![Supreme Court Dismisses Plea Seeking Contempt Action Against ECI - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/10/ECI.jpg.webp?itok=aBdYvgAo)
న్యూఢిల్లీ: ఓటరు గుర్తింపు కార్డు అప్‌డేట్, కొత్త ఓటరు నమోదు దరఖాస్తుల్లో ఆధార్ సంఖ్యను జత చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పష్టమైన మార్పులను చేపట్టనందుకు ఎన్నికల సంఘం అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది.
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో ఈసీకి మేం డెడ్‌లైనేదీ పెట్టలేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment