న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అటు ఆప్ ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు వారి ప్రచారం సాగుతోంది. రోజూ ఏదో కొత్త అంశంపై వీరి ప్రచారం జోరు సాగుతోంది. అయితే దీనిలో భాగంగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించారు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇందులో ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీని కేంద్రం ఎప్పుడుఓబీసీ జాబితాలో చేరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్,
ఈ మేరకు ఒక సుదీర్ఘనమైన లేఖను ప్రధాని మోదీకి రాసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ ‘ జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఢిల్లీలోని జాట్స్‌కు మాత్రమే ఇలా ఉండకూడదు కదా? అని డిమాండ్ చేశారు
మీరు ప్రామిస్ చేశారు.. మరిచిపోయారా?
దేశంలోని జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చుతామని మీరే ప్రామిస్ చేశారు. బీజేపీలో ఇద్దరు అగ్రనేతలు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), జాట్స్‌కు ప్రామిస్ చేశారు. వారిని కేంద్ర స్థాయిలో ఓబీసీల్లో చేర్చుతామని హామీలు అయితే ఇచ్చారు కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. ఆ హామీ ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయింది’ అని ఆరోపించారు కేజ్రీవాల్
మోదీ జీ, అమిత్ షాలను అడుగుతున్నా..
ఈ హామీ ఇచ్చిన ప్రధాని మోదీని, అమిత్ షాలను అడుగుతున్నాను. జాట్స్ కమ్యూనిటీని ఎప్పుడు కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతారో చెప్పండి. ఈ విషయంలో జాట్ నాయకులు నన్ను కలిశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం వారు ఆగ్రహంతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి తమకు అన్యాయం జరుగుతూనే ఉందని వారు ఆరోపిస్తున్నారు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
మీరు మురికివాడలను బాగు చేయండి..
ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.
‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment