న్యూఢిల్లీ: ఆధార్ పథకం అమలును సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి బుధవారం ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆధార్ పథకం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతుందంటూ దాఖలైన పిటిషన్‌పై నవంబరు 6 లోగా స్పందించాలంటూ నోటీసుల్లో కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రణాళికా శాఖ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఆధార్ సంఖ్య కేటాయించేందుకు వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్ సమాచారం సేకరించడం ఆందోళనకరమని మానవ హక్కుల కార్యకర్త ఇందు ప్రకాశ్ సింగ్‌తో కలిసి బేఘర్ మజ్దూర్ ఫౌండేషన్ అనే ఎన్‌జీవో పిటిషన్ దాఖలుచేసింది.