Updates..
► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నేడు ఉభయ సభలు మణిపూర్ అంశంపైనే పట్టుబట్టాయి. ఇటీవల విడుదలైన వీడియోలపై స్పందించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. కానీ కేంద్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలోపల మాట్లాడాలని డిమాండ్ చేశారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ బయట ప్రధాని మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే.
#WATCH | Bengaluru: Congress President Mallikarjun Kharge on Manipur viral video says, "I had raised the question in the parliament but wasn't given a chance. Govt should discuss this issue and we demand PM Modi to release a statement...PM Modi made a statement outside the House,… pic.twitter.com/2ETNgc3ao2
— ANI (@ANI) July 21, 2023
► పార్లమెంట్‌లో మణిపూర్‌పై నిరసన నేపథ్యంలో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.
#MonsoonSessionofParliament | Lok Sabha adjourned till 11am, Monday (July 24) pic.twitter.com/w6e5Oz9zjp
— ANI (@ANI) July 21, 2023
► మణిపూర్ అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది.
Rajya Sabha adjourned till 2.30 pm amid uproar in the House over Manipur issue. pic.twitter.com/OF387p0PMq
— ANI (@ANI) July 21, 2023
► ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరిగిన హింస మన మనస్సాక్షిని కదిలించింది. కేంద్ర ప్రభుత్వం నిద్ర నుండి మేల్కొనాలి. మణిపూర్ సమస్యపై చర్చించాలని నేను అభ్యర్థిస్తున్నాను... మణిపూర్‌లో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏం చేసిందో దేశం మొత్తం తెలుసుకోవాలని కోరుకుంటోంది. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి.
AAP MP Raghav Chadha on the ruckus in parliament over the Manipur issue says, "The violence in Manipur has shaken our collective conscience. I request the central govt to wake up from their slumber & discuss the Manipur issue...The entire country wants to know what is happening… pic.twitter.com/O6vkfW9anD
— ANI (@ANI) July 21, 2023
► కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.
► ఈ క్రమంలోనే విపక్షాలు చర్చకు పట్టుబట్టగా లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది.
#WATCH | Amid the uproar in Lok Sabha over the Manipur situation, Defence Minister Rajnath Singh said, "Manipur incident is definitely very serious and understanding the situation, PM himself has said that what happened in Manipur has put the entire nation to shame. PM has said… pic.twitter.com/QHW1KHfg0q
— ANI (@ANI) July 21, 2023
► కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. విపక్షాలకు నచ్చచెప్పే యత్నం చేసినా విపక్షాలు ఆందోళన కొనసాగాయి. దాంతో లోక్‌సభను వాయిదా వేయక తప్పలేదు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా లోక్‌సభలో మణిపూర్ ఘటనపై చర్చకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు మరోసారి తమ ఆందోళన కొనసాగించే అవకాశం ఉంది.
► దీనిపై ముందుగా చర్చకు అవకాశం ఇవ్వాలనేది విపక్షాల ప్రధాన డిమాండ్. దీనిపైనే తొలిరోజు కూడా విపక్షాలు ఆందోళన చేపట్టగా, రెండో రోజు కూడా అదే రచ్చ కొనసాగుతోంది.
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లిపోతోంది.
► ఈ ఘటనపై చర్చ జరగాలని విపక్షాల డిమాండ్‌తో పార్లమెంట్ రెండో రోజూ కూడా ఆందోళనల నడుమే ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment