జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు
Published Wed, Jun 22 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు రెండో వారం వరకు కొనసాగనున్నాయి. పార్లమెంటు వ్యవహారాల కమిటీ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ నెల 29 న సమావేశమై షెడ్యూల్ ను ప్రకటించనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లు రాజ్యసభలో పెండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సారి రాజ్యసభలో ప్రభుత్వ సభ్యుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం బలంగా కనిపించనుంది. జీఎస్టీ ఆమోదానికి అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఆమోదం తెలిపాయని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement