వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 61వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలంలో శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కుప్పం బడూరులో 8.30 గంటలకు వైఎస్ జగన్ పార్టీ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఒడ్డు కల్వ, సురవారి పల్లి క్రాస్‌రోడ్డు, బలిజపల్లి, పీవీ పురం, రామిరెడ్డి పల్లి మీదుగా గంగిరెడ్డి పల్లి క్రాస్‌రోడ్డుకు చేరుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కమ్మ కండ్రిగ మీదుగా రామచంద్రాపురం చేరుకొని అక్కడ వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. లక్ష్మీ నగర్, నడవలూరు, పాత కందులవారి పల్లి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. రాత్రికిపాత కందులవారి పల్లిలోనే బస చేస్తారు.