
సాక్షి,విజయవాడ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష నీట్ రేపు (మే5) జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. ఏపీ నుంచి75 వేల మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు.
ఏపీలో 29 నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు మద్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్దులికు సెంటర్‌లోకి అనుమతి ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు.