parliment sessions
-
మానవ తప్పిదమే.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణం
ఢిల్లీ : మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 8, 2021న ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ మంగళవారం లోక్‌సభ ముందుంచింది. 2017 - 2022 వరకు 'పదమూడవ డిఫెన్స్ పీరియడ్ ప్లాన్' పేరిట రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2017-2022 వరకు మొత్తం భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది.The Indian Air Force has officially attributed the tragic crash of the Mi-17 V5 helicopter, which resulted in the untimely demise of CDS General Bipin Rawat and other esteemed personnel, to human error by the flying crew. This conclusion raises critical questions about the… pic.twitter.com/lFNZs29uls— Aviator Amarnath Kumar (@aviatoramarnath) December 19, 2024 వాటిల్లో అప్పటి సీడీఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం కూడా ఉందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సందర్భంగా బిపిన్ రావత్ ప్రమాదానికి కారణం మానవ తప్పిదేమేనని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులోని సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఆ రోజు ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు.అయితే మార్గం మధ్యలో హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్ హెలికాప్టర్‌ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చాము’ అని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
సోరోస్‌తో స్నేహంపై శశిథరూర్ రియాక్షన్
ఢిల్లీ : 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్‌పై వివాదం రాజుకుంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, తన పాత మిత్రుడు జార్జ్ సోరోస్‌ను కలిశానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ చేస్తున్న ఆరోణల్ని శశిథరూర్ ఖండించారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు పెట్టుబడిదారుడితో కుమ్మక్కయ్యారని బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అందుకు.. అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులతో పనిచేస్తున్న ఎఫ్డీఎల్-ఏపీ సహ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాందీ.. ఆ సంస్థలో తన పాత్రను వెల్లడించాలని డిమాండ్ చేసింది.తాజాగా,సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సాన్నిహిత్యంపై మరోసారి బీజేపీ నేతలు ప్రస్తావించారు. మే 26, 2009న ఎక్స్ వేదికగా ప్రపంచ కుబేరుల్లో ఒకరు, తన పాత మిత్రుడు జార్జ్ సోరోస్‌ను కలిశాను. అతను పెట్టుబడిదారుడి కంటే అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంటారు’అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన నాటి ట్వీట్‌ను వెలుగులోకి తెచ్చారు.Since there is so much unhealthy curiosity about this tweet, I knew Mr Soros well in my @UN days as an upstanding international-minded resident of New York. He was a friend in the social sense: i have never received or solicited a penny from him or any of his foundations for… https://t.co/c1PmAHygyl— Shashi Tharoor (@ShashiTharoor) December 15, 2024ఆ ట్వీట్‌కు శశిథరూర్ ఎక్స్ వేదికగా.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న రోజుల్లో సోరస్ నాకు బాగా తెలుసు. అయితే, సోరస్ తనకు మంచి స్నేహితుడు. అంతే తప్పా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంస్థలు, ఆర్థికపమైన లావాదేవీలు జరగలేదు. సోరస్‌తో మాట్లాడి సుదీర్ఘకాలమైంది. సోరస్‌కు తనకున్న స్నేహాన్ని రాకీయాలు ముడిపెట్టడం తగదు’ అని అన్నారు.పదిహేనేళ్ల నాటి ట్వీట్‌తో అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ తప్పుదారి పట్టించే వారికి ఇది స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం, ఆ ట్వీట్లో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిగ్గా మారాయి. -
పార్లమెంట్ లో మా టార్గెట్ ఒక్కటే - ఎంపీ మిథున్ రెడ్డి
-
జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి
కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రం వృద్ధి నమోదు చేశాయి. అలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశ జీడీపీలో వాటా తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35 శాతంగా ఉండేదని, 2022–23లో 15 శాతానికి తగ్గిందని లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముంద్రా వెల్లడించారు. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడంతోనే వ్యవసాయ రంగం వాటా తగ్గిందని మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు. ‘ప్రొడక్షన్ పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదు. పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లో ఉత్పత్తులు వేగంగా పెరగడమే ఇందుకు కారణం’ అని ఆయన వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయని మంత్రి అన్నారు. వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 4 శాతంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడానికి, సుస్థిరాభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వనరులను సమర్థంగా వినియోగించేందకు ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు, పాలసీలు తీసుకొచ్చిందని వివరించారు. కేంద్రం ప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? -
పార్లమెంట్ ను కుదిపేస్తున్న మణిపూర్ అంశం
-
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ స్పందించాలని పార్లమెంట్లో విపక్షాల డిమాండ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
-
కేంద్రంపై అవిశ్వాసం.!
-
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ఇండియా కూటమి
-
పార్లమెంట్ ను కుదిపేస్తున్న మణిపూర్ ఘటన
-
పార్లమెంట్లో మణిపూర్ రచ్చ.. లోక్‌సభ వాయిదా.. కొనసాగుతున్న రాజ్యసభ..
Updates.. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నేడు ఉభయ సభలు మణిపూర్ అంశంపైనే పట్టుబట్టాయి. ఇటీవల విడుదలైన వీడియోలపై స్పందించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. కానీ కేంద్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలోపల మాట్లాడాలని డిమాండ్ చేశారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ బయట ప్రధాని మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. #WATCH | Bengaluru: Congress President Mallikarjun Kharge on Manipur viral video says, "I had raised the question in the parliament but wasn't given a chance. Govt should discuss this issue and we demand PM Modi to release a statement...PM Modi made a statement outside the House,… pic.twitter.com/2ETNgc3ao2 — ANI (@ANI) July 21, 2023 ► పార్లమెంట్లో మణిపూర్‌పై నిరసన నేపథ్యంలో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. #MonsoonSessionofParliament | Lok Sabha adjourned till 11am, Monday (July 24) pic.twitter.com/w6e5Oz9zjp — ANI (@ANI) July 21, 2023 ► మణిపూర్ అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. Rajya Sabha adjourned till 2.30 pm amid uproar in the House over Manipur issue. pic.twitter.com/OF387p0PMq — ANI (@ANI) July 21, 2023 ► ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరిగిన హింస మన మనస్సాక్షిని కదిలించింది. కేంద్ర ప్రభుత్వం నిద్ర నుండి మేల్కొనాలి. మణిపూర్ సమస్యపై చర్చించాలని నేను అభ్యర్థిస్తున్నాను... మణిపూర్‌లో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏం చేసిందో దేశం మొత్తం తెలుసుకోవాలని కోరుకుంటోంది. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. AAP MP Raghav Chadha on the ruckus in parliament over the Manipur issue says, "The violence in Manipur has shaken our collective conscience. I request the central govt to wake up from their slumber & discuss the Manipur issue...The entire country wants to know what is happening… pic.twitter.com/O6vkfW9anD — ANI (@ANI) July 21, 2023 ► కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ► ఈ క్రమంలోనే విపక్షాలు చర్చకు పట్టుబట్టగా లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. #WATCH | Amid the uproar in Lok Sabha over the Manipur situation, Defence Minister Rajnath Singh said, "Manipur incident is definitely very serious and understanding the situation, PM himself has said that what happened in Manipur has put the entire nation to shame. PM has said… pic.twitter.com/QHW1KHfg0q — ANI (@ANI) July 21, 2023 ► కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. విపక్షాలకు నచ్చచెప్పే యత్నం చేసినా విపక్షాలు ఆందోళన కొనసాగాయి. దాంతో లోక్‌సభను వాయిదా వేయక తప్పలేదు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా లోక్‌సభలో మణిపూర్ ఘటనపై చర్చకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు మరోసారి తమ ఆందోళన కొనసాగించే అవకాశం ఉంది. ► దీనిపై ముందుగా చర్చకు అవకాశం ఇవ్వాలనేది విపక్షాల ప్రధాన డిమాండ్. దీనిపైనే తొలిరోజు కూడా విపక్షాలు ఆందోళన చేపట్టగా, రెండో రోజు కూడా అదే రచ్చ కొనసాగుతోంది. ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లిపోతోంది. ► ఈ ఘటనపై చర్చ జరగాలని విపక్షాల డిమాండ్‌తో పార్లమెంట్ రెండో రోజూ కూడా ఆందోళనల నడుమే ప్రారంభమైంది. -
మణిపూర్ ఘటన సిగ్గుపడాల్సిన విషయం
-
అటు N.D.A...ఇటు I.N.D.I.A
-
విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం :విజయసాయిరెడ్డి
-
తొలిసారి భేటీ కానున్న విపక్ష కూటమి ఇండియా
-
ఏపీకి 18 ఈ-పోక్సో కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం, పోక్సో చట్టం కేసుల సత్వర పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌కు 18 ఈ–పోక్సో కోర్టులు కేటాయించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. వీటిలో 10 ప్రస్తుతం పనిచేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ మూడు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిచేయ తలపెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు సాగరమాలలో భాగంగా ఆర్థికసాయం ఇవ్వడం లేదని కేంద్ర నౌకాయన మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ మూడు నాన్–మేజర్ పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోర్టుల్లో ఏఐ జస్టిస్ డెలివరీ సిస్టమ్ సామర్థ్యం పెంచడానికి సాంకేతికతతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవశ్యకతను గుర్తించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు తెలిపారు. ఈ–కోర్టు రెండో దశ ప్రస్తుతం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, వంగా గీతావిశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భర్తీకాని 1,425 పీజీ సీట్లు 2020–21లో 1,425 మెడికల్ పీజీ సీట్లు భర్తీకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా చెప్పారు. వీటిలో 1,365 బ్రాడ్–స్పెషాలిటీ సీట్లు, 60 డిప్లొమా సీట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏపీలో 12,859 మంది ఔషధ మొక్కల సాగు ఆంధ్రప్రదేశ్‌లో 12,859 మంది రైతులు ఔషధ మొక్కలు సాగుచేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఆయా రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌లో నర్సింగ్ కళాశాల మంగళగిరి ఎయిమ్స్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాల ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాగా,దేశవ్యాప్తంగా మంగళగిరి సహా 13 ఎయిమ్స్‌ల్లో 7,500 పడకలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఉచిత వ్యాక్సిన్‌కు రూ.27,945.14 కోట్లు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడానికి 2021–22లో రూ.35 వేల కోట్లు కేటాయించగా ఫిబ్రవరి 7 నాటికి రూ.27,945.14 కోట్లు వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. 2022–23 బడ్జెట్లో కూడా వ్యాక్సినేషన్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల సంఖ్య పెంచే ప్రతిపాదన లేదు కేంద్ర మంత్రుల సంఖ్య పెంచడానికి రాజ్యాంగాన్ని సవరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు.. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే భారత్‌కు ప్రధాన శత్రువు: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడోరోజు ఉభయ సభలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తమ రాజవంశానికి మించి ఎక్కువ ఆలోచించకపోవడం కాంగ్రెస్ సమస్య అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే భారత్ కు ప్రధాన శత్రువన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరపున సమాధానమిస్తూ ప్రధాని మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ముప్పు ఈ వంశపారంపర్య పార్టీలేనని నిప్పులు చెరిగారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్‌ని రద్దు చేయాలని కోరారని, గాంధీ కోరికను అనుసరించినట్లయితే భారతదేశం ఈ బంధుప్రీతి నుంచి విముక్తి పొంది ఉండేదని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ లేకపోయి ఉంటే దేశంలో ఎమర్జెన్సీ మరక ఉండేది కాదు. దశాబ్దాలుగా అవినీతి సంస్థాగతంగా ఉండేది కాదు. కులతత్వం లేదా ప్రాంతీయత వంటివి ఉండేవి కావు. సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు. కశ్మీర్ నుంచి వలసలు ఉండేవి కావు. మహిళలను తాండూరులో కాల్చిచంపేవారు కాదు. సామాన్యులు కనీస సౌకర్యాల కోసం చాలా కాలం వేచి ఉండాల్సిన అగత్యం ఉండేది కాదు’ అంటూ విమర్శలు గుప్పించారు. చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం అయితే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర కూడా ఆ పార్టీకే ఉందన్నారు. పైగా వారు అపఖ్యాతి, అస్థిరత, తొలగింపులను విశ్వసించారని మోదీ చెప్పుకొచ్చారు. అంతేకాదు అర్బన్ నక్సల్స్ భావజాలంలో కాంగ్రెస్ ఇరుక్కుపోయిందని అందుకే వారి మనసులు విధ్వంసకరం అంటూ ప్రధాని విమర్శించారు. తాను రాష్ట్రాల ప్రగతికి వ్యతిరేకం కాదని, అయితే ప్రాంతీయ ఆకాంక్షలు దేశ ప్రగతికి విరుద్ధంగా ఉండొద్దని ప్రధాని అన్నారు. దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ఆకాంక్షలను పరిష్కరించినప్పుడే భారతదేశ పురోగతి మరింత బలంగా ఉంటుందని, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుంది అని ప్రధాని మోదీ రాజ్యసభలో నొక్కి చెప్పారు. -
‘కేంద్రం చరిత్రను మారుస్తోంది’
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చరిత్రనే మార్చేయడానికి ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొహువా మొయిత్రా దుయ్యబట్టారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. వర్తమానంపై అపనమ్మకం, భవిష్యత్తు పట్ల భయం కేంద్రం చర్యల్లో అడుగడుగునా కన్పిస్తున్నాయని, ఈ ప్రభుత్వం బారినుంచి దేశా న్ని కాపాడటం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. చదవండి: రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా -
చట్టసభల్లో బీసీ కోటాపై మీ చిత్తశుద్ధి ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై మీ చిత్తశుద్ధి ఏంటని కేంద్రాన్ని టీఆర్ఎస్ ప్రశ్నించింది. రాజ్యాంగ (127వ సవరణ) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ బండ ప్రకాశ్ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులపై అధికారాలను రాష్ట్రాలకు దఖలుపరుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. పొరపాటును సరిదిద్దుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పునరుద్ధరించడం అభినందనీయం. బీసీ జాబితాలో పలు కులాలను చేర్చాలంటూ వివిధ రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నాయి. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నిబంధనలు ఉన్నాయి. ఎస్సీ జనాభా పెరిగినప్పుడు.. బీసీ రిజర్వేషన్ తగ్గుతూ వస్తోంది. 50 శాతం పరిమితి కారణంగా బీసీలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. 50 శాతం ఏ డేటా ఆధారంగా నిర్ణయిస్తున్నారు? సుప్రీంకోర్టు ఏ డేటాను అనుసరించి నిర్ణయిస్తోంది? శాస్త్రీయ ప్రాతిపదిక ఏముంది? 1931 నుంచి దేశంలో కులాల జనగణన లేదు. ఓబీసీ జనగణన చేస్తామని 2018లో అప్పటి మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారు. రోడ్‌మ్యాప్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కార్యాచరణ లేదు. వెంటనే బీసీ జనగణన చేపట్టాలి. ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశాలు, చివరకు పీహెచ్డీ ప్రవేశాల్లో కూడా రిజర్వేషన్లు సరిగా అమలు కావ డం లేదు. సమానత్వం కోసం రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున రాజకీయంగా కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిని కేంద్రానికి పంపారు. కానీ అది ఇప్పుడు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్లపై మీకున్న చిత్తశుద్ధి ఏంటి? లోక్‌సభలో, రాజ్యసభలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయండి’అని డిమాండ్ చేశారు. క్రీమీలేయర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ‘న్యాయ వ్యవస్థ వెనకబడిన తరగతులకు వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇస్తోంది. వెనకబడిన తరగతుల విషయానికి వచ్చేసరికి వారు పరిమితి గురించి ఆలోచిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విషయంలో వారు ఎందుకు పరిమితి ఆలోచించరు? కేంద్రం స్వయంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తూ 50 శాతం పరిమితిని ఉల్లంఘించింది. సుప్రీంకోర్టు ఎం దుకు మౌనంగా ఉంది? మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారు? కేవలం బీసీల విషయంలోనే క్రీమీలేయర్ గురిం చి ఆలోచిస్తారు. ఇతర విషయాల్లో ఎందుకు ఇలా చేయరు? ఈ క్రీమీలేయర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? రాజ్యాంగంలో ఉందా? మైనా రిటీలు, మహిళలు, ఎస్సీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఉండదు? బీసీల అభ్యున్నతి లేనప్పుడు దేశాభివృద్ధి కూడా సాధ్యం కాదు’అని బండ ప్రకాశ్ చెప్పారు. -
తిలా పాపం... తలా పిడికెడు!
అనుకున్నదే అయింది. అందరూ అనుమానించినట్టే అయింది. ఏ ప్రజాసమస్య పైనా తగిన చర్చ జరగకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణమయ్యాయి. అదీ... మొదట ప్రకటించిన ఆగస్టు 13 కన్నా రెండు రోజుల ముందే ముగిశాయి. ప్రతిపక్షాలు గొంతు చించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం, సర్కారు సావధానంగా పోదామన్నా పట్టు వీడని విపక్షం, సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘం కబురు చేసినా సరే ఖాళీ లేదనే అధికార వర్గం, మంత్రి చేతిలోని ప్రకటనను చించివేసే సభ్యుల తెంపరితనం, పెద్దల సభలోనే బల్లలెక్కి అధ్యక్షుడి ఖాళీ కుర్చీ మీదకు నిబంధనావళిని విసిరేయగల దాదాగిరి, సమస్యల పరిష్కారం కన్నా ప్రతిపక్షాలదే తప్పు అన్న ప్రచారమే కీలకమని భావించిన పాలకులు, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై మార్షల్స్ దౌర్జన్యం, మహిళా మార్షల్‌పై ఎంపీలే దాడి చేశారన్న పాలకపక్ష ఆరోపణలు – ఇలా ఈ విడత పార్లమెంట్లో ఎన్నెన్నో వివాదాలు, విషాద దృశ్యాలు. చివరకు, ఈ విడత కూడా విలువైన సభాసమయం వృథా అయింది. తిలాపాపంలో తలా పిడికెడు వాటా అన్ని పక్షాలకూ దక్కింది. లెక్కిస్తే – ఈ సమావేశాల్లో కేవలం 17 సార్లే సభ కొలువు తీరింది. నిజానికి, లోక్‌సభ 96 గంటలు పనిచేయాల్సి ఉండగా, కేవలం 21 గంటల 14 నిమిషాలే పని చేసింది. ఏకంగా 74 గంటల 46 నిమిషాల సమయం గందరగోళాలకే సరిపోయింది. వెరసి, నిరుడు పార్లమెంట్ ఉత్పాదకత 126 శాతం దాకా ఉంటే, ఈసారి ఏకంగా 22 శాతానికి పడిపోయింది. సాధారణంగా సభా నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలు, రోజుకు రూ. 9 కోట్లు ఖర్చవుతాయని లెక్క. అంటే విలువైన సమయంతో పాటు, ఎంత ప్రజాధనం వృథా అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ సమావేశాల్లో ప్రభుత్వం 13 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. మరో 20 బిల్లుల్ని ఆమోదించింది. చర్చకు అవకాశమివ్వకుండా, సంఖ్యాబలంతో కీలకమైన బిల్లులకు క్షణాల్లో ఆమోదముద్ర వేస్తూ పోయింది. ‘ఏ మాత్రం చర్చ లేకుండా దాదాపు 35కి పైగా బిల్లుల్ని పాస్ చేశారు. అనేక బిల్లుల్ని పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకైనా పంపకుండానే ఆమోదిస్తున్నార’ని ప్రతిపక్షాల ఆరోపణ, ఆవేదన. సభకు అడ్డుపడి తమ వాదన వినిపించాలనుకోవడం, తామెత్తిన అంశంపై చర్చ జరగాలనడం ప్రతిపక్షాలు ఆది నుంచి చేసేదే. అధికారపక్షం ఎక్కడోచోట సర్దుకొని, అందుకు అంగీకరించడం సంప్రదాయం. కానీ, ఈసారి మోదీ సర్కారు విదేశీ నిఘా సాఫ్ట్వేర్ పెగసస్ వివాదంపై చర్చకు సై అనకుండా, తప్పుకు తిరగడంతో పీటముడి బిగిసింది. సమావేశాలకు ఒక్క రోజు ముందుగా బయటపడ్డ పెగసస్ పైనే చివరి దాకా ప్రతిష్టంభన సాగింది. అదే పట్టుకొని వేలాడిన ప్రతిపక్షాలు ఇతర అంశాలపై చర్చ లేవనెత్తడంలో విఫలమయ్యాయి. మరోపక్క ప్రతిపక్షాల అనుమానాల్ని నివృత్తి చేయాల్సింది పాలకులే. అధికారంలో ఉన్నవారే పెద్దమనసుతో ముందుకు రావడం ఎక్కడైనా మర్యాద, గౌరవం. కానీ, ఆపాటి విశాల హృదయం పాలకపక్షానికి లేకుండా పోయింది. పెగసస్‌పై ఐరోపా దేశాలు కొన్ని విచారణకు ఆదేశించినా, మనవాళ్ళు అందుకు సిద్ధమనలేదు. కేంద్ర ఐటీ మంత్రేమో ఫోన్లను తాము ట్యాప్ చేయలేదన్నారు కానీ, పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాకింగ్‌కు వాడారో లేదో చెప్పలేదు. రక్షణ మంత్రేమో లిఖిత పూర్వక ఏకవాక్య సమాధానంలో తమ శాఖ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని సరిపెట్టారు. కానీ, దర్యాప్తు సంస్థలు దాన్ని వాడిందీ లేనిదీ సర్కారు సూటిగా జవాబివ్వలేదు. సభలో ప్రతిష్టంభనకు కారణం ప్రతిపక్షాలే అని ప్రచారం చేస్తే చాలనుకుంది. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి, మాట్లాడలేమంటూ తర్కం లేవదీసింది. ‘కరోనా రెండో వేవ్ మరణాలు స్వతంత్ర భారత ప్రభుత్వాలన్నిటి సమష్టి వైఫల్యం’ అంటూ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా చేసిన భావోద్వేగభరిత ‘మాఫీనామా’ ప్రసంగమొక్కటే ఈ సమావేశాల్లో అందరినీ కదిలించింది. అధికార, విపక్షాలు రెంటి మధ్య ఒకే ఒక్క అంశంలో అరుదైన ఐక్యత కనిపించింది. అది – సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీలు – వాడుకలో ఓబీసీలు) జాబితాను రాష్ట్రాలే తయారుచేసుకొనే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓటుబ్యాంకు ఓబీసీల విషయంలో రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. అయితే, ఓబీసీల జాబితా రూపకల్పనకు రాష్ట్రాలకున్న అధికారాన్ని 2018లో మోదీ ప్రభుత్వమే తొలగించిందనీ, ఇప్పుడా తప్పు దిద్దుకొనేందుకు తాము సహకరించామనీ విపక్షాల వాదన. ఆ బిల్లు పని కాగానే సర్కారు ఈ సమావేశాలకు సెలవిచ్చేసింది. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో జరగాల్సింది ప్రజాసమస్యలపై విలువైన చర్చ. ఈ విడత సభలో చర్చలు లేవు. జరిగిందల్లా రచ్చ. దానితోనే చివరకు సమావేశాలు సమాప్తం కావడం విచారకరం. సభలో ఘటనలతో రాత్రి నిద్ర పట్టలేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగం చూపారు. అధికార – ప్రతిపక్షాల మంకుపట్టు, ఓబీసీ బిల్లు వేళ కూడా సభా నాయకుడు – హోమ్ మంత్రుల గైర్హాజరు, ప్రతిపక్షాల ప్రశ్నలకు కొన్నేళ్ళుగా సభలో జవాబివ్వని పాలకుల తీరు చూస్తుంటే నిజంగానే ప్రజాస్వామ్య వాదులకు కన్నీరొస్తుంది. లోక్‌సభ కొలువుదీరి రెండేళ్ళు దాటినా, ప్రతిపక్షాలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవ డమూ విడ్డూరమనిపిస్తుంది. మూకబలానికే తప్ప, చర్చకు స్థానం లేనివేళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రోజులు కావా అన్న అనుమానమొస్తోంది. ఇప్పుడిక దీని మీద చర్చ జరగాల్సిందే! -
ఫిరాయింపులపై చర్యలకు గడువుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులకు సంబంధి ంచిన పిటిషన్లను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల వివరాలు వెల్లడించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై పిటిషన్ల పరిష్కారంలో నిర్ణీత గడువు ఉండాల్సిన అవసరంపై స్పందన కోరగా ‘మీరు మంచి ప్రశ్న లేవనెత్తారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో నిర్ణీత కాలపరిమితి ఉండాల్సిన అవసరం ఉంది. క్రితంసారి స్పీకర్ల సదస్సు జరిగినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సదస్సు నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం ఈ దిశగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తే నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్ణయం తీసుకునే వీలుంటుంది..’అని సభాపతి పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా ‘ఏదైనా పిటిషన్ వచ్చినప్పుడు మా సచివాలయం దానిని పరిశీలిస్తుంది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఆ వివరాలు బహిర్గతం చేయం.. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నియమావళి మేరకు ప్రక్రియ ఉంటుంది. ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుంది. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటాం..’అని పేర్కొన్నారు. అంతకుముందు సభాపతి ఓం బిర్లా మాట్లాడుతూ ఉభయసభలు కోవిడ్‌కు పూర్వం ఉన్న వేళల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకకాలంలో పనిచేస్తాయని వివరించారు. 280 మంది సభ్యులు సభా ఛాంబర్లో, 259 మంది సభ్యులు గ్యాలరీలో కూర్చుంటారని వివరించారు. వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదులో తీసుకున్న సభ్యులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి కాదని వివరించారు. ఇప్పటికే 411 మంది సభ్యులు టీకాలు తీసుకున్నారని, మిగతా సభ్యులు విభిన్న వైద్య కారణాల వల్ల టీకా తీసుకోలేదని స్పీకర్ వివరించారు. టీకా తీసుకోని వారికి పార్లమెంటు భవనంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. కోవిడ్ ఆంక్షల కారణంగా సందర్శకులను అనుమతించబోమని సభాపతి తెలిపారు. అన్ని పార్లమెంటరీ వ్యవహారాలు అందుబాటులో ఉండేలా ఒక యాప్ రూపొందిస్తున్నామని, మరో పదిహేను ఇరవై రోజుల్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ప్రశ్నోత్తరాలు, చర్చల రికార్డులు అందుబాటులో ఉంటాయని వివరించారు. నిర్ణీత సమయంలోగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. పార్లమెంటు లైబ్రరీ, రాష్ట్ర శాసనసభల లైబ్రరీలు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వర్షాకాల సెషన్లో మొత్తం 19 రోజులు సమావేశాలు ఉంటాయని వివరించారు. కోవిడ్ ఉన్నప్పటికీ 17వ లోక్‌సభ మునుపటి లోక్‌సభలతో పోలిస్తే మొదటి 5 సెషన్లలో రికార్డు స్థాయిలో పనిచేసిందన్నారు. అంతకుముందు ఆయన సెషన్ ఏర్పాట్లను, పార్లమెంటు భవన కాంప్లెక్స్‌లో సౌకర్యాలను పరిశీలించారు. -
శీతాకాల సమావేశాలకు బ్రేక్
పార్లమెంటు శీతాకాల సమావేశాలపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలు నిజమేనని తేలింది. వాటిని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారే ఇందుకు కారణమంటోంది. రివాజు ప్రకారమైతే నవంబర్ మధ్యలోనే సమావేశాలు మొదలుకావాలి. అలా జరగలేదు గనుక ఈసారి వుండకపోవచ్చునని అందరూ అనుకున్నారు. పార్లమెంటు ఏడాదికి మూడుసార్లు సమావేశం కావాలి. అయితే ఏ రెండు సమావేశాల మధ్యా ఆర్నెల్లకు మించి వ్యవధి వుండరాదని రాజ్యాంగంలోని 85(1) అధికరణ చెబుతోంది. మొన్న సెప్టెంబర్‌లో వర్షాకాల సమా వేశాలు జరిగాయి. అప్పుడు 18 రోజులపాటు సమావేశాలుంటాయని ప్రకటించినా ఇంకా వారం రోజుల గడువుండగానే అవి ముగిసిపోయాయి. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సమావేశా లకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కువమంది సభ్యులు ఒకచోట చేరే అవకాశం లేకుండా ఉభయ సభలనూ చెరో పూట ఏర్పాటు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దయింది. అయితే ఆ సమావేశాల తీరు మాత్రం యధాప్రకారమే వుంది. ఎప్పటిలాగే అధికార, విపక్ష సభ్యులు వాగ్యుద్ధాలకు దిగారు. రాజ్యసభలో ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు శీతాకాల సమావేశాలు నిలుపుదల చేయడానికి కేంద్రం చూపిన కారణంకంటే, అందుకనుసరించిన విధానంపై వివాదం తలెత్తింది. సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించడానికి ముందు విపక్ష నేతలతో లాంఛనంగా చర్చించా మని కేంద్రం చెబుతోంటే తమతో ఎవరూ మాట్లాడలేదని కాంగ్రెస్ అంటున్నది. పార్లమెంటు సమావేశాల రద్దు వంటి కీలక అంశంలో కూడా ఎవరు నిజం చెబుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యకరమే. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమేపీ శాంతిస్తున్న వైనం కనబడుతూనే వున్నా... మును పటితో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా ఆ వ్యాధి పూర్తిగా కనుమరుగుకాలేదు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వ్యాధి మరోసారి విరుచుకుపడినా పడొచ్చని నిపు ణులు కూడా చెబుతున్నారు. అయితే కరోనా కారణాన్నే చూపి శీతాకాల సమావేశాలు రద్దు చేయ దల్చుకుంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, బహిరంగసభలు వంటివి కూడా ఆపి వుండాలి. కానీ అవి యధావిధిగా జరిగాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్ రాజకీయ పక్షాల పోటాపోటీ ర్యాలీలు, సభలతో సందడిగా మారింది. ఢిల్లీలో ఇతరచోట్లకు భిన్నమైన ప్రత్యేక వాతా వరణ పరిస్థితులున్నాయనుకుంటే ఆ సంగతిని అఖిల పక్ష సమావేశం నిర్వహించి చెబితే ఎవరి అభిప్రాయాలేమిటో ప్రజలందరికీ తెలిసేది. నిజానికి మొన్న వర్షాకాల సమావేశాల సమయంలో సభ్యుల్లో కొందరు వరసగా కరోనా బారిన పడుతున్న తీరు చూసి విపక్ష నేతలే సమావేశాలను కుదిస్తే మంచిదని సూచించారు. వర్షాకాల సమావేశాలనాటికి దేశంలో కరోనా కేసుల తీవ్రత అసాధారణంగా వుంది. ఆ నెలలో 26 లక్షల కేసులు నమోదయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా సమావేశాలు నిర్వహించి ఇప్పుడు మాత్రం కరోనాను కారణంగా చూపడం ఏమిటన్నది కాంగ్రెస్ ప్రశ్న. అయితే ఎటూ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభం కానుండగా కేవలం కొన్ని రోజుల ముందు శీతాకాల సమావేశాలు జరిపితీరాలని వాదించడం ఏం సబబని బీజేపీ వాదన. ఎవరేం చెప్పినా సమస్యలు దండిగా వున్నప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవ హరించాలని... సమస్యల విషయంలో తన ఆలోచనలనూ, వైఖరిని తేటతెల్లం చేయాలని అందరూ కోరుకుంటారు. అందుకు చట్టసభే సరైన వేదిక. మీడియా సమావేశాల ద్వారానో, ఇతరత్రా సభలు, సమావేశాల్లోనో ప్రభుత్వాల ఆలోచనలు తెలుస్తుంటాయి. కానీ దాన్ని నిలదీయడానికి, ఒప్పించడా నికి చట్టసభల్ని మించిన వేదికలుండవు. అయితే చట్టసభలు గత కొన్నేళ్లుగా బలప్రదర్శన వేదిక లవుతున్నాయి. ప్రజా సమస్యలపై గళం వినిపించడం కన్నా ఏదో ఒక సాకుతో సభకు అంతరాయం కలిగించడం, మర్నాడు పత్రికల్లో పతాకశీర్షికలకు ఎక్కాలని తపనపడటం విపక్షాల్లో ముదిరింది. దాంతో అర్ధవంతమైన చర్చలకు అవకాశం కొరవడుతోంది. అటు ప్రభుత్వాలు కూడా నామ మాత్రంగా సమావేశాలు కానివ్వడం, కీలకమైన బిల్లుల్ని సైతం మూజువాణి ఓటుతో ఆమోదింప జేసుకోవటం రివాజైంది. గత సమావేశాలే ఇందుకు తార్కాణం. వర్షాకాల సమావేశాలు వరసగా పదిరోజులపాటు కొనసాగాయని, 27 బిల్లులు ఆమోదం పొందాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెబుతున్న మాట వాస్తవమే అయినా ఏ అంశంలో సక్రమంగా చర్చ జరిగిందో, విపక్షాల సూచనలను ఎన్ని సందర్భాల్లో పరిగణనలోకి తీసుకున్నారో లెక్కేస్తే నిరాశ కలుగుతుంది. విపక్షాల వాకౌట్లు, సస్పెన్షన్ల మధ్యే సాగు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయన్న సంగతి మరిచిపోకూడదు. పార్లమెంటులో ఆ బిల్లులపై ఆరోగ్యకరమైన చర్చ జరిగివుంటే ఇప్పుడు తలెత్తిన నిరసనలే వుండేవి కాదు. దేశంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు. వ్యాక్సిన్ త్వరలోనే వచ్చే అవకాశాలు కనబడుతు న్నాయి. ఢిల్లీ వెలుపల రైతుల నిరసనోద్యం సాగుతోంది. వీటన్నిటిపైనా పార్లమెంటు లోతుగా చర్చిస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. గతవారం పార్లమెంటు నూతన భవన సము దాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ సైతం ప్రజా స్వామ్యంలో చర్చల ప్రాధాన్యత గురించి చెప్పారు. కీలకమైన సమస్యలనూ, ప్రభుత్వం తీసుకునే ముఖ్య నిర్ణయాలనూ కూలంకషంగా చర్చించడం, వాటన్నిటిపైనా ఏకాభిప్రాయానికి రాలేక పోయినా, కనీసం సహేతుకమైన సూచనలను పాలకులు ఏదోమేరకు పట్టించుకుంటున్నారన్న అభి ప్రాయం కలగడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ కోణంలో చూస్తే స్వల్పకాలమైనా శీతాకాల సమావేశాల నిర్వహణకే ప్రాధాన్యమిచ్చివుంటే బాగుండేది. -
అవాంఛనీయ దృశ్యాలు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల ఈసారి పార్లమెంటు సమావేశాలు భిన్నంగా కనబడ్డాయి. కానీ రాజ్యసభలో ఆది, సోమవారాల్లో దృశ్యాలు మాత్రం పాత సభల్నే గుర్తుకుతెచ్చాయి. రైతుల మేలుకోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు బిల్లులపై రాజ్యసభలో ఆదివారం వాగ్యుద్ధం చోటుచేసుకుంది. బిల్లుల్ని అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నించడం, ఆ క్రమంలో సభాధ్యక్ష స్థానంలో వున్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పైకి పుస్తకాలు విసరడం, ఆయన దగ్గరున్న మైక్ లాక్కోవడానికి ప్రయత్నించడం, బిల్లుల ప్రతుల్ని చించివేయడం వంటి ఘటనలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. పావుగంటకుపైగా రాజ్యసభ రణరంగాన్ని తలపిం చింది. ఈ గందరగోళంలోనే వ్యవసాయ బిల్లులు మూడింటిపైనా కేంద్రం మూజువాణి ఓటు కోరడం, సవరణలు తిరస్కరించినట్టు.. బిల్లుల్ని ఆమోదించినట్టు హరివంశ్ ప్రకటించడం అయిపోయింది. ఈ ఉదంతాల పర్యవసానంగా 8 మంది సభ్యుల్ని ఈ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు. మార్షల్స్ అడ్డుకోకపోతే హరివంశ్‌పై దాడి కూడా చేసేవారేమోనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సస్పెండైనవారు క్షమాపణలు చెబితే అను మతిస్తామని కేంద్రం... సస్పెన్షన్‌ని రద్దు చేయడంతోపాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చేవరకూ పార్లమెంటును బహిష్కరిస్తామని విపక్షం చెప్పడంతో ఇప్పుడు ప్రతిష్టంభన ఏర్పడింది. బిల్లు అంశాలపైనా, వాటి వెనకున్న ఉద్దేశాలపైనా, ఆ బిల్లుల్ని ప్రవేశపెట్టడంలో నిబంధనలు పాటించలేదన్న అంశంపైనా అభ్యంతరాలు చెప్పి...దేశ ప్రజలకు తమ గళాన్ని వినిపించాల్సిన విపక్ష సభ్యుల్లో కొందరు అనవసర ఆవేశాలకు పోయి బాహాబాహీకి దిగడం సరికాదు. మూడు సాగు బిల్లులపైనా విపక్షాలకు మాత్రమే కాదు... కొన్ని రైతు సంఘాలకు, సాగు రంగ నిపుణులకు కూడా అభ్యంతరాలున్నాయి. రైతు సంఘాల వాదనలేమిటో, పంజాబ్, హరియాణాల్లో ఉద్యమిస్తున్న రైతుల మనోగతమేమిటో రాజ్యసభలో ప్రభావవంతంగా వినిపించడానికి విపక్షం సరిగా ప్రయత్నిం చలేదు. ఈ బిల్లుల్లో కొన్ని లోపాలున్నాయని సంఘ్ పరివార్ సంస్థల్లో ఒకటైన భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) కూడా అంటున్నది. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విషయంలో రాజీపడబోమన్న హామీ ఇవ్వాలంటోంది. అలాగే సాగు ఉత్పత్తిని రైతు వద్ద నుంచి కొన్న వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించేలా చూడాలంటోంది. ఆ విషయంలో ప్రభుత్వం లేదా బ్యాంకు గ్యారెంటీగా వుండాలని కోరుతోంది. రైతు ఉద్యమ నాయకుల సందేహాలు వేరే వున్నాయి. ఇవి చట్టాలుగా మారి అమల్లోకొచ్చాక అసలు ఎంఎస్పీ వుంటుందా అనే ఆందోళన రైతుల్లో వుంది. అలాగే ఇప్పుడున్న కమిషన్ ఏజెంట్ల వ్యవస్థ పోయి కార్పొరేట్ వ్యాపార సంస్థ గుత్తాధిపత్యం వస్తే తాము తట్టుకో గలమా అని సాధారణ రైతులు సందేహపడుతున్నారు. ఇందుకు కారణాలున్నాయి. వ్యవసాయ రంగ సంస్కరణలపై నియమించిన శాంతకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికలో అనేక అంశాలు రైతులకు గుబులు పుట్టించేవే. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ధాన్య సేకరణకు స్వస్తిచెప్పాలని, ఆ పని రాష్ట్రాలు చేసుకోవాలని ఆ కమిటీ సూచించింది. సేకరణ చేయలేని పేద రాష్ట్రాలకు మాత్రమే ఇకపై ఎఫ్‌సీఐ తోడ్పాటు వుండాలని ప్రతిపాదించింది. ధాన్య సేకరణలో, నిల్వలో ప్రైవేటు సంస్థల పాత్ర వుండాలనికూడా అది సూచించింది. కేంద్రం ప్రకటించే ఎంఎస్పీపై రాష్ట్రాలు బోనస్ ఇవ్వ కూడదని తెలిపింది. ఈ నివేదికలోని సిఫార్సుల అమలుకే ఇప్పుడు మూడు సాగు బిల్లులు తెచ్చా రన్నది విపక్షాల విమర్శ. వీటికి ప్రభుత్వం వైపునుంచి సమాధానం రాబట్టే దిశగా అడుగులేయడానికి బదులు రాజ్యసభలో విపక్షాలు ఆగ్రహావేశాలకు పోయాయి. బిల్లులపై వోటింగ్‌కు సిద్ధపడకుండా, మూజువాణి ఓటుతో వాటిని ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం ఆత్రుత ప్రదర్శించిందన్న విపక్షాల ఆరోపణ నిజమే కావొచ్చు... కానీ ఆ విషయంలో ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేసేందుకు తగిన వ్యూహం విపక్షాల దగ్గర లేకుండాపోయింది. బిల్లుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో, తగిన చాకచక్యాన్ని ప్రదర్శించడంలో విఫ లమైన కాంగ్రెస్ బిల్లును సమర్ధించే ఇతర పార్టీలపై ఉక్రోషాన్ని ప్రదర్శించింది. వాస్తవానికి ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ మాదిరి సాగు రంగ సంస్కరణలకు బీజాలు పడ్డాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సాగు ఉత్ప త్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ)ల పరిధి నుంచి పండ్లు, కూరగాయలను తప్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆ రెండింటినీ రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని తెలిపింది. కాంట్రాక్టు వ్యవసాయం ప్రతిపాదన కూడా ఆ ప్రభుత్వానిదే. దళారుల బెడద నుంచి రైతుల్ని తప్పించడం కోసం వారి ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకునేవిధంగా సంస్కరణలు తీసుకొస్తామని చెప్పింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఆ విషయంలో తమది తప్పిదమేనని ప్రకటించకుండా, అందుకు క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు బిల్లుల్ని వ్యతిరేకించడం అవకాశవాదమవుతుంది. అప్పుడైనా, ఇప్పుడైనా సాగు రంగంపై ప్రభుత్వపరంగా పెట్టుబడి చాలా తక్కువ. అది గణనీయంగా పెంచడం, ఇప్పటికీ అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న ఆ రంగానికి తగిన రక్షణలు కల్పించడం అవసరం. సాగు ఉత్పత్తుల ధర, ఆ మొత్తాన్ని చెల్లించడానికి అనుసరించే విధానం వంటివి కార్పొరేట్ రంగం, రైతులు తేల్చుకుంటారని బిల్లు చెబుతోంది. ఒకటి, రెండు ఎక రాలుండే రైతు కార్పొరేట్లతో బేరసారాలాడే స్థితిలో వుంటాడని ఎవరూ అనుకోరు. అందుకు చట్ట పరమైన రక్షణలుండాలి. అలాగే ఎంఎస్పీ విషయంలో ఇస్తున్న హామీ బిల్లులో భాగం కావాలి. ఈ రెండూ సాధించడంలో విపక్షాలు విఫలం అయ్యాయి. పర్యవసానంగా రైతులకు నష్టం జరిగింది. మున్ముందైనా ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలి. -
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్దల సభలో రేగిన దుమారం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ వెల్లడించారు. విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెన్ ఆరోపించారు.విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు. ఇక గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఆదివారం రాజ్యసభ ఆమోదించింది. -
వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ బిల్లులపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమపీలు నినాదాలు చేశారు. బిల్లు ప్రతులను పలువురు సభ్యులు చించివేశారు. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులను సభ ఆమోదం తెలిపిందని ప్రకటించిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక అంతకుముందు రాజ్యసభలో బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. టీఎంసీ, ఆమ్ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. కాగా లోక్‌సభలో వ్యవసాయ బిల్లులు గురువారం రాత్రి ఆమోదం పొందాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హరియాణ సహా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు. చదవండి : రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా!