BJP Parliamentary Party
-
రేపే మోదీ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను ఆహా్వనించారు. ఆదివారం రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ దిశగా శుక్రవారం హస్తినలో ఒకదాని వెంట ఒకటి పలు పరిణామాలు జరిగాయి. తొలుత ఉదయం 11.30కు నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ సమావేశమై తమ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. పార్లమెంటు పాత భవనం ‘సంవిధాన్ సదన్’ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు టీడీపీ, జేడీ(యూ), ఎల్జేపీ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పారీ్టల అధినేతలు, ఎంపీలు పాల్గొన్నారు. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపాదించగా కూటమి ఎంపీలంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అనంతరం ఎంపీలందరినీ ఉద్దేశించి మోదీ, ఆయన నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ భాగస్వామ్య పక్షాల నేతలు ప్రసంగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా కూడా మోదీ ఎన్నికయ్యారు. తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఎన్డీఏ ఎంపీల నిర్ణయాన్ని ఆమెకు తెలియజేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ముర్ము ఆహా్వనించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నట్టు భాగస్వామ్య పక్షాలన్నీ రాష్ట్రపతికి తెలిపాయి. దాంతో ఆమె నన్ను ప్రధానిగా నియమించారు. ఆ మేరకు నాకు లేఖ అందజేశారు. ప్రమాణస్వీకారానికి అనువైన సమయం, నాతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే నేతల వివరాలు కోరారు. ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తామని తెలిపాను. కాబోయే మంత్రుల జాబితాను ఆదివారానికల్లా రాష్ట్రపతి భవన్‌కు అందజేస్తా’’ అని వివరించారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్రోత్సవాల నాటికి జాతి కలలను సంపూర్ణంగా సాకారం చేసే ప్రస్థానంలో 18వ లోక్‌సభ కీలక మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ‘‘ఇది నవ, యువ శక్తితో అలరారుతున్న సభ. దేశ ప్రజలు ఎన్డీఏకు మరోసారి అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఎన్డీఏ పక్షాలన్నీ మోదీకి మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నమే రాష్ట్రపతికి లేఖలు అందజేశాయి. జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య... సమతూకంగా పాలన: బాబు, నితీశ్ జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగాలని భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) ఆకాంక్షించాయి. ఎన్డీఏపీపీ నేతగా మోదీ పేరును రాజ్‌నాథ్ ప్రతిపాదించగా చంద్రబాబు (టీడీపీ), నితీశ్‌కుమార్ జేడీ(యూ), ఏక్నాథ్ షిండే (శివసేన), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ), హెచ్.డి.కుమారస్వామి జేడీ(ఎస్), అజిత్ పవార్ (ఎన్సీపీ), జితిన్‌రాం మాంఝీ తదితరులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు సారథ్యం వహిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘‘ప్రపంచ సారథిగా ఎదిగేందుకు భారత్‌కు ఇదో అద్భుతమైన అవకాశం. సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పాలన సాగాలి’’ అని ఆకాంక్షించారు. రాష్ట్రాల అభివృద్ధిని చిన్నచూపు చూడొద్దని నితీశ్ సూచించారు. దేశాన్ని అద్భుతంగా వృద్ధి పథంలో నడిపించడంతో పాటు బిహార్‌పైనా మోదీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ విపక్షాలకు ఓటమి తప్పదు. వాళ్లు పనికిరాని కబుర్లు చెప్పి అక్కడా, ఇక్కడా గెలిచారు. వచ్చేసారి వారంతా ఓడటం ఖాయం’’ అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం దేశం ఎవరి ముందూ తలొంచబోదని పవన్ కల్యాణ్ అన్నారు.విరిసిన నవ్వులు... ఎన్డీఏ భేటీ పలు ఆహ్లాదకర సన్నివేశాలకు వేదికైంది. తమ కూటమిది పటిష్టమైన ఫెవికాల్ బంధం అని షిండే అభివరి్ణంచగా నవ్వులు విరిశాయి. తనకు పాదాభివందనం చేసేందుకు నితీశ్ ప్రయత్నించగా మోదీ వారిస్తూ ఆలింగనం చేసుకున్నారు. చిరాగ్నూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను భుజం తట్టారు. పవన్ కల్యాణ్ ‘పవనం కాదు, సుడిగాలి’ అంటూ మోదీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రశంసించారు.రాజ్యాంగ ప్రతికి నమస్సులు ఎన్డీఏ భేటీ కోసం సెంట్రల్ హాల్లోకి ప్రవేశించగానే మోదీ ముందుగా రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకుని వందనం చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పెట్టి భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ‘‘తన జీవితంలో ప్రతి క్షణమూ రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణకే అంకితం. నా వంటి వెనకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నాడంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనమే. అది కోట్లాది ప్రజలకు ఆశ, శక్తియుక్తులు, గౌరవాదరాలు కలి్పస్తోంది’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పదేళ్లుగా అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తూ వచి్చన మోదీ నేడిలా అదే రాజ్యాంగానికి ప్రణామాలు చేయడం విడ్డూరమంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు. -
సుపరిపాలనకు మారుపేరు బీజేపీ
న్యూఢిల్లీ: సుపరిపాలనకు బీజేపీ ఒక పర్యాయపదంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత కొన్ని దశాబ్దాల అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేటతెల్లం అవుతోందని అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్, ఇతర పారీ్టల కంటే బీజేపీ రికార్డు చాలా మెరుగ్గా ఉన్నట్లు గుర్తుచేశారు. గురువారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏ ఒక్కరి ఘనత కాదని, బృంద స్ఫూర్తితో అందరూ కలిసి పనిచేయడం వల్లే చక్కటి ఫలితాలు వచ్చాయని అన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో గెలిచామని, తెలంగాణ, మిజోరం రాష్ట్రల్లో బీజేపీ బలం పెరిగిందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలతో వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే సంభాíÙంచాలని బీజేపీ నేతలకు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ఉదాహరణకు ‘మోదీజీ కీ గ్యారంటీ’ బదులు ‘మోదీ కీ గ్యారంటీ’ అనాలని చెప్పారు. ఇదిగో మా సక్సెస్ రేటు కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు 40 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొందని, కానీ, ఏడుసార్లు మాత్రమే గెలిచిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ సక్సెస్ రేటు 18 శాతంగా ఉందన్నారు. బీజేపీ 39 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని 22 సార్లు నెగ్గిందని ఉద్ఘాటించారు. బీజేపీ సక్సెస్ రేటు 56 శాతమని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పారీ్టలే మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ పారీ్టలు 36 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని, 18 సార్లు గెలిచాయని, 50 శాతం సక్సెస్ రేటు సాధించాయని వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే అధికారం అప్పగించే విషయంలో ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను సమర్థవంతంగా నడిపించే శక్తి బీజేపీకి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత లేదని, సానుకూలత ఉందని వివరించారు. పారీ్టలో తాను ఒక సాధారణ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో పాల్గొనండి తన దృష్టిలో దేశంలో పేదలు, యువత, మహిళలు, రైతులు అనే నాలుగు పెద్ద కులాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆయా కులాల సంక్షేమం కోసం కృషి చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో పాల్గొనాలని పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పనితీరు పట్ల తమ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన పేర్కొన్నారు. మొయిత్రా, వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుంటున్నట్లు ఉన్న తిరుగులేని సాక్ష్యాలను ఒక న్యాయవాది తనతో పంచుకున్నారని దూబే చెప్పారు. ‘అదానీ గ్రూప్ లక్ష్యంగా ఇప్పటి వరకు ఆమె లోక్‌సభలో ఇప్పటి వరకు 50 నుంచి 61 వరకు ప్రశ్నలడిగారు. 12 డిసెంబర్ 2005 నాటి ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారాన్ని గుర్తుచేసే విధంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడగడం ద్వారా వ్యాపారవేత్త శ్రీ దర్శన్ హీరానందానీ వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మహువా మోయిత్రా పన్నిన నేరపూరిత కుట్ర అనేందుకు ఎలాంటి సందేహం లేదు. విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చాలి’అని ఆయన స్పీకర్ బిర్లాను కోరారు. దీనిపై మొయిత్రా ఘాటుగా స్పందించారు. ముందుగా దుబేపై పెండింగ్‌లో ఉన్న ఆరోపణలపై స్పీకర్ చర్యలు తీసుకున్నాక తనపై చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తానని ఆమె అన్నారు. ‘నకిలీ డిగ్రీ పట్టావాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై పెండింగ్‌లో ఉన్న ఉల్లంఘనలు చాలానే ఉన్నాయి. స్పీకర్ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తే స్వాగతిస్తా’అంటూ ఆమె ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రెండు పార్టీలకు చెందిన ఈ ఎంపీల మధ్య పార్లమెంట్‌లోనూ తరచూ వాదోపవాదాలు జరుగుతుంటాయి. -
అవిశ్వాసంపై చర్చకు ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానిపై చర్చకు ముందు మంగళవారం ఉదయం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ ఆగ్రనేతలందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదని, అహంకారుల కూటమి అని తీవ్రంగా మండిపడ్డారు. అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు క్విట్ ఇండియా అని పేర్కొన్నారు. చదవండి:అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? నెహ్రూ నుంచి మోదీ వరకు.. అత్యధికంగా ఎదుర్కొన్నది ఎవరూ? సోమవారం రాజ్యసభలొ ఆమోదం పొందిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లును ప్రధాని ప్రస్తావిస్తూ.. విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు. విపక్ష కూటమిలోని అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవిశ్వాసం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి మ్యాచ్ నెగ్గినట్టే విపక్షాలపై పైచెయ్యి సాధించాలని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంప్రతిపక్షాలఐక్యతకు, వారి అంతర్గత విశ్వాసానికి పరీక్ష అని తెలిపారు. ఈ ఓటుతో వెరు ఐక్యంగా ఉన్నారో, ఎవరూ లేరో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్’ కావాలని కోరుకుంటోందని, దానికి తగ్గట్లే ఫలితాలు అందరూ చూడాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా పార్లమెంట్ వేదికగా అధికార విపక్షాల మధ్య చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కార్ నేడు లోక్‌సభలో అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ఇండియా కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించి.. చర్చకు మూడు రోజులు(8,9,10 తేదీలు) సమయమిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించనున్నారు. చదవండి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రాహుల్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి -
గడ్కరీ ఇమేజ్ను బీజేపీ ఓర్వలేకపోయిందా?
ముంబై: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని.. అనూహ్యంగా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించింది బీజేపీ. ఈ నిర్ణయం సొంత పార్టీ నేతలనే కాదు.. ఆయనతో దగ్గరి సంబంధాలు ఉన్న విపక్ష నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఈ పరిణామాన్ని ఆధారంగా చేసుకుని.. బీజేపీపై విమర్శలు సంధించింది ఎన్సీపీ. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడంపై స్పందించింది. ప్రజల్లో గడ్కరీ ఇమేజ్ నానాటికీ పెరిగిపోతోందని, అది భరించలేకే బీజేపీ ఆయన్ని పక్కన పెట్టిందని ఆరోపించింది. అంతేకాదు గడ్కరీని బీజేపీలో విచక్షణ, వివేకం ఉన్న నేతగా అభివర్ణించింది శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ. మీ శక్తిసామర్థ్యాలు, వ్యక్తిగత ఇమేజ్ పెరిగినప్పుడు.. ఉన్నత స్థాయికి సవాలుగా మారినట్లే లెక్క. అప్పుడు BJP మీ స్థాయిని అమాంతం తగ్గిస్తుంది. కళంకం ఉన్నవాళ్లు ఆ స్థానంలో అప్‌గ్రేడ్ అవుతారు అంటూ ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో.. గడ్కరీని పక్కనపెట్టడాన్ని ఉద్దేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నితిన్ గడ్కరీకి మహా రాజకీయాల్లో సొంత పార్టీ నుంచే ప్రత్యర్థిగా భావించే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేంద్ర ఎన్నికల కమిటీలో చేర్చింది బీజేపీ . గడ్కరీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సైతం బీజేపీ తన పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం గమనార్హం. మరోవైపు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే రాజకీయాలను వదిలేయాలని అనిపిస్తోందంటూ గడ్కరీ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలే చేశారు కూడా. ఇదీ చదవండి: అనూహ్యం.. బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డు ఇదే! -
లక్ష్మణ్‌కు అందలం.. రెండు జాతీయ స్థాయి కమిటీల్లో సముచిత స్థానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణకు చెందిన డాక్టర్ కోవా లక్ష్మణ్‌కు జాతీయ పార్టీకి సంబంధించిన రెండు అత్యున్నతస్థాయి కమిటీల్లో స్థానం లభించింది. అత్యున్నత నిర్ణాయక కమిటీలైన పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో కె.లక్ష్మణ్‌ను సభ్యుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతూ రాష్ట్ర బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు అన్నివిధాలుగా గుర్తింపునిస్తోంది. దక్షిణాది నుంచి కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పతో పాటు లక్ష్మణ్ మాత్రమే పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే లక్ష్మణ్‌ను పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఇటీవల యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన జాతీయ నాయకత్వం తెలంగాణకు, ముఖ్యంగా వెనుకబడినవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడించింది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నగర పార్టీ అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, బీజేఎల్పీనేతగా, పార్టీ అధ్యక్షుడిగా, వెనుకబడిన వర్గాలకు చెందిన నేతగా లక్ష్మణ్ తనదైన గుర్తింపు పొందారు. 2017లో ఉపరాష్ట్రపతి అయ్యేదాకా తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉండేవారు. చిత్తశుద్ధితో పని చేసే నేతలను, వారి అనుభవాన్ని పార్టీ ఎంతగా గుర్తిస్తుందో చెప్పేందుకు లక్ష్మణ్ తదితరులకు అవకాశమే తాజా నిదర్శనమని బీజేపీ వర్గాలు తెలిపాయి. ‘‘లక్ష్మణ్, యడియూరప్ప, జతియా పార్టీ కోసం తమ జీవితాలను ధారపోశారు. ఒక్కో ఇటుకా పేర్చి పార్టీ నిర్మాణానికి పాటుపడ్డారు’’అంటూ కొనియాడాయి. సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవమిది ‘‘పార్టీలో సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవమిది. ఏలాంటి రాజకీయ నేపథ్యం లేని నాలాంటి ఓ కార్యకర్త అంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు ఒక్క బీజేపీలో తప్ప మరెక్కడా సాధ్యం కాదు. చాలా సంతోషాన్ని కలిగించింది. నాపై పార్టీ అధినాయకత్వం ఉంచిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెడతా. ఈ కమిటీల ద్వారా నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తా’’. –డాక్టర్ కె.లక్ష్మణ్ చదవండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే.. -
ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం పార్లమెంటులోని లైబ్రరీ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ వారం ఉభయసభల్లో పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్‌తో బిల్లులను ఆమోదించుకోవాల్సిన అవసరం ఉండటంతో పార్టీ ఎంపీలందరూ విధిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఈ భేటీలో ప్రధాని మోదీ కోరారు. -
కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఆ మంత్రుల పేర్లు తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని, పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రిని ఆదేశించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కెబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం, మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడం పట్ల మోదీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకానీ మంత్రుల పేర్లను తనకు అందజేయాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని ఆదేశించారు. -
ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : తాగునీటి సమస్యలపై ప్రతి ఒక్క ఎంపీ దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నీటీ సమస్య అనేది ప్రజల దృష్టిలో పెద్ద సమస్య అని, దీనిపై దృష్టి సారించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ఎంపీలను సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి తమ తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ నీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీలకు చెప్పారు. -
150 కి.మీ. పాదయాత్ర చేయాలి
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిలను పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీలందరూ అక్టోబర్ 2 నుంచి 31 వరకు వారి వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని అన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ప్రధాని మోదీ కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. అలాగే పార్టీ బలహీనంగా నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు పర్యటించాలని మోదీ సూచించారు. మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2, వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31లను పురస్కరించుకుని బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా ఈ పాదయాత్ర నిర్వహించాలని మోదీ తెలిపారు. పాదయాత్రలో ముఖ్యంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం పట్ల అభిప్రాయాన్ని ఎంపీలు తెలుసుకోవాలని, అలాగే ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో అడగాలని అన్నారు. యాత్రలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. -
ఎవరినీ ఉపేక్షించం
న్యూఢిల్లీ: బీజేపీ నేతలెవరైనా సరే అహంకారపూరితంగా, అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ కొడుకు, ఎమ్మెల్యే ఆకాశ్ వర్గీయ ఇటీవల ఓ ప్రభుత్వ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ హెచ్చరికలు చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘అతడు ఎవరి కొడుకైనా సరే అటువంటి వారి అహంకారపూరిత, దుష్ప్రవర్తనను సహించేది లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే ఊరుకోబోం. కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఆకాశ్ జైలు నుంచి విడుదలైనపుడు హడావుడి చేసిన నేతలపై బీజేపీ గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ఆకాశ్ తండ్రి కైలాశ్ సమావేశంలోనే ఉండటం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో లోక్‌సభలో పార్టీ సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండటంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రజలకు గుర్తుండేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలో కనీసం ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ‘పంచవటి’గా పేర్కొన్నారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో 14 ఏళ్లపాటు పర్ణశాలలో నివసించిన విషయం తెలిసిందే. ఎంపీలతో ప్రధాని వరుస సమావేశాలు బీజేపీ ఎంపీలతో మోదీ తన నివాసంలో ఈ వారం వరుస సమావేశాలు జరపనున్నారు. ఎంపీలను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, యువత తదితర గ్రూపులుగా విభజించి వేర్వేరుగా మాట్లాడతారు. పార్లమెంట్‌తో వివిధ అంశాలపై ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడమే ఈ భేటీల ఉద్దేశం. -
అమిత్ షా వస్తానని రాకపోతే...
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీల్లో చాలా మంది తరచుగా పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేవారిని నిశితంగా కనిపెడుతున్నామని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక చర్చలు జరుగుతున్న సమయంలోనూ ఎంపీల హాజరు శాతంతక్కువగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘మీరు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అమిత్ షా వస్తానని, చివరి నిమిషంలో రాకుండా ఉంటే మీకు ఎలా ఉంటుంది. ఒకవేళ 2 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచిన మీకు సన్నిహిత మిత్రుడు ఓటు వేయలేదని తెలిస్తే ఎలా ఫీలవుతారు? పార్లమెంట్లో మన ఎంపీలు తక్కువగా ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఫీలవుతాన’ని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై చర్చల్లో పాలుపంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలని ఎంపీలకు సూచించారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పహ్లాద్ జోషి మాట్లాడుతూ... ఎంపీలు సమయపాలన పాటించాలని కోరారు. ట్రిఫుల్ తలాక్ బిల్లు గురించి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. -
ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ లైబ్రరీ హాల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం భేటీ అయింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో పాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ఇతర కీలక బిల్లులు, పార్టీ అజెండా గురించి ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బీజేపీ సభ్యత్వ నమోదు అంశంపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడనున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన జీపీ నడ్డాను ఈ సమావేశంలో అభినందనించనున్నారు. -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నడ్డా
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా(58) బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ వెల్లడించారు. సమావేశంలో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సెక్రటరీగా ఉన్న నడ్డా పార్టీ సంస్థాగత ఎన్నికల తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా, బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించడం ఇదే ప్రథమం.. నడ్డాకు ప్రధాని అభినందనలు.. 1960లో బిహార్ రాజధాని పట్నాలో జన్మించిన జగత్ ప్రకాశ్ నడ్డా విద్యాభ్యాసం అంతా పట్నా, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సాగింది. నడ్డా బీఏ ఎల్ఎల్బీ చదివారు. ఆయనకు భార్య డాక్టర్ మల్లిక, ఇద్దరు పిల్లలున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ గత మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. హిమాచల్‌లో 2007–12 కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నడ్డాను ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు అభినందించారు. నడ్డా నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
లోక్‌సభలో బీజేపీ నేతగా మోదీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ నేతగా ప్రధాని మోదీ, ఉపనేతగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నియమితులయ్యారు. బుధవారం ఇక్కడ సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకుంది. రాజ్యసభలో అధికార పార్టీ నేతగా బీజేపీకి చెందిన దళిత నేత, కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోత్, ఉపనేతగా పీయూష్ గోయెల్ నియమితులయ్యారు. చీఫ్ విప్‌గా సంజయ్ జైస్వాల్‌తోపాటు ప్రథమంగా ముగ్గురు మహిళా ఎంపీలను, వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 15 మంది లోక్‌సభ సభ్యులను విప్‌లుగా నియమించింది. రాజ్యసభ నుంచి కూడా ఆరుగురిని విప్‌లుగా ప్రకటించింది. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా లోక్‌సభ సభ్యులు గడ్కరీ, రవి శంకర్, అర్జున్ ముండా, నరేంద్ర తోమర్, జువల్ ఓరమ్, స్మృతీ ఇరానీ హాజరయ్యారు. అలాగే, రాజ్యసభ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా జేపీ నడ్డా, ఓ ప్రకాశ్ మాథుర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవడేకర్ పాల్గొన్నారు. ఎంపీలు కానందున మొదటిసారిగా ఈ కమిటీలో సభ్యులు కాని అగ్ర నేతలు, ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సమావేశానికి రాలేదు. బీజేపీ పార్లమెంటరీ కార్యాలయం ఇన్చార్జిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ, కార్యదర్శిగా తెలుగు వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. 16న పార్టీ బీజేపీ మొదటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా తెలుగు వ్యక్తి అయిన కామర్సు బాలసుబ్రహ్మణ్యంను మరోసారి కొనసాగిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బాలసుబ్రహ్మణ్యంను బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆయన్ను కార్యదర్శిగా కొనసాగించింది. 2007 నుంచి 2010 వరకు బీజేపీ జాతీయ మీడియా సహ కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం బాధ్యతలు నిర్వహించారు. నితిన్ గడ్కరీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లీగల్ సెల్ జాతీయ సహ కార్యదర్శిగా కూడా పని చేశారు. -
ఆటంకవాద రాజకీయాలపై తీర్మానం: నఖ్వీ
న్యూఢిల్లీ: సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ వారికి అండగా ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న అభివృద్ధి నిరోధక, ఆటంకవాద, వ్యతిరేక రాజకీయాలను నిరసిస్తూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఓ తీర్మానం ఆమోదించిందని తెలిపారు. సుష్మ, రాజె, చౌహాన్ రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఉభయ సభల్లోనూ సభా కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారు.