తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ఓ కీలక పాత్రకు సంజయ్ దత్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో భాగం కావడానికి సంజయ్ దత్ సుముఖంగా ఉన్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment