రాజ్యసభలో తళుక్కుమన్న రేఖ!
రాజ్యసభలో తళుక్కుమన్న రేఖ!
Published Tue, Aug 27 2013 2:54 PM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
బాలీవుడ్ తార రేఖ రాజ్యసభలో తళుక్కుమంది. వర్షాకాల సమావేశాల్లో తొలిసారి రాజ్యసభ సమావేశాలకు రేఖ హాజరయ్యారు. పసుపు రంగు చీరతో, బంగారు రంగు హ్యాండ్ బ్యాగ్ తో రాజ్యసభలో దర్శనమిచ్చి సభ్యులను ఆకర్సించారు. గత మే 7 తేదిన బడ్జెట్ సమావేశాల తర్వాత రేఖ రాజ్యసభ సమావేశాలకు హాజరుకావడం ఇదే తొలిసారి.
57 సంవత్సరాల రేఖ గత ఏప్రిల్ మాసంలో సచిన్ టెండూల్కర్ తోపాటు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ ఆగస్టు 5 తేదిన రాజ్యసభ సమావేశాలకు హాజరైన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement