న్యూఢిల్లీ: విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభ నుంచి పారిపోయాయని ఎద్దేవా చేశారు. దాన్ని దేశమంతా వీక్షించిందన్నారు. మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో వాటికి చిత్తశుద్ధే లేదని ఆరోపించారు. మణిపూర్ ప్రజలకు అవి ద్రోహం చేశాయన్నారు.
ప్రజా సంక్షేమం కంటే స్వార్థ రాజకీయాలకే విపక్షాలు ప్రాధాన్యమిచ్చాయని దుమ్మెత్తిపోశారు. దాంతో కీలక సమస్యలకు పార్లమెంటులో చర్చ ద్వారా పరిష్కారం సాధించే సువర్ణావకాశం చేజారిందని ఆవేదన వెలిబుచ్చారు. దేశవ్యాప్తంగా విపక్షాలు వ్యాప్తి చేస్తున్న ప్రతికూల భావజాలాన్ని తమ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. పశి్చమ బెంగాల్లో పంచాయతీ రాజ్ పరిషత్‌ను ఉద్దేశించి శనివారం మోదీ వర్చువల్‌గా మాట్లాడారు.
వారికి రాజకీయాలే ముఖ్యం
రెండు రోజుల క్రితమే విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని 140 కోట్ల భారతీయుల ఆశీర్వాదంతో ఓడించామని మోదీ అన్నారు. ‘అలాగే వారు వ్యాప్తి చేస్తున్న ప్రతికూలతనూ ఓడించాం. మణిపూర్ అంశంపై చర్చించాలని కేంద్రం భావిస్తోందంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందే విపక్షాలకు లేఖ రాశామని. కానీ ఏం జరిగిందో మీరంతా చూశారు. దానిపై చర్చను అవే అడ్డుకున్నాయి. అంతటి సున్నిత అంశంపై చర్చ జరిగి ఉంటే మణిపూర్ ప్రజలకు కాస్త ఊరటన్నా దక్కి ఉండేది.
సమస్యకు కొన్నయినా పరిష్కారాలు దొరికి ఉండేవి. కానీ మణిపూర్ హింసాకాండకు మూల కారణానికి సంబంధించిన వాస్తవాలు విపక్షాలను ఎంతో బాధిస్తాయి. కనుక కావాలనే చర్చను జరగనీయలేదు. అసలు పార్లమెంటులో ఏ చర్చ జరగడమూ వారికి ఇష్టం లేదు. ప్రజల బాధ వాటికి పట్టదు కావాల్సిందల్లా కేవలం రాజకీయాలు’ అంటూ తూర్పారబట్టారు. విపక్షాల నిజ రూపాన్ని దేశ ప్రజల ముందు బట్టబయలు చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రజల విశ్వాసమే నాకు స్ఫూర్తినిస్తుంది. నా ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది’ అని అన్నారు.
మమతది అరాచక పాలన
గత నెల బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలను భయభ్రాంతులను చేసేందు కు పాలక తృణమూల్ కాంగ్రెస్ భాయోతోత్పాతానికి, బెదిరింపులకు దిగిందని విమర్శించారు. పైగా ప్రజాస్వామ్య పరిరక్షకుల్లా పోజు లు కొడుతోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment