
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగా ముగిసే అవకాశాలు కనిపిస్తు న్నాయి. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు ఉభయసభల సమావేశాలు జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ప్రతినిధులతో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మెజారిటీ సభ్యులు మొగ్గుచూపారు.
ఈమేరకు 23వ తేదీ వరకే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర మంత్రులు గడ్కరీ, ప్రహ్లాద్ పటేల్‌లకు కరోనా సోకింది. ఇంకొందరికీ సోకడంతో సమావేశా లకు రావద్దని వారికి సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సమావేశాలను నిర్వహించడం మంచిదికాదని ప్రతిపక్షాలు కూడా సూచించ డంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇప్పటికే ఉభయసభలను షిఫ్టుల వారీగా నడుపుతూ మునుపెన్నడూ లేనివిధంగా పలు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం చేపట్టింది.
► లాక్‌డౌన్ సమయంలో శ్రామిక్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో 97 మంది మరణిం చారని కేంద్రం రాజ్యసభ లో తెలిపింది.
► రూ. 2,000 నోట్ల ముద్రణను ఆపే ఆలోచనలేమీ లేవని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. అయితే 2019తో పోలిస్తే 2020లో తక్కువ నోట్లు సర్కులేçషన్‌లో ఉన్నట్లు చెప్పింది.
► భవిష్యత్ మిలిటరీ అప్లికేషన్లపై పరిశోధనకు డీఆర్డీఓ 8 అధునాతన సెంటర్లను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment