parliament session 2023: 8న అవిశ్వాసం | parliament session 2023:Lok Sabha to discuss no-confidence motion from August 8 to 10, PM Modi to reply on 10 Aug 2023 | Sakshi
Sakshi News home page

parliament session 2023: 8న అవిశ్వాసం

Published Wed, Aug 2 2023 4:04 AM | Last Updated on Wed, Aug 2 2023 4:04 AM

parliament session 2023:Lok Sabha to discuss no-confidence motion from August 8 to 10, PM Modi to reply on 10 Aug 2023 - Sakshi

న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పకపోవడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజులపాటు లోక్‌సభలో చర్చ జరుగనుంది. 10వ తేదీన ప్రధాని మోదీ దీనిపై సమాధానమిచ్చే అవకాశం ఉంది. మంగళవారం లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అవిశ్వాస తీర్మానంపై బుధవారం నుంచే చర్చ చేపట్టాలంటూ తాము డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి సహా ఇతర ప్రతిపక్ష ఎంపీలు బీఏసీ సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కేంద్రంపై గత నెల 26న విపక్ష ‘ఇండియా’ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటుండడం ఇది రెండోసారి.

2018 జూలై 20న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది ఎంపీలు ఓటేశారు. మోదీ సర్కారు సునాయాసంగా గట్టెక్కింది. ఈసారి కూడా గెలుపు లాంఛనమే. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కనీసం 332 మంది ఎంపీల మద్దతు ఉంది. నంబర్‌ గేమ్‌లో తాము ఓడిపోతామని తెలుసని, మణిపూర్‌ అంశంపై మాట్లాడేలా ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచాలన్నదే తమ ఉద్దేశమని విపక్షాలు చెబుతున్నాయి.  

మణిపూర్‌ అంశంపై విపక్షాల అందోళన  
మణిపూర్‌ వ్యవహారంపై పార్లమెంట్‌లో రగడ కొనసాగుతూనే ఉంది. వాయిదాల పర్వం ఆగడం లేదు. మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌లో చర్చించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సైతం ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు ఆందోళనకి దిగారు. ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్‌సభ, రాజ్యసభ బుధవారానికి వాయిదా పడ్డాయి.  
 
లోక్‌సభలో ‘ఢిల్లీ’ బిల్లు  
లోక్‌సభ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కొందరు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్‌ స్థానం పక్కనే నిల్చున్నారు. నినాదాలతో హోరెత్తించారు. ఇంతలో స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. హరియాణాలో జరిగిన హింసను బీఎస్పీ ఎంపీ కున్వర్‌ డానిష్‌ సభలో ప్రస్తావించారు. నినాదాలు, అరుపులతో గందరగోళం నెలకొనడంతో 15 నిమిషాల్లోనే స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. 

సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలకు తెరపడకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో జనన, మరణాల రిజి్రస్టేషన్‌(సవరణ) బిల్లు, ఆఫ్‌షోర్‌ ఏరియాస్‌ మినరల్‌(డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) సవరణ బిల్లు, కానిస్టిట్యూషన్‌(òÙడ్యూల్డ్‌ కులాలు) ఆర్డర్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై స్వల్ప వ్యవధిపాటు చర్చించి, ఆమోదించారు.

అలాగే దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాలనా సేవల నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(అమెండ్‌మెంట్‌) బిల్లు–2023ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఢిల్లీ సర్వీసెస్‌ ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభలో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. తమ చేతుల్లోని కాగితాలను చించి విసిరేశారు. వారి తీరును కేంద్ర హోంశాఖ అమిత్‌ షా తప్పుపట్టారు. విపక్ష ఎంపీల నిరసన కేవలం రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీకి సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంట్‌కు ఉందని గుర్తుచేశారు.  
 
రాజ్యసభ నుంచి ‘ఇండియా’ ఎంపీల వాకౌట్‌  
మణిపూర్‌ హింసాకాండపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ రాజ్యసభ నుంచి ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో వాకౌట్‌ చేశారు. అంతకుముందు మణిపూర్‌ అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ప్రతిపక్షాల నినాదాల మధ్యే చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభలో ఎంపీల ప్రవర్తన ప్రజల దృష్టిలో హాస్యాస్పదంగా మారుతోందని ధన్‌ఖడ్‌ చెప్పారు. సభకు సహకరించాలని విపక్షాలను కోరారు.

మణిపూర్‌ హింసపై చర్చ కోసం రూల్‌ 267 కింద విపక్ష ఎంపీలు ఇచ్చిన 60 నోటీసులను ఆయన తిరస్కరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖకు సంబంధించిన ‘సిటిజెన్స్‌ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ’పై పార్లోమెంటరీ స్థాయీ సంఘం ఇచ్చిన నివేదికపై సీపీఎం సభ్యుడు జాన్‌ బ్రిటాన్‌ లేవనెత్తిన పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ను ధన్‌ఖడ్‌ తోసిపుచ్చారు. దేశంలో సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన మలీ్ట–స్టేట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌(అమెండ్‌మెంట్‌) బిల్లు–2023ను ఎగువసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లు గత నెలలో లోక్‌సభలో ఆమోదం పొందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement