shedule
-
TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ గురువారం(డిసెంబర్ 19) ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది(2025) మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయోలజి, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేడే!
ఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ( మంగళవారం) ప్రకటింనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీఐ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Election Commission of India to announce the schedule for General Election to Legislative Assemblies of Maharashtra and Jharkhand 2024.ECI to hold a press conference at 3:30 PM today. pic.twitter.com/yehIR0qUsm— ANI (@ANI) October 15, 2024288 సీట్ల ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది.అయితే, అంతకుముందే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇక. 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5వ తేదీతో ముగుస్తుంది.అదేవిధంగా దాదాపు 50 స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వాటిలో జూన్‌లో అమేథీ, వయనాడ్ రెండింటి నుండి గెలిచిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ లోక్‌సభ స్థానం కూడా ఉంది. వయనాడ్ స్థానానికి ప్రియాంక గాంధీ వాద్రా అభ్యర్థిగా పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.మహారాష్ట్రలో.. అధికార మహాయుతి కూటమి( బీజేపీ, శివసేన( షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం), ప్రతిపక్షాల కూటమి మహా వికాస్ అఘాడి( కాంగ్రెస్, ఎన్సీపీ( శరద్ పవార్ వర్గం) శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం)పోటీ చేయనున్నాయి. అదేవిధంగా జార్ఖండ్‌లో.. ఇండియా కూటమిలో భాగంగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), బీజేపీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్) పార్టీలు పోటీ చేయన్నాయి.చదవండి: చిరాగ్ పాశ్వాన్‌కు జెడ్– కేటగిరీ భద్రత -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంతర్గత వివక్ష కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా ఒక వర్గంలో ఉప వర్గాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో 2004 నాటి ఈవీ చిన్నయ్య కేసులోని తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే ఉప వర్గీకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సబ్ క్లాస్‌కు మొత్తం రిజర్వేషన్‌ను కేటాయించ కూడదు. అంతేగాకుండా ఏయే ఉప వర్గాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేక పోతున్నాయన్న డేటా ఆధారంగా వర్గీకరణ జరగాలి’’ – సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో విద్య, ఉద్యోగాలలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సబ్క్లాస్లుగా వర్గీకరించి.. ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. 25 ఏళ్లుగా నానుతున్న వర్గీకరణ!దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని కొన్ని కులాల వారే పొందుతున్నారని.. అందువల్ల ఈ రిజర్వేషన్లను వర్గీకరించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చేసిన రిజర్వేషన్ల చట్టం, దానిని కొట్టివేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఈ తీర్పు ఆధారంగా పంజాబ్–హరియాణా హైకోర్టు కొట్టివేయడం తదితర పరిణామాలతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.తొలుత దీనిపై (పంజాబ్ వర్సెస్ దేవీందర్‌సింగ్ కేసు) విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తిస్థాయిలో పునర్విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం ‘‘రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయడం 14, 15, 16 ఆర్టికల్‌లకు భంగం కలిగిస్తుందా? షెడ్యూల్డ్ కులాలు/తెగలు సజాతీయమేనా (ఒకేవర్గం కింద పరిగణించవచ్చా?) లేక భిన్నమైన వర్గాల సమూహమా? ఆర్టికల్ 341కు ఇవి భిన్నమా? ఉప వర్గీకరణ పరిధిలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?’’ అన్న అంశాలను లోతుగా పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వర్గాల వాదనలు విని.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.నెహ్రూ వ్యాఖ్యలను కోట్ చేస్తూ..‘‘మతపరంగా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగితే భారతదేశం రెండో లేదా మూడో గ్రేడ్ దేశంగా మారుతుంది. ఈ మార్గం మూర్ఖత్వం మాత్రమే కాదు. విపత్తు కూడా. కానీ వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయాల్సి ఉంది..’’ అన్న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను ధర్మాసనం తమ తీర్పులో ఉటంకించింది.మన తొలితరాల వారు, న్యాయమూర్తులతోపాటు మాజీ ప్రధాని కూడా.. ఏ వర్గం లేదా కులానికి చెందినవారికి పూర్తిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని వ్యతిరేకించారని.. మెరిట్ ప్రాతిపదికన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారని పేర్కొంది. ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల్లో కొంతమంది ముందుకుసాగడంలో ఇబ్బంది పడుతున్నారని.. వారికి చేయూతనివ్వడం ఎంతో అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు ధర్మాసనం అనుమతిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు 565 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు అనుగుణంగా రాష్ట్రా లు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.ఆరుగురు అనుకూలం.. ఒకరు వ్యతిరేకంఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్ బేలా త్రివేదీ వర్గీకరణను విభేదించగా.. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా, మిగతా జడ్జీలు వేర్వేరుగా తమ తీర్పులు ఇచ్చారు. దీనితో మొత్తం ఆరు తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండటంతో.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు అయింది.కేంద్ర ఉద్యోగాలు, విద్యాసంస్థలకు ‘వర్గీకరణ’ వర్తించనట్లే!సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థలు, ఉద్యోగాలు, పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు, ఎమ్మార్పీస్ నేతలు చెప్తున్నారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల్లోని ఉద్యోగాలు, విద్యా సంస్థలపై ప్రభావం చూపదని అంటున్నారు. రాష్ట్రాలు చేసిన చట్టాలపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. కోర్టు కూడా రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చనే దానిపైనే తాజా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు.ఇందులో జాతీయ స్థాయిలో, కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశమేదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కులాలు, తెగలు విభిన్నంగా ఉంటాయని.. వాటిని కేంద్ర స్థాయిలో వర్గీకరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఎస్సీల్లోని మాదిగ వర్గం కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణ గురించి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీస్ అధ్యక్షుడు నరేశ్ చెప్పారు. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వర్గీకరణపై ఇప్పటివరకు తాము దృష్టి పెట్టలేదన్నారు.వెనుకబాటు ఆధారంగా ఉప వర్గీకరణ‘‘షెడ్యూల్డ్ కులాలు సజాతీయ తరగతి (ఒకే వర్గానికి చెందిన సమూహం) కాదని సూచించే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద పొందుపరిచిన సమానత్వ సూత్రాన్ని గానీ.. ఆర్టికల్ 341(2)ను గానీ ఉల్లంఘించదు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లలో కూడా రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలను నిరోధించేది ఏమీ లేదు.ఉప వర్గీకరణ అయినా, మరేదైనా నిశ్చయాత్మక చర్య అయినా.. వాటి లక్ష్యం వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించడమే. కొన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప వర్గీకరణ చేయవచ్చు. అయితే ఏదైనా కులం/ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడానికి దాని వెనుకబాటుతనమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలి. ఆ కులం/ ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడంపై డేటాను సేకరించాలి. అందుకు అనుగుణంగా ఉప వర్గీకరణ చేయాలి..’’ – జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రారిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలిఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను సమర్థిస్తున్నాను. అయితే ఏ రిజర్వేషన్లు అయినా మొదటి తరానికి లేదా ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలి. కుటుంబంలోని ఏదైనా తరం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితిని సాధిస్తే.. రిజర్వేషన్ల ప్రయోజనం లాజికల్‌గా రెండో తరానికి అందుబాటులో ఉండరాదు. రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని సాధారణ వర్గంతో కలసిన కుటుంబాలను.. తర్వాత రిజర్వేషన్లు పొందకుండా మినహాయించడానికి కాలానుగుణ కసరత్తు చేపట్టాలి. – జస్టిస్ పంకజ్ మిత్తల్క్రీమీలేయర్ వర్తింపజేయాలివెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రాల విధి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తిరస్కరించలేం. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న కులాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నాయి. అయితే ఉప వర్గీకరణ సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని క్రీమీలేయర్ (అధికాదాయం ఉన్నవారిని) గుర్తించాలి. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గం.ఇందుకోసం రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల క్రీమీలేయర్ మినహాయింపు ప్రమాణాలు ఇతర వెనుకబడిన కేటగిరీలకు వర్తించే ప్రమాణాలకు భిన్నంగా ఉండవచ్చు. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో ప్రాథమిక లోపం ఏమిటంటే.. ఆర్టికల్ 341 రిజర్వేషన్లకు ప్రాతిపదిక అని అర్థం చేసుకొని ముందుకు వెళ్లడమే! ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్ల ప్రయోజనాల నిమిత్తం కులాల గుర్తింపు కోసం మాత్రమే. – జస్టిస్ బీఆర్ గవాయిఉప వర్గీకరణకు అనుకూలంషెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వీలుకాదన్న ‘ఈవీ చిన్నయ్య’ కేసులోని తీర్పు సరికాదన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. క్రీమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయడం మరింత సమానత్వానికి తోడ్పడుతుంది. – జస్టిస్ విక్రమ్నాథ్తగిన డేటా సేకరించి అమలు చేయాలిరిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాజ్యాంగ చెల్లుబాటు ఉందన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. రాష్ట్రాలు తగిన డాటా సేకరించి ఉప వర్గీకరణ అవసరాన్ని నిర్ధారించాలి. ఇందు లో క్రీమీలేయర్ గుర్తింపునకు కూడా ఆవశ్యకత ఉండాలి. – జస్టిస్ సతీశ్చంద్రరాష్ట్రాలకు ఉప వర్గీకరణ అర్హత లేదుఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు. షెడ్యూల్డ్ కులాల పరిణామ చరిత్ర, నేపథ్యానికి తోడు రాజ్యాంగంలోని 341 కింద ప్రచురించిన రాష్ట్రపతి ఉత్తర్వులు కలసి షెడ్యూల్డ్ కులాలు ఒక సజాతీయ తరగతిగా మారాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, జాతులు లేదా తెగలను విభజించడం /ఉప వర్గీకరణ చేయడం/ పునర్విభజన చేయడం తద్వారా నిర్దిష్ట కులం/కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి చట్టాన్ని రూపొందించే శాసన అధికారం రాష్ట్రాలకు లేదు.రిజర్వేషన్లు కల్పించే ముసుగులో, బలహీనవర్గాలకు మంచి చేస్తున్నామన్న నెపంతో రాష్ట్రాలు రాష్ట్రపతి జాబితాను మార్చకూడదు, ఆర్టికల్ 341తో విభేదించకూడదు. రాష్ట్ర ప్రభుత్వ చర్య సదుద్దేశంతో ఉన్నా, రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి ధ్రువీకరించడం కుదరదు. సదుద్దేశ చర్య, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ రెండూ సమసమాజం లక్ష్యంగా ఉన్నా.. న్యాయబద్ధత, రాజ్యాంగ బద్ధతను పాటించాలి. – జస్టిస్ బేలా ఎం త్రివేది -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తాజా చారిత్రక తీర్పులో.. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది. కేసు ఏంటంటే..వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ’ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పునస్సమీక్షించాలని పేర్కొంటూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఫిబ్రవరిలో..ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్ కూడా ఉంది. వీటిపై మూడురోజులపాటు వాదనలు జరగ్గా.. ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. ఇప్పుడు.. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడించింది.కేంద్రం వాదనలుఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించింది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం అని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది. -
అమెరికాలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కుదింపు
న్యూయార్క్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో సమావేశాన్ని కుదించారు. క్షణం తీరిక లేకుండా ప్రధాని షెడ్యూల్ ఉండడంతో ప్రవాస భారతీయుల్లో అత్యంత ముఖ్యులతో వాషింగ్టన్లో చిన్న సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వెయ్యి మంది వరకు హాజరయ్యే అవకాశాలున్నాయి. తొలుత షికాగోలో భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేసినప్పటికీ ప్రధాని బిజీ షెడ్యూల్‌తో తగ్గించాల్సి వచ్చిందని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ భరత్ బరాయ్ వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ తొలిసారిగా అధికారిక హోదాలో ఈ నెల 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. -
విశాఖలో రేపు సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
వరుస షూటింగులతో ఫుల్ బిజీ బిజీగా ప్రభాస్
‘సలార్’, ప్రాజెక్ట్ కె’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ వీలైనప్పుడుల్లా ‘రాజా డీలక్స్’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ అని టాక్. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ వారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, మాళవిక మోహనన్‌లపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే మళ్లీ ‘సలార్’ సెట్స్‌లో జాయిన్ అవుతారట ప్రభాస్. కాగా ‘సలార్’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న, ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ ఈ జూన్ 16న రిలీజ్ కానుంది. అదేవిధంగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ రూపొందనుంది. ఈ సినిమాల వరుస షూటింగ్‌లు, వాటి తాలూకు ప్రమోషన్స్‌తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. -
EAPCET షెడ్యూల్ ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
ఏపీ: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్( ఏడు పేపర్లు) : జూన్ 7(సోమవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ జూన్ 8( మంగళవారం) : సెకండ్ లాంగ్వేజ్ జూన్ 9(బుధవారం) : ఇంగ్లీష్ జూన్ 10(గురువారం) : గణితం జూన్ 11 (శుక్రవారం) : ఫిజికల్ సైన్స్ జూన్ 12 (శనివారం) : బయోలాజికల్ సైన్స్ జూన్ 14( సోమవారం) : సోషల్ స్టడీస్ జూన్ 15 ( మంగళవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 ఓఎస్ఎస్సీ మేయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్) జూన్ 16 ( బుధవారం ) ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు(థియరీ) -
అటు ఎన్నికలు.. ఇటు వ్యాక్సినేషన్ రెండూ ముఖ్యమే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. రాష్ట్ర ప్రజలకు అటు ఎన్నికలు.. ఇటు కోవిడ్ వ్యాక్సినేషన్ రెండూ అత్యంత ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల వాటిని ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం అనుమతించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. కాగా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పులో సవివరంగా పరిణామాలు పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికల షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ ఈ నెల 11న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ రిట్ అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 19న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీజే ధర్మాసనం గురువారం 38 పేజీల తీర్పును వెలువరించింది. 2018లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు మొదలు ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వరకు స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టులో జరిగిన పరిణామాలన్నింటినీ ధర్మాసనం తీర్పులో సవివరంగా పొందుపరిచింది. ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందా? వేగంగా నిర్వహించడం సాధ్యమవుతుందా? తదితర అంశాలపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషనేనని కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించిందని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల కమిషన్ తన విచక్షణాధికారాన్ని సక్రమంగా ఉపయోగిస్తుందని భావించాలే కానీ వక్రబుద్ధితో చూడటానికి వీల్లేదని మొహీందర్ గిల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఆ వివరణ లేదు ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని సింగిల్ జడ్జి తన ఉత్తర్వులో పేర్కొనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఎన్నికల కమిషనర్ ఏకీభవించకపోయి ఉండొచ్చు. ప్రభుత్వం అందించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్న సింగిల్ జడ్జి.. ఏ వివరాలను పరిగణనలోకి తీసుకోలేదన్న దానిపై తన ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాలను చెప్పలేదు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల నిర్వహణ ఏ రకంగా అడ్డంకులు కలిగిస్తుందో సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రాథమిక వివరణ ఇవ్వలేదు. కోవిడ్ వ్యాక్సినేషన్, పంచాయతీ ఎన్నికలను మేళవించడం వల్ల కేటగిరి 1, కేటగిరి 2 వ్యాక్సినేషన్‌కు ఏ రకంగానూ ఇబ్బంది లేదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతే, మూడో కేటగిరి వ్యాక్సినేషన్‌కు ముందే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘రెండున్నరేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యతను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ ఈ నెల 8న షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్ తన చట్టబద్ధతమైన అధికారాన్ని ఉపయోగించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అంతిమంగా చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందా? లేదా? అన్నదే’ అని పేర్కొంది. ఆ అప్పీల్‌కు విచారణార్హత ఉంది ‘ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్ రాసిన లేఖలను అడ్వొకేట్ జనరల్ ఈ కోర్టు ముందు ఉంచారు. ఎన్నికల కమిషనర్ మితిమీరిన భాషను వాడకుండా ఉంటే మంచిది. స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మే లో జరుగుతాయని అధికార పార్టీ సీనియర్ నేత చెప్పిన దాని ఆధారంగా తన హయాంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ ఎన్నికల కమిషనర్ అభిప్రాయం వ్యక్తీకరించారని అడ్వొకేట్ జనరల్ చెబుతున్నారు. పార్టీ నేత చెప్పిన దాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారే తప్ప క్షేతస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదన్న అడ్వకేట్ జనరల్ వాదనను ఆమోదించలేం. ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన ఈ అప్పీల్‌కు విచారణార్హత ఉంది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ‘జడ్జిమెంట్’ నిర్వచన పరిధిలోకే వస్తాయి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనతో ఏకీభవిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. -
పార్లమెంట్ సమావేశాల కుదింపు?
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగా ముగిసే అవకాశాలు కనిపిస్తు న్నాయి. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు ఉభయసభల సమావేశాలు జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ప్రతినిధులతో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మెజారిటీ సభ్యులు మొగ్గుచూపారు. ఈమేరకు 23వ తేదీ వరకే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర మంత్రులు గడ్కరీ, ప్రహ్లాద్ పటేల్‌లకు కరోనా సోకింది. ఇంకొందరికీ సోకడంతో సమావేశా లకు రావద్దని వారికి సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సమావేశాలను నిర్వహించడం మంచిదికాదని ప్రతిపక్షాలు కూడా సూచించ డంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇప్పటికే ఉభయసభలను షిఫ్టుల వారీగా నడుపుతూ మునుపెన్నడూ లేనివిధంగా పలు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ► లాక్డౌన్ సమయంలో శ్రామిక్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో 97 మంది మరణిం చారని కేంద్రం రాజ్యసభ లో తెలిపింది. ► రూ. 2,000 నోట్ల ముద్రణను ఆపే ఆలోచనలేమీ లేవని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. అయితే 2019తో పోలిస్తే 2020లో తక్కువ నోట్లు సర్కులేçషన్లో ఉన్నట్లు చెప్పింది. ► భవిష్యత్ మిలిటరీ అప్లికేషన్లపై పరిశోధనకు డీఆర్డీఓ 8 అధునాతన సెంటర్లను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు-2019 షెడ్యూల్ విడుదలైంది. శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్టులను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ 19న ఈ సెట్( అనంతపురం జేన్టీయూ), ఏప్రిల్ 26న ఐసెట్ (ఎస్వీయూ), మే 1న పీజీ సెట్(ఏయూ), మే 6న ఏపీ ఎడ్‌సెట్(ఎస్వీయూ),మే 6 లా సెట్(ఎస్వీయూ), మే 5న పీఈ సెట్(నాగార్జున వర్శిటీ), ఏప్రిల్ 20న ఏపీ ఎంసెట్( కాకినాడ జేఎన్టీయూ) ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
297వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, సాలూరు : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజా సమస్యలను ఆలకిస్తూ.. వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 297వ రోజు షెడ్యూల్‌ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం సాలూరు నియోజకవర్గంలోని తామరఖండి శివారు నుంచి జననేత పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చినభోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి మీదుగా చినరాయుడు పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనవిడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు ముగిసింది. సాలూరు నియోజకవర్గంలోని కొయ్యనపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కంచేడువలస క్రాస్, వెంకట భైరిపురం, బగ్గందొర వలస, గెడలుప్పి జంక్షన్ మీదుగా తామరఖండి వరకు కొనసాగింది. -
296వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
296వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జననేత సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలంలోని తన నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కంచేడువలస క్రాస్ మీదుగా వెంకటభిరిపురంకు చేరుకుంటారు. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బగ్గందొర వలస, గెద్దలుప్పి జంక్షన్ మీదుగా తామరకండి వరకూ పాదయాద్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 295వ రోజు ముగిసింది. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జననేత పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.17 రోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ తన 295వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో పున: ప్రారంభించారు. అక్కడి నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు, ములక్కాయవలస, కాశీపట్నం క్రాస్ రోడ్డు, పాపయ్య వలస మీదుగా కొయ్యనపేట వరకూ పాదయాత్రను కొనసాగించారు. నేడు జననేత 6.8కిలో మీటర్ల దూరం నడిచారు. దీంతో ఇప్పటి వరకూ 3,218.3కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. -
269వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 269వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం జననేత పాదయాత్రను పెందుర్తి నుంచి ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సారిపల్లి, జంగాలపాలెం, చింతలపాలెం, తాడివానిపాలెం, దేశపాత్రునిపాలెం, కొత్తవలస మీదుగా తుమ్మికపాలెం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. దేశపాత్రునిపాలెం వద్ద జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
268వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 268వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జననేత పాదయాత్రను భీమిలీ నియోజకవర్గంలోని అనందపురం మండలం నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గండిగుండం కాలనీ, అక్కిరెడ్డిపాలెం, జుట్టాడ క్రాస్ మీదుగా పెందుర్తి మండంలంలోని పాత్రులునగర్ చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న విరామం తీసుకుంటారు. అనంతరం పెందుర్తి, రాయవరపువాని పాలెం మీదుగా సారిపల్లి కాలనీ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
104వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ప్రకాశం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 104వ రోజు ముగిసింది. నేటి ఉదయం అద్దంకి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన నాగులపాడు, వెంకటాపురం, అలవలపాడు మీదుగా తక్కెళ్లపాడు చేరుకుని యాత్రను ముగించారు. ఈ క్రమంలో ఆయన 1400 కిలోమీటర్ల మైలురాయిని దాటగా.. ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. నేటి పాదయాత్రలో వైఎస్ జగన్ 16.3 కిలోమీటర్లు నడిచారు. కాగా, ప్రజాసంకల్పయాత్ర ఇప్పటిదాకా 1414.7 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 105వ రోజు షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్ : ప్రజాసంకల్పయాత్ర 105వ రోజు షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మంగళవారం ఉదయం తక్కెళ్లపాడు శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అటుపై యాత్ర జె. పంగులూరు, అరికట్ల వారిపాలెం, గంగవరం మీదుగా ఇంకొల్లు వరకు యాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేరిట పార్టీ ప్రకటనలో పేర్కొంది. -
61వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర షెడ్యూల్
-
ఎట్టకేలకు డీఎడ్ పరీక్షలు
-జూలై 6 నుంచి 12 వరకు నిర్వహణ రాయవరం(మండపేట) : ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(డీఎడ్) 2015–17 బ్యాచ్‌కు సంబంధించి తొలి ఏడాది పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఎట్టకేలకు సన్నద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం పరీక్షల టైం టేబుల్ వెల్లడించారు. జూలై 6 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరో పేపరు మినహా మిగిలిన ఐదు సబ్జెక్టులకు సంబంధించి కొత్త, పాత సిలబస్ అనుసరించి ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఆరో పేపరుకు మాత్రం కొత్త సిలబస్‌ను అనుసరించనున్నట్లు ప్రకటించారు. తొమ్మిదినెలలు ఆలస్యం.. 2015–17 విద్యా సంవత్సరానికి 2015 డిసెంబరులో డీఎడ్ ప్రవేశాలు పొందిన ఛాత్రోపాధ్యాయులకు వాస్తవానికి 2016 సెప్టెంబరులోనే పరీక్షలు జరగాల్సి ఉంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో లోపాల వల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చోటు చేసుకుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో ఒక్కో ప్రవేశానికి రూ.2 వేల అపరాధ రుసుమును విధిస్తూ గత డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేశారు. అపరాధ రుసుమును రూ.వెయ్యికి తగ్గించాలని కోరుతూ అన్ ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాల చేసి విజ్ఞప్తులతో పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమైంది. తొమ్మిది నెలలు ఆలస్యంగా జూలై 6 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. చివరి అరగంటలో బిట్ పేపరు.. 2015–17 బ్యాచ్‌కు కొత్త సిలబస్‌లను అనుసరించి పరీక్షలను నిర్వహించనుండగా, అంతకు ముందు బ్యాచ్‌కు సంబంధించి మాత్రం పాత సిలబస్‌ను అనుసరించి పరీక్షలను నిర్వహిస్తారు. వారికి ఇదే చివరి అవకాశంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరు పేపర్లకు సంబంధించి అభ్యర్థులకు చివరి అరగంటలోనే 20 మార్కులకు బిట్ పేపరు ఇవ్వనున్నారు. బిట్ పేపరు ఇవ్వడం ఇదే తొలిసారిగా అధ్యాపకులు పేర్కొంటున్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, అన్ఎయిడెడ్ కళాశాలల నుంచి సుమారు మూడు వేల మంది ఛాత్రోపాధ్యాయులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో కన్వీనర్, యాజమాన్య కోటా నుంచి 2,122 మంది ప్రవేశాలను పొందగా 841 మంది స్పాట్ అడ్మిషన్ల పేరుతో ప్రవేశాలను పొందడం గమనార్హం. ఇదిలా ఉండగా మొదటి సంవత్సరం శిక్షణ పూర్తి చేసుక్ను ఛాత్రోపాధ్యాయులు రెండో ఏడాది శిక్షణ గతేడాది అక్టోబరు నెల నుంచి పొందుతున్నారు. రెండేళ్ల పరీక్షలు ఒకేసారి రాయాల్సి వస్తుందేమోనని ఇప్పటి వరకు ఛాత్రోపాధ్యాయులు భయాందోళనలు వ్యక్తం చేశారు. తాజాగా డీఎడ్ పరీక్షల నిర్వహణకు తేదీలను ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తాం. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. –అప్పారి జయప్రకాష్, ప్రభుత్వ డైట్ కళాశాల, బొమ్మూరు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.. ఛాత్రోపాధ్యాయుల మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. – జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ -
డీఎడ్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల
జూలై 6 నుంచి ప్రారంభం కర్నూలు సిటీ: డీఎడ్ మొదటి సంవత్సర పరీక్షలు జూలై 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. పాత, కొత్త సిలబస్‌తో పరీక్షలు జరుగనున్నాయి. మరో మూడు నెలలు ఉంటే కోర్సు గడువు సైతం పూర్తి కానున్న తరుణంలో విద్యార్థులు.. మొదటి ఏడాది పరీక్షలు రాయనుండటం గమనార్హం. జిల్లాలో ఒక ప్రభుత్వ డీఎడ్ కాలేజీతో పాటు, మొత్తం 93 కాలేజీలు ఉన్నాయి. నామినల్ రోల్స్ 3200 మందికి చేశారు. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మిగిలిపోయిన సీట్లను ఇష్టానుసారంగా భర్తీ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. మొదటి సంవత్సర పరీక్షలు పాత సిలబస్‌తో రాయాలో కొత్త సిలబస్‌తో రాయాలో అర్థం కాకపోవడంతో కొన్ని రోజులు ఛాత్రోపాధ్యాయులు ఆందోళనకు గురి అయ్యారు. దీనిపై సెకెండరీ ఎడ్యుకేషన్ స్పష్టత ఇచ్చింది. పాత, కొత్త సిలబస్‌లతో రాయాల్సి ఉంటుంది. ఆరో పేపరుకు మాత్రం మొత్తం కొత్త సిలబస్‌ను అనుసరించనున్నారు. ఈ పేపరుకు సంబంధించి అభ్యర్థులకు మాత్రం చివరి ఆరగంటలో బిట్ పేపర్ ఇవ్వనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. తేదీ పేపరు సబ్జెక్టు జూలై–06 పేపర్–1 చైల్డ్‌హుడ్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ (కొత్త సిలబస్),ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జీ ఇండియా (పాత సిలబస్) జూలై –07 పేపర్–2 సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరికులం (కొత్త సిలబస్),ఎడ్యుకేషన్ సైకాలజి మెజర్మెంట్ అండ్ ఎవాల్యుషన్(పాత సిలబస్) జూలై–08 పేపర్–3 చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (కొత్తసిలబస్), ప్రాథమిక విద్య ప్రణాళిక యాజమాన్యం, ఉపాధ్యాయుల విధులు (పాత సిలబస్) జూలై–10 పేపర్–4 తెలుగు పెడగాగి/ఉర్దూ, తమిళ్ ప్రాథమిక స్థాయి (కొత్త సిలబస్), ప్రాస్పెక్టీవ్స్ ఇన్ ప్రైమరీ అండ్ ఇంక్లీసివ్ఎడ్యుకేషన్(పాతసిలబస్) జూలై–11 పేపర్–5 ప్రాథమిక స్థాయి గణిత శాస్త్ర పెడగాగి (కొత్త సిలబస్), కెపాసిటీ బిల్డింగ్(పాత సిలబస్), పార్ట్–1 కంప్యూటర్ ఎడ్యుకేషన్, పార్ట్–2 ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ పార్ట్–3 వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ జూలై–12 పేపర్–6 పెడగాగి అక్రాస్ కరికులమ్ అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్ (కొత్త సిలబస్) -
ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
15న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన డిసెంబర్ 14 వరకు కొత్తవి నమోదు కాకినాడ సిటీ : ఓటర్ల జాబితా 2017 సవరణ ప్రక్రియకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 19 నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఈనెల 15న జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ప్రకటించనుంది. ఓటర్ల జాబితా ప్రకటన సమయం నుంచి డిసెంబర్ 14 వరకు జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు జరుగుతుంది. ఈ జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 19 నియోజకవర్గాల్లోని 4,266 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 38,05,354 మంది ఓటర్లు ఉన్నారు. జాబితాలో డూప్లికేషన్లు, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు ఇప్పటి వరకు నమోదైన క్లెయిమ్‌లను పరిశీలించి మార్పులు, చేర్పులతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. సవరణ ప్రక్రియలో 2017 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదుతో పాటు ఓటు హక్కులేనివారు కూడా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిష¯ŒS అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. నవంబర్ 23, డిసెంబర్ 7వ తేదీల్లో ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం గ్రామసభలు నిర్వహించి బూత్‌లెవెల్ అధికారులు ప్రదర్శిస్తారు. అదేవిధంగా నవంబర్ 20, డిసెంబర్ 11వ తేదీల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా బూత్‌లెవెల్ ఏజంట్స్, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్ 28వ తేదీలోపు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తారు. అలాగే జనవరి 5వ తేదీలోపు పరిశీలించిన దరఖాస్తులను ఆ¯ŒSలై¯ŒSలో డేటా ఎంట్రీ పూర్తిచేసి సప్లమెంటరీ జాబితాలను సిద్ధం చేస్తారు. అనంతరం 2017 జనవరి 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. -
కానిస్టేబుల్ రాత పరీక్ష షెడ్యూల్ విడుదల
హైదారాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం కానిస్టేబుల్ రాత పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రిలిమినరీ, దేహ దారుఢ్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో.. అక్టోబర్ 23న కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలు నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (పీఆర్బీ) నిర్ణయించింది. అక్టోబర్ 23న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో కలిపి మొత్తంగా 9,613 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. దేహ దారుఢ్య పరీక్షల అనంతరం తుది రాతపరీక్షకు 81 వేల మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. -
సిద్దిపేట ఎన్నికల షెడ్యూల్ విడుదల
సిద్దిపేటకు 11 ఏళ్ల తరువాత మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రేపటి నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించి 11న ఫలితాలు వెల్లడించనున్నారు. సిద్ధిపేట మున్సిపాల్టీలో మొత్తం 34 వార్డులున్నాయి. ఆరు గ్రామ పంచాయతీ లను సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేయడానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ గతంలో మున్సిపల్ శాఖ నోటిఫై చేసింది. విలీన పంచాయతీల పరిధిలోని ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. మున్సిపాలిటీలో విలీనం చేశారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విలీన పంచాయతీల పరిధిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అధికారులు వివరాలను కోర్టుకు సమర్పించారు. వివరాలతో సంతృప్తి చెందిన హైకోర్టు స్టేను తొలగించింది. దీంతో ఎన్నికకు మార్గం సుగమమైంది. -
మినీ సార్వత్రిక సమరం
అయిదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఈ వేసవిలో మళ్లీ పరీక్షా కాలం వచ్చింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలకు సంబంధించిన ఎన్ని కల షెడ్యూల్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) విడుదల చేసింది. పశ్చిమబెంగాల్లో ఏప్రిల్ 4 నుంచి మే 5 వరకూ నెల రోజుల వ్యవధిలో ఆరు దశలుగా...అస్సాంలో ఏప్రిల్ 4, 11 తేదీల్లో రెండు దశలుగా ఎన్నికలుంటాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే రోజు- మే 16న ఎన్నికలు జరుగుతాయి. అయిదు రాష్ట్రాల ఫలితాలు మే 19న వెలువడతాయి. ఇవి ఒకరకంగా మినీ సార్వత్రిక ఎన్నికలని చెప్పాలి. ఇందులో దాదాపు 17 కోట్లమంది ఓటర్లు 824 అసెంబ్లీ స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పడానికి వీలిచ్చే ‘నోటా’ మీటకు ఈ ఎన్నికల్లో తొలిసారిగా గుర్తును కేటాయించబోతున్నారు. అభ్యర్థుల గురించి ఓటర్లలో గందరగోళం లేకుండా చూడటం కోసం పార్టీ గుర్తులతోపాటు వారి ఫొటోలను కూడా ఈవీఎంలపై ఉంచబోతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహించి అధికారాన్ని చేపట్టిన బీజేపీ... మహారాష్ట్ర, హరియాణా వంటి రాష్ట్రాల్లో విజయపరంపరను కొన సాగించి అక్కడ అధికారం కైవసం చేసుకుంది. కానీ నిరుడు ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, నవంబర్‌లో జరిగిన బిహార్ ఎన్నికల్లో ఊహించనివిధంగా పరాజయంపాలైంది. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో సైతం ఒక్క అస్సాంలో మినహా మిగిలినచోట్ల బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. ముఖ్యమైన పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆ పార్టీ పెద్దగా పోటీ ఇచ్చే అవకాశం లేదు. కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉన్నదన్న సంకేతాలు వెలువడు తున్నాయి. అస్సాంలో ప్రాంతీయ పార్టీ అసోం గణ పరిషత్(ఏజీపీ)తో ఇప్పటికే అవగాహనకొచ్చిన బీజేపీ ఈసారి అధికార పక్షంగా అవతరించవచ్చునన్న అంచనాలున్నాయి. అక్కడి 126 స్థానాల్లో బీజేపీ 57 స్థానాలు గెల్చుకుంటుందని ఒక సర్వేలో తేలింది. వరసగా మూడు దఫాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి 44కు పరిమితం కాగలదని ఆ సర్వే చెబుతోంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో నష్టజా తకురాలు కాంగ్రెసే. ఆ పార్టీకి అటు అస్సాంలోనూ, ఇటు కేరళలోనూ అధికారం కోల్పోక తప్పనిస్థితి ఏర్పడింది. అయిదేళ్లనాడు పశ్చిమబెంగాల్, కేరళలో వామపక్ష కూటములు అధికారంలో ఉండేవి. ప్రతి దఫాలోనూ అధికార పక్షాన్ని మార్చే ఆనవాయితీని కొనసాగిస్తున్న కేరళలో అప్పడు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఓడించింది. అయితే రెండు కూటములకూ మధ్య కేవలం 4 స్థానాలు మాత్రమే వ్యత్యాసం ఉందని గమనిస్తే ఆ రాష్ట్రంలో వామపక్షాల ప్రభావం పెద్దగా తగ్గలేదని అర్ధమవుతుంది. ఈసారి అక్కడ ఎల్డీఎఫ్దే విజయ మని ఒక సర్వే వెల్లడించింది. బెంగాల్‌కు సంబంధించినంతవరకూ ఆ రాష్ట్రాన్ని 34 ఏళ్లు అవిచ్ఛిన్నంగా పాలించిన వామపక్షాలకు గత ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. తమ అధికారం శాశ్వతమన్న భ్రమల్లో కూరుకుపోయిన వామపక్షాలు తప్పుల మీద తప్పులు చేసి చేతులారా ఓటమిని కొనితెచ్చుకున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఊహించనివిధంగా తిరుగులేని మెజారి టీని సాధించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సైతం వామపక్షాల రాత మారలేదు. తృణమూల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జనంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే అయినా ఆ పార్టీని అధికారంనుంచి దించేంతగా అది పెరగలేదని ఈమధ్య నిర్వహించిన ఒక సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్, వామ పక్షాలు జతగడితే ఆ కూటమికి 107 స్థానాలు వస్తాయని... తృణమూల్ 182 స్థానాలతో అధికారంలోకొస్తుందని ఆ సర్వే చెబుతోంది. వామపక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే వాటికి 74 స్థానాలు, కాంగ్రెస్‌కు 16 సీట్లు మించకపోవచ్చునంటున్నది. అప్పుడు తృణమూల్‌కు 197 సీట్లు లభించే అవకాశం ఉందని సర్వే లెక్కగట్టింది. ఈ రెండు రకాల పరిస్థితుల్లోనూ బీజేపీకి ఒరిగేదేమీ ఉండదని అంటోంది. గత ఎన్నికల వరకూ బెంగాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్ తృణమూల్ ధాటికి కూటమిగా జనం ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బెంగాల్లో మిగిలిన పార్టీలు ఇంకా మంతనాల్లో తలమునకలై ఉండగా...ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కొద్దిసేపటికే అభ్యర్థుల జాబితా ప్రకటించి మమతా బెనర్జీ అందరినీ ఆశ్చర్యపరిచారు. 2011 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన తృణమూల్ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. తమిళనాట ఈసారి రసవత్తరమైన పోటీ ఉంటుంది. ఆనవాయితీకి భిన్నంగా జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ప్రభుత్వం వరసగా రెండోసారి కూడా విజయకేతనం ఎగరేసి రికార్డు బద్దలు కొడుతుందా లేక డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. సర్వే మాత్రం డీఎంకే కూటమి కన్నా అన్నాడీఎంకే పార్టీకే ఆధిక్యత లభిస్తుందని, అయితే అధికారం నిలబెట్టుకోవడానికి అవసరమైన మెజారిటీ దక్కకపోవచ్చునని సూచి స్తోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకేకు 116(ప్రస్తుత స్థానాలు 203), డీఎంకేకు 101(ప్రస్తుతం 31) రావొచ్చునని అంచనా. జయలలిత ప్రభుత్వం అమలు చేస్తున్న జనాకర్షక విధానాల మాటెలా ఉన్నా ఇటీవల వరసగా రెండుసార్లు చెన్నై నగరాన్ని ముంచెత్తిన వరదలు, అప్పుడు కొట్టొచ్చినట్టు కనబడిన ప్రభుత్వ వైఫల్యం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. బహుశా అందువల్లే కావొచ్చు రాజీవ్‌గాంధీ హంతకులకు యావజ్జీవ శిక్షనుంచి విముక్తి కలిగించేందుకు అనుమతించమంటూ జయలలిత కేంద్రానికి లేఖరాసి తమిళనాట కొత్త చర్చకు తెరతీశారు. మొత్తానికి ఈ మినీ సార్వత్రిక సమరం ఆద్యంతమూ ఆసక్తికరంగా ఉండబోతోంది. -
మార్చి 21 నుంచే పదో తరగతి పరీక్షలు
- ఎగ్జామ్స్ టైంటేబుల్‌ను ఖరారు చేసిన ప్రభుత్వం - నేడు అధికారికంగా షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను 2016 మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించేందుకు రూపొందించిన టైంటేబుల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంబంధిత ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. దీంతో ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం టైంటేబుల్‌ను జారీ చేసేందు కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి కోసం మంగళవారం సాయంత్రం సంప్రదించగా పరీక్షలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాబోదని కమిషన్ మౌఖికంగా పేర్కొంది. ఈసారి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటాయి. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. ఇదీ ఒక పేపరే ఉంటుంది. మిగితా సబ్జెక్టులు రెండు చొప్పున పేపర్లు ఉంటాయి. మార్చి 23న హోలీ, 25న గుడ్ ఫ్రైడే, 27నఆదివారం, ఏప్రిల్ 3న ఆదివారం, 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 8న ఉగాది కావడంతో ఆయా తేదీలను విద్యాశాఖ తొలగించి టైంటేబుల్ రూపొందించింది. ఇదీ పరీక్షల షెడ్యూలు 21-3-2016 - ప్రథమ భాష పేపరు-1 22-3-2016 - ప్రథమ భాష పేపరు-2 24-3-2016 - ద్వితీయ భాష 26-3-2016 - ఇంగ్లిషు పేపరు-1 28-3-2016 - ఇంగ్లిషు పేపరు-2 29-3-2016 - గణితం పేపరు-1 30-3-2016 - గణితం పేపరు-2 31-3-2016 - జనరల్ సైన్స్ పేపరు-1 1-4-2016 - జనరల్ సైన్స్ పేపరు-2 2-4-2016 - సోషల్ స్టడీస్ పేపరు-1 4-4-2016 - సోషల్ స్టడీస్ పేపరు-2 6-4-2016 - ఓఎస్సెస్సీ ప్రధాన భాష పేపరు-1 7-4-2016 - ఓఎస్సెస్సీ ప్రధాన భాష పేపరు-2 9-4-2016 - ఎస్సెస్సీ వొకేషనల్ (థియరీ) -
అమరావతిలో మోదీ పర్యటన ఖరారు
- రాజధాని శంకుస్థాపన అనంతరం తిరుమల వెళ్లనున్న ప్రధాని హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి రాక ఖరారయింది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11:45కు గన్నవరం చేరుకునే ఆయనకు అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకోనున్న మోదీ.. మధ్యాహ్నం 12:35 గంటలకు రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దాదాపు రెండు గంటలపాటు అక్కడే గడుపుతారు. ఆ తరువాత 2:45 గంటలకు అమరావతి నుంచి తిరుపతికి పయనమవుతారు. 4:05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడినుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 5:25 గంటలకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. కార్యక్రమాలను ముగించుకుని రాత్రి 7:30 గటలకు మోదీ తిరిగి ఢిల్లీ పయనమవుతారు. ఈ మేరకు ప్రభుత్వాధికారులు ప్రధాని పర్యటన వివరాలను శుక్రవారం వెల్లడించారు.