PM Modi Key Comments At BJP Parliamentary Meeting - Sakshi
Sakshi News home page

అవిశ్వాసంపై చర్చకు ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Published Tue, Aug 8 2023 11:48 AM | Last Updated on Tue, Aug 8 2023 12:18 PM

PM Modi Key Comments At BJP Parliamentary Meeting - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానిపై చర్చకు ముందు మంగళవారం ఉదయం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో జరిగిన ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ ఆగ్రనేతలందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదని, అహంకారుల కూటమి అని తీవ్రంగా మండిపడ్డారు. అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.  అవినీతి, వారసత్వ రాజకీయాలకు క్విట్‌ ఇండియా అని పేర్కొన్నారు.
చదవండి:అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? నెహ్రూ నుంచి మోదీ వరకు.. అత్యధికంగా ఎదుర్కొన్నది ఎవరూ?

సోమవారం రాజ్యసభలొ ఆమోదం పొందిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లును ప్రధాని ప్రస్తావిస్తూ.. విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు. విపక్ష కూటమిలోని అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవిశ్వాసం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. లాస్ట్‌ బాల్‌కు సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ నెగ్గినట్టే విపక్షాలపై పైచెయ్యి సాధించాలని పేర్కొన్నారు. 

అవిశ్వాస తీర్మానంప్రతిపక్షాలఐక్యతకు, వారి అంతర్గత విశ్వాసానికి పరీక్ష అని తెలిపారు. ఈ ఓటుతో వెరు ఐక్యంగా ఉన్నారో, ఎవరూ లేరో స్పష్టంగా తెలుస్తుందన్నారు.  ప్రతిపక్ష కూటమి ఇండియా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్’ కావాలని కోరుకుంటోందని, దానికి తగ్గట్లే ఫలితాలు అందరూ చూడాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాగా మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌ వేదికగా అధికార విపక్షాల మధ్య చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కార్‌ నేడు లోక్‌సభలో అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ఇండియా కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ఓంబిర్లా ఆమోదించి.. చర్చకు మూడు రోజులు(8,9,10 తేదీలు) సమయమిచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించనున్నారు. 
చదవండి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రాహుల్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement