Monsoon Session
-
పార్లమెంట్లో మణిపూర్ రచ్చ.. లోక్‌సభ వాయిదా.. కొనసాగుతున్న రాజ్యసభ..
Updates.. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నేడు ఉభయ సభలు మణిపూర్ అంశంపైనే పట్టుబట్టాయి. ఇటీవల విడుదలైన వీడియోలపై స్పందించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. కానీ కేంద్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలోపల మాట్లాడాలని డిమాండ్ చేశారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ బయట ప్రధాని మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. #WATCH | Bengaluru: Congress President Mallikarjun Kharge on Manipur viral video says, "I had raised the question in the parliament but wasn't given a chance. Govt should discuss this issue and we demand PM Modi to release a statement...PM Modi made a statement outside the House,… pic.twitter.com/2ETNgc3ao2 — ANI (@ANI) July 21, 2023 ► పార్లమెంట్లో మణిపూర్‌పై నిరసన నేపథ్యంలో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. #MonsoonSessionofParliament | Lok Sabha adjourned till 11am, Monday (July 24) pic.twitter.com/w6e5Oz9zjp — ANI (@ANI) July 21, 2023 ► మణిపూర్ అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. Rajya Sabha adjourned till 2.30 pm amid uproar in the House over Manipur issue. pic.twitter.com/OF387p0PMq — ANI (@ANI) July 21, 2023 ► ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరిగిన హింస మన మనస్సాక్షిని కదిలించింది. కేంద్ర ప్రభుత్వం నిద్ర నుండి మేల్కొనాలి. మణిపూర్ సమస్యపై చర్చించాలని నేను అభ్యర్థిస్తున్నాను... మణిపూర్‌లో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏం చేసిందో దేశం మొత్తం తెలుసుకోవాలని కోరుకుంటోంది. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. AAP MP Raghav Chadha on the ruckus in parliament over the Manipur issue says, "The violence in Manipur has shaken our collective conscience. I request the central govt to wake up from their slumber & discuss the Manipur issue...The entire country wants to know what is happening… pic.twitter.com/O6vkfW9anD — ANI (@ANI) July 21, 2023 ► కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ► ఈ క్రమంలోనే విపక్షాలు చర్చకు పట్టుబట్టగా లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. #WATCH | Amid the uproar in Lok Sabha over the Manipur situation, Defence Minister Rajnath Singh said, "Manipur incident is definitely very serious and understanding the situation, PM himself has said that what happened in Manipur has put the entire nation to shame. PM has said… pic.twitter.com/QHW1KHfg0q — ANI (@ANI) July 21, 2023 ► కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. విపక్షాలకు నచ్చచెప్పే యత్నం చేసినా విపక్షాలు ఆందోళన కొనసాగాయి. దాంతో లోక్‌సభను వాయిదా వేయక తప్పలేదు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా లోక్‌సభలో మణిపూర్ ఘటనపై చర్చకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు మరోసారి తమ ఆందోళన కొనసాగించే అవకాశం ఉంది. ► దీనిపై ముందుగా చర్చకు అవకాశం ఇవ్వాలనేది విపక్షాల ప్రధాన డిమాండ్. దీనిపైనే తొలిరోజు కూడా విపక్షాలు ఆందోళన చేపట్టగా, రెండో రోజు కూడా అదే రచ్చ కొనసాగుతోంది. ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లిపోతోంది. ► ఈ ఘటనపై చర్చ జరగాలని విపక్షాల డిమాండ్‌తో పార్లమెంట్ రెండో రోజూ కూడా ఆందోళనల నడుమే ప్రారంభమైంది. -
ఈసారైనా జనవాణి వింటారా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడిగా, వేడిగా సాగుతాయని ఊహించినదే. అయితే మొదటి రోజే రానున్న నెల రోజులు ఎలా ఉండనున్నాయో అర్థమైపోయింది. అల్లరిమూకలు మణిపుర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పార్లమెంట్ ఉభయ సభలను తొలి రోజే కుదిపేసింది. పాలకులు సిగ్గుపడాల్సిన ఈ మణిపుర్ ఘటనపై పూర్తి స్థాయి చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. రెండున్నర నెలల పైగా మణిపుర్ అగ్నికీలల్లో దగ్ధమవుతున్నా మూగనోము వీడని పాలకులు సుప్రీమ్ కోర్ట్కో, ఓటర్లలో వెల్లువెత్తే నిరసనకో వెరచి ఎట్టకేలకు పార్లమెంట్ తొలి రోజున పెదవి విప్పారు. సభ సమావేశంలో ఉన్నా అక్కడ కాకుండా, మీడియా ఎదుట మాత్రం విచారం వ్యక్తం చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పగలిగారు. ప్రధాని సైతం సభలో మణిపుర్‌పై చర్చలో పాల్గొని జవాబివ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, హోమ్ మంత్రి మాట్లాడతారని అధికారపక్షం ఆశ్వాసిస్తోంది. మొత్తానికి ఒక్క మణిపురే కాదు... ఢిల్లీలో ఎన్నికైన ‘ఆప్’ ప్రభుత్వాన్ని కాదని అధికా రాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు దఖలు పరిచే ఆర్డినెన్స్, డేటా రక్షణ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) – ఇలా అనేక అంశాలు ఈ సమావేశాల్ని విమర్శల జడివానగా మార్చనున్నాయి. ఆగస్ట్ 17 వరకు జరిగే వర్షాకాల సమావేశాల్లో అంతా సజావుగా సాగితే 17 రోజులు పార్లమెంట్ పని చేయాలి. ఈసారి శాసన నిర్మాణ అజెండాలో భాగంగా ఇప్పటికే పార్లమెంటరీ సంఘాలు పరిశీలించిన అటవీ, జీవావరణ వైవిధ్య చట్టసవరణ సహా 8 పెండింగ్ బిల్లులకు ఆమోదం పొందాలని ప్రభుత్వ ఆలోచన. అలాగే, వ్యక్తిగత డేటా భద్రత బిల్లు సహా కొత్తగా మరో 21 బిల్లులకు ఆమోదముద్ర వేయించాలనీ భావిస్తోంది. ముందుగా ప్రకటించిన వీటికి తోడు జాబితాలో లేనివాటినీ ప్రభుత్వం సభ ముందుకు తేవచ్చు. ముందుగా చెప్పకుండానే 2019 ఆగస్ట్ 5న రాజ్యసభలో జమ్ము–కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పాలకపక్షం ప్రవేశపెట్టిన అనుభవం ఉంది. కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగా పార్లమెంట్ కీలక చట్టాలు చేయడం కొంత కాలంగా జరుగుతున్నదే. 2019 ఎన్నికలకు ముందు 2018 వర్షాకాల సమావేశాల్లో ఆర్థిక నేరగాళ్ళ ఆస్తుల స్వాధీనం చట్టాన్నీ, 2014 ఎన్నికలకు ముందు 2013 వర్షాకాల సమావేశాల్లో జాతీయ ఆహార భద్రత చట్టాన్నీ నాటి పాలకపక్షాలు చేశాయి. ఈసారి అలాగే యూసీసీ ప్రస్తావనకు రావచ్చు. వరదలు, అధిక ధరలు, రైళ్ళ భద్రత సహా అనేక అంశాలున్నాయి. కానీ, పరస్పరం పైచేయి కోసం ప్రయత్నిస్తున్న అధికార, ప్రతిపక్షాల మధ్య పార్లమెంట్లో ప్రజాసమస్యల ప్రస్తావన, వాటిపై సరైన చర్చ ఎంత వరకు ఉంటాయనే అనుమానం కలుగుతోంది. మహిళలపై అమానుష ఘటనలో 48 రోజుల తర్వాత కానీ మణిపుర్లో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదంటే, సామూహిక అత్యాచార నిందితులు పాతికమందిలో ఒక్కరి అరెస్టుకే 77 రోజులు పట్టిందంటే ఏమనాలి? మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎంపీ నిష్పూచీగా, నిర్లజ్జగా తిరుగుతుంటే ఏం చేయాలి? పాలకుల ఈ నిర్లిప్తతనూ, నిష్క్రియా పరత్వాన్నీ కచ్చితంగా నిలదీయాలి. మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలంటూ ప్రభుత్వాన్ని వంచి, ఒప్పించాలి. కానీ, అందుకోసం షరా మామూలుగా సభ కార్యకలాపాల్ని అడ్డుకొంటే లాభం లేదు. వేర్వేరు మార్గాల ద్వారా సభలోనే పాలకవర్గాన్ని నిలదీసి, జవాబివ్వక తప్పనిస్థితిలోకి నెట్టవచ్చు. కార్యాచరణకు దిగేలా చూడవచ్చు. దీనికి ప్రతి పక్షాల మధ్య ఐక్యత, ఎప్పటికప్పుడు ముందస్తు వ్యూహరచన తప్పనిసరి. పరస్పర వైరుద్ధ్యాల మధ్య కూడా అనివార్య తతో ఇటీవలే ‘ఇండియా’ పేరిట ఎన్నికల కూటమి కట్టిన 26 ప్రతిపక్షాల్లో అలాంటి సభా సమ న్వయం ఏ మేరకు ఉంటుందో చూడాలి. అర్థవంతమైన చర్చలకూ, ప్రజాసమస్యల పరిష్కారాలకూ వేదిక కావాల్సిన ప్రజాస్వామ్య దేవా లయం కొన్నేళ్ళుగా పలు దుస్సంప్రదాయాలకు మౌనసాక్షిగా మిగలాల్సి వస్తోంది. ప్రస్తుత లోక్‌సభ అయిదేళ్ళ కాలపరిమితి 2024 ప్రథమార్ధంలో ముగిసిపోనుంది. రాజ్యాంగ విహితమైన డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకుండానే ఇంతకాలంగా అధికారపక్షం చక్రం తిప్పుతోంది. ఇది మన పార్లమెంటరీ చరిత్రలోనే కనివిని ఎరుగనిది. మరి ఈ సమావేశాల్లోనైనా ఉప సభాపతి ఎన్నికకు పాలకపార్టీ ఊ కొడుతుందా అంటే చెప్పలేం. సంఖ్యాబలం ఉందని అధికార పక్షం, ప్రభుత్వానికి ముందరి కాళ్ళకు బంధం వేయాలని ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న మంకుపట్టు కారణంగా చర్చలు, సంప్రతింపులు అటకెక్కాయి. పెద్దగా చర్చలేమీ లేకుండానే అనేక బిల్లులు మూజువాణీ ఓటుతో చట్టాలైపోతున్న శోచనీయమైన పరిస్థితులు చూస్తున్నాం. వాకౌట్లు, సస్పెన్షన్లతోనే సమావేశాలు తూతూ మంత్రంగా నడిచి, మమ అనిపిస్తున్నాయి. ఇది దేశానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటివాళ్ళమని జబ్బలు చరుచుకొనేవారు ఇకనైనా కళ్ళు తెరవాలి. అలాగే, పార్లమెంట్ సజావుగా సాగడం అధికార, ప్రతిపక్షాల సమష్టి బాధ్యత. నిమిషానికి రూ. 2.5 లక్షల వంతున వెచ్చిస్తున్న ప్రజాధనం వృథా కానివ్వరాదని ప్రజాప్రతినిధులు స్ఫురణలో ఉంచుకోవాలి. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మరొక్కసారి శీతకాలంలో మాత్రమే పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలకు వీలుంటుంది. కాబట్టి, ఈసారైనా మన పార్లమెంట్ అంకగణితపు లెక్కల కన్నా అత్యవసర అంశాలపై కనీసపాటి చర్చకు వేదిక కావాలి. ప్రజాస్వామ్యానికి అదే అసలైన ధన్యత. -
ఈ నెల 12కు వాయిదాపడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11.30 ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో దివంగతులైన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి), పరిపాటి జనార్దన్‌రెడ్డి (కమలాపూర్)కి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మండలిలోనూ మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డికి సంతాపం ప్రకటించారు. సంతాప తీర్మానాల అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12కు వాయిదా పడ్డాయి. బీఏసీ సమావేశం సభ వాయిదా అనంతరం స్పీకర్ చాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండా, సభ నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 12, 13 వ తేదీన రెండు రోజుల పాటు సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలాఉండగా.. ఈ నెల 7న కశ్మీర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’యాత్రను ప్రారంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. -
12 బిల్లులకు సభ ఓకే..!
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో శాసనసభ వానాకాలం సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. బీఏసీ సూచన మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి 28 వరకు సభ నిర్వహించాలని అనుకున్నా సభ్యులు, ఇతరుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమావేశాలను కుదించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బుధవారం వానాకాలం ఎనిమిదో రోజు సమావేశాలు ముగిసిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘రాష్ట్రంలో అమలవుతున్న అన్ని కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించాలనే ఉద్దేశంతో సమావేశాలు ప్రారంభించాం. ముఖ్యమైన రెవెన్యూ బిల్లులతో పాటు మొత్తం12 బిల్లును ఆమోదించుకున్నాం. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌తో పాటు విద్యుత్, కరోనా, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై లఘు చర్చ జరిగింది. సభ సజావుగా సాగుతున్నా.. రోజూ 1,200 మంది సమావేశాలకు వస్తున్నారు. వీరి క్షేమం కోసమే వాయిదా వేస్తున్నాం’అని స్పీకర్ ప్రకటించారు. ఇద్దరు శాసనసభ్యులకు కరోనా.. ‘భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నా.. ఇటీవల జరిపిన కరోనా పరీక్షల్లో ఇద్దరు శాసనసభ్యులతో పాటు పలువురు పోలీసులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరు ఎలా కరోనా బారిన పడతారో... అనే సంశయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని శాసనసభ వానాకాలం సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నా’అని స్పీకర్ పోచారం ప్రకటించారు. మండలి కూడా... శాసనసభ తరహాలోనే మండలి సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. కాగా, అసెంబ్లీ ఉభయ సభల నిర్వహణకు సంబంధించి బుధవారం ఉదయం స్పీకర్ చాంబర్లో పోచారం, గుత్తా భేటీ అయ్యారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులతోనూ సభ కొనసాగింపుపై చర్చించారు. అర్ధవంతంగా సమావేశాలు... కరోనా నేపథ్యంలో ఈ నెల 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 8 రోజుల పాటు అర్ధవంతంగా, హుందాగా సాగాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సమావేశాలు వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో మీడియాతో మాట్లాడారు. కరోనా పరిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ సమవేశాలు 5 రోజులకు మించి జరగలేదని, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. స్పీకర్, మండలి చైర్మన్ సమావేశాలను కుదించాలని నిర్ణయించారన్నారు. నిర్మాణాత్మక చర్చలకు ప్రతిపక్షాలు ప్రాధాన్యత ఇచ్చాయని, సమయభావం వల్లే పాలక సభ్యులకు మాట్లాడే అవకాశం లభించలేదని మంత్రి వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు పాల్గొన్నారు. -
‘కోవిడ్-19 నిబంధనలతో కొలువుతీరుతాం’
హుబ్లీ : కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ‘వర్షాకాల సమావేశాలు తప్పనిసరిగా జరుగుతాయి..నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్తల’ను చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ 12 బిల్లులను ఆమోదించింది. ఆ సెషన్స్‌లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు. ఫైనాన్స్ బిల్లుతో పాటు బడ్జెట్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇరు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనతో సమావేశాలకు అర్థంతరంగా తెరపడింది. ఇక భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో తాజాగా 28,637 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,49,553కు ఎగడబాకింది. కాగా కరోనాతో ఒక్కరోజులో 551 మరణించడంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 22,674కు పెరిగింది. చదవండి : ఆ ప్రాజెక్టును అడ్డుకోలేం -
ఇదిగో పంటల పటం
సాక్షి, హైదరాబాద్ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంటల వారీగా సాగుచేయాల్సిన విస్తీర్ణాన్ని వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖలు ఖరారు చేశాయి. జిల్లాల వారీగా 2019 వానాకాలంలో పంటల వారీగా సాగు విస్తీర్ణం గణాంకాలను దృష్టిలో పెట్టుకుని 2020 వానాకాలా నికి సంబంధించి పంటల చిత్రపటం (క్రాప్ మ్యాపిం గ్)ను రూపొందించాయి. గతేడాది వానాకాలం, యాసంగి కలుపుకుని రాష్ట్రంలో 1.23 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేయగా, కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో అదనంగా మరో 10లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో 2020 వానాకాలం, యాసంగి కలుపుకుని 1.33 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలు, పంటల వారీగా వానా కాలంలో సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. సాగులో సం‘పత్తి’ తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న నాణ్యమైన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో ఆ పంటసాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. గతేడాది రాష్ట్రంలో 53లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది 70లక్షల ఎకరాలకు పెంచాలని సీఎం ఆదేశించారు. దీంతో తాజాగా రూపొందించిన పంటల ప్రణాళిక మేరకు రాష్ట్రంలో అదనంగా 10.24లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేయాల్సి ఉంటుంది. మక్క.. వద్దు పక్కా పొరుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నలు తక్కువ ధరకే దొరుకుతుండటంతో రాష్ట్రంలో సాగవుతున్న మక్కలకు కనీస మద్దతుధర లభించట్లేదు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలుకు రూ.1,760 చెల్లించి మక్కలను కొనుగోలు చేసింది. అయితే రాష్ట్రంలో 25లక్షల టన్నులకు మించి మక్కల వినియోగం లేకపోవడంతో వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయొద్దని సీఎం ఖరాకండీగా చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 10.11లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యింది. ప్రస్తుతం రూపొందించిన పంటల చిత్రపటంలో ఈ పంటకు చోటు దక్కలేదు. కంది.. సాగు దండి గతేడాది రాష్ట్రంలో 7.38లక్షల ఎకరాల్లో కంది సాగైంది. పంటల చిత్రపటం రూపకల్పనలో భాగంగా మొక్కజొన్నకు బదులు కంది సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలో పప్పుధాన్యాల వినియోగం 11.7లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5.6 లక్షల టన్నుల పప్పుధాన్యాలు మాత్రమే దిగుబడి అవుతున్నాయి. ఈ లోటు భర్తీకి 6.1లక్షల టన్నుల మేర పప్పులను రాష్ట్రం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కందితో పాటు మినుములు, పెసలు సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచుతూ కార్యాచరణ ఖరారు చేశారు. క్రాప్ మ్యాపింగ్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6.70లక్షల ఎకరాల్లో కంది, 45వేలకుపైగా ఎకరాల్లో పెసలు, 28వేల ఎకరాల్లో మినుములు సాగు చేయాల్సి ఉంటుంది. వరి..సరిసరి గతేడాది వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 41.19లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ధాన్యాగారంగా మారింది. ఈ ఏడాది ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో సుమారు మూడోవంతు రాష్ట్రం నుంచి దిగుబడి వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాళేశ్వరం జలాలు కూడా అందుబాటులోకి వస్తుండటంతో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సాగునీటి వసతి ఉన్నచోట కూడా పత్తి సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో వరిసాగు విస్తీర్ణంలో భారీగా కోత పడనుంది. దీంతో పంటల చిత్రపటం ప్రకారం సుమారు 95వేలకుపైగా ఎకరాల్లో వరిసాగును తగ్గించాలని నిర్ణయించారు. ఆముదం.. ప్రధానం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆముదం నూనెలో భారత్ నుంచే 90శాతం వస్తుండగా, తర్వాత స్థానాల్లో బ్రెజిల్, చైనా ఉన్నాయి. దేశంలో గుజరాత్‌లోనే అత్యధికంగా 75శాతం మేర ఆముదం సాగు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధానంగా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఆముదం సాగుచేస్తుండగా, నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ఈ సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని నిర్ణయించారు. దీంతో కొత్తగా 73వేలకు పైగా ఎకరాల్లో ఆముదం సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వేరుశనగ బాగు.. సోయా తగ్గు నూనె గింజలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వేరుశనగను కూడా 17వేలకు పైగా ఎకరాల్లో అదనంగా సాగు చేస్తారు. ఆముదం, వేరుశనగ సాగు విస్తీర్ణాలను పెంచుతూనే సోయా సాగు విస్తీర్ణాన్ని 1.74లక్షల ఎకరాల మేర కుదించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గతేడాది 4.28లక్షల ఎకరాల్లో సోయా సాగుచేయగా, ప్రస్తుత వానాకాలంలో సుమారు 3లక్షల ఎకరాలకే పరిమితం కానుంది. పసుపు, ఉల్లి కుదింపు.. జొన్న కాదిక మిన్న ►గతేడాది 34వేల ఎకరాల్లో ఉల్లి సాగుచేయగా 3.40లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వచ్చింది. పంటల చిత్రపటం ప్రకారం ఈ ఏడాది వానాకాలంలో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని 24వేల ఎకరాలకుపైగా తగ్గించాలని నిర్ణయించారు. ►పసుపు 1.33లక్షల ఎకరాల్లో సాగు చేయగా 2.81లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. తాజా ప్రణాళికలో భాగంగా ఈ పంట సాగు విస్తీర్ణాన్ని 8,700పైగా ఎకరాలకు కుదిస్తారు. ►ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్న జొన్న పంట విస్తీర్ణాన్ని మొత్తంగా 5వేల ఎకరాల మేర తగ్గించాలని పంటల చిత్రపటంలో పేర్కొన్నారు. వరి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నల్లగొండ 3,30,000 ( ఎకరాలు) సూర్యాపేట 3,20,000 నిజామాబాద్ 3,00,000 పత్తి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నల్లగొండ 7,25,000(ఎకరాల్లో) నాగర్‌కర్నూలు 4,50,000 ఆదిలాబాద్ 4,35,088 కంది సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు వికారాబాద్ 1,73,900 (ఎకరాల్లో) నారాయణపేట 1,70,000 రంగారెడ్డి 1,00,000 సోయాబీన్ సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నిర్మల్ 60,000( ఎకరాల్లో) కామారెడ్డి 50,000 సంగారెడ్డి 46,473 జొన్న సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు మహబూబ్‌నగర్ 41,500(ఎకరాల్లో) రంగారెడ్డి 22,000 నారాయణపేట 15,000 మినుములు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 22,000 (ఎకరాల్లో) కామారెడ్డి 10,000 వికారాబాద్ 9,500 ఆముదం సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు మహబూబ్‌నగర్ 40,530(ఎకరాల్లో) నారాయణపేట 36,000 వనపర్తి 25,050 వేరుశనగ సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు గద్వాల 20,000 (ఎకరాల్లో) వరంగల్ రూరల్ 8,500 వనపర్తి 4,500 చెరుకు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 34,200(ఎకరాల్లో) కామారెడ్డి 12,061 వికారాబాద్ 6,508 పెసలు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు సంగారెడ్డి 48,000(ఎకరాల్లో) ఖమ్మం 22,000 వికారాబాద్ 20,800 పసుపు సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు నిజామాబాద్ 37,350 (ఎకరాల్లో) జగిత్యాల 32,240 నిర్మల్ 20,050 ఉల్లి సాగు విస్తీర్ణంలో టాప్ జిల్లాలు గద్వాల 7,599(ఎకరాల్లో) వనపర్తి 810 మెదక్ 578 -
‘ఫలవంతం’ అర్ధమేమిటి?
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 17 రోజులపాటు కొనసాగి శుక్రవారం ముగిశాయి. ఈసారి సమావేశాలు ఫలవంతమయ్యాయని అటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఇటు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి వరకూ ఎజెండా ప్రకారం సమావేశాలు సాగితే, అవాంతరాల బారిన పడకపోతే అవి ఫలవంతమైనట్టే. సభాధ్యక్షులు గనుక వారికి ఆ దృష్టి ఉండటం సహజం. అయితే చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకున్న ప్రజలు దీంతోపాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తాము ఏ పార్టీ తరఫున గెలిపించామో అదే పార్టీలో తమ ప్రతినిధి కొనసాగుతున్నారా లేదా అన్నది అందులో కీలకమైనది. ఎందుకంటే ఒక పార్టీ విధానాలు నచ్చి ఆ పార్టీ తరఫున బరిలో నిల్చున్నవారిని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ విధానాలనే ఆ ప్రతినిధులు పార్లమెంటులో ప్రతిబింబించాలని వారు కోరుకుంటారు. కనుక ఫిరాయించిన చట్టసభల సభ్యులు ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధులయ్యే అర్హత కోల్పోతారు. అందువల్ల అలాంటివారు ఆ పార్టీ ద్వారా లభించిన పదవిని వదులుకుని ప్రజా తీర్పును కోరుతూ మళ్లీ బరిలో నిలబడవలసిందే. వారికి ఆ మాదిరి విలువలు లేని పక్షంలో సభాధ్యక్షులుగా ఉన్నవారు చట్టప్రకారం వ్యవహరించి వారిని బయటకు సాగనంపాలి. అనర్హత వేటు వేయాలి. అప్పుడు మాత్రమే చట్టసభల సమావేశాలు ఫలవంతమైనట్టు. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించినట్టు. అందుకు భిన్నంగా ఎవరైనా సభలో కూర్చుంటే ఆ సమావేశాలు అర్ధరహితమవుతాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఆ దుస్థితి ఏర్పడకుండా కాపాడాల్సినవారు సభాధ్యక్షులే. విపక్షాల ర్యాలీకి హాజరయ్యారన్న ఏకైక కారణంతో ఫిర్యాదు వచ్చిన వెంటనే రాజ్యసభలో శరద్‌యాదవ్, అలీ అన్వర్‌లపై వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేశారు. అనర్హత విషయంలో రెండు సభల్లోనూ ఇలా వేర్వేరు ప్రమాణాలు పాటించడం ఆశ్చర్యకరం. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున తొమ్మిదిమంది ఎన్నికయ్యారు. వారిలో నలుగురు పార్టీ ఫిరాయించారు. ఇదంతా బహిరంగమే. ముగ్గురు టీడీపీ కండువాలు కప్పుకుంటే, ఒకరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చట్టాన్ని గౌరవించి వీరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికి 13 సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ సుమిత్రా మహాజన్‌కు వినతి పత్రాలిచ్చింది. లోక్‌సభ పదవీకాలం మరి కొన్ని నెలల్లో ముగియబోతున్నా ఆ విషయం తేలలేదు. ఆ నలుగురు ఎంపీలు వేరే పార్టీల పంచన చేరారో లేదో తేల్చడమనేది అంత జటిలమైన విషయమా? ఆ నలుగురికీ నోటీసులు జారీ చేస్తే వచ్చి వారంతట వారే సంజాయిషీ ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేయవచ్చునో ఆమెకు తెలియదా? గత బడ్జెట్ సమావేశాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పలుమార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చినా సభ సజావుగా సాగడం లేదన్న కారణంతో వాటిపై నిర్ణయం తీసుకోలేదు. చిత్రంగా వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజునే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమె ఆమోదించటం, ఆ మర్నాడే ప్రభుత్వం చర్చకు సిద్ధపడటం జరిగిపోయాయి. ఇందులో మతలబు ఏమిటన్న సంగతలా ఉంచి ఆ అవిశ్వాసం నోటీసుపై జరిగిన చర్చలో ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకకు మాట్లాడే అవకాశం ఎలా ఇచ్చారు? ఏదైనా అంశంపై చర్చ జరిగినప్పుడు దానిపై మాట్లాడేందుకు పార్టీలకు సమయం కేటాయిస్తారు. తమ పార్టీ తరఫున ఎవరెవరు, ఎన్ని నిమిషాల చొప్పున మాట్లాడాలో సంబంధిత పార్టీ విప్ నిర్ణయిస్తారు. వారి పేర్లను సభాధ్యక్షులకు అందజేస్తారు. దాని ప్రకారమే ఆ పార్టీ సభ్యులు మాట్లాడతారు. మరి బుట్టా రేణుక ఏ పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడినట్టు? ఈ సమావేశాలకు ముందు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించమని కోరడానికి సుమిత్రా మహాజన్‌ను కలిశారు. అప్పుడు మరోసారి ఫిరాయింపుల విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా గత నెల 10న ఆమె వివిధ పార్టీలకు లేఖ రాస్తూ మన పార్లమెంటు, ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితోక్తులు పలికారు. మరి ఫిరాయింపుదార్లపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేయడమేకాక, వారిలో ఒకరికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం ఏ ఆదర్శాలకు దోహదపడుతుందో ఆమె ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి సమావేశాల ఎజెండా పూర్తికావడం ఒక్కటే గీటురాయా? ఇతరత్రా అంశాలేవీ పరిగణనలోకి రావా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఫిరాయింపుదార్ల సంగతి తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు. పార్లమెంటు అత్యున్నతమైనది కనుక కనీసం అక్కడి నిర్ణయాలైనా రాష్ట్రాల చట్టసభలకు ఆదర్శనీయంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఈసారి సమావేశాల్లో 21 బిల్లులు, సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ చట్టం సవరణ బిల్లు, మనుషుల అక్రమ తరలింపు నిరోధక బిల్లు, వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి బిల్లు వగైరాలు ఇందులో ఉన్నాయి. ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) తమ ప్రతినిధి ద్వారా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలు కల్పించే బిల్లు కూడా ముఖ్యమైనది. విదేశాల్లో మూడు కోట్లకుపైగా ఎన్నారైలు ఉన్నారు. ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎండగడతామని, దాన్ని సాధించుకొస్తామని చెప్పిన టీడీపీ దారుణంగా విఫలమైంది. హోదాపై తాము అందరినీ కూడగట్టామని చెప్పుకున్నా, చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో సహా ఏ ఒక్కరూ ఆ విషయమై మాట్లాడకపోవడం టీడీపీని నగుబాటుపాలు చేసింది. బహుశా ఆ పార్టీ పార్లమెంటు ముందు వేయించిన పగటి వేషాలతో హోదా అంశాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోయి ఉండొచ్చు. ఏదేమైనా పార్లమెంటు సమావేశాలు మున్ముందు మరింత అర్ధవంతంగా సాగాలని అందరూ ఆశిస్తారు. -
పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్
-
జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల (జూలై) 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 18 రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, అధికార బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో సభలు దద్దరిల్లే అవకాశముంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. గత సమావేశాలను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా, ఏపీకి విభజన హామీల అమలు విషయంలో ఉదాత్తమైన పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తిన వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేయడమే కాదు.. చివరకు వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి.. ఆమోదింపచేసుకున్నారు. పదవులకు కన్నా ఏపీ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మరోసారి వైఎస్సార్ సీపీ ఎంపీలు చాటారు. -
’మాట్లాడనివ్వకపోతే రాజీనామా చేస్తా’
మాయావతి హెచ్చరిక, రాజ్యసభ నుంచి వాకౌట్ న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండోరోజు సమావేశమైన రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రైతుల అంశంపై, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారత్-చైనా ప్రతిష్టంభనపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ షహరాన్‌పూర్‌లో దళితులపై దాడి అంశాన్ని లేవనెత్తారు. ఆమె మాట్లాడుతుండగా సభాపతి అడ్డుపడటంతో మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’మాట్లాడేందుకు అనుమతించకపోతే.. నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను. ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వకపోతే.. నేను రాజీనామా సమర్పించి వెళ్లిపోతాను’ అంటూ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజీనామా చేయాలని మాయావతి భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, మాయావతి సభాపతిని సవాల్ చేసి అగౌరవపరిచారని, ఆమె క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. -
ప్రతిపక్ష నేతలను స్వయంగా పలుకరించిన మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రతిపక్ష సభ్యుల వద్దకు వెళ్లి పలుకరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా గ్రీటింగ్స్ తెలిపారు. సోమవారం ఉదయం సభ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే లోక్‌సభకు వచ్చిన ప్రధాని మోదీ ప్రతిపక్షాల బెంచ్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి.. ప్రతిపక్ష నేతలను పలుకరించారు. ప్రథమ వరుసలో కూర్చున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై, సోనియాగాంధీలను పలుకరించారు. గౌడ, ములాయం, ఖర్గే, తంబిదురైలతో కరచాలనం చేసిన మోదీ.. సోనియాకు చేతులు జోడించి ప్రణామం తెలిపారు. రెండో వరుసలో కూర్చున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జ్యోతిరాదిత్య సింథియాలను కూడా ప్రధాని మోదీ పలుకరించారు. సభలోకి వచ్చే సమయంలో చేతులు జోడించి సభ్యులకు ఆయన ప్రణామం తెలిపారు. ఈ సందర్భంగా ఎల్జేపీ నేత రాంచంద్ర పాశ్వాన్ మోదీకి పాదాభివందనం చేశారు. -
డుమ్మా కొట్టిన తృణమూల్ కాంగ్రెస్!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టింది. వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరేందుకు మోదీ సర్కారు ఈ భేటీ నిర్వహించింది. ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు, పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. జీఎస్టీ సహా ప్రతిపక్షాలు లేవనెత్తుత్తే ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. 24 ఉత్తర పరగణాల జిల్లాలో మతఘర్షణలకు బీజేపీ కారణమని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి దూరంగా ఉంది. అయితే, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించే అఖిలపక్ష భేటీకి తాము హాజరవుతామని తృణమూల్ స్పష్టం చేసింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు హాజరు కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం భేటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కృష్ణా జలాల పంపకాలు, చేనేత, చిన్నతరహా పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు, ఫిరాయింపు నిరోధక చట్ట సవరణ తదితర అంశాలను వారు ప్రస్తావించారు. -
‘వేసవిలో సమావేశాలు బాగా జరిపిస్తాం’
న్యూఢిల్లీ: ఎలాంటి ఫలితాలను ఇవ్వకుండానే మొత్తానికి శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు నెల రోజులపాటు జరిగిన సమావేశాల్లో లోక్ సభ కేవలం 17.04శాతం మాత్రమే పనిచేయగా.. రాజ్యసభ 20.61శాతం నడిచిందని కేంద్ర మంత్రి అనంత కుమార్ చెప్పారు. లోక్ సభలో నాలుగు, రాజ్యసభలో ఒక బిల్లుకు ఆమోదం అయినట్లు ఆయన చెప్పారు. విపక్షాల కారణంగానే సభలు నడవలేదని ఆయన అన్నారు. వేసవికాలంలో జరిగే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ.
-
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
మూడు రోజులపాటు వర్షాకాల సమావేశాలు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్నాయి. తొలిసారిగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇలా ప్రశ్నోత్తరాలు చేపట్టడం ఇదే ప్రథమం. సమావేశాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగుతాయి. మధ్యలో రెండుగంటల విరామం ఉంటుంది. సమావేశాల నేపథ్యంలో అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం వ్యూహప్రతివ్యూహాలతో సంసిద్ధమయ్యాయి. ప్రజాసమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మరోవైపు గత బడ్జెట్ సమావేశాల్లో మాదిరిగానే ఈసారీ ప్రజాసమస్యలు సభలో చర్చకు రాకుండా చేసేందుకు అధికారపక్షం సకల ప్రయత్నాలు చేస్తోంది. చర్చించే అంశాలు బీఏసీలో ఖరారు: ప్రస్తుత సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల్ని గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ ఖరారు చేస్తుంది. స్పీకర్ కోడె ల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీలు తమ పార్టీల తరఫున చర్చించాల్సిన అంశాల్ని ప్రతిపాదించనున్నాయి. సమావేశాల్ని మూడు రోజులపాటు ఐదు లేదా ఆరుపూటలు నిర్వహించి పూర్తిచేయాలని ప్రభుత్వం చూడటంపట్ల వైఎస్సార్సీపీతోపాటు మిత్రపక్షం బీజేపీ కూడా అసంతృప్తిగా ఉంది. పదిరోజులు జరపాలని బీఏసీలో బీజేపీ లేఖ ఇవ్వనుంది. సీఎస్, డీజీపీలతో స్పీకర్ భేటీ: శాసనసభ, శాసనమండలి నిర్వహణపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి బుధవారం వేర్వేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, డీజీపీ ఎన్.సాంబశివరావు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. సమావేశాలు అర్థవంతంగా జరిగేందుకు అధికారులు మరింత సమర్థంగా పనిచేయటంతోపాటు సభ్యులకు, సభకవసరమైన సమాచారమందించటంలో అలసత్వం ప్రదర్శించొద్దని సీఎస్‌తో భేటీలో స్పీకర్ స్పష్టంచేశారు. -
8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- తొలిరోజు జీఎస్టీ బిల్లు ఆమోదం - మిగిలిన రెండు రోజులు కరువుపై ప్రత్యేక చర్చ - ఇతర అంశాలు చర్చకు రాకుండా సర్కారు ఎత్తుగడ సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. తొలిరోజు వస్తు, సేవల బిల్లు(జీఎస్టీ)ను ఆమోదిస్తారు. మిగిలిన రెండు రోజులు కరువుపై చర్చిస్తారు. ఇతర అంశాలు చర్చకు రాకుండా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకే పరిమితం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శాసనసభ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని టీడీపీ శాసనసభ పక్షం వ్యూహ కమిటీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. 8న జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వం తరపున ఇదే ప్రతిపాదన చేయనున్నారు. టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్‌బాబు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, విప్‌లు కూన రవికుమార్, యామినీ బాల, ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లే యోచన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేసుల నుంచి బయట పడేలా మేనేజ్ చేసుకోవడం అలవాటు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యే లేదా నేతతో న్యాయస్థానంలో కేసు వేయించనున్నారు. సమావేశం అనంతరం విప్ కూన రవికుమార్ విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. మంత్రులు బొజ్జల, రావెల, చీఫ్ విప్ కాలువ మాట్లాడుతూ... శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేలా సభ్యులంతా సహకరించాలని కోరారు. -
8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల అమలాపురం : శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమవుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సమావేశాలు నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలనుకున్నామని, కేంద్రం జీఎస్టీ బిల్లును వచ్చే నెల 8 నాటికి ఆమోదించి పంపాల్సిందిగా కోరడంతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామన్నారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలు చర్చించాలనేది తొలి రోజున బీఏసీ సమావేశం నిర్వహించి ప్రకటిస్తామని చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి చైర్మన్‌గా ఉన్న హైపర్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ నెల 30న న్యూఢిల్లీలో సమావేశమై జీఎస్టీ పరిహారం కేటాయింపులపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. -
అసెంబ్లీ మూడు రోజులే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మూడోవారంలో జరిగే అవకాశముంది. ఇవి మూడు రోజులపాటు మాత్రమే జరగనున్నట్టు సమాచారం. శాసనసభ సమావేశాలు గత మార్చిలో జరిగాయి. ఆరు నెలల్లోగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఆ మేరకు సెప్టెంబర్ 29వ తేదీలోగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంది. కాగా జీఎస్టీ బిల్లును ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించడం తెలిసిందే. ఆ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్ని రాష్ట్రాల సీఎంలకు ఈ మేరకు లేఖలు రాశారు. దీంతో ఆ బిల్లు ఆమోదం నిమిత్తం రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంది. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. స్పీకర్ కోడెలకు ఉండే వీలును బట్టి తేదీల ఖరారు..: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్ని ఐదు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి మూడు రోజులపాటే ఈ సమావేశాలను నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సెప్టెంబర్ ఒకటి నుంచి పదో తేదీ వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావే శాల్లో పాల్గొనే అవకాశముంది. ఆ తరువాత లేదా అంతకుముందుగా కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వివిధ దేశాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో స్పీకర్ కోడెల కూడా ఉంటారని సమాచారం. ఆయన పర్యటననుబట్టి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీల్ని ఖరారు చేస్తారు. -
ప్రజలూ మీ దృష్టిలో మిలిటెంట్లేనా?
న్యూఢిల్లీ: అశాంతితో అట్టుడుకుతున్న కశ్మీర్ అంశం రాజ్యసభను కుదిపేసింది. ఈ అంశంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ కశ్మీరీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘పౌరులనూ మిలిటెంట్ల మాదిరిగా చూస్తారా’ అంటూ ఆయన ప్రశ్నించారు. ‘పౌరులను మిలిటెంట్ల మాదిరిగా చూస్తూ.. వారికి మరో ప్రత్యామ్నాయం లేకుండా చేయకండి. వ్యాలీలోని ప్రజల పట్ల అనుచితమైన బలప్రయోగాన్ని చూపకండి’ అంటూ ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల పట్ల కూడా జవాన్లు తూటాలు, పెల్లెట్లు ఉపయోగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆజాద్ తాను ఎంతో బాధాతప్తుడినై ఈ సభ ముందు ఉన్నానని చెప్పారు. ‘మిలిటెన్సీని అంతం చేయడంలో మేం ప్రభుత్వానికి అండగా ఉంటాం. కానీ పౌరుల పట్ల ఇలా ప్రవర్తించడాన్ని మాత్రం సమర్థించం’ అని ఆయన పేర్కొన్నారు. మిలిటెంట్ బుర్హన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్ లో కొనసాగుతున్న ఈ అశాంతిపై రాజ్యసభలో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో మొదట ఆజాద్ మాట్లాడారు. -
18 నుంచి వర్షాకాల సమావేశాలు
ఎజెండాలో అగ్రస్థానంలో జీఎస్టీ బిల్లు న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల కమిటీ తేదీలను ఖరారు చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంటు వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ప్రకటించారు. ఇప్పటివరకు 20 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరపాలని నిర్ణయించామని.. అవసరాన్ని బట్టి రెండుమూడు రోజులు కుదించడం గాని, పెంచడం గాని చేస్తామన్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు వెంకయ్యనాయడు తెలిపారు. అణు సరఫరా దేశాల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు తదితరాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే తాను వాటికి సమాధానం చెబుతానని సుష్మా స్వరాజ్ ముందుకొచ్చారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రతిష్టాత్మకమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) బిల్లు పాసవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్ ఆర్థికంగా మరింత వృద్ధి చెందుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు ఆమోదానికి సహకరించాలన్నారు. రాజ్యసభలో 45 బిల్లులు, లోక్‌సభలో 11 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బినామీ లావాదేవీల నిరోధక సవరణ బిల్లు, వినియోగదారుల సంరక్షణ బిల్లులతో సహా మెజారిటీ బిల్లులకు ఈసారి మోక్షం లభిస్తుందన్నారు. -
జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు రెండో వారం వరకు కొనసాగనున్నాయి. పార్లమెంటు వ్యవహారాల కమిటీ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ నెల 29 న సమావేశమై షెడ్యూల్ ను ప్రకటించనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లు రాజ్యసభలో పెండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి రాజ్యసభలో ప్రభుత్వ సభ్యుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం బలంగా కనిపించనుంది. జీఎస్టీ ఆమోదానికి అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఆమోదం తెలిపాయని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
'వాయిదాల' ప్రజాస్వామ్యం!
అనుకున్నట్టే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అధికార, విపక్షాలు రెండూ చాపచుట్టేశాయి. ఆఖరిరోజైన గురువారం విజయ్ చౌక్ నుంచి పార్లమెంటు హౌస్ వరకూ అధికార ఎన్డీయే పక్షాలకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు 'ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ' ఊరేగింపు తీసి అస్తవ్యస్థంగా సాగిన సమావేశాలక 'సరైన' ముగింపునిచ్చారు. మరో రెండు రోజుల్లో 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోబోతున్న తరుణంలో... అధికార పక్షమే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని రోడ్డెక్కడం మన దేశంలో సాగుతున్న రాజకీయాల తీరుతెన్నులకు పరాకాష్ట. గత నెల 21న మొదలైన నాటినుంచీ ఒక్క రోజైనా సమావేశాలు సక్రమంగా జరగలేదు. ఒక్కనాడైనా ప్రజా సమస్యలు చర్చకు రాలేదు. పార్లమెంటు చరిత్రలో తొలిసారి విపక్షానికి చెందిన 25 మంది ఎంపీలను సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో అయిదురోజులు సస్పెండ్ చేశారు. కొన్ని దశాబ్దాల క్రితం విప్లవ రాజకీయ నాయకుడు తరిమెల నాగిరెడ్డి శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చట్టసభలను 'బాతాఖానీ క్లబ్'లతో పోల్చారు. అవి ఇప్పుడు చేపల మార్కెట్‌ని మించిపోయాయని వర్తమాన పరిణామాలను చూసి ఎవరైనా అనుకుంటే అది వారి తప్పు కాదు. అంతా అయ్యాక సమావేశాలిలా అఘోరించడానికి కారణం 'మీరంటే మీర'ని అధికార, విపక్షాలు నిందించుకుంటున్నాయి. ఇందువల్ల మన ప్రజాస్వామ్యానికి కలిగిన అప్రదిష్ట...కీలకమైన బిల్లులు పెండింగ్‌లో పడిపోవడంవల్ల దేశానికి జరిగిన నష్టం ఎంతన్న సంగతిని పక్కనబెడితే అధికారిక లెక్కల ప్రకారమే రూ. 260 కోట్ల ప్రజాధనం వృథా అయింది. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, వారికి సంఘీభావంగా మిగిలిన విపక్షాల సమావేశాల బహిష్కరణ పర్యవసానంగా లోక్‌సభలో కొన్ని బిల్లులు మాత్రం ఆమోదం పొందాయి. విపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో మాత్రం నిత్యం వాయిదాలే కొనసాగాయి. పార్లమెంటు సమావేశాల్లో ఎప్పుడూ ప్రశాంతంగా కనబడే తల్లీకొడుకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఈసారి స్వరం పెంచి మాట్లాడారు. సోనియా అయితే తన భర్త రాజీవ్‌గాంధీపై బీజేపీ సభ్యుడొకరు చేసిన వ్యాఖ్యానంతో ఆగ్రహించి పోడియంవైపు దూసుకెళ్లారు. ఆ వ్యాఖ్యను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు సుమిత్రా మహాజన్ ప్రకటిస్తే తప్ప ఆమె ఆగ్రహం చల్లారలేదు. సమావేశాలకు ఇంకా వారం రోజుల సమయం ఉందన్నప్పుడే అవి ఎలా ఉండబోతున్నాయో దేశ ప్రజలకు అర్థమైంది. లలిత్‌మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియాలు రాజీనామా చేయాలని... వ్యాపం కుంభకోణంలో జరిగిన 48 అనుమానాస్పద మరణాలకు బాధ్యతవహించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుకోవాలని కాంగ్రెస్ చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో వీటిని ప్రధాన ఆయుధాలుగా చేసుకుంటామని చెప్పింది. కనుక సమావేశాలు సక్రమంగా జరిగే అవకాశం లేదని బీజేపీకి ముందే తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా సమావేశాలకు నాలుగు రోజుల ముందు ఒక సభలో సూచన ప్రాయంగా ఆ సంగతి చెప్పారు. మరి అలాంటి స్థితిని తప్పించడానికి బాధ్యతగల అధికార పక్షంగా బీజేపీ చేసిందేమిటి? ఆరోపణలొచ్చినవారితో ఆ వ్యవహారాలపై వివరణనిప్పించిందా? కనీసం వారిపై ఏదో రకమైన చర్యకైనా సిద్ధపడిందా? ఏం చేసుకుంటారో చేసుకోండని మౌనంగా ఉండిపోయింది. సభలో ఎంత గందరగోళం నెలకొని ఉన్నా సుష్మా స్వరాజ్ సమావేశాలు ముగియడానికి ఒక్కరోజు ముందు తన వాదనను ఏదో మేరకు వినిపించారు. ఆ పని ఆమె మొదటే ఎందుకు చేయలేక పోయారు? 'ముందు రాజీనామా... తర్వాతే చర్చ'అని మొదటిరోజునుంచీ సమావేశాలను స్తంభింపజేసిన కాంగ్రెస్ ఆ రోజు ఆమె చేసిన ప్రసంగాన్ని విన్నది. రాహుల్ ఆమె చేసిన వ్యాఖ్యలన్నిటికీ జవాబులిచ్చారు. సుష్మా రాజీనామా చేసే ప్రసక్తే లేదని... కావాలంటే చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పినప్పుడు కాంగ్రెస్‌కు ఈ బుద్ధి ఎక్కడకు పోయింది? ఏం చెబుతారో విన్నాక తమ డిమాండ్‌ను కొనసాగించాలో, వదులుకోవాలో నిర్ణయించుకోవచ్చునన్న స్పృహ ఎందుకు లేక పోయింది? తాము పాలకులుగా ఉన్నప్పుడు బీజేపీ పార్లమెంటును స్తంభింపజేసింది గనుక తామూ అదే పని చేయాలనుకోవడం తప్ప కాంగ్రెస్‌కు వేరే ఎజెండా లేదు. సమావేశాలు సరిగా సాగడంపై అధికార పక్షానికి కూడా పెద్ద ఆసక్తి ఉన్నట్టు కనబడదు. అదే గనుక ఉంటే ప్రవర్తించాల్సిన తీరిదేనా? విపక్షాలను పిలిచి చర్చించడం... వారు కోరుతున్న డిమాండ్ల విషయంలో తమ వైఖరేమిటో చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించడం వంటి చర్యలు తీసుకోవడానికి ఎందుకు చొరవ తీసుకోలేకపోయింది? ప్రభుత్వ సారథులుగా అది వారి బాధ్యత కాదా? సమా వేశాలు సరిగా సాగితే తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూసేకరణ బిల్లుపైనా, ఆ చట్టానికి సవరణ తెస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌లపైనా చర్చ జరుగుతుందని...బిహార్ ఎన్నికల ముందు ఇది మంచిదికాదని అధికార పక్షం అనుకుందా? ఎన్డీయే పెద్దలు జవాబివ్వాలి. మొత్తానికి సమావేశాలు వృథా కావడంలో ఇరు పక్షాల బాధ్యతా ఉంది. పర్యవసానంగా పలు బిల్లులు పెండింగ్‌లో పడటమే కాక ఎన్నో ముఖ్యాంశాలు చర్చకు రాకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, స్వయంగా సీఎంపైనే ఆరోపణలొచ్చిన 'ఓటుకు కోట్లు' కేసు, గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట వంటివి చర్చ మాట అటుంచి, కనీసం ప్రస్తావనకు రాలేదు. దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉన్న రైతు ఆత్మహత్యలూ పార్లమెంటు దృష్టికి రాలేదు. సాధారణ ప్రజానీకంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే ఏవగింపు కలగకముందే అన్ని పక్షాలూ మేల్కొనాలి. తమ ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. పార్లమెంటును బలప్రదర్శనల వేదికగా మార్చే ధోరణిని వదులుకోవాలి. -
'ఓటుకు కోట్లు'పై పార్లమెంట్లో ప్రశ్నిస్తాం
-
భూ బిల్లు 'వర్షా' ర్పణం కానుందా?
- వర్షాకాల సమావేశాల్లో భూ సేకరణ సవరణ బిల్లు సభ ముందుకు అనుమానమే - ప్రభుత్వానికి ఇంకా చేరని జాయింట్ పార్లమెంటరీ కమిటీ తుది నివేదిక - జేపీసీలో స్పష్టతవస్తేగానీ బిల్లుకు సహకరించబోమని విపక్షాల పట్టు - మరోవైపు లిలిత్ గేట్ పోటు.. మల్లగుల్లాలు పడుతోన్న మోదీ సర్కార్ న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ భూ సేకరణ సవరణ బిల్లు ఎన్డీఏ ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగల్చనుందా? అసలా బిల్లు సభ ముందుకు రాకుండానే సమావేశాలు ముగుస్తాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినవస్తున్నాయి. బిల్లు ఆమోదం కోసం ఎగువ, దిగువ సభల సభ్యులతో ఏర్పాటయిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక సమయానికి అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. బీజేపీ ఎంపీ అహ్లువాలియా నేతృత్వంలో ఇరు సభల సభ్యులతో ఏర్పాటయిన జేపీసీ.. ఇప్పటికే పలుమార్లు సమావేశమై బిల్లులో చేయాల్సిన మార్పులపై సమాలోచనలు జరిపింది. అయితే అన్ని రాష్ట్రాల నుంచి ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని, మరిన్ని భేటీల తర్వాతగానీ బిల్లులో మార్పులపై స్పష్టత వస్తుందని, అందుకోసం మరో మూడు, నాలుగు వారాలు గడువు అవసరం ఉందని జేపీసీ ఒక నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసెకెళ్లింది. జులై 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే జేపీసీ నివేదిక పూర్తవుతుందని, దాంతో భూ బిల్లును సులభంగా గట్టెక్కించుకోవచ్చని ప్రభుత్వం భావించింది. కాగా మరింత గడువు కావాలని జేపీసీ కోరడంతో మోదీ సర్కారు ఇరుకున పడ్డట్టయింది. ఒకవేళ వర్షాకాల సమావేశాల్లో భూ బిల్లు చర్చకు రాకుంటే మరో సారి ఆర్డినెన్స్ తప్ప మరో మార్గంలేదు బీజేపీకి. ఎందుకంటే పార్లమెంట్ శీతకాల సమావేశాలు డిసెంబర్ లో జరుగుతాయి. ఆలోపు ఆర్డినెన్స్ గడువు ముగుస్తుంది. అప్పుడు మరోసారి ఆర్డినెన్స్ జారీచేయాల్సి ఉంటుంది. జులై 21 నుంచి ఆగస్లు 13 వరకు జరిగే వర్షాకాల సమావేశాల్లో భూబిల్లుతోపాటు లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణలు, రైల్వే (సవరణ) బిల్లు, జలమార్గాల బిల్లు, జీఎస్టీ బిల్లు, అటవీకరణ పరిహార నిధి బిల్లు, బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ బిల్లు-2015 తదితర కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశముంది. -
ఆత్మహత్యల సెగ
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సెగ అసెంబ్లీకి తగిలింది. బెళగావిలోని సువర్ణసౌధలో వర్షాకాల సమావేశాలు సో మవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు అధికార పక్షంపై విరుచుకుపడ్డాయి. ఇదే సందర్భంలో వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు సువర్ణసౌధను ముట్టడించేందుకు యత్నించారు. సువర్ణసౌధ లో పల, బయట రైతు సమస్యల సెగ ప్రభుత్వానికి తగిలింది. - లోపలా బయటా అట్టుడికిన అసెంబ్లీ - వాడీవేడిగా ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు - మొదటి రోజునే పాలకపక్షంపై విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు - మంత్రి శ్యామనూరు రాజీనామాకు బీజేపీ పట్టు - సువర్ణసౌధ ముట్టడికి రైతు సంఘాల ప్రయత్నం సాక్షి, బెంగళూరు: బెళగావిలోని సువర్ణసౌధలో సమావేశాల మొదటి రోజైన సోమవారం మొదటగా ఇటీవల మృతిచెందిన ప్రముఖులకు సంతాపాన్ని ప్రకటించిన అనంతరం సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక సమావేశాల మొదటి రోజున రైతుల సమస్యలపై అధికారపక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. మొదటగా రైతుల సమస్యలపై చర్చ జరగాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. రైతుల సమస్యలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వరకు దూసుకెళ్లి ధర్నాకు దిగారు. ఆఖరుకి చర్చకు అనుమతిస్తానంటూ స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రతిపక్ష సభ్యులకు హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు. ఇక ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ రైతుల సమస్యలపై చర్చకు మోషన్ నోటీసుకు ఇవ్వాలని ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ కోరడంతో అధికారపక్ష సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ప్రతిపక్షనేత జగదీష్ శెట్టర్ స్పందిస్తూ, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయిన ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదంటూ విమర్శించారు. మండ్య, మైసూరు, హాసన ఇలా అన్ని ప్రాంతాల్లో రై తుల ఆత్మహత్యల పరంప ర కొనసాగుతోందంటూ చె బుతున్న సమయంలో స్పీ కర్ కాగోడు తిమ్మప్ప కలగజేసుకొని ఈ విషయాన్ని ప్రశ్నోత్తరాల సమయం అ నంతరం ప్రస్తావించాలని కోరారు. అనంతరం ము ఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, అసెంబ్లీ స మావేశాల సమయంలో చర్చకు అవకాశం ఇవ్వాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ కలగజేసుకుంటూ రైతుల సమస్యలపై చర్చించేందుకు పూర్తి సమావేశాలను బెళగావిలోని సువర్ణసౌధలోనే నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. శ్యామనూరు రాజీనామాకు బీజేపీ పట్టు విధానపరిషత్‌లోనూ అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. విధాన పరిషత్ కార్యకలాపాలు ప్రారంభం కాగానే విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ, చక్కెర కర్మాగారాల్లోని నిల్వలను ప్రభుత్వం జప్తు చేసుకోవడాన్ని విమర్శించిన రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘చక్కెర నిల్వలను జప్తు చేసుకోవడంపై శామనూరు శివశంకరప్ప తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఓ బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం. అందుకే శామనూరు శివశంకరప్ప తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. సువర్ణ సౌధ ముట్టడికి రైతుల యత్నం చెరుకు రైతుల బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు ప్రభుత్వానికి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకూ సమయం ఇచ్చారు. అప్పటిలోపు ప్రభుత్వం స్పంధించకపోతే సువర్ణ విధానసౌధ ముట్టడికి రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అయితే రైతు సమస్యలకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం దాటినా ఎటువంటి హామీని ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన రైతులు సువర్ణ విధానసౌధ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతు సంఘం నాయకులైన కోడిహళ్లి చంద్రశేఖర్‌తో సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శాసనసభ్యుడు పుట్టణ్ణయ్య శాసనసభ వెల్‌లోకి చొచ్చుకువచ్చి ధర్నాకు దిగారు. ఈయనకు అధికార పార్టీకే చెందిన రమేశ్‌కుమార్ మద్దతు ప్రకటించారు. ఆయన నిరసన మధ్యే శాసనసభ కార్యక్రమాలు కొనసాగాయి. సోమవారం పొద్దుపోయే వరకు సువర్ణసౌధ ముందు ఉన్న జాతీయరహదారి ఎన్‌హెచ్-4వద్ద నిరసన కార్యక్రమాలు కొనసాగించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
అస్త్రశస్త్రాలతో రెఢీ
రేపటి నుంచి వర్షా కాల సమావేశాలు లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారి కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో దూకుడు మీదున్న బీజేపీ నేతలు ఇంటి పోరుతో కాంగ్రెస్ సతమతం కేబినెట్ విస్తరణ లేకపోవడంతో ‘అసంతృప్తి’ కాంగ్రెస్ నేతల్లో అనైక్యత తలనొప్పిగా మారిన చెత్త సమస్య సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ వర్షా కాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 27 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి సమావేశాలు ఇవే. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ ఘన విజయం సాధించగా, అధికార కాంగ్రెస్ ఒకే అంకెకు పరిమితం కావాల్సి వచ్చింది. రైల్వే లాంటి కీలక శాఖ కూడా రాష్ట్రానికే దక్కడంతో బీజేపీ జోరు మీద ఉంది. పాలన మందకొడిగా సాగుతోందని, మంత్రుల మధ్య సమన్వయం కొరవడిందన్న ఆరోపణల మధ్య అధికార కాంగ్రెస్‌కు ఈ సమావేశాలు నల్లేరు మీద నడక కాబోవు. అదనపు డీజీపీ డాక్టర్ రవీంద్ర నాథ్ ఓ కాఫీ షాపులో యువతి ఫొటోలు తీశారన్న ఆరోపణలపై పోలీసు శాఖలో ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌పై ఆయన పలు ఆరోపణలు చేయడంతో సీఐడీ దర్యాప్తు చేయాల్సి వచ్చింది. పోలీసు శాఖలో ఈ విధంగా రాజకీయాలు చోటు చేసుకుంటే శాంతి భద్రతల పరిరక్షణ ఎలాగంటూ ఇదివరకే బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉద్యాన నగరిగా పేరొందిన బెంగళూరులో చెత్త సమస్య నానాటికీ తీవ్ర రూపం దాల్చుతోంది. తమ గ్రామం వద్ద చెత్త పారబోయవద్దని మండూరు వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చివరకు ప్రభుత్వం ఎలాగో బతిమలాడి మరో ఐదు నెలలు మాత్రమే అక్కడ చెత్త పారబోస్తామని, ఆలోగా వేరే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేసింది. హైకోర్టు కూడా చెత్త సమస్యపై ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కొత్త ప్రభుత్వానికి ఏడాది గడువు ఇచ్చినా ఈ సమస్యను పరిష్కరించ లేకపోయిందని నిష్టూరమాడింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చెత్త సమస్యపై అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనేక వాగ్బాణాలు సంధించారు. ఇప్పుడు అవే విమర్శలను ఆయన బీజేపీ నుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలకు లాడ్ నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిపై నిలదీయడానికి జేడీఎస్ సన్నద్ధమవుతోంది. అవసరమైతే సభలో పోరాటాలకు కూడా సిద్ధం కావాలని నిర్ణయించింది. ఇక శాఖల వారీ డిమాండ్లపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాల్సి ఉంది. కనుక ఈ సమావేశాలు పాలక కాంగ్రెస్‌కు అగ్ని పరీక్షే. ఇప్పటికే సభలో ప్రతిపక్షాల విమర్శలకు అధికార బెంచీల నుంచి సరైన సమాధానాలు లభించడం లేదు. ఎవరికి వారు తమకేం పట్టిందిలే అని వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవులు రాని వారు, కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్ష పదవులను ఆశిస్తున్న వారు... ఇలా ప్రతి ఎమ్మెల్యే ఏదో ఒక అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి దశలో ప్రతిపక్షాలను సభలో కాంగ్రెస్ సమైక్యంగా ఎదుర్కొంటుందా...అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
అరణ్యం: ఏనుగులు నవ్వుతాయా?
ఆఫ్రికా ఏనుగులన్నింటికీ దంతాలుంటాయి. కానీ ఆసియా ఏనుగుల్లో మగవాటికి మాత్రమే ఉంటాయి! ఇవి రోజుకి 150 నుంచి 170 కిలోల ఆహారాన్ని తీసుకుంటాయి. వర్షాకాలంలో ఈ మోతాదు మరింత పెరుగుతుంది. అప్పుడు 200 నుంచి 280 కిలోలు తింటాయి. రోజులో పదహారు గంటలు తింటూనే గడుపుతాయి! వీటి గ్రహణ శక్తి అమోఘం. మూడు మైళ్ల దూరంలో నీరు ఉన్నా ఏనుగులు ఇట్టే పసిగట్టేస్తాయి. పట్టుకు 80 నుంచి 210 లీటర్ల నీళ్లు తాగుతాయి. తొండంలో ఒకేసారి రెండు గ్యాలన్ల నీటిని నింపుకోగలవివి! వీటి తొండం రెండు మీటర్ల వరకూ పొడవు పెరుగుతుంది. దాదాపు లక్ష కండరాలు ఉంటాయని అంచనా! ఏనుగులు ఈత కొట్టగలవు. నీటిలో సైతం శ్వాసను పీల్చుకోవడానికి తొండం సహకరిస్తుంది వీటికి! ఏనుగుకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఒక్కసారి ఏదైనా మనసులో పెట్టుకుంటే, జన్మలో మర్చిపోవు. ఒకసారి చూసినదాన్ని ఎన్నేళ్ల తర్వాతయినా గుర్తు పట్టేస్తాయి! ఏనుగులు గుంపులుగా జీవిస్తాయి. ప్రతి గుంపులో కనీసం ఎనిమిది ఏనుగులుంటాయి. సంఖ్యకు పరిమితి లేదు. అయితే విశేషమేమిటంటే... ఆడవి వేరుగా, మగవి వేరుగా గుంపులు కడతాయి! ఇవీ మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. ఆటలాడుకుంటాయి. పట్టరాని ఆనందం వస్తే బిగ్గరగా నవ్వుతాయి. బాధ కలిగితే ఏడుస్తాయి కూడా! ఎందుకోగానీ ఏనుగులకు వేరుశెనగలంటే ఇష్టం ఉండదు. తిండి లేకపోయినా ఫర్వాలేదు కానీ వేరుశెనగల్ని మాత్రం ముట్టవట! రంగే కాదు... రేటూ అదురుద్ది! ఒక జాతికి చెందిన చేప ఒకే రంగులో ఉంటుంది. మహా అయితే రెండు రంగుల్లో ఉంటుంది. కానీ అరొవానా చేప చూడండి... ఎన్ని రంగుల్లో ఉందో! అక్వేరియంలో పెంచే చేపల్లో అత్యంత అందమైనవిగా వీటిని పరిగణిస్తారు. అరొవానాలు మంచినీటిలో మాత్రమే జీవించగలవు. పెద్ద పెద్ద పొలుసులతో ఉండే వీటి తలనిండా ముళ్లు ఉంటాయి. ఈ చేపలు నీటి అడుగున చక్కని గూళ్లు కట్టుకుంటాయి. గుడ్డు పెట్టాక, వాటిని గూటిలో ఉంచి కాపాడుకుం టాయి. శత్రువు దాడి చేస్తే గుడ్లను తమ నోటిలో దాచేస్తాయి. ఇవి మహా హుషారైన చేపలు. తెగ గంతులు వేస్తుంటాయి. ఉన్నట్టుండి పైకి ఎగిరి నీటిలో టప్పున పడటం వీటికి మహా సరదా. దాదాపు ఆరడుగుల ఎత్తువరకూ ఎగరగలవు అరొవానాలు. అందుకే వీటిని దక్షిణమెరికాలో ‘వాటర్ మంకీస్’ అంటూ ఉంటారు. అక్వేరియంలో పెంచే చేపలన్నిటి కంటే అరొవానా ఖరీదు అత్యంత ఎక్కువ. అయితే మిగతా రంగుల చేపల కంటే సిల్వర్ కలర్ అరొవానా రేటు మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, అవి చాలా అరుదుగా ఉంటాయి. అందుకే ఎంత రేటయినా పెట్టి కొనేస్తారు. దీని రేటు ఎనభై వేల డాలర్ల వరకూ వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి! -
రాజ్యసభలో తళుక్కుమన్న రేఖ!
బాలీవుడ్ తార రేఖ రాజ్యసభలో తళుక్కుమంది. వర్షాకాల సమావేశాల్లో తొలిసారి రాజ్యసభ సమావేశాలకు రేఖ హాజరయ్యారు. పసుపు రంగు చీరతో, బంగారు రంగు హ్యాండ్ బ్యాగ్ తో రాజ్యసభలో దర్శనమిచ్చి సభ్యులను ఆకర్సించారు. గత మే 7 తేదిన బడ్జెట్ సమావేశాల తర్వాత రేఖ రాజ్యసభ సమావేశాలకు హాజరుకావడం ఇదే తొలిసారి. 57 సంవత్సరాల రేఖ గత ఏప్రిల్ మాసంలో సచిన్ టెండూల్కర్ తోపాటు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ ఆగస్టు 5 తేదిన రాజ్యసభ సమావేశాలకు హాజరైన సంగతి తెలిసిందే. -
సభ సజావుగా జరిగేలా చూడండి:ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాఫీగా జరిగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని మన్మోహన్సింగ్ సోమవారం విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత రెండు మూడు సమావేశాల్లో ఎంతో సమయం వృథా అయిందని, దాన్ని ఈసారి పునరావృతం కానీయొద్దని ఉదయం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఆయనన్నారు. కానీ తర్వాత కాసేపటికే ఆయన సొంత పార్టీ ఎంపీలే ఉభయ సభలనూ పదేపదే స్తంభింపజేయడం విశేషం! -
రాజ్యసభలో అందరి కళ్లూ సచిన్ మీదే
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో తమ వాణి గట్టిగా వినిపించడంతో పదే పదే వాయిదా పడ్డాయి. అయితే, ఇన్ని సంఘటనల మధ్య కూడా రాజ్యసభలో అందరి కళ్లు ఒక వ్యక్తి మీదే ఉన్నాయి. ఆయనెవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తెలుపు, నీలం చారల చొక్కా, నల్ల ప్యాంటు వేసుకుని.. కుడిచేతికి కడియం, రెండు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ఎడమచేతికి వాచీ పెట్టుకున్న టెండూల్కర్.. సోమవారం నాటి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యాడు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లాతో కలిసి సభ ప్రారంభం కావడానికి చాలా ముందుగానే వచ్చేశాడు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బాలీవుడ్ నటి రేఖ, వ్యాపారవేత్త అను ఆగాలతో కలిసి రాజ్యసభకు నామినేట్ అయిన టెండూల్కర్.. తన సీటులో కూర్చునే ముందు పలువురు ఎంపీలతో కరచాలనం చేశాడు. తర్వాత తన పక్కనే కూర్చున్న ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్‌తో మాటల్లోకి దిగాడు. సచిన్ భార్య అంజలి కూడా పార్లమెంటుకు వచ్చి, సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభినందనలు తెలియజేయగా, సచిన్ బల్లమీద చరిచి తన హర్షం వ్యక్తం చేశాడు. సీమాంధ్ర ఎంపీల ఆందోళనతో సభ పది నిమిషాలు వాయిదా పడగా, చాలామంది ఎంపీలు సచిన్ వద్దకు వచ్చి, చేతులు కలిపారు. తర్వాత టెండూల్కర్ లేచి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. -
పార్లమెంటును తాకిన సమైక్య సెగ
-
పార్లమెంటును తాకిన సమైక్య సెగ
అనుకున్నంతా అయ్యింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళం విప్పారు. ఉభయ సభల్లోనూ వారు నిరసన తెలియజేయడంతో రాజ్యసభ, లోక్ సభ రెండూ వాయిదా పడ్డాయి. రాజ్యసభ అయితే రెండుసార్లు వాయిదా పడింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా నినదించారు. విభజనను వారు గట్టిగా వ్యతిరేకించారు. సమైక్య సెగ పార్లమెంట్‌ను పూర్తిస్థాయిలో తాకింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత సభలో ఒకవైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. రాజ్యసభలో కూడా ఇవే పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు... ఇటీవల రాజ్యసభ, లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అదేవిధంగా ఇటీవలే కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులను ప్రధాని మన్మోహన్ సభకు పరిచయం చేశారు. ఇటీవల నక్సల్స్ దాడిలో మృతిచెందిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నేత మహేంద్రకర్మ తదితర నాయకులకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. -
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
-
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి.ముందుగా ఉప ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ సందర్భంలో తన ప్రమాణ స్వీకార పత్రం హిందీలో రాసి ఉందంటూ ఓ సభ్యుడు ప్రస్తావించడం సభలో నవ్వులు పూయించింది. ఇక ఆహారభద్రత లాంటి కీలక బిల్లులు ఆమోదం కోసం వేచి చూస్తుండగా.. తెలంగాణ చిచ్చు రేపిన కేంద్ర ప్రభుత్వానికి అసోం, నాగాలాండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి కూడా విభజన వాదాలు చెలరేగి షాక్ తినిపిస్తున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు సజావుగా నడిచేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ఉదయం విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. గడిచిన రెండు మూడు సమావేశాల్లో చాలా సమయం వృథా అయ్యిందని, ఈసారి అలా జరగకుండా చూడాలని ఆయన కోరారు. సీమాంధ్ర ఎంపీల ఆందోళన? సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. ఈ ఆందోళనలు ఉభయసభలపైనా ప్రభావం చూపనుంది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా చేసినా, లోక్ సభ స్పీకర్ గానీ, రాజ్యసభ చైర్మన్ గానీ వీరి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించాలని పట్టుపట్టటం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పట్టు.. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తీరుపై సమగ్ర చర్చతో పాటు.. ఇకపై దేశంలో మరే రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమనే విస్పష్ట ప్రకటన కోసం పశ్చిమబెంగాల్లో గూర్ఖాలాండ్ ఉద్యమ సెగను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పట్టుపట్టే అవకాశాలున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రతిపక్షానికి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైనా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినా బొగ్గు కుంభకోణం, రైల్ గేట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అన్ని రంగాల్లో ద్వారాలు తెరవడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాల నుంచి సర్కారుపై ముప్పేట దాడి తప్పకపోవచ్చు. రూపాయి విలువ పడిపోవడం, డాలర్‌కు ఏకంగా 61 రూపాయల వరకు వెళ్లడంతో ఆ విషంయపైనా ఇటు ప్రధానిని, అటు ఆర్థిక మంత్రిని ప్రతిపక్షాలు దులిపేయడానికి సిద్ధపడ్డాయి. బిల్లులకు సహకరించండి బీమా, పెన్షన్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన సంస్కరణల బిల్లులపై సహకరించాలని ప్రతిపక్ష బీజేపీకి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్న ఆర్థిక బిల్లులపై బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌సిన్హాలతో చిదంబరం చర్చలు జరిపారు. సాధారణ, ఆర్థిక కార్యక్రమాలపై తమ పార్టీ మద్దతు ఇస్తుందని.. అయితే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని బీజేపీ సంకేతాలిచ్చింది. పెన్షన్ రంగంలోనూ ఎఫ్‌డీఐని పెంచే ప్రతిపాదనను కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆహార భద్రత బిల్లుకు సూత్రప్రాయంగా అనుకూలమే అయినా తాము ప్రతిపాదించిన అనేక సవరణలను ఆమోదిస్తేనే సహకరిస్తామని బీజేపీ వ్యూహకర్తల బృందం స్పష్టం చేసింది. మొత్తం మీద ఈసారి పార్లమెంట్ సమావేశాలు గతంతో పోల్చితే వాడివేడిగా సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలు
-
ఈ వర్షకాల సమావేశాల్లో బిల్లు ఉండదు:షిండే