
సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన సభ’ ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా, సాంఘిక మాద్యమాల ద్వారా చేయాలని.. ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
శరవేగంగా ‘ప్రగతి నివేదన సభ’ ఏర్పాట్లు
సెప్టెంబర్ 2న కొంగర్ కలాన్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు శరావేగంగా జరుగుతున్నాయి. సభకోసం ఔటర్ రింగ్ రోడ్డునుంచి ప్రత్యేకంగా రోడ్లను వేశారు. ఔటర్ రింగ్ రోడ్డునుంచి నేరుగా పార్కింగ్ ప్లేసులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment