
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు-2019 షెడ్యూల్ విడుదలైంది. శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తం 7 కామన్ ఎంట్రన్స్ టెస్టులను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ 19న ఈ సెట్( అనంతపురం జేన్‌టీయూ), ఏప్రిల్ 26న ఐసెట్ (ఎస్వీయూ), మే 1న పీజీ సెట్(ఏయూ), మే 6న ఏపీ ఎడ్‌సెట్(ఎస్వీయూ),మే 6 లా సెట్(ఎస్వీయూ), మే 5న పీఈ సెట్(నాగార్జున వర్శిటీ), ఏప్రిల్ 20న ఏపీ ఎంసెట్( కాకినాడ జేఎన్‌టీయూ) ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.