
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం భేటీ అయింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో పాటు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే ఇతర కీలక బిల్లులు, పార్టీ అజెండా గురించి ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బీజేపీ సభ్యత్వ నమోదు అంశంపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడనున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన జీపీ నడ్డాను ఈ సమావేశంలో అభినందనించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment