'రాజ్యసభ ఎంపీగానా..అయితే ఆలోచిస్తా'
'రాజ్యసభ ఎంపీగానా..అయితే ఆలోచిస్తా'
Published Mon, Sep 15 2014 2:48 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
ముంబై: సచిన్ టెండూల్కర్, రేఖ దారిలోనే నడిచేందుకు సిద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎంపీగా సేవలందించడానికి అవకాశం వస్తే తాను సిద్దమేననే సంకేతాలిచ్చారు. రాజ్యసభకు ఎంపికకు అవకాశం వస్తే ఆలోచిస్తానని ఓ హిందీ చానెల్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే సచిన్, రేఖలు మంచి స్నేహితులని, వారి పనితీరు గురించి తాను కామెంట్ చేయనని బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ తెలిపారు. మోడీ పాలన గురించి తన కంటే మీడియాకే ఎక్కువ తెలుసునని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
మహిళల పాత్రల చిత్రీకరణ అంశంలో బాలీవుడ్ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తోందని, అది తప్పుడు సంకేతాలు పంపే అవకాశముందని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. మోహ్రా చిత్రంలోని తూ చీజ్ బడి మస్త్ మస్త్.., దిల్ లోని కంభే జైసే కడీ హై పాటల చిత్రీకరణను ఆయన తప్పుపట్టారు. మహిళల ఆలోచన విధానాన్ని గౌరవించాలని అమీర్ తెలిపారు.
Advertisement
Advertisement