సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఆ మంత్రుల పేర్లు తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని, పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రిని ఆదేశించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు. పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కెబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం, మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడం పట్ల మోదీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరుకానీ మంత్రుల పేర్లను తనకు అందజేయాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment