Prabhas starts shooting for next film 'Raja Deluxe' this week - Sakshi
Sakshi News home page

Prabhas : వరుస షూటింగులతో ఫుల్‌ బిజీ బిజీగా ప్రభాస్‌

Published Mon, Feb 20 2023 12:01 PM | Last Updated on Mon, Feb 20 2023 12:31 PM

Prabhas Starts Shooting For Raja Deluxe This Week - Sakshi

‘సలార్‌’, ప్రాజెక్ట్‌ కె’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ వీలైనప్పుడుల్లా ‘రాజా డీలక్స్‌’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) షూటింగ్‌లో పాల్గొంటున్నారు ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌ హీరోయిన్స్‌ అని టాక్‌. కాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఈ వారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది.

ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, మాళవిక మోహనన్‌లపై కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేశారట చిత్రయూనిట్‌. ఈ షెడ్యూల్‌ పూర్తి కాగానే మళ్లీ ‘సలార్‌’ సెట్స్‌లో జాయిన్‌ అవుతారట ప్రభాస్‌. కాగా ‘సలార్‌’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న,  ప్రాజెక్ట్‌  కె’ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

కాగా ప్రభాస్‌ నటించిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆదిపురుష్‌’ ఈ జూన్‌ 16న రిలీజ్‌ కానుంది. అదేవిధంగా ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ మూవీ రూపొందనుంది. ఈ సినిమాల వరుస షూటింగ్‌లు, వాటి తాలూకు ప్రమోషన్స్‌తో ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement