని మారుతీ సుజుకీ తెలిపింది. పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు బావుంటాయనే ఉద్దేశంతో తమ నెట్‌వర్క్‌ను సిద్ధం చేశామని, తమ కంపెనీ చరిత్రలోనే అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని కంపెనీ ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. అక్టోబర్‌లో అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని హ్యుందాయ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. గ్రాండ్ ఐ10 కూడా రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించిందని వివరించారు. వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడిందని, రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రీమియం బ్రాండ్స్ క్రెటా, ఇలీట్ ఐ20/యాక్టివ్ కార్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన టీయూవీ300 ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు. వడ్డీరేట్లు తగ్గడం, ఇంధన ధరలు కూడా తక్కువ స్థాయిల్లోనే కొనసాగడం కలసివచ్చాయని వివరించారు.రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
వెంకటేష్‌తో మరోసారి జోడీ కట్టబోతున్న నయన్
-
మారుతి దర్శకత్వంలో..?
నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందా? ఫిలిం నగర్ వర్గాలు ఔననే అంటున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్‌తో మారుతి డీసెంట్ ఎంటర్టైనర్స్ తీయగలనని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి హీరోలు ముందుకు వస్తున్నారట. ముందుగా నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారట. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మారుతి కథ రెడీ చేసుకునే పని మీద ఉన్నారట. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందే సినిమా డిసెంబర్లో ఆరంభమయ్యే అవకాశం ఉందని బోగట్టా. -
అమెరికాలోనూ మారుతి మేజిక్!
ఒక మతిమరుపు కుర్రాడిని తెరపై చూసి ఎవరైనా భలే మగాడు అంటారా? కానీ మారుతి తన మేజిక్‌తో అది సాధ్యమే అని నిరూపించాడు. ఈ మతిమరపు కథను ఇప్పుడు పరిశ్రమ ‘అన్ఫర్గెటబుల్ హిట్’గా కీర్తిస్తోంది. ఇంటా బయటా ఎక్కడ చూసినా ‘భలే భలే మగాడివోయ్’ ప్రభంజనమే. మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది. యు.వి. క్రియేషన్స్, జిఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మాత. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అమెరికాలో అయితే ఏకంగా మిలియన్ డాలర్ల మార్క్‌ని అధిగమించి దర్శకుడు మారుతిని త్రివిక్రమ్, శ్రీను వైట్ల, రాజమౌళి, కొరటాల శివల సరసన చేర్చింది. నానిని కూడా అగ్ర కథానాయకుల జాబితాలోకి తీసుకెళ్లిందీ సినిమా. సాధారణంగా ఓవర్సీస్ ప్రేక్షకులు కామెడీని బాగా ఇష్టపడుతుంటారు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ లాంటి దర్శకుల చిత్రాలు అమెరికాలో వసూళ్లు ఇరగదీస్తుంటాయంటే వాళ్ల సినిమాల్లోని కామెడీనే కారణం. ఆ తరహాలో ఈసారి మారుతి అదరగొట్టాడు. స్వచ్ఛమైన వినోదంతో సినిమా తీశాడు. చాలారోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వించే సినిమా వచ్చిందంటూ ‘భలే భలే మగాడివోయ్’కి అమెరికాలో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోలాగే విడుదలైన తొలిరోజే అమెరికాలో పాజిటివ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. లాభాలే లాభాలు... అప్పట్లో ప్రచారం కాలేదు కానీ, మారుతి తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ని అమెరికాలో రెండు లక్షల రూపాయలకు కొని విడుదల చేస్తే ఏకంగా 25 లక్షల వసూళ్లొచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్‌కి ఏ రేంజ్ లాభాలో ఊహించొచ్చు. అలాగే ‘ప్రేమకథా చిత్రమ్’ రూ.5 లక్షలకి అమ్ముడైంది. కాని ఇక్కడ ఆ సినిమాకి రూ.75 లక్షల వసూళ్లొచ్చాయి. ఇటీవల ‘భలే భలే మగాడివోయ్’ సినిమాని అమెరికాలో రూ.55 లక్షలకు అమ్మారు నిర్మాతలు. కానీ ఆ సినిమా ఏకంగా మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఈరకంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్‌లో మారుతి ఓ సరికొత్త ట్రెండ్‌ని సృష్టించినట్టే. అమెరికాలోనే కాదు... నైజామ్, ఆంధ్రా, సీడెడ్‌లలోనూ ‘భలేభలే మగాడివోయ్’కి థియేటర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మంచి సినిమాలే... దర్శకుడు మారుతి ఇదివరకు తీసిన సినిమాల్లో కూడా వినోదం చాలానే ఉంది. కాని దాంతో పోలిస్తే ‘భలే భలే మగాడివోయ్’లోని వినోదం విభిన్నమైనది. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి స్పందనొచ్చింది. మారుతి కామెడీ శైలిని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ స్పందనని చూసి మారుతి కూడా మరింతగా స్ఫూర్తి పొందుతున్నాడు. ‘‘మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న విషయం మరోసారి తెలుగు ప్రేక్షకులు రుజువు చేశారు. ఇకపై ఇలాంటి స్వచ్ఛమైన సినిమాలే తీస్తా. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులతోపాటు అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులకూ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు’’ అంటున్నాడు మారుతి. నాని టైమింగ్ అదుర్స్ ‘భలే భలే మగాడివోయ్’ కథని నాని తన టైమింగ్‌తో మరో స్థాయికి తీసుకెళ్లాడు. లక్కీ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించాడు. లావణ్యతోనూ మంచి కెమిస్ట్రీ పండించాడు. అందుకే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాని టైమింగ్ గురించీ, లావణ్య త్రిపాఠి అందం గురించి మాట్లాడుతున్నారు. ‘ఇది ఊహించని విజయం’ అంటున్నాడాయన. ‘సినిమా సక్సెస్ సాధిస్తుందని తెలుసు. కానీ ఈ స్థాయిలో సక్సెస్‌ని మాత్రం అస్సలు ఊహించలేదు. ఓవర్సీస్లో ప్రేక్షకుల ఆదరణని నిజంగా ఎప్పటికీ మరచిపోలేను’ అని చెప్పుకొచ్చాడు నాని. -
డైనమైట్ .. భలే.. భలే... కొత్త సినిమాలు గురూ!
కొత్త సినిమాలు గురూ! ఈ యాక్షన్ సినిమా చూస్తూ కళ్లు తిప్పామంటే పళ్లు రాలతాయి... అంత స్పీడులో బ్రేకుల్లేకుండా పరుగెడుతుంది ఈ స్క్రీన్ ప్లే. ఇంకొక కామెడీ సినిమా చూస్తూ పళ్లు బిగపట్టకపోతే కళ్లూడతాయి నవ్వుతో... అంతగా బ్రేకు ఇవ్వకుండా మరీ గిలిగింతలు పెడుతుందీ స్టోరీ లైన్. మొత్తానికి ఈ వారం సినిమా స్కోపు డబులైంది. ఆకట్టుకున్న ఈ సినిమాలు డబ్బులు తెస్తాయి. ఈ శ్రావణంలో మన సినిమాకి మంచి రోజులూ, మంచి సినిమాకి వెలుగు జిగేళ్లూ ప్రాప్తమయ్యాయి. క్లాసూ మాసూ తేడా లేకుండా... దేవ కట్టా, మారుతి కట్టలు తెంచుకుని మరీ గంతులేశారు. డైనమైట్ యాక్షన్ బిట్లు భలే భలేగా ఆకట్టుకున్నాయి. భలే భలే కామెడీ బిట్లు డైనమైట్లా పేలాయి. దర్శకుడు శ్రీను వైట్ల తరహా వినోదభరిత సినిమాలకూ, రచయిత కోన వెంకట్ బాక్సాఫీస్ మంత్రమైన స్క్రీన్‌ప్లే విధానానికీ తెలుగు సినిమా బందీగా మారి కొన్నేళ్ళయింది. ఈ మధ్యే అడపాదడపా కొన్ని ఫ్యామిలీ కథలు, కొన్ని హార్రర్ - కామెడీలు అందుకు భిన్నంగా అలరిస్తున్నాయి. అయితే, వీటిలోనూ వినోదం కామనే. ఇప్పుడున్న ఈ ట్రెండ్లకు భిన్నంగా పూర్తి ఛేజింగ్ ఫార్ములా యాక్షన్ సినిమా తీస్తే? అలా వచ్చిందే - ‘డైనమైట్’. వైవిధ్యాన్ని ఆశ్రయించారు నట, నిర్మాత విష్ణు. ఇంతకీ కథేంటి? శివాజీ కృష్ణ (మంచు విష్ణు) డిజిటల్ మార్కెటింగ్ చేసే వ్యక్తి. అన్యాయం ఎదురైతే, ఎదిరించి పోరాడే తత్త్వమున్న మనిషి. ఆ క్రమంలో అతను అనుకోకుండా అనామిక (ప్రణీత)కు దగ్గరవుతాడు. ఆమె ‘చానల్ 24’ సి.ఇ.ఓ రంగనాథ్ (పరుచూరి వెంకటేశ్వరరావు) కూతురు. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడీ పడగానే కథలో కుదుపు. దుండగులు కొందరు హీరోయిన్ను కిడ్నాప్ చేస్తారు. నేరస్థులను వెంటాడే క్రమంలో హీరోయిన్ తండ్రి ఇంటికి వెళతాడు హీరో. ఆయన దగ్గరున్న కీలకమైన వీడియో తాలూకు మెమొరీ కార్డ్ కోసం దుండగులు హీరోయిన్ను కిడ్నాప్ చేశారన్నమాట. అక్కడ జరిగిన కాల్పులు, ప్రతికాల్పుల్లో ఆయన చనిపోతాడు. దీని వెనక ఎవరో పెద్దలున్నారని హీరోకూ అర్థమైపోతుంది. కథ ముదిరి, పాకానపడుతుంది. కిడ్నాప్ చేసిన దుండగుల నుంచి హీరోయిన్ను హీరో తప్పిస్తాడు. అలాగే, దుండగులు తెచ్చిన వీడియో టేప్ మెమొరీకార్డ్ను కూడా సాధిస్తాడు. అయితే, ఆ కార్డ్ ఓపెన్ కాదు. అందులో ఏముందన్న సస్పెన్స్ కొనసాగుతుంది. కథ అక్కడ నుంచి కేంద్రంలో ఉన్న కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రిషిదేవ్ (జె.డి. చక్రవర్తి) దాకా వెళుతుంది. హీరో - హీరోయిన్లను చంపడానికి కూడా మంత్రి వెనకాడడు. ఇంతకీ ఆ కార్డ్‌లోని వీడియోలో ఉన్నదేమిటి, మంత్రికీ దానికీ సంబంధం ఏమిటీ అన్నది ఈ కాన్స్పిరసీ థ్రిల్లర్ మిగతాపార్ట. తమిళ కథ... తెలుగు యాక్షన్... ‘ఢీ’, ‘దేనికైనా రెఢీ’ లాంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు సాధించిన హీరో విష్ణు ఈసారి ట్రాక్ మార్చి, ఇలా యాక్షన్ బాట పట్టారు. రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నం కాబట్టి అభినందించాలి. తమిళ చిత్రం ‘అరిమ నంబి’, దర్శక - రచయిత ఆనంద్ శంకర్ దానికి రాసుకున్న కథ - ఈ ‘డైనమైట్’కు ఆధారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు కొన్ని కొత్త సీన్లు కలుపుకొని, దర్శకుడు కొత్తగా వండి వడ్డించారు. ‘ప్రస్థానం’ ద్వారా చాలా పేరు తెచ్చుకున్న దేవ కట్ట ఈ కథను స్టయిలిష్‌గా ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. యాక్షన్ ప్రధాన చిత్రం కాబట్టి స్టంట్ మాస్టర్ విజయన్ దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా సినిమా మొత్తాన్నీ తన చేతుల మీదుగా నడిపించారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న హీరో విష్ణు చేత థ్రిల్స్ బాగా చేయించారు. విష్ణు కూడా యాక్షన్ సన్నివేశాలకు బిలీవబుల్‌గా ఉన్నారు. డ్యాన్స్‌లకు పడిన కష్టమూ తక్కువేమీ కాదు. ప్రణీత అందంగా కనిపిస్తూ, యాక్షన్ సీన్లూ కష్టపడి చేశారు. జె.డితో విలనీ వెరైటీగా అనిపిస్తుంది. సందర్భం, సంభావ్యతల పని లేకుండా, మాస్ కోసం సినిమాలో ప్రత్యేక నృత్యగీతం పెట్టారు. హీరో, హీరోయిన్ల మధ్య కలర్‌ఫుల్ డ్యూయెట్లూ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాలకు కీలకం. ఆ పని చిన్నా బాగా చేశారు. కెమేరా వర్క్ కూడా భేష్. రెండు గంటల 22 నిమిషాల ఈ సినిమా హీరోయిన్ కిడ్నాప్ నుంచి పట్టాల మీద కెక్కి, వేగంగా నడుస్తుంటుంది. జనం ఆ మూడ్‌లో లీనమైపోతారు. ఫలితంగా, లోటుపాట్లేమైనా ఉన్నా గుర్తించే తీరిక, గుర్తుపెట్టుకొనే ఓపిక ఉండవు. ఆఖరి దాకా టెంపోలో సాగడంతో సినిమా ఎంతసేపటిగా చూస్తున్నామనే ఫీలింగే రాదు. అది సినిమాకు శ్రీరామరక్ష. యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకూ, మాస్కూ నచ్చే విషయం. వెరసి, సమష్టి కృషితో తెరపై ఇది అవుటండ్ అవుట్ యాక్షన్ దట్టించిన డైనమైట్. దర్శకుడు దేవ కట్ట భలే.. భలే తెలుగు తెరపై అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం కామన్. వాళ్ళకు విలన్ నుంచి ఇబ్బందులు ఎదురవడం కూడా కామనే. కొన్నిసార్లు... ఆ ప్రేమకూ, పెళ్ళికీ అడ్డంకి హీరోయిన్ తండ్రే కావడం మరీ కామన్. ఈ ఫార్ములా కథకు మతిమరుపనే పాయింట్‌తో కాస్తంత కొత్తదనం చేరిస్తే? దర్శకుడు మారుతి రాసుకున్న ‘భలే.. భలే మగాడివోయ్’ కథ అలాంటిదే! ఈ కథేంటి? శ్రీమతి, శ్రీఆంజనేయు లు (నరేశ్ - సితార) దంపతుల బిడ్డ లక్కరాజు అలియాస్ లక్కీ(నాని). మనవాడు మైండ్ ఆబ్సెంట్కి యూత్ ఐకాన్. మరో సైంటిస్ట్ పాండురంగారావు (మురళీశర్మ). ఆయన కూతురు కూచిపూడి డ్యాన్సర్ నందన (‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్యా త్రిపాఠీ). లక్కీని అల్లుడిగా చేసుకుందామనుకున్న టైమ్‌లో ఆయనకు ఈ ‘మతిమరపు మేళం’ సంగతి అర్థమై, పెళ్ళి కుదరదంటాడు. ఇంతలో పరధ్యానంలో చేసిన ప్రతి పొరపాటునూ ఏదో ఒక సామాజిక సేవకూ, మంచి పనికీ లింక్ చేస్తూ, హీరోయిన్ ప్రేమను పొందుతాడు హీరో. కూతురు ప్రేమిస్తున్నది తాను వద్దనుకున్న సంబంధం తాలూకు కుర్రాడినే అని తెలియక హీరోయిన్ తండ్రి కూడా ఓ.కే. అనేస్తాడు. ఇంతలో అసలు సంగతి హీరోకు అర్థమైపోతుంది. ఇక, అక్కడ నుంచి అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కలసి హీరో ఆడే నాటకం. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ అజయ్ (నటుడు అజయ్) ఎలాగైనా హీరోయిన్ను పెళ్ళి చేసుకోవాలని చూస్తుంటాడు. ఈ మొత్తం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ తరహా ఎపిసోడ్ ఏయే మలుపులు తిరిగింది, చివరకు హీరో - హీరోయిన్ల ప్రేమ ఎలా సక్సెసైందన్నది మిగతా సినిమా. నేచురల్ యాక్టింగ్ ఆ మధ్య ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్న తరహా ప్రయత్నం చేసిన హీరో నాని ఈసారి ‘మతిమరపు’ పాయింట్‌తో జనం ముందుకొచ్చారు. కామెడీ పండించడానికి మంచి స్కోపున్న విషయమిది. దాన్ని దర్శకుడు బాగానే వాడుకున్నారు. సహజంగా ప్రవర్తించినట్లుండే నాని తరహా నటన ఈ పాత్రకు మరో ప్లస్. కథాంశం చాలా చిన్నది కాబట్టి, ఎక్కువగా సీన్లు రాసుకొని, వాటితో నడిపించడం మీదే దర్శక - రచయితలు ఆధారపడ్డారు. ఆ పరిస్థితుల్లో నాని వినోదంతో సినిమాను ముందుకు నడిపే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. లావణ్యా త్రిపాఠీ చూడడానికి బాగుంది. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ మంచి క్యారెక్టర్ యాక్టర్‌నని ఋజువు చేసుకున్నాడు. అజయ్ విలనీ సరేసరి. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మలయాళ మ్యూజిక్ డెరైక్టర్ గోపీ సుందర్ (‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్) సంగీతం సినిమాకు మరో బలం. త్యాగరాయ కీర్తన ‘ఎందరో మహానుభావులు...’ను అనుకరిస్తూ, కథకూ, హీరో క్యారెక్టరైజేషన్‌కూ తగ్గట్లుగా సాహిత్యం మార్చుకొని, అదే ట్యూన్లో చేసిన ప్రయోగం బాగుంది (రచన రామజోగయ్య శాస్త్రి). రిచ్ ఫ్రేమింగ్స్తో నిజార్ షఫీ కెమేరా వర్క్ భేష్. ‘ముద్ర’కు దూరంగా.. ఫ్యామిలీస్‌కి దగ్గరగా.. హీరోకున్న మతిమరపు పాయింట్‌ను టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చైల్డ్‌హుడ్ ఎపిసోడ్‌లోనే దర్శకుడు చెప్పేశారు. కానీ, ప్రేక్షకులు మర్చిపోతారనో ఏమో, ఫస్టాఫ్‌లో గంటకు పైగా అలాంటి సంఘటనలతో నడిపారు. అయితే, అవన్నీ వినోదం నింపే ఎపిసోడ్సే. చివరకొచ్చేసరికి అల్లుడే మామను జయించి, ఒప్పించినట్లు కాకుండా, మామే అల్లుడిని చాలాకాలంగా గమనిస్తూ, ఓ.కె. చెప్పినట్లు చూపడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. మొత్తం మీద, ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ లాంటి చిత్రాలతో ఒక ముద్ర వేయడమే కాకుండా, తెలియకుండానే తన మీద ఒక రకం ముద్ర వేయించుకున్న దర్శకుడు మారుతికి ఈ సినిమా ఒక పెద్ద రిలీఫ్. రెండర్థాల మాటలతో పని లేకుండా, క్లీన్ ఎంటర్టైనర్ను కూడా అందించగలనని ‘భలే.. భలే.. మగాడివోయ్’తో ఆయన ప్రూవ్ చేసుకున్నట్లయింది. తీరిక, ఓపిక తగ్గిన నవతరం ప్రేక్షకులు కోరుకుంటున్నదీ కాసేపు నవ్వుకోవడమే కాబట్టి, ఫ్యామిలీస్ ఈ సినిమా చూసి ‘భలే భలే.. సినిమావోయ్’ అంటే ఆశ్చర్యం లేదు. దర్శకుడు మారుతి తెర వెనుక ముచ్చట్లు ►‘డైనమైట్’ చిత్రం ఏడాది క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘అరిమ నంబి’కి రీమేక్. తమిళ సినిమా విడుదలైన నాలుగు రోజులకే దాని గురించి తెలిసి, రీమేక్ రైట్స్‌కి పోటీ ఎదురైంది. తమిళ నిర్మాత ఎస్. థానుకి, మోహన్‌బాబుకి మధ్య అనుబంధం వల్ల విష్ణుకు రైట్స్ దక్కాయి. ► ఈ చిత్రానికి మొదట ‘ఎదురీత’ అని టైటిల్ పెడదామనుకున్నారు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, ‘డైనమైట్’ టైటిల్ పెట్టాలన్నది విష్ణు ఆలోచన. యూనిట్ మొత్తానికి నచ్చడంతో చివరికి దాన్నే ఫైనలైజ్ చేశారు. ► తమిళ ఒరిజినల్‌కి ‘డ్రవ్ు్స’ శివమణి సంగీత దర్శకుడు. మ్యూజిక్ డెరైక్టర్‌గా అదే ఆయన తొలి సినిమా. తెలుగులో పాటలు అచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిన్నా అందించారు. ► షూటింగ్‌కి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేశారు. ఎక్కడెక్కడ తీయాలో లొకేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని న్యాచురల్ లొకేషప్స్లో, సెట్స్ వేసి తీశారు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. 65 రోజుల్లో పూర్తి చేసేశారు. ► మొత్తం ఏడు ‘రెడ్ కెమెరా’లు వాడారు. యాక్షన్ సీక్వెన్సెస్‌కి ఐదు, టాకీకి రెండు. ► చేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ విష్ణు డూప్ లేకుండా చేశారు. విష్ణు సినిమాకు ఫైట్ మాస్టర్ విజయన్ పనిచేయడం ఇదే మొదటిసారి. ఫైట్స్ టైవ్‌ులో విష్ణుకి చిన్న గాయాలయ్యాయి. వాటి తాలూకు మచ్చలు ఈ సినిమాకి సంబంధించిన తీపి గుర్తులంటారు విష్ణు. ►‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడు మారుతి డెరైక్టర్ కాక ముందు ‘బిబా సీడ్స్’ కంపెనీకి ప్రోమో చేసిచ్చారు. అప్పుడే మొక్కల పెంపకం నేపథ్యం కథ ఆలోచనొచ్చింది. అదే ఈ సినిమాకి వాడారు. ►మారుతికి కూడా ఏదైనా ఒక పనిలో పడితే మిగతా విషయాలు మర్చిపోతూంటాడు. ఆ మతిమరుపు డోస్ పెంచి హీరో క్యారెక్టైరె జేషన్ డిజైన్ చేస్తూ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఫస్ట్‌హాఫ్ రెడీ కాగానే నానీకి వినిపిస్తే ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ►‘మరోచరిత్ర’లోని భలే భలే మగాడివోయ్ పాట మారుతికిష్టం. నాలుగేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పటికి కథ లేదు. ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అని పెట్టారు. ►ఈ సినిమాలో నాని ఉపయోగించే మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ ‘భలే భలే మగాడి వోయ్’ పాట. దాన్ని ఇలా రింగ్‌టోన్ పెట్టాలని అనుకోలేదు. ఎడిటింగ్ టైమ్‌లో తీసుకున్న డెసిషన్ ఇది. ►‘హల్లో హల్లో’ అనే పాట మినహా ఈ సినిమా మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరించారు. ‘హల్లో హలో’్ల పాట మాత్రం గోవాలో తీశారు. వర్కింగ్ డేస్ 50 రోజులు ►హీరోయిన్ ఫాదర్ పాత్రకు ‘మిర్చి’ సంపత్ లేదా మురళీ శర్మ అనుకున్నారు. ఫ్రెష్ ఫీల్ ఉంటుందని శర్మను ఎంపికచేశారు. మహేశ్‌బాబు ‘అతిథి’లో విలన్‌గా పరిచయమయ్యారు. ►ఓ రోజు టీవీలో ‘నాయిగళ్ జాగిరతై’ తమిళ సినిమా చూస్తున్నారు మారుతి. ఆ విజువల్స్ బాగా నచ్చాయి. కెమేరామ్యాన్ నిజార్ షఫీకదే తొలి సినిమా. ఆయన్ని ఈ సినిమాకు పెట్టారు. -
మినీ భారతం!
మహాభారతంలోని శ్రీకృష్ణుడు, పంచపాండవులు మళ్లీ తెరపై ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? అది తెలియాలంటే ‘సినీ మహల్’ చూడాల్సిందే. సిద్దాంశ్, రాహుల్, తేజస్విని ముఖ్యతారలుగా లక్ష్మణ్ వర్మ దర్శక త్వంలో బి.రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ వర్మ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం మినీ మోడ్రన్ మహాభారతాన్ని పోలినట్లుగా ఉంటుంది. వినూత్న కథాంశంతో సాగే చిత్రం. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర సహ నిర్మాతలు పార్ధు, బాలాజీ , మురళీధర్, దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
కారు కొంటున్నారా.. ఇప్పుడే కొనేయండి!
-
ప్రేమ విలువ చెప్పే నంబర్
‘‘ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి. కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతాయనిపిస్తోంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషిక, మహావీర్, అస్రిద్ మాధుర్, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘టోల్ ఫ్రీ నంబర్ 143’. వీఎస్ వాసు దర్శకత్వంలో దాసరి భాస్కర యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ వెంకట్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని మారుతి ఆవిష్కరించి నిర్మాత ఎన్వీ ప్రసాద్‌కి ఇచ్చారు. దాసరి భాస్కర్ మాట్లాడుతూ -‘‘143 అంటే ఐ లవ్ యు అని అర్థం. యువత డ్రగ్స్‌కి ఎలా బానిసలవుతున్నారో చెప్పే చిత్రం ఇది’’ అన్నారు. -
దేశీ మార్కెట్లో చిన్న కార్ల జోరు
న్యూఢిల్లీ: కష్టకాలాన్ని ఎదుర్కొంటూ వచ్చిన దేశీ కార్ల మార్కెట్‌కు ప్రస్తుతం చిన్న కార్లు ఊతమిస్తున్నాయి. ఇరుకు రోడ్లు, పార్కింగ్ సమస్యల కారణంగా కొనుగోలుదారులు ఎక్కువగా వీటివైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం. దీంతో పరిమాణంలో చిన్నగా ఉన్నా, కొనుగోలుదారు పెట్టే ధరకు గరిష్ట స్థాయిలో లగ్జరీ సదుపాయాలను కూడా ఆటోమొబైల్ కంపెనీలు వీటిలో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూ. 5,00,000- రూ. 9,00,000 శ్రేణిలో మినీ సెడాన్లు, రూ. 6,00,000 నుంచి రూ. 12,00,000 దాకా ఖరీదు చేసే స్పోర్ట్స్ యుటి లిటీ వాహనాలు(ఎస్యూవీ), మల్టీ యుటిలిటీ వాహనాలు(ఎంయూవీ) మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. మిగతా సెగ్మెంట్లతో పోలిస్తే ఈ సెగ్మెంట్ మెరుగ్గా 15-16 శాతం స్థాయిలో వృద్ధి చెందుతోందని అంచనా. నాలుగు మీటర్ల లోపు పొడవుండే కార్లపై తక్కువ స్థాయిలో ఎనిమిది శాతం ఎక్సైజ్ సుంకం విధించాలన్న గత యూపీఏ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. చిన్న కార్ల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. సెడాన్లపై 20 శాతం, ఎస్‌యూవీలపై 24 శాతం ఎక్సైజ్ సుంకాలు ఉండాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించడం చిన్న కార్ల మార్కెట్‌కు తోడ్పడుతోంది. లగ్జరీ ఫీచర్లు.. లోపల విశాలంగా ఉండటం, లగ్జరీ ఫీచర్లు, తక్కువ ధర, చూడముచ్చటి ఆకారం, అన్నింటికన్నా ముఖ్యంగా మెరుగైన మైలేజీ, ట్రాఫిక్‌లో సైతం సులువుగా వెళ్లేందుకు అనువుగా ఉండటం చిన్న కార్లకు ప్లస్ పాయింటు. టచ్స్క్రీన్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, పార్కింగ్ సెన్సార్లు, డే-టైమ్ ల్యాంప్‌లు, సీడీ ప్లేయర్లు మొదలైన ఫీచర్లు కొన్నాళ్ల క్రితం దాకా కాస్త పై స్థాయి కార్లకు మాత్రమే పరిమితం అయ్యేవి. ప్రస్తుతం టెక్నాలజీ అభిరుచి కలిగిన యువ కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుండటంతో కంపెనీలు చిన్న కార్లలో కూడా ఇలాంటి ఫీచర్లను పొందుపరుస్తున్నాయి. స్టీరింగ్ వీల్‌పైనే బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో కంట్రోల్స్ కూడా ఉండాలని చాలా మంది కొనుగోలుదారులు కోరుకుంటున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణుడు టుటు ధవన్ తెలిపారు. ఇతరులను అనుకరించడం కాకుండా తమ అవసరాలకు అనుగుణమైన కార్లను ఎంచుకోవడంలో దేశీ కొనుగోలుదారులు ప్రస్తుతం వాస్తవిక దృక్ప థంతో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 4 మీటర్ల లోపు పొడవుండే కార్లలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హోండా అమేజ్, మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్ వాహనాలు పాపులర్‌గా ఉన్నాయి. అలాగే రెనో డస్టర్, నిస్సాన్ టెరానో, మారుతీ సుజుకీ ఎర్టిగా, హోండా మొబీలియో కార్లు మార్కెట్లో పెను మార్పులు తెచ్చాయి. ఈ సెగ్మెంట్ ఊతంతోనే రెనో, ఫోర్డ్ వంటి కంపెనీలు నిలదొక్కుకున్నాయి. భారత మార్కెట్లో లేటుగా ప్రవేశించినప్పటికీ 2012 జూలైలో ప్రవేశపెట్టిన డస్టర్ ఎస్‌యూవీతో రెనో సంస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక, రెండు దశాబ్దాల పైగా భారత్‌లో ఉన్న పెద్దగా విజయవంతం కాలేకపోయిన ఫోర్డ్ సైతం.. ఎకోస్పోర్ట్ మినీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. 17 రోజుల వ్యవధిలో ఏకంగా 40,000 బుకింగ్స్ వచ్చాయి. ఇప్పటికీ వీటికోసం నాలుగు నుంచి ఎనిమిది నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ విభాగం కార్లు ఇంత ప్రజాదరణ పొందుతుండటంతో రాబోయే ఆరు నెలల్లో మారుతీ, టాటా, హ్యుందాయ్, మహీంద్రా, ఫియట్, షెవర్లె, ఫోక్స్‌వ్యాగన్ తదితర కంపెనీలు మరిన్ని మినీ-సెడాన్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. -
ఇదో బలహీన ప్రేమకథాచిత్రమ్
తారాగణం: సుమంత్ అశ్విన్, నందిత, కెమేరా: మల్హర్ భట్ జోషీ, సంగీతం: జె.బి, నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, బి.మహేంద్ర బాబు, దర్శకత్వం: హరినాథ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: మారుతి కొన్ని కథలు వినడానికి బాగుంటాయి... మరికొన్ని చూడడానికి బాగుంటాయి. వినడానికి బాగున్నవన్నీ తెరపై చూసేందుకు సరిపడక పోవచ్చు. పదే పదే ఒక అబ్బాయి ప్రేమను భగ్నం చేసే అమ్మాయి. చివరకు ఆ అమ్మాయి, అబ్బాయే ప్రేమలో పడితే? వినడానికి బాగున్న ఈ ఇతివృత్తానికి మారుతి మార్కు వెండితెర రూపం - ‘లవర్స’. కథ ఏమిటంటే... సిద్ధు (సుమంత్ అశ్విన్) ఇంటర్ చదువుతున్న రోజుల నుంచి ఒకరి తరువాత మరొకరుగా గీత (తేజస్వి), సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. కానీ, ఆ అమ్మాయిలకు ఫ్రెండ్ అయిన చిత్ర (‘ప్రేమకథా చిత్రవ్‌ు’ ఫేవ్‌ు నందిత) ‘అది నిజమైన ప్రేమ కాదు... ప్రేమ పేరిట ఉబుసుపోక కాలక్షేప (ఫ్లర్టింగ్)’మంటూ, ఆ ప్రేమల్ని చెడగొడుతుంది. తీరా ఇంజినీరింగ్ చదువుకొంటున్న రోజుల్లో ఆ చిత్రనే అనుకోకుండా హీరో ప్రేమిస్తాడు. ఆ విషయం తెలిశాక ఏమైంది, వాళ్ళ ప్రేమ ఫలించిందా అన్నది మిగతా సినిమా. ఎలా నటించారంటే... హీరో సుమంత్ అశ్విన్ హుషారుగా నటించాడు, నర్తించాడు. కెమేరా లుక్స్ మీద, ఎంచుకొనే కథల మీద ఈ యువ నటుడు మరింత శ్రద్ధ పెట్టాలి. నందిత ఫరవాలేదనిపిస్తారు. మారుతి చిత్రాల్లో తరచూ కనిపించే సాయి పంపన హీరో ఫ్రెండ్‌గా మాటల హడావిడి చేశారు. సెకండాఫ్ లోని సప్తగిరి ఎపిసోడే ఈ బలహీనమైన కథ, కథనాల్లో కాస్త రిలీఫ్. ఎలా ఉందంటే... సినిమా మొదలైనప్పుడు కాస్త ఆసక్తిగా అనిపించినా, చర్చి ఫాదర్ (ఎమ్మెస్ నారాయణ)తో హీరో తన మొదటి ప్రేమకథ చెప్పి, రెండో కథ మొదలుపెట్టేటప్పటికే ఆసక్తి పోతుంది. పాత్రల పరిచయం, అసలు హీరోయిన్‌తో హీరో ప్రేమ మొదలవడం - ఈ కొద్దిపాటి కథనే ఫస్టాఫ్ అంతా నడిపారు. ఇక, వారిద్దరి మధ్య ప్రేమను ఎలా ముందుకు నడపాలన్న దానిపై దర్శక, రచయితలకు కూడా ఒక స్పష్టత లేదు. దాంతో, ప్రధాన కథకు సంబంధం లేని పాత్రలను తెచ్చి, వాటి ద్వారా కామెడీ చేయిస్తూ, కథను ముగింపు దగ్గరకు తీసుకురావాలని విఫలయత్నం చేశారు. కానీ, దురదృష్టవశాత్తూ ప్రేక్షకులప్పటికే డిస్కనెక్ట్ అయిపోతారు. మారుతి సినిమాలన్నిటి లాగానే దీనిలోనూ అక్కడక్కడ ఆడియో కట్లను దాటుకొని వచ్చిన ద్వంద్వార్థపు డైలాగులు వినిపిస్తాయి. ఒకటీ అరా చోట్ల డైలాగులు సమకాలీన యువతరం ఆలోచనల్ని ప్రతిఫలిస్తూ, హాలులో జనాన్ని నవ్విస్తాయి. కెమేరా వర్క, సంగీతం లాంటి అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, పాత్రధారులకు టచప్ కూడా చేయకుండా తీసిన కొన్ని దృశ్యాలు, సాగదీత కథనం మధ్య వాటికి గ్రహణం పట్టేసింది. కథను ఎలా ముగించాలో తెలియక కేవలం సెకండాఫ్‌లో పిచ్చివాడు గజిని పాత్రలో సప్తగిరితో వచ్చే కామెడీతోనే సినిమాను నడిపేయాలనుకోవడం దర్శక, రచయితల పొరపాటు. వెరసి, హాలులోకి వెళ్ళిన కాసేటికే కథ గ్రహించేసిన జనం పూర్తిగా రెండు గంటల పది నిమిషాల సినిమా బోర్ అనుకోకుండా చూడగలగడం కష్టం. అందుకే, హాల్లోంచి బయటకొస్తూ ఒక స్టూడెంట్ అన్నట్లు, ఈ ‘లవర్స’ - ప్రేక్షకుల చెవిలో దర్శక, నిర్మాతలు పెట్టిన ఫ్లవర్స. బలాలు: * హీరో హుషారు నటన * లౌడ్‌గా అనిపించినా, కాసేపు నవ్వించే సప్తగిరి కామెడీ * ఒకటి రెండు పాటలు బలహీనతలు: * సున్నా కథ * మైనస్ కథనం * కథలోని పాత్రలను ప్రవేశపెట్టి, వాటి మధ్య అనుబంధం తెలియజేయడానికే ఫస్టాఫ్ అయిపోవడం ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్‌లో కథ, * కథనం.. మరీ పిల్లలాట లాగా ఉండడం * దర్శకత్వం -
కార్ల కంపెనీలకు ఊరట
మే లో పెరిగిన మారుతీ, హ్యుందాయ్, హోండా అమ్మకాలు పరిస్థితులు ఇక మెరుగుపడగలవని కంపెనీల ఆశాభావం న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా గడ్డుకాలం ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ పరిశ్రమకి గత నెల కాస్త ఊరట లభించింది. స్థిరమైన కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రభావంతో దిగ్గజ కార్ల కంపెనీల అమ్మకాలు మెరుగుపడ్డాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా వంటి దిగ్గజాలు దేశీయంగా మెరుగైన గణాంకాలు నమోదు చేశాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్ వంటి సంస్థల అమ్మకాలు క్షీణించాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) దేశీ అమ్మకాలు 16.4 శాతం పెరిగాయి. 90,560 కార్లు అమ్ముడయ్యాయి. ఇక హ్యుందాయ్ విక్రయాలు సుమారు 13 శాతం పెరిగి 36,205 వాహనాలు అమ్ముడు కాగా, ఫోర్డ్ కార్ల విక్రయాలు 51 శాతం ఎగిశాయి. 6,053 కార్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ గతేడాది మేలో అమ్మకాలు 77,821. స్విఫ్ట్, ఎస్టిలో రిట్జ్ వంటి కాంపాక్ట్ కార్ల ఊతంతో మారుతీ మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. ఈ విభాగంలో విక్రయాలు 17,147 నుంచి 26,394కి పెరిగాయి. అటు ఎం800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాలు మాత్రం 31,427 నుంచి 29,068 యూనిట్లకు తగ్గాయి. గత మూడేళ్లుగా విక్రయాల్లో పెద్దగా పెరుగుదల కనిపించటంలేదని, అయితే ఇటీవలి కాలంలో తొలిసారిగా కారు కొనాలనుకుంటున్న వారు ఎంక్వైరీలు చేయడమే కాకుండా కొనేస్తుండటం కూడా పెరుగుతోందని ఎంఎస్ఐ సీవోవో మయాంక్ పరీక్ తెలిపారు. చాలా రోజుల తర్వాత కొనుగోలుదారులు ఇలా కొనడం మొదలుపెట్టారని ఆయన వివరించారు. మరోవైపు, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు వల్ల దేశ ఆర్థిక పరిస్థితులు, వ్యాపార సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపగలదని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వినయ్ పిపర్సానియా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు వంటి పరిశ్రమ అనుకూల చర్యలను కొనసాగించగలదని, అలాగే కొనుగోలుదారుల సెంటిమెంటును సైతం మెరుగుపర్చే సానుకూల ప్రయత్నాలూ చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో డిమాండ్ కూడా క్రమంగా పెరగగలదని ఆశిస్తున్నట్లు ఎంఅండ్ఎం సీఈవో (ఆటోమోటివ్ విభాగం) ప్రవీణ్ షా పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు, కొనుగోలుదారుల సెంటిమెంటు ఆశావహంగా లేకపోవడంతో గడిచిన రెండేళ్లుగా ఆటోమొబైల్ పరిశ్రమకు గడ్డుకాలంగా గడిచిందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. నిర్ణయాత్మక ప్రభుత్వం రాకతో రాబోయే రోజుల్లో మార్కెట్ సెంటిమెంటు మెరుగుపడగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఎంజాయ్మెంట్...
‘‘యూత్ అంటేనే ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్కి నిలువెత్తు నిదర్శనంగా ఈ సినిమా నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో యువతరం మధ్య అనుబంధాలు ఎలా ఉంటున్నాయనే నేపథ్యంలో నాలుగు జంటలపై ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని దర్శకుడు విజయ్ మాదాల చెప్పారు. ఆయన దర్శకత్వంలో మారుతి సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన ‘గ్రీన్ సిగ్నల్’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ -‘‘బాలీవుడ్ స్థాయిలో విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు’’ అని కితాబిచ్చారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఈ చిత్రం మెప్పిస్తుందని నిర్మాత తెలిపారు. పాటలకు చక్కని స్పందన లభిస్తోందని సంగీత దర్శకు జేబీ పేర్కొన్నారు. రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోష్, డింపుల్ చోపడే, శిల్పిశర్మ, గోపాల్ సాయి ఇందులో ముఖ్యతారలుగా నటించారు. -
మారుతి అంటే 'ఆ' హీరోలకు భయమెందుకో..?
-
మారుతీ లాభం స్కిడ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీపై మందగమనం ప్రభావం పడింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో కంపెనీ నికర లాభం 35.46 శాతం దిగజారి రూ.800 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా అమ్మకాలు తగ్గడం, ప్రచారం ఇతరత్రా వ్యయాలు పెరగడంతోపాటు ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు సంబంధించి డీలర్లకు నష్టపరిహారం చెల్లింపులు ఇతరత్రా అంశాలు లాభాలు తగ్గేందుకు దారితీశాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. క్యూ4లో కంపెనీ మొత్తం ఆదాయం కూడా 9.48 శాతం క్షీణించింది. రూ.13,056 కోట్ల నుంచి రూ.11,818 కోట్లకు తగ్గింది. పూర్తి ఏడాదికి రికార్డు లాభం... 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మారుతీ కన్సాలిడేటెడ్ నికర లాభం 15.23 శాతం ఎగబాకి రూ.2,853 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ చరిత్రలో అత్యధిక వార్షిక నికర లాభం కావడం గమనార్హం. కాగా, గతేడాది కంపెనీ మొత్తం ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.43,216 కోట్ల నుంచి రూ.43,271 కోట్లకు చేరింది. వాహన అమ్మకాల సంఖ్య 11,71,434 నుంచి 11,55,041కి తగ్గింది. విక్రయాల్లో 1.4 శాతం క్షీణత నమోదైంది. 2013-14 ఏడాదికిగాను కంపెనీ రూ.5 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.12 డివిడెండ్‌ను ప్రకటించింది.ఈ ఏడాది ప్రీమియం సెడాన్ సియాజ్తోపాటు మూడు కొత్త కార్లను మారుతీ విడుదల చేయనుంది. ఫలితాల ప్రభావంతో కంపెనీ షేరు ధర బీఎస్ఈలో శుక్రవారం 1.35 శాతం క్షీణించి రూ.1,956 వద్ద ముగిసింది.