డీఎడ్-1 పరీక్షల షెడ్యూల్ విడుదల
Published Mon, May 29 2017 12:08 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
జూలై 6 నుంచి ప్రారంభం
కర్నూలు సిటీ: డీఎడ్ మొదటి సంవత్సర పరీక్షలు జూలై 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. పాత, కొత్త సిలబస్‌తో పరీక్షలు జరుగనున్నాయి. మరో మూడు నెలలు ఉంటే కోర్సు గడువు సైతం పూర్తి కానున్న తరుణంలో విద్యార్థులు.. మొదటి ఏడాది పరీక్షలు రాయనుండటం గమనార్హం. జిల్లాలో ఒక ప్రభుత్వ డీఎడ్ కాలేజీతో పాటు, మొత్తం 93 కాలేజీలు ఉన్నాయి. నామినల్ రోల్స్ 3200 మందికి చేశారు. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మిగిలిపోయిన సీట్లను ఇష్టానుసారంగా భర్తీ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. మొదటి సంవత్సర పరీక్షలు పాత సిలబస్‌తో రాయాలో కొత్త సిలబస్‌తో రాయాలో అర్థం కాకపోవడంతో కొన్ని రోజులు ఛాత్రోపాధ్యాయులు ఆందోళనకు గురి అయ్యారు. దీనిపై సెకెండరీ ఎడ్యుకేషన్ స్పష్టత ఇచ్చింది. పాత, కొత్త సిలబస్‌లతో రాయాల్సి ఉంటుంది. ఆరో పేపరుకు మాత్రం మొత్తం కొత్త సిలబస్‌ను అనుసరించనున్నారు. ఈ పేపరుకు సంబంధించి అభ్యర్థులకు మాత్రం చివరి ఆరగంటలో బిట్ పేపర్ ఇవ్వనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
తేదీ పేపరు సబ్జెక్టు
జూలై–06 పేపర్–1 చైల్డ్‌హుడ్, చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ లర్నింగ్ (కొత్త సిలబస్),ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జీ ఇండియా
(పాత సిలబస్)
జూలై –07 పేపర్–2 సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరికులం (కొత్త సిలబస్),ఎడ్యుకేషన్ సైకాలజి మెజర్‌మెంట్ అండ్ ఎవాల్యుషన్(పాత సిలబస్)
జూలై–08 పేపర్–3 చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (కొత్తసిలబస్),
ప్రాథమిక విద్య ప్రణాళిక యాజమాన్యం, ఉపాధ్యాయుల విధులు (పాత సిలబస్)
జూలై–10 పేపర్–4 తెలుగు పెడగాగి/ఉర్దూ, తమిళ్ ప్రాథమిక స్థాయి (కొత్త సిలబస్), ప్రాస్పెక్టీవ్స్ ఇన్ ప్రైమరీ అండ్
ఇంక్లీసివ్‌ఎడ్యుకేషన్(పాతసిలబస్)
జూలై–11 పేపర్–5 ప్రాథమిక స్థాయి గణిత శాస్త్ర పెడగాగి (కొత్త సిలబస్), కెపాసిటీ బిల్డింగ్(పాత సిలబస్), పార్ట్–1 కంప్యూటర్ ఎడ్యుకేషన్, పార్ట్–2 ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ పార్ట్–3 వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్
జూలై–12 పేపర్–6 పెడగాగి అక్రాస్ కరికులమ్ అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్ (కొత్త సిలబస్)
Advertisement
Advertisement