అన్ని పద్దులపై చర్చించాలి: లక్ష్మణ్ | discuss all of the balance sheet: Laxman | Sakshi
Sakshi News home page

అన్ని పద్దులపై చర్చించాలి: లక్ష్మణ్

Published Tue, Nov 18 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

అన్ని పద్దులపై చర్చించాలి: లక్ష్మణ్

అన్ని పద్దులపై చర్చించాలి: లక్ష్మణ్

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను మ రిన్ని రోజులు పొడిగించి అన్ని డిమాండ్ల(పద్దులు)పై పూర్తిస్థాయిలో చర్చించాకే బడ్జెట్‌ను ఆమోదించాలని బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్ డిమాండ్  చేశారు. పద్దులపై చర్చించకుండానే ‘గిలెటిన్’ చేసే పరిస్థితి రాకుండా నివారించాలన్నారు. సోమవారం బీజేఎల్పీ కార్యాలయంలోఆయన విలేకరులతోమాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలతీరుపై చర్చించేందుకు మరోసారి అన్నిపక్షాలతో ‘బిజినెస్ అడ్వయిజరీ కమిటీ’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభా వ్యవహా రాల మంత్రి టి.హరీష్‌రావుకు సూచించారు.

ముఖ్యమైన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై సభా సంప్రదాయాలకు భిన్నంగా ముగ్గురు, నలుగురు మంత్రులు జోక్యం చేసుకుని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వానికి కావాల్సిన సంఖ్యాబలం ఉన్నా వలసలను ఎందుకు ప్రోత్సహిస్తున్నదని ప్రశ్నిం చారు. బీబీనగర్ నిమ్స్ ఆసుపత్రి అంశంపై తాము వేసిన ప్రశ్నపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా లక్ష్మణ్ మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులు అనైతికమని ఫిరాయింపులపై సభలో చర్చకు అనుమతించాలని కోరారు. ఫిరాయింపులు ప్రో త్సహించే వారు పదవులకు రాజీనామాలు చే యించి మళ్లీ గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లనుంచి 60కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement