
సభ సజావుగా జరిగేలా చూడండి:ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాఫీగా జరిగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్ సోమవారం విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత రెండు మూడు సమావేశాల్లో ఎంతో సమయం వృథా అయిందని, దాన్ని ఈసారి పునరావృతం కానీయొద్దని ఉదయం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో ఆయనన్నారు. కానీ తర్వాత కాసేపటికే ఆయన సొంత పార్టీ ఎంపీలే ఉభయ సభలనూ పదేపదే స్తంభింపజేయడం విశేషం!