Business Advisory Committee
-
parliament session 2023: 8న అవిశ్వాసం
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పకపోవడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజులపాటు లోక్‌సభలో చర్చ జరుగనుంది. 10వ తేదీన ప్రధాని మోదీ దీనిపై సమాధానమిచ్చే అవకాశం ఉంది. మంగళవారం లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై బుధవారం నుంచే చర్చ చేపట్టాలంటూ తాము డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి సహా ఇతర ప్రతిపక్ష ఎంపీలు బీఏసీ సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కేంద్రంపై గత నెల 26న విపక్ష ‘ఇండియా’ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటుండడం ఇది రెండోసారి. 2018 జూలై 20న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది ఎంపీలు ఓటేశారు. మోదీ సర్కారు సునాయాసంగా గట్టెక్కింది. ఈసారి కూడా గెలుపు లాంఛనమే. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కనీసం 332 మంది ఎంపీల మద్దతు ఉంది. నంబర్ గేమ్‌లో తాము ఓడిపోతామని తెలుసని, మణిపూర్ అంశంపై మాట్లాడేలా ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచాలన్నదే తమ ఉద్దేశమని విపక్షాలు చెబుతున్నాయి. మణిపూర్ అంశంపై విపక్షాల అందోళన మణిపూర్ వ్యవహారంపై పార్లమెంట్లో రగడ కొనసాగుతూనే ఉంది. వాయిదాల పర్వం ఆగడం లేదు. మణిపూర్ హింసపై పార్లమెంట్లో చర్చించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైతం ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు ఆందోళనకి దిగారు. ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్‌సభ, రాజ్యసభ బుధవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో ‘ఢిల్లీ’ బిల్లు లోక్‌సభ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కొందరు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ స్థానం పక్కనే నిల్చున్నారు. నినాదాలతో హోరెత్తించారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. హరియాణాలో జరిగిన హింసను బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ సభలో ప్రస్తావించారు. నినాదాలు, అరుపులతో గందరగోళం నెలకొనడంతో 15 నిమిషాల్లోనే స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలకు తెరపడకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో జనన, మరణాల రిజి్రస్టేషన్(సవరణ) బిల్లు, ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్(డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు, కానిస్టిట్యూషన్(òÙడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ అమెండ్మెంట్ బిల్లుపై స్వల్ప వ్యవధిపాటు చర్చించి, ఆమోదించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాలనా సేవల నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభలో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. తమ చేతుల్లోని కాగితాలను చించి విసిరేశారు. వారి తీరును కేంద్ర హోంశాఖ అమిత్ షా తప్పుపట్టారు. విపక్ష ఎంపీల నిరసన కేవలం రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీకి సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంట్‌కు ఉందని గుర్తుచేశారు. రాజ్యసభ నుంచి ‘ఇండియా’ ఎంపీల వాకౌట్ మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ రాజ్యసభ నుంచి ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో వాకౌట్ చేశారు. అంతకుముందు మణిపూర్ అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ప్రతిపక్షాల నినాదాల మధ్యే చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభలో ఎంపీల ప్రవర్తన ప్రజల దృష్టిలో హాస్యాస్పదంగా మారుతోందని ధన్‌ఖడ్ చెప్పారు. సభకు సహకరించాలని విపక్షాలను కోరారు. మణిపూర్ హింసపై చర్చ కోసం రూల్ 267 కింద విపక్ష ఎంపీలు ఇచ్చిన 60 నోటీసులను ఆయన తిరస్కరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖకు సంబంధించిన ‘సిటిజెన్స్ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ’పై పార్లోమెంటరీ స్థాయీ సంఘం ఇచ్చిన నివేదికపై సీపీఎం సభ్యుడు జాన్ బ్రిటాన్ లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను ధన్‌ఖడ్ తోసిపుచ్చారు. దేశంలో సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన మలీ్ట–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్(అమెండ్మెంట్) బిల్లు–2023ను ఎగువసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లు గత నెలలో లోక్‌సభలో ఆమోదం పొందింది. -
బడ్జెట్ సమావేశాలు.. 7 రోజులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలను ఈ నెల 15వ తేదీ వరకు 7 రోజులు నిర్వహించాలని శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినందున మరో 6 రోజులు సమావేశాలు కొనసాగనున్నాయి. సభ్యులు కోరితే సమావేశాల పొడిగింపుపై 15న మరోమారు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి రోజూ కనీసం 12 గంటలు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బీఏసీ నిర్ణయాలను ఈ నెల 9న బుధవారం శాసనసభకు సమర్పిస్తారు. శాఖల వారీ పద్దుపై 4 రోజులు చర్చ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మంగళవారం, ఈ నెల 13న ఆదివారం శాసనసభ సమావేశాలకు విరామం ఉంటుంది. 9న సభ సమావేశమయ్యాక బడ్జెట్‌పై అధికార, విపక్ష సభ్యుల ప్రసంగాలు, ఆర్థిక మంత్రి సమాధానం ఉంటుంది. 10, 11, 12, 14 తేదీల్లో బడ్జెట్ పద్దులపై శాఖల వారీగా చర్చ జరుగుతుంది. 10న సంక్షేమ శాఖలతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ జరగనుంది. 15న ద్రవ్య, వినిమయ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. బీఎసీ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు పాల్గొన్నారు. బడ్జెట్‌పై మండలిలో 10న చర్చ ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ జాఫ్రీ అధ్యక్షతన జరిగిన శాసన మండలి బీఏసీ సమావేశంలోనూ సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు చేశారు. 8, 9 తేదీల్లో శాసన మండలి సమావేశాలకు విరామం ప్రకటించడంతో పాటు ఈ నెల 10న తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. 10న మండలిలో బడ్జెట్‌పై చర్చ, అదే రోజు ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. 11, 12 తేదీల్లో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశముంది. ఎన్నిక షెడ్యూల్ విడుదలపై 10న జరిగే మండలి సమావేశంలో స్పష్టత రానున్నది. 14న మండలి సమావేశాలకు విరామం ప్రకటించారు. 15న మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. -
పార్లమెంట్ సమావేశాల కుదింపు?
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగా ముగిసే అవకాశాలు కనిపిస్తు న్నాయి. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు ఉభయసభల సమావేశాలు జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ప్రతినిధులతో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మెజారిటీ సభ్యులు మొగ్గుచూపారు. ఈమేరకు 23వ తేదీ వరకే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర మంత్రులు గడ్కరీ, ప్రహ్లాద్ పటేల్‌లకు కరోనా సోకింది. ఇంకొందరికీ సోకడంతో సమావేశా లకు రావద్దని వారికి సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సమావేశాలను నిర్వహించడం మంచిదికాదని ప్రతిపక్షాలు కూడా సూచించ డంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇప్పటికే ఉభయసభలను షిఫ్టుల వారీగా నడుపుతూ మునుపెన్నడూ లేనివిధంగా పలు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ► లాక్డౌన్ సమయంలో శ్రామిక్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో 97 మంది మరణిం చారని కేంద్రం రాజ్యసభ లో తెలిపింది. ► రూ. 2,000 నోట్ల ముద్రణను ఆపే ఆలోచనలేమీ లేవని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. అయితే 2019తో పోలిస్తే 2020లో తక్కువ నోట్లు సర్కులేçషన్లో ఉన్నట్లు చెప్పింది. ► భవిష్యత్ మిలిటరీ అప్లికేషన్లపై పరిశోధనకు డీఆర్డీఓ 8 అధునాతన సెంటర్లను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. -
రాజ్యసభలో వైఎస్సార్సీపీకి పెరిగిన ప్రాధాన్యత
న్యూఢిల్లీ : రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత పెరుగుతోంది. తాజాగా రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం పెరగడంతో బీఏసీలో చోటు లభించింది. అలాగే రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. (‘సీఎం జగన్ పాలన మహిళలకు స్వర్ణ యుగం’) రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు 1. విజయసాయిరెడ్డి 2. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 3.పిల్లి సుభాష్ చంద్రబోస్ 4. మోపిదేవి వెంకటరమణ 5. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి 6. పరిమళ్ నత్వాని -
22 వరకు అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 14 నుంచి 22 వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, ఉపసభాపతి పద్మారావు గౌడ్, పలువురు మంత్రులు, విపక్ష ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. మొహర్రం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పా టు, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. వీరితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి హాజరు కాగా, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ తర హాలో హైదరాబాద్‌లో ప్రత్యేక భవనం నిర్మించా లని భట్టి విక్రమార్క సూచించారు. నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవన సముదాయంలో నిర్మిస్తా మని కేసీఆర్ తెలిపారు. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్ పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు తెలి సింది. కాగా వచ్చే బడ్జెట్ సమావేశాలను 21 రోజులపాటు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. 22 వరకు అసెంబ్లీ సమావేశాలు.. వాయిదా అనంతరం తిరిగి 14న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 22న ముగుస్తాయి. 14వ తేదీ మొదలు 22వ తేదీ వరకు రోజువారీగా చేపట్టాల్సిన అంశాలపై బీఏసీ చర్చించింది. 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగించి, 15న ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు. 16న హౌసింగ్, సాంఘిక, గిరిజన, మహిళా, మైనార్టీ, స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమ శాఖల పద్దులపై సభ చర్చిస్తుంది. 17న మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ అంశా లు, 18న రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, అనుబంధ శాఖలు, పౌర సరఫరాల శాఖ పద్దులపై చర్చిస్తారు. 19న పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన, వైద్య, ఆరోగ్య శాఖ పద్దులు, 20న కార్మిక, ఉపాధి, దేవాదాయ, అటవీ, పరిశ్రమలు, ఐటీ, ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చ జరుగుతుంది. 21న పాలన, ప్రణాళిక, సమాచార శాఖ పద్దులు, సమావేశాల చివరి రోజు 22న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. 14 నుంచి 22 వరకు పలు బిల్లులను కూడా సభలో పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 22న శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉగాండాలో జరిగే కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరి వెళతారు. నాలుగు రోజుల పాటు మండలి భేటీ.. ఈ నెల 11న శాసనమండలి స్పీకర్ ఎన్నిక తర్వాత శాసన మండలిని వాయిదా వేసి, తిరిగి 14, 15, 22 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని శాసన మండలి బీఏసీ నిర్ణయించింది. పద్దుల మీద శాసన మండలిలో చర్చ జరగనందున కేవలం నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
అన్ని పద్దులపై చర్చించాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను మ రిన్ని రోజులు పొడిగించి అన్ని డిమాండ్ల(పద్దులు)పై పూర్తిస్థాయిలో చర్చించాకే బడ్జెట్‌ను ఆమోదించాలని బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పద్దులపై చర్చించకుండానే ‘గిలెటిన్’ చేసే పరిస్థితి రాకుండా నివారించాలన్నారు. సోమవారం బీజేఎల్పీ కార్యాలయంలోఆయన విలేకరులతోమాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలతీరుపై చర్చించేందుకు మరోసారి అన్నిపక్షాలతో ‘బిజినెస్ అడ్వయిజరీ కమిటీ’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభా వ్యవహా రాల మంత్రి టి.హరీష్‌రావుకు సూచించారు. ముఖ్యమైన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై సభా సంప్రదాయాలకు భిన్నంగా ముగ్గురు, నలుగురు మంత్రులు జోక్యం చేసుకుని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వానికి కావాల్సిన సంఖ్యాబలం ఉన్నా వలసలను ఎందుకు ప్రోత్సహిస్తున్నదని ప్రశ్నిం చారు. బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి అంశంపై తాము వేసిన ప్రశ్నపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా లక్ష్మణ్ మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులు అనైతికమని ఫిరాయింపులపై సభలో చర్చకు అనుమతించాలని కోరారు. ఫిరాయింపులు ప్రో త్సహించే వారు పదవులకు రాజీనామాలు చే యించి మళ్లీ గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లనుంచి 60కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.